Group of monkeys
-
వానరాల దాడిలో వృద్ధురాలి మృతి
రామారెడ్డి (ఎల్లారెడ్డి) : ఒక్కసారిగా కోతుల గుంపు దాడి చేయడంతో ఒక వృద్ధురాలు మృతి చెందింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం చాతరబోయిన నర్సవ్వ (70) ఇంట్లో అన్నం గిన్నెలను శుభ్రం చేస్తుండగా.. సుమారు 20 వరకు కోతులు దాడి చేశాయి. ఆ సమయంలో ఆమె ఇంట్లో ఎవరూ లేరు. చుట్టుపక్కల మహిళలు భయంతో కోతులను తరిమే ప్రయత్నం చేయక ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. నర్సవ్వ ఛాతీ, వీపు, నడుముపై కోతులు తీవ్రంగా కరిచాయి. పెళ్లికని కామారెడ్డికి ఆమె కూతురు సుగుణ 20 నిమిషాల తర్వాత వచ్చి.. తల్లిని కామారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ నర్సవ్వ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కూతుళ్లుండగా, ఇద్దరి వివాహం జరిగింది. ప్రస్తుతం చిన్న కూతురితో కలిసి ఉంటోంది. నర్సవ్య అంత్యక్రియలను చిన్న కుమార్తె పూర్తి చేసింది. -
అయ్యో పాపం..
కోతులకు భయపడి పరుగులు.. రెండేళ్ల చిన్నారి మృతి ఏన్కూరు: కోతుల గుంపునకు భయపడి పిల్లలు పరుగులు తీసిన ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం అరికాయలపాడులో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బెజవాడ సుధాకర్ రెండో కుమార్తె జస్విక(2) ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. ఈ చిన్నారికి సమీపంలో వీధిలో మరికొందరు పిల్లలు ఆడుకుంటున్నా రు. ఈలోగా ఓ కోతులు గుంపు అటువైపు రావడంతో పిల్లలు భయపడి ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న జస్వికకు ఓ చిన్నారి బలంగా తగలడంతో ఆమె ఒక్కసారిగా కిందపడి కుప్పకూలింది. దీంతో ఆమె తలకు బలమైన గాయమైంది. వెంటనే ఏన్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. జస్విక మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.