greyhound constable
-
గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య
రాజేంద్రనగర్: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఒకరు రివాల్వర్‌తో కణతపై కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఇన్స్పెక్టర్ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట ప్రాంతానికి చెందిన చాంద్‌పాషా(42) మంచిరేవులలోని గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం విచారణ కేంద్రం వద్దకు వచ్చిన అతను రివాల్వర్‌తో కణతపై కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. అయితే, అతనికి రివాల్వర్ ఎలా వచ్చింది.. అనే విషయంలో పోలీసులు స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. అతని డ్యూటీ అధికారి వద్ద రివాల్వర్ తీసుకొని ఆయన ముందే కాల్చుకున్నట్లు సమాచారం. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని నిర్ధారించడం లేదు. అయితే, గ్రేహౌండ్స్‌లోని కొంతమంది కానిస్టేబుళ్లకు కరోనా వ్యాధి సోకిన నేపథ్యంలో స్థానికంగానే ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులోనే చికిత్స అందిస్తున్నారు. చాంద్‌పాషాకు సైతం ఐసోలేషన్‌లోనే ఉండాలని చెప్పడంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ విషయమై ఇన్స్పెక్టర్ గంగాధర్‌ను వివరణ కోరగా.. అలాంటిది ఏమి లేదని, కుటుంబ కలహాల నేపథ్యంలోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. -
బీదర్‌లో సుశీల్‌కుమార్ అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్/న్యాల్కల్(జహీరాబాద్) : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో శుక్రవారం ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతి చెందిన బీదర్‌వాసి, గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ బి.సుశీల్‌కుమార్ (33) అంత్యక్రియలు శనివారం బీదర్ పట్టణంలో నిర్వహించారు. భద్రాద్రి నుంచి ఆయన మృతదేహాన్ని శనివారం తెల్లవారుజామున ప్రత్యేక వాహనంలో బీదర్‌కు తీసుకొచ్చారు. సుశీల్ మృతదేహం ఇంటికి రాగానే కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పట్టణంలోని నయాకమాన్, అఫ్జల్‌గంజ్ మీదుగా మంగల్‌పేట్‌లోని మె«థడిస్టు చర్చి వరకు అంతిమయాత్ర కొనసాగింది. అనంతరం మంగల్‌పేట్‌లోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. నివాళులర్పించిన డీజీపీ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి కర్ణాటకలోని బీదర్‌లో ఉన్న సుశీల్‌కుమార్ ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. అలాగే అంత్యక్రియలకు నిఘా విభాగం అధిపతి నవీన్‌చంద్, సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, బీదర్ కలెక్టర్ మహాదేవు, ఎస్పీ దేవరాజ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
నిత్యానందరెడ్డి కిడ్నాప్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు
-
నిత్యానందరెడ్డి కిడ్నాప్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు
హైదరాబాద్ : అరబిందో ఫార్మా కంపెనీ వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డి కిడ్నాప్ కేసుపై తుది తీర్పును నాంపల్లి కోర్టు గురువారం వెలువరించింది. ఈ కేసులో నిందితుడు కానిస్టేబుల్ ఓబులేశుకు జీవిత ఖైదు విధించింది. గతేడాది నవంబర్ 14వ తేదీన బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో ఉదయపు నడకను ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు కారు ఎక్కుతున్న నిత్యానందరెడ్డిపై ఆగంతకుడు ఏకే 47తో కాల్పులు జరిపాడు. ఆ వెంటనే తేరుకున్న నిత్యానందరెడ్డి తనవద్ద ఉన్న తుపాకీతో ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఆగంతకుడు ఏకే 47 వదిలి పరారైయ్యాడు. నిత్యానందరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వదిలిన ఏకే 47 తుపాకీ ఆధారంగా కేసు విచారణ ప్రారంభించారు. ఆ తుపాకీ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఓబులేశుదని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది.