Greater voters
-
మనసులు ‘గెలిచారు’
* గ్రేటర్ ఎన్నికల్లో ఏకపక్ష మద్దతు * కేసీఆర్పై ప్రజల్లో అచంచల విశ్వాసం * సెటిలర్లదీ గులాబీ బాటే సాక్షి, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ డివిజన్లో చూసినా టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించడం ప్రజల ఏకపక్ష నిర్ణయానికి దర్పణం పట్టింది. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా అన్నిచోట్లా గులాబీ జెండా రెపరెపలాడింది. నగర ఓటర్లు అంతా ఒక్కవైపే మొగ్గు చూపినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. జీహెచ్ఎంసీ చరిత్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి ‘తీర్పు’ రాలేదనిరాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎంలను పక్కన పెట్టిన గ్రేటర్ ఓటర్లు టీఆర్ఎస్పై అంచంచల విశ్వాసాన్ని చూపించారు. ఈ ఆదరణకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కారణమన్న అభిప్రాయం వినిపిస్తోంది. 19 నెలల టీఆర్ఎస్ పాలనలో చేపట్టిన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఇంటి పన్ను మినహాయింపు, కిలో రూపాయి బియ్యం, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్ల పెంపు, రేషన్ కార్డుల వంటివి పేద, మధ్య తరగతి వర్గాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. షాదీ ముబారక్, విద్య, ఉపాధి రంగాల్లో 12 శాతం రిజర్వేషన్లు, రుణాల్లో సబ్సిడీ పెంపు వంటివి మైనారిటీలను పార్టీకి బాగా దగ్గర చేశాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. నగరంలో కరెంటు కోతలు లేకుండా చూడడంతో పాటు పారిశ్రామిక రంగానికి 24 గంటలూ విద్యుత్ సరఫరా చేసి అన్ని వర్గాల మనసు దోచుకున్నారు. బస్తీల్లోని నిరుపేదలకు రేషన్ కార్డులు, వృద్ధులకు పింఛను రూ.500 నుంచి రూ.1000కి, వికలాంగులకు రూ.1500కు పెంచడం వంటివి బాగా ప్రభావం చూపాయి. ఐటీ, ఇతర పారిశ్రామిక రంగాల్లో సరళీకృత విధానాలతో ఆ వర్గాల్లో కేసీఆర్ నమ్మకాన్ని పెంచారు. సెటిలర్లు టీఆర్ఎస్నే తమ పార్టీగా భావించడం గొప్ప విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలిచిన స్థానాల్లో ప్రజలు ఈసారి టీఆర్ఎస్కు పట్టం కట్టారు. కూకట్పల్లి మినహా నగరంలోని అన్ని ప్రాంతాల్లో సెటిలర్లు టీఆర్ఎస్కు మద్దతు పలకడం ఇతర పార్టీలకు మింగుడు పడడం లేదు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన సెటిలర్లు అక్కడ చంద్రబాబు అమలు చేస్తున్న విధానాలను చూసి టీడీపీపై నమ్మకం కోల్పోయారు. కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేసే చంద్రబాబు కంటే ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్నునమ్ముకోవడమే మేలని వారంతా భావించినట్టు ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. -
తిరక్రాసు
గేటర్ క్రాస్ ఓటింగ్ ఒక్క పార్టీకే పరిమితం కాని ఓటరు లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థుల మధ్య ఓట్లలో వ్యత్యాసం సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ ఓటర్లు తమ తీర్పును ఏ ఒక్క పార్టీకో పరిమితం చేయలేదు. ఒకే ఓటరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పార్టీకి ఓటు వేస్తే.. లోక్సభ నియోజకవర్గంలో మరో పార్టీకి ఓటేశారు. ఇందుకు కారణాలనేకం. కేంద్రంలో ఒక పార్టీ ఉంటే బాగుంటుందని ఆలోచించిన ఓటరే.. రాష్ట్రానికి వచ్చేటప్పటికి మరోపార్టీపై మొగ్గు చూపాడు. అలాగే.. నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిని సైతం పరిగణనలోకి తీసుకున్నాడు. అభ్యర్థుల పనితీరు.. అందుబాటులో ఉండే తీరు.. తదితర అంశాలతో ఒకే ఓటరు భిన్నమైన పార్టీలకు ఓటేశాడు. దీంతో పార్లమెంట్-అసెంబ్లీ స్థానాలకు క్రాస్ ఓటింగ్ జరిగింది. మిత్రపక్షాల పొత్తులోనూ ఇది కనిపించింది. టీడీపీ-బీజేపీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ ఓట్లలో అన్ని చోట్లా అది కనిపించలేదు. ఎంపీగా బీజేపీకి ఓటేసిన ఓటరు ఎమ్మెల్యేగా టీడీపీకి ఓటు వేయని పరిస్థితి ఉంది. ఉదాహరణకు.. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థికి 65,355 ఓట్లు రాగా, అసెంబ్లీ అభ్యర్థికి 50,898 ఓట్లు మాత్రమే లభించాయి. అంటే.. బీజేపీ ఎంపీ అభ్యర్థికి పడినన్ని ఓట్లు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థికి లభించలేదు. ఇలా.. పలు సెగ్మెంట్లలో పలు వ్యత్యాసాలున్నాయి. ఎంఐఎంకు యాకుత్పురా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పార్లమెంట్ అభ్యర్థికి 83,081 ఓట్లు రాగా, అసెంబ్లీ అభ్యర్థికి కేవలం 66,843 ఓట్లు మాత్రమే లభించాయి. అంటే దాదాదపు 16 వేల ఓట్లకు పైగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అలాగే బీజేపీకి మలక్పేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంపీ అభ్యర్థికి 41,825 ఓట్లు రాగా, అసెంబ్లీ అభ్యర్థికి 35,713 ఓట్లు మాత్రమే దక్కాయి. అంటే ఆరువేల ఓట్లకు పైగా క్రాస్ ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంపీ అభ్యర్థికి 16,912 ఓట్లు మాత్రమే రాగా, అదే అసెంబ్లీ అభ్యర్థికి 45,964 ఓట్లు లభించాయి. అంటే.. దాదాపు 29 వేల ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థికి ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెం ట్లో 37,823 ఓట్లు రాగా, అదే సెగ్మెంట్ నుంచి ఎంపీ అభ్యర్థికి 27,226 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే దాదాపు 10 వేల తేడా. ఇలా పలు సెగ్మెంట్లలో క్రాస్ ఓటింగ్ జరిగింది.. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలు.. వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో (సెగ్మెంట్లలో) ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లు ఇలా ఉన్నాయి. ఒకే పార్టీకి అసెంబ్లీలో తక్కువ ఓట్లు వచ్చిన చోట అదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావడాన్ని.. పార్లమెంట్ స్థానానికి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తక్కువ ఓట్లు వచ్చిన చోట అదే పార్టీ అసెంబ్లీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావడాన్నీ దిగువ పట్టికల ద్వారా గమనించవచ్చు.