grievances cell
-
వివాద్ సే విశ్వాస్ను ఆకర్షణీయంగా మార్చాలి
న్యూఢిల్లీ: బడ్జెట్లో భాగంగా ప్రకటించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్పులు చేయాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) ప్రభుత్వాన్ని కోరాయి. రీయింబర్స్మెంట్, వడ్డీ రేట్ల పరంగా ఆకర్షణీయంగా మార్చాలని ఎంఎస్ఎంఈలు కోరినట్టు ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. అంతేకాదు, బలమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఆన్లైన్లో ఉండాలని డిమాండ్ చేశాయి. బడ్జెట్ అనంతరం డీపీఐఐటీ ఏర్పాటు చేసిన వెబినార్‌లో భాగంగా ఈ అంశాలను ఎంఎస్ఎంఈలు లేవనెత్తాయి. టెక్నాలజీ వినియోగంతో వ్యాపార సులభతర నిర్వహణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. 2023–24 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంఎస్ఎంఈలకు వివాద్సే విశ్వాస్ పథకాన్ని ప్రకటించారు. -
ట్విటర్ దీపం
సమస్యలను పరిష్కరించడం, తోటివారికి సాయం చేసే గుణం ఉంటే అధికారం, పదవులు, డబ్బులు లేకపోయినప్పటికీ ట్వీట్స్‌తో సామాజిక సేవ చేయవచ్చని నిరూపించి చూపిస్తోంది ఒడిషా ట్విటర్ క్వీన్ దీపా బారీక్. ఒడిషాలోని బర్గఢ్ జిల్లా టెమ్రీ గ్రామానికి చెందిన దీపా బారీక్ తండ్రి వ్యవసాయదారు. తల్లి అంగన్వాడి వర్కర్. మూడేళ్ల క్రితం దీపకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్ ఎలా వాడాలో తెలుసుకునేందుకు పక్కింట్లో ఉంటోన్న సామాజిక కార్యకర్త దిబాస్ కుమార్ సాహుని కలిసింది. అతను స్మార్ట్ ఫోన్ వాడకం గురించి వివరిస్తూ వివిధ రకాల సోషల్ మీడియా యాప్‌లు దీప ఫోన్లో వేశాడు. వీటితోపాటు ట్విటర్ యాప్ వేస్తూ ‘‘నువ్వు చేసే ట్వీట్‌ను తప్పనిసరిగా ఫలానా వ్యక్తులు చూడాలనుకుంటే వారి అకౌంట్‌ను ట్యాగ్ చేసి పోస్టుచేస్తే వారికి నేరుగా చేరుతుంది’’ అని చెప్పాడు. దిబాస్ చెప్పిన ఈ విషయమే దీపను ఒడిషా ట్విటర్ క్వీన్‌గా మార్చింది. సౌకీలాల్‌తో తొలిసారి.. అది 2019 ఒడిషాలో తీవ్ర అల్పపీడనం ఏర్పడి గ్రామాల్లో ఇళ్లు కొట్టుకు పోవడంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. టెమ్రీ గ్రామానికి పక్కనే ఉన్న మరో గ్రామంలో ఇల్లు కొట్టుకుపోవడంతో పేద దంపతులు ఉండడానికి వసతి లేక ఇబ్బందులు పడుతుండడం కనిపించింది దీపకు. అది చూసి చలించిపోయి సౌకీలాల్ దంపతుల సమస్యను వివరిస్తూ.. ఒడిషా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఐదుగురు ఉన్నత స్థాయి అధికారులతోపాటు సోషల్ మీడియా గ్రీవెన్స్ సెల్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ట్వీట్ చేసిన 48 గంటల్లోనే గ్రామాభివృద్ధి అధికారి గ్రామాన్ని సందర్శించి, సౌకీలాల్ ఇల్లు కట్టుకునేందుకు రూ.98 వేల రూపాయలను ఇచ్చారు. ఈ సంఘటన దీపకు ముందుకు సాగడానికి ఉత్సాహాన్ని ఇవ్వడంతో..తరువాత మగదిక్కులేని వితంతువులకు పెన్షన్ కష్టాలు, ఆర్థిక సమస్యలతో పోరాడుతున్న వారి సమస్యలను రాష్ట్ర ఆశీర్వాద్ యోజన అధికారులకు చేర్చి వితంతువుల సమస్యను పరిష్కరించింది. వికలాంగులకు ప్రభుత్వం అందించే సదుపాయాలన్నింటిని వారి చెంతకు చేర్చడం, బిలాస్పూర్ గ్రామంలో డ్యామ్ మరమ్మతుల కారణంగా పంటపొలాలకు నీళ్లు అందకపోవడంతో.. ఆ సమస్యను నీటిపారుదల అధికారులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడంతో రైతులు పంటలు పండించేందుకు నీరు అందింది. ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా దీప ఐదు వేలమందికి పైగా సాయం చేయడం విశేషం. దేశంలో ఎక్కడున్నా... నేనున్నానంటూ... వివిధ సమస్యల పరిష్కారానికి దీప ట్వీటర్ సాయంతో చేస్తున్న కృషి స్థానికంగా చాలా పాపులర్ అయ్యింది. దీంతో ఎవరికి ఏ సమస్య ఉన్నా దీపను కలిసి వివరించడం, ట్విటర్ వేదికగా దీప ఆ సమస్యను సంబంధిత అధికారుల ముందు ఉంచడం, వారు దానిని పరిష్కరించడం చకచక జరిగిపోతున్నాయి. సొంతరాష్ట్రంలో ఇబ్బంది పడుతోన్న వారికేగాక, బతుకుదెరువుకోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారికి సైతం దీప సాయం చేస్తోంది. గతేడాది అక్టోబర్‌లో ఒడిషాకు చెందిన 23 మంది తెలంగాణలోని పెద్దపల్లిలో ఓ ఇటుకల తయారీ బట్టీలో పనిచేయడానికి చేరారు. బట్టీ యజమాని ఆహారం, నీరు ఇవ్వకుండా, ఎక్కువ గంటలు పనిచేయమంటూ హింసించేవాడు. రోజులు గడిచేకొద్ది వాళ్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. అది తట్టుకోలేక అక్కడినుంచి ఎలా బయటపడాలా? అనుకుంటోన్న సమయంలో వారిలో ఒకతనికి దీప గురించి తెలియడంతో.. వెంటనే ఈ సమస్య గురించి దీపకు చెప్పారు. వెంటనే ఆమె తెలంగాణ పోలీసులకు ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది. పోలీసులు స్పందించి 23 మంది కూలీలను రక్షించి సొంతరాష్ట్రానికి పంపించారు. ఇలా దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తోన్న వెయ్యిమంది ఒడిషా కూలీలకి సాయం చేసింది. సమస్యలను వెతుక్కుంటూ.. అడిగిన వారికేగాక, చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం, దినపత్రికల్లో ప్రచురితమయ్యే ప్రజాసమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా అధికారులకు చేరవేయడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తోంది దీప. ప్రస్తుతం సైన్స్‌లో పీజీ చేస్తున్న దీప భవిష్యత్‌లో ప్రొఫెసర్ కావాలనుకుంటోంది. ‘‘ప్రొఫెసర్‌గా పనిచేస్తూ నా లాంటి వారినెందరినో తయారు చేయవచ్చు. ఇలాంటివాళ్లు సమాజంలో మరెంతోమందికి సాయం చేస్తారు’’ అంటూ భవిష్యత్ తరాల గురించి ఆలోచించడం విశేషం. తన ద్వారా సాయం అందిన వారితో దీప. -
Whatsapp: మీ వాట్సాప్ బ్యాన్ అయ్యిందా?
Whatsapp Banned? Find Reasons, How to Recover Whatsapp Blocked Number: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ను మన దేశంలో కోట్ల మంది వాడుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. మెటా కంపెనీ పరిధిలో పని చేస్తున్న వాట్సాప్ ద్వారా ఇంటర్నెట్ ఆధారిత మెసేజ్‌ల దగ్గరి నుంచి వీడియో కాల్స్ దాకా, వ్యక్తిగత అవసరాల నుంచి ఆఫీసుల పనుల దాకా.. అన్నీ నడిచిపోతున్నాయి. అయితే ఐటీ రూల్స్ 2021 అమలులోకి వచ్చాక.. వాట్సాప్ భారత్‌లో తన యూజర్లపై ఎక్కువ అజమాయిషీ చెలాయిస్తోంది. ఈ తరుణంలో వాట్సాప్ అకౌంట్లను క్రమం తప్పకుండా భారత్‌లో అకౌంట్లను బ్యాన్ చేస్తూ వస్తోంది. పైగా Intermediary Guidelines and Digital Media Ethics Code ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘించిన అకౌంట్లనే బ్యాన్ చేస్తున్నట్లు మంత్లీ కంప్లైయన్స్ రిపోర్టుల్లో చెబుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి దాదాపు రెండు కోట్ల వాట్సాప్ అకౌంట్లను నిషేధిత జాబితాలోకి చేర్చిందని తెలుస్తోంది. ఇంతకీ వాట్సాప్ అకౌంట్లను ఎందుకు బ్యాన్ చేస్తుందో కారణాలు తెలుసా? ►ఫేక్ అకౌంట్లు వేరే వ్యక్తి పేరు మీద, నెంబర్ మీద వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయడం. ఇలాంటి వ్యవహారాలు దృష్టికి వస్తే వాట్సాప్ వాటిని బ్యాన్ చేస్తుంది. ►కాంటాక్ట్ లిస్ట్‌లో లేనోళ్లకు.. కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నెంబర్లకు ఎక్కువ మెసేజ్‌లు పంపడాన్ని.. అనుమతులు లేని సంభాషణలుగా గుర్తిస్తుంది వాట్సాప్. అందుకే బ్యాన్ విధిస్తుంది. ఒకవేళ తెలిసిన వ్యక్తి అయినా సరే, నోటికి నెంబర్ గుర్తున్నా సరే.. కచ్చితంగా కాంటాక్ట్‌లో సేవ్ చేసుకున్నాకే ఛాటింగ్ చేయండి. ►థర్డ్ పార్టీ యాప్‌లతో.. వాట్సాప్ మెసేంజర్ కాకుండా థర్డ్ పార్టీలు యాప్‌లు ఉపయోగించినా ఈ సమస్య ఎదురవుతుంది. ఉదాహరణకు.. వాట్సాప్ డెల్టా, జీబీ వాట్సాప్, వాట్సాప్ ఫ్లస్.. ఇలాంటివన్నమాట. వీటిని వాట్సాప్ ఎట్టిపరిస్థితుల్లో అనుమతించదు. ప్రైవసీ కోణంలో ఆ అకౌంట్లను నిషేధిస్తుంది. కాబట్టి, వాటిని డిలీట్ చేయండి. అఫీయల్ యాప్‌కు మొమరీ స్పేస్ ఎక్కువైనా వాడేయండి. ►ఎక్కువమంది బ్లాక్ చేసినా.. ఒక వాట్సాప్ అకౌంట్‌ను ఎక్కువ మంది యూజర్లు బ్లాక్ చేసినా సరే.. ఆ అకౌంట్‌ను వాట్సాప్ నిషేధిస్తుందని తెలుసా?. కాబట్టి, అడ్డగోలు కాంటాక్ట్‌లను సేవ్ చేసుకోవడం, అవసరం లేకున్నా వాళ్లకు మెసేజ్‌లు పంపడం, ఫార్వార్డ్ మెసేజ్‌లు పంపడం చేయడం తగ్గిస్తే మంచిది. ►ఫిర్యాదుల ఫలితం కూడా.. ఒక వాట్సాప్ అకౌంట్‌ను ఎక్కువ మంది రిపోర్ట్ చేసినా, ఎక్కువ మంది ఫిర్యాదులు చేసినా.. ఆ అకౌంట్‌ను వాట్సాప్ బ్యాన్ చేసేస్తుంది. ►మాల్వేర్ లింక్స్ మాల్వేర్(వైరస్)తో కూడిన లింక్స్, స్మార్ట్ఫోన్లకు ప్రమాదం కలిగించే లింక్స్‌గానీ, ఏపీకే ఫైల్స్ రూపంలో ఉండే ఫైల్స్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లకు పంపినా వాట్సాప్ ఆ అకౌంట్లను నిషేధిస్తుంది. ►అసభ్య సందేశాలు.. పోర్న్ సంబంధిత కంటెంట్, అసభ్య సందేశాలు, ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే సందేశాలు, బెదిరింపులు, వేధింపులు, విద్వేషపూరిత సందేశాలు.. ఇతరులకు పంపినా సరే బ్యాన్ తప్పదు!. ►హింసను ప్రేరేపించినా.. ఈరోజుల్లో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల నుంచే ఫేక్ కంటెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. అందుకే హింసను ప్రేరేపించేవిగా ఉండే కంటెంట్‌ను ఫార్వార్డ్ చేసినా బ్యాన్ వేస్తుంది వాట్సాప్. వీటితో పాటు ఘర్షణలకు ప్రేరేపించే పోస్టులు, పిల్లలపై జరిగే అకృత్యాలకు సంబంధించిన కంటెంట్ ప్రమోట్ చేసినా వాట్సాప్ బ్యాన్ తప్పదు. కాబట్టి, బ్యాన్ పరిధిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడడండి. అలాగే వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేయడం అనేది రిపోర్ట్ లేదా అవతలి వాళ్ల ఫిర్యాదుల ఆధారంగా జరుగుతుంటుంది. పర్సనల్ అకౌంట్లతో పాటు గ్రూపులు ఇందుకు అతీతం కాదు. గ్రీవియెన్స్ చానెల్‌తో పాటు రకరకాల టూల్స్ ఇబ్బందికారక అకౌంట్ల(ఫిర్యాదుల ఆధారంగా)ను నిశీతంగా పరిశీలించాకే.. వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేస్తుంది. ఈ బ్యాన్ టెంపరరీగా లేదంటే శాశ్వతంగా ఉండొచ్చు. తాత్కాలిక నిషేధం ఎత్తివేతకు వాట్సాప్ సపోర్ట్ టీంకి మెయిల్ పెడితే సరిపోతుంది. ఏం చేయాలంటే.. వాట్సాప్ బ్యాన్ అని కనిపించే స్క్రీన్ షాట్‌ను.. అన్‌బ్యాన్(బ్యాన్ ఎత్తేయమంటూ) రిక్వెస్ట్ చేస్తూ support@whatsapp.com కు మెయిల్ పెట్టాలి. అప్పుడు ఎందుకు బ్యాన్ చేసిందో వివరణ ఇస్తూనే.. వీలైతే అన్‌బ్యాన్ చేయడానికి వాట్సాప్ ప్రయత్నిస్తుంది. ఒకవేళ అన్‌బ్యాన్ కన్ఫర్మ్ మెసేజ్ గనుక వస్తే.. యాప్‌ను అన్-ఇన్స్టాల్ చేసి, తిరిగి ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే ప్లేస్టోర్‌లో అప్డేట్ కొట్టినా సరిపోతుంది. ఒకవేళ మళ్లీ మళ్లీ బ్యాన్ మెసేజ్ వస్తుంటే.. ఈసారి support@whatsapp.com కు మరోసారి రిక్వెస్ట్ మెయిల్ (ఇంతకు ముందు.. ఇప్పటివి స్క్రీన్ షాట్స్‌తో) పెట్టొచ్చు. అప్పుడు సరైన వివరణ దక్కుతుంది. ఒకవేళ పర్మినెంట్ బ్యాన్ సంకేతాలు గనుక అందితే మాత్రం.. నెంబర్ మార్చేడయం తప్ప మరో మార్గం ఉండదని వాట్సాప్ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొని ఉంది. మీ తరపున గనుక ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు లేకుంటే.. grievance_officer_wa@support.whatsapp.comకు మెయిల్ చేయడం ద్వారా సమస్యకు ఓ పరిష్కారం పొందవచ్చు. చదవండి: ఇంట్లో కరెంట్ బిల్లును ఆదా చేసే సింపుల్ టిప్స్.. పాటించండి -
అన్న క్యాంటిన్లో ఇచ్చి వెళ్లు!
తాడేపల్లిరూరల్(మంగళగిరి): స్థానిక అధికారుల వద్ద సమస్యలు పరిష్కారం కాక.. తమ బాధను ముఖ్యమంత్రి కార్యాలయానికి చెప్పుకోవాలని వస్తున్న బాధితులకు నిరాశే ఎదురువుతోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంట ఉన్న సీఎం కార్యాలయ గ్రీవెన్స్‌హాల్ పనితీరు ఘోరంగా తయారయింది. ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇటీవల అసలు గ్రీవెన్స్‌హాల్‌లో అర్జీలు తీసుకునేవారు కూడా ఎవరూ ఉండడం లేదు. పైగా అన్న క్యాంటిన్లో అర్జీలు ఇచ్చి వెళ్లాలని చెబుతున్నారు. రసీదులు ఇవ్వకుండా వెనక్కు పంపించేస్తున్నారు. సోమవారం కూడా వివిధ ప్రాంతాలనుంచి తమ సమస్యలను చెప్పుకునేందుకు గ్రీవెన్స్ సెల్‌కు పలువురు వచ్చారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతపురంలో చేస్తున్న అరాచకాల గురించి సీఎం దృష్టికి తీసుకువచ్చి తమ భూములను తమకు ఇప్పించాలని కోరేందుకు 10 మంది రైతులు వచ్చారు. మరికొంత మంది తమకు నాబార్డు నుంచి నిధులు కేటాయించి ఆదుకోవాలని అర్జీ ఇచ్చేందుకు వచ్చారు. ఇప్పటికే ఒక్కొక్క రైతు స్థానికంగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేను ఐదారుసార్లు కలవగా, సీఎం నివాసానికి రెండు సార్లు వచ్చినట్టు తెలిపారు. ప్రతి సోమవారం ఇక్కడకు రావడం అర్జీలు ఇచ్చి వెళ్లడం తప్ప పరిష్కారం కనిపించడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ సారైనా సీఎంను కలుద్దామని పట్టుదలతో వస్తే ఆయన నివాసంలో లేరు. కనీసం అర్జీ తీసుకునే నాథుడు కూడా లేడు. ఉదయం 6 గంటల నుంచి వర్షంలో తడుస్తూనే ఉన్నాం. చివరకు అన్న క్యాంటిన్లో అర్జీలు తీసుకుంటున్నారని పోలీసులు చెబితే, అక్కడకు వెళ్లి అర్జీలు ఇచ్చాం. వారు రసీదులు ఇవ్వకుండా వెనక్కు పంపించివేశారు. ఇదేమని ప్రశ్నించిన వారికి ఇస్తే ఇవ్వండి లేకపోతే తీసుకువెళ్లండని అర్జీలు విసిరేశారు’’ అని బాధితులు సాక్షి వద్ద వాపోయారు. ఐదుసార్లు వచ్చినా ఫలితం లేదు.. నాకు 5 సంవత్సరాలప్పటి నుంచి కళ్లు కనిపిచడం లేదు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించమని కోరేందుకు ఆరు నెలల కాలంలో ఐదుసార్లు ఇక్కడికి ఇంటికి వచ్చా. ఇక్కడి సిబ్బంది నా ఫోన్ నంబర్ తీసుకుని అర్జీ తీసుకుని ఇంటికి వెళ్లమంటున్నారు. ఇప్పటివరకు నా సమస్య పరిష్కారం కాలేదు. – యనమల ఇంద్రాణి,అనంతపురం జిల్లా, బుక్కపట్నం మండలం ఎమ్మెల్యే అనుచరులు నా భూమిని ఆక్రమించుకున్నారు.. మా ఎమ్మెల్యే అనుచరులు నా పంట పొలాన్ని ఆక్రమించుకున్నారని ఇప్పటికి రెండుసార్లు ఇక్కడకు వచ్చి ఫిర్యాదు చేశాను. ఇప్పటికీ నా సమస్య పరిష్కారం కాలేదు. ఈసారి సీఎం గ్రీవెన్స్ వద్ద నా గోడు విన్నవించుకునేందుకు వస్తే కనీసం అర్జీ కూడా ఎవరూ తీసుకోలేదు. చివరకు అన్న క్యాంటిన్లో అర్జీ ఇచ్చి వెనుదిరగాల్సి వచ్చింది. దీనికి రసీదు కూడా వారు ఇవ్వలేదు. – చల్లా రంగప్ప, ప్రకాశం జిల్లా -
సమస్యలు యథాత థం
సాక్షి, కాకినాడ : సుమారు మూడు నెలల అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలను అధికారులకు వివరించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇద్దరూ స్థానికంగా లేకపోవడంతో అదనపు జాయింట్ కలెక్టర్ డి.మార్కండేయులు, డీఆర్వో బి.యాదగిరి గ్రీవెన్స్ నిర్వహించారు. ఎప్పటిలాగే రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, ఉద్యోగ, ఉపాధి తదితర అంశాలపై అర్జీలు అందాయి. అదే విధంగా పదో తరగతిలో మార్కులు అధికంగా తెచ్చుకున్నామని, ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్ చదివేందుకు ఫీజులు, వసతి కల్పించాలని కోరుతూ యువత గ్రీవెన్స్‌లో అధికారులకు మొరపెట్టుకుంది. వాటిని పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని కిందిస్థాయి అధికారులను ఏజేసీ, డీఆర్వో ఆదేశించారు. చేపల చెరువులు తవ్వేస్తున్నారు... తొండంగి మండలం ఏవీ నగరంలో ఊరి చుట్టూ చేపల చెరువులు తవ్వుతున్నారని దళితులు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు వచ్చి ఆందోళన చెందారు. దళిత కాలనీని ఆనుకుని వున్న పంట భూముల్లో కొందరు పెద్దలు చెరువులు తవ్వి చేపలు ఏపుగా పెరగటం కోసం చుట్టు పక్కల ఏ జంతువు చచ్చినా తీసుకొచ్చి చెరువుల్లో వేస్తున్నారన్నారు. వాతావరణ కాలుష్యంతోపాటు దోమల బెడద కూడా ఎక్కువగా ఉంటోందని వారు వాపోయారు. అనంతరం ఏజేసీకి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే ఏడెకరాల చెరువుందని, మరో పదకొండు ఎకరాల చెరువు తవ్వుతుండగా ఇంకా కొత్త చెరువుల ఏర్పాటుకు కొందరు పెద్దలు ప్రణాళికలు వేశార ని ఫిర్యాదులో పేర్కొన్నారు. వేలిముద్ర పడడం లేదని పింఛను కట్ ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన దిడ్డి వరలక్ష్మి వికలాంగురాలు. ఆమెకు ప్రతి నెలా రూ. 500 పింఛను వచ్చేది. ఉపాధి కూలీ కూడా పనికి తగ్గ వేతనం అందుకునేది. ఆమె చేతి వేళ్ల ముద్రలు సరిగా పడకపోవడంతో మూడు నెలల నుంచి పింఛను అందడం లేదు. ఉపాధి హామీ కూలీ కింద పోస్టాఫీసులో ఏడాది నుంచి సొమ్ము అందడం లేదు. తన తండ్రితో పాటు కలెక్టరేట్‌కు వచ్చిన వరలక్ష్మి అధికారులకు వినతిపత్రం అందించి న్యాయం చేయాలని కోరింది. అలాగే మరిన్ని ముఖ్య సమస్యలపై పలువురు అర్జీలు అందజేశారు. వాటిని పరిశీలించి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.