group-4 job
-
Telangana: గ్రూప్–4లో 8,039 పోస్టులే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని గ్రూప్–4 ఉద్యోగాల భర్తీపై గందరగోళం మరింత పెరిగింది. ప్రకటించిన తేదీనాటికి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో ఆందోళనలో ఉన్న అభ్యర్థులకు.. డిసెంబర్ 30న అర్ధరాత్రి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెబ్సైట్లో పెట్టిన పూర్తిస్థాయి నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటం అయోమయంగా మారింది. నిజానికి డిసెంబర్ ఒకటిన టీఎస్పీఎస్సీ 9,168 గ్రూప్–4 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. కానీ 8,039 పోస్టులతోనే పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. వాయిదాతో గందరగోళం మొదలై..: టీఎస్పీఎస్సీ డిసెంబర్ ఒకటిన శాఖల వారీగా ఖాళీలను ప్రకటించింది. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలతో డిసెంబర్ 23న పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తామని తెలిపింది. కానీ ఆ రోజున పూర్తిస్థాయి నోటిఫికేషన్ రాలేదు. దరఖాస్తుల స్వీకరణ చేపట్టలేదు. మరోవైపు ఇతర ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల అవుతూ వచ్చాయి. దీనితో అభ్యర్థుల్లో గందరగోళం మొదలైంది. టీఎస్పీఎస్సీ 30న అర్ధరాత్రి దాటాక 8,039 ఖాళీలతో పూర్తి నోటిఫికేషన్‌ను వెబ్సైట్లో పెట్టి.. దరఖాస్తుల నమోదు ఆప్షన్‌ను ఇచ్చింది. పంచాయతీరాజ్‌లో తగ్గిన పోస్టులు: టీఎస్పీఎస్సీ వెబ్‌నోట్‌లో ప్రకటించిన పోస్టులతో పోలిస్తే ఇప్పుడు 1,129 ఉద్యోగాలు తగ్గిపోయాయి. కొన్ని విభాగాల పోస్టుల సంఖ్యలో స్వల్పంగా మార్పులు జరిగినా.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఏకంగా 1,208 పోస్టులు తగ్గాయి. వాస్తవానికి గతేడాది సీఎం అసెంబ్లీలో వెల్లడించిన జాబితా ప్రకారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో 1,245 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ పూర్తిస్థాయి నోటిఫికేషన్లో ఈ శాఖలో 37 పోస్టులు మాత్రమే చూపారు. మొత్తంగా 1,129 కొలువులు తగ్గాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరైన సమాచారం, రోస్టర్ వివరాలు ఇవ్వకపోవడంతో టీఎస్పీఎస్సీ ఆ మేరకు పోస్టులు తగ్గించి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. టీఎస్పీఎస్సీ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. చదవండి: TSPSC: మరో నాలుగు నోటిఫికేషన్లు.. 806 కొలువులు -
Group 4 Notification: 9,168 కొలువులకు నోటిఫికేషన్.. పరీక్ష విధానం ఇదే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తంగా 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ఇంత భారీ సంఖ్యలో గ్రూప్స్ కొలువుల భర్తీకి ప్రకటన వెలువరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ కేటగిరీల పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తులు: గ్రూప్–4 పోస్టులకు ఈ నెల 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఇచ్చింది. ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, కేటగిరీల వారీగా ఖాళీలు, వేతన స్కేల్, వయో పరిమితి తదితర వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఈ నెల 23న కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని.. దీనిని వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహిస్తామని వెల్లడించింది. అన్నీ జూనియర్ అసిస్టెంట్ కేటగిరీవే.. తాజాగా గ్రూప్–4 కేటగిరీలో భర్తీ చేయనున్న ఉద్యోగాలన్నీ జూనియర్ అసిస్టెంట్ స్థాయికి సంబంధించినవే. ఇందులో నాలుగు కేటగిరీలు ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ కేటగిరీలో 429 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ కేటగిరీలో 6,859 పోస్టులు, జూనియర్ ఆడిటర్ కేటగిరీలో 18 పోస్టులు, వార్డ్ ఆఫీసర్ కేటగిరీలో 1,862 పోస్టులు ఉన్నాయి. -
ఉద్యోగం వచ్చేసరికి... ప్రాణం పోయింది
కలలు నెరవేరకుండానే నిరుద్యోగి కన్నుమూత ఏడాది కాలం కొనసాగిన నియామక ప్రక్రియ గ్రూప్-4 నియామకాలపై నిరుద్యోగుల్లో ఆందోళన గుంటూరు(నగరంపాలెం): ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని నెలల తరబడి కలలు కన్న ఓ వికలాంగుడు కన్నుమూశాడు. ఆశించిన ఉద్యోగం చేతికందే నాటికి అలసిపోయిన ఆశలతో తుదిశ్వాస విడిచాడు. పోస్టుల భర్తీలో చోటుచేసుకున్న ఎడతెగని ఆలస్యం అతనిలో తీవ్ర నైరాశ్యం నింపింది. దీంతో మానసిక ఆందోళనకు లోనై ఈ నెల ఒకటో తేదీన కన్నుమూశాడు. పొన్నూరు మండలం కొండముది గ్రామానికి చెందిన కోండ్రు నాగరాజు(41) అంధుడు. జిల్లాలో 2015 మార్చి 31వ తేదీన వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన బ్యాక్లాగ్ నోటిఫికేషన్లో క్లాస్-4 ట్యాంక్ క్లీనర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం వరకు ఈ నియామక ప్రక్రియ కొనసాగింది. నాగరాజు మెరిట్‌లిస్ట్‌లో, షార్టు లిస్టులో అర్హత సాధించటంతోపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యాడు. అనంతరం వికలాంగత్వం జన్యునిటీ సర్టిఫికెట్ కోసం జనవరిలో హైదరాబాద్‌కు వెళ్లాడు. ఫిబ్రవరిలో ఆ సర్టిఫికెట్ అందింది. దీంతో నియామక ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారు. ఈలోగా ఈనెల 1న హైబీపీ కారణంగా తలలో నరాలు పగిలి నాగరాజు చనిపోయినట్లు వికలాంగశాఖ కార్యాలయానికి సమాచారం వచ్చింది. ఏడాదికాలం కొనసాగిన ప్రక్రియ.. గత సంవత్సరం మార్చి 31న జిల్లాలో క్లాస్-4, గ్రూప్-4కు సంబంధించి 74 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. క్లాస్-4కు సుమారు 3,700 దరఖాస్తులు రాగా, వాటిని క్లాసిఫికేషన్ చేసి మెరిట్ లిస్టు తయారు చేయటానికి వికలాంగుల శాఖ అధికారులకుఐదునెలల సమయం పట్టింది. సెప్టెంబరులో లిస్టు విడుదల చే శారు. నెలరోజులు అభ్యంతరాలు స్వీకరించారు. డిసెంబర్లో షార్ట్ లిస్టును విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులను జన్యునిటీ టెస్టుకోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేసేవారు. జనవరిలో అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి ఫిబ్రవరిలో సర్టిఫికెట్లు అందజేశారు. నియామక ఉత్తర్వులు సిద్ధం చేసి గురువారం ఉదయం అభ్యర్థులకు ఇవ్వనున్నారు. ఇక గ్రూప్ 4 నియామకాలపై ఇప్పటి వరకు మెరిట్‌లిస్ట్ మాత్రమే విడుదల చేశారు. దానికి షార్టు లిస్టు, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంత సమయం పడుతుందో వేచి చూడాల్సిందే. జరుగుతున్న ఆలస్యంపై అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.