GT
-
నువ్వా నేనా..కొత్త కెప్టెన్స్ పోరు..
-
అదే జరిగితే CSK గెలిచేదే కాదు..!
-
శుభమన్ గిల్, రవీంద్ర జడేజా వద్దు ఇంగ్లాండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..!
-
మోహిత్ కి పాండ్య పాఠాలు చెప్పడం ఏంటి ..!
-
మహి అన్న కోసం ఏదైనా చేస్తా టచ్ చేస్తున్న జడేజా మాటలు..!
-
CSK అభిమానులకు జడేజా భార్య ట్రీట్ ..!
-
ఆటోగ్రాఫ్ ఇవ్వని ధోని బతిమాలుకున్న చాహర్..!
-
గెలిచిన CSK.. పండగ చేసుకుంటున్న పాకిస్థాన్ ఫాన్స్ ..!
-
ఫైనల్ లో జడేజా బాటింగ్ పై సురేష్ రైనా కామెంట్స్
-
ఐపీఎల్ దెబ్బకి లక్షన్నర మొక్కలు..!
-
ఏడాది క్రితం సరిగ్గా అదే రోజు ఇది RR కాదు CSK
-
CSK వద్దనుకుంది GT కొనుక్కుంది 20 లక్షలు తీసుకుని చెన్నై పై రెచ్చి పోయడుగా ....
-
బ్యాటింగ్ చేసేది గిల్ అయితే కీపింగ్ చేసేది ధోని...
-
చెన్నై పాంచ్ పటాకా
-
ధోని చివరి మ్యాచ్ వాన గండం తప్పదా...!
-
గుజరాత్ గ్రేట్ చెన్నై తోపు ...
-
గిల్ దున్నేస్తున్నాడు .. ఇక ఛాంపియన్ CSK
-
ఐపీల్ ప్రైజ్ మనీ ఎన్ని కోట్లు అంటే ..
-
చెన్నైVS గుజరాత్
-
ఒక్క విషయం చాలు గుజరాత్ తో గెలిచేది చెన్నై...
-
వారెవ్వా గిల్ ఆవిషయంలో ధోని తరువాత ఇతనే..
-
చరిత్రలో తోలి సారి కంకషన్ సబ్ స్టిట్యూట్
-
ధోని కప్.. గిల్ సెంచరీ.. ఫైనల్ పై ఉత్కంఠ..
-
ముంబయి చిత్తు చిత్తు.. CSK పై రివెంజ్ కు రెడీ
-
ఫైనల్ బెర్త్ ఎవరిది..
-
ఫైనల్ కి వెళ్ళేది ఏవరు.. ప్రెజర్ లో GT జోష్ లో MI
-
ధోని గురించి ఆఒక్క మాటతో టచ్ చేసిన హర్దిక్ పాండ్య,
-
ఓడిపోయాం అంతే.. సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు!
-
గుజరాత్ వర్సెస్ చెన్నై.. ఎవరి బలమెంత..?
-
ఛాంపియన్ ఎవరు?
-
GT Vs CSK: మా ఓటమికి కారణం అదే: ధోని! కొంపముంచిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’!
Gujarat Titans vs Chennai Super Kings- MS Dhoni Over Loss: ‘‘పిచ్‌పై డ్యూ (తేమ) ఉందని అందరికీ తెలుసు. అయినా మా బ్యాటర్లు మరింత మెరుగ్గా రాణించాల్సింది. మరిన్ని పరుగులు స్కోరు చేయాల్సింది. ఏదేమైనా రుతరాజ్ అదరగొట్టాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తన బ్యాటింగ్ కన్నుల పండుగగా అనిపించింది. తన షాట్ సెలక్షన్ సూపర్. యువ ఆటగాళ్లంతా ఇలాగే ముందుకు సాగితే బాగుంటుంది. ఇక రాజ్ బాగానే బౌలింగ్ చేశాడు. కానీ ఇంకాస్త మెరుగుపడాలి. అనుభవం గడిస్తున్న కొద్దీ తను రాణించగలడు. ఇక నోబాల్స్ అనేవి మన నియంత్రణలో ఉండేవే! కాబట్టి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బౌలర్‌పై ఉంటుంది’’ అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. బ్యాటర్లు ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2023 ఆరంభ మ్యాచ్‌లో డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై తలపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రుతు అదుర్స్.. కానీ ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 50 బంతుల్లో 92 పరుగులు సాధించగా.. వన్‌డౌన్ బ్యాటర్ మొయిన్ అలీ 23 పరుగులు చేయగలిగాడు. మిగతా వాళ్లు కనీసం 20 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు. PC: IPL/BCCI కొంప ముంచాడు! లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌కు ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 63 పరుగులతో అద్బుత ఆరంభం అందించగా.. ఆఖర్లో వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ 3 బంతుల్లో 10 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా హార్దిక్ సేన 19.2 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నై బౌలర్లలో పేసర్ తుషార్ దేశ్‌పాండే(ఇంపాక్ట్ ప్లేయర్) 3.2 ఓవర్లలోనే ఏకంగా 51 పరుగులు ఇవ్వడం కొంపముంచింది. మిగతా వాళ్లలో రాజ్‌వర్దన్ హంగేర్గకర్ మూడు వికెట్లతో మెరవగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. రెండు వికెట్లతో మెరిసి.. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో చెన్నై ఓటమిపై ధోని పైవిధంగా స్పందించాడు. చదవండి: GT Vs CSK: చెన్నై పేసర్ అరుదైన ఘనత.. టోర్నీ చరిత్రలోనే మొదటిసారి ఇలా! గుజరాత్ కూడా.. IPL 2023: రుత్‌రాజ్ గైక్వాడ్ విధ్వంసం.. 9 సిక్స్‌లు, 4 ఫోర్లతో! వీడియో వైరల్ A successful final-over chase at the Narendra Modi Stadium to kick off #TATAIPL 2023 🔥🔥 The @rashidkhan_19-@rahultewatia02 duo at it again as @gujarat_titans secure a win against #CSK💪 Scorecard ▶️ https://t.co/61QLtsnj3J#GTvCSK pic.twitter.com/uKS9xJgIbw — IndianPremierLeague (@IPL) March 31, 2023 -
చెన్నై పేసర్ అరుదైన ఘనత.. టోర్నీ చరిత్రలోనే మొదటిసారి ఇలా! దారుణ వైఫల్యం..
Gujarat Titans vs Chennai Super Kings, 1st Match: ఐపీఎల్ చరిత్రలో మొదటి ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా తుషార్ దేశ్‌పాండే నిలిచాడు. క్యాష్ రిచ్ లీగ్ పదహారో ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ ఈ మేరకు ఘనత వహించాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్- చెన్నై మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో మ్యాచ్ ఆరంభానికి ముందుగానే చెన్నై తుషార్ దేశ్‌పాండేను సబ్‌స్టిట్యూట్‌గా ప్రకటించింది. దీంతో ఐపీఎల్లో తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుషార్ పేరు నమోదైంది.ఇక చెన్నై జట్టు బ్యాటింగ్ ముగించుకున్న తర్వాత బ్యాటర్ అంబటి రాయుడును ఫీల్డింగ్ సమయంలో తప్పించింది సీఎస్కే. అతడి స్థానంలో ఫాస్ట్ బౌలర్ తుషార్‌ను బరిలోకి దించింది. దారుణ వైఫల్యం అయితే, ఈ మ్యాచ్‌లో తుషార్ .. 3.2 ఓవర్లు బౌలింగ్ చేసి.. 51 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. భారీగా పరుగులు సమర్పించుకుని విమర్శల పాలయ్యాడు. మరోవైపు.. గుజరాత్ జట్టు కూడా ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కేన్ విలియమ్సన్ స్థానంలో టాపార్డర్ బ్యాటర్ సాయి సుదర్శన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా టీమ్‌లోకి తీసుకుంది. కాగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. రషీద్ మెరుపు ఇన్నింగ్స్ ధోని సారథ్యంలోని చెన్నైపై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన హార్దిక్ సేన ఐపీఎల్-2023లో తొలి విజయం నమోదు చేసింది. ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండు వికెట్లు తీయడంతో పాటు.. కీలక సమయంలో 3 బంతుల్లో 10 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడీ ఆఫ్గన్ స్టార్. ఐపీఎల్లో ఇంపాక్ల్ ప్లేయర్ నిబంధన తొలిసారి ►ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు లేదంటే, ఓవర్ ముగిసిన తర్వాత.. వికెట్ పడినపుడు, ఒకవేళ బ్యాటర్ రిటైర్ అయితే సబ్‌స్టిట్యూట్‌ను వాడుకోవచ్చు. ఇంపార్ట్ ప్లేయర్ నిబంధన వాడుకునే క్రమంలో.. మ్యాచ్‌కు ముందు తుది జట్టుతో పాటు నలుగురు సబ్స్టిట్యూట్ల పేర్లు వెల్లడించాలి. వారిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు. ►ఒకవేళ 11 మంది సభ్యుల జట్టులో విదేశీ ఆటగాళ్లు నలుగురు ఉన్న తరుణంలో స్వదేశీ క్రికెటర్‌నే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేసుకోవాలి. ►మ్యాచ్ పరిస్థితిని బట్టి జట్టుకు అవసరమైన సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ సేవలు వినియోగించుకోవచ్చు. పిచ్ స్వభావాన్ని బట్టి బ్యాటర్‌కు బదులు.. బౌలర్లను బరిలోకి దింపవచ్చు. ►ఛేజింగ్‌లో అదనపు బ్యాటర్ కావాలని భావిస్తే.. ఒక బౌలర్‌ను తప్పించి అతడి స్థానంలో బ్యాటర్‌ను ఆడించవచ్చు. అయితే, ఒక్కసారి ఇంపాక్ట్ ఆటగాడి కోసం మైదానం ►వీడితే ఏ బ్యాటర్ లేదంటే బౌలర్ మళ్లీ గ్రౌండ్(సదరు మ్యాచ్)లో అడుగుపెట్టే అవకాశం ఉండదు. ►ఒకవేళ.. అప్పటికే రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన బౌలర్ స్థానంలో వచ్చే ఇంపాక్ట్ ప్లేయర్ బౌలర్ అయినట్లయితే.. అతడు తన నాలుగు ఓవర్ల కోటా పూర్తిచేయవచ్చు. ►సబ్‌స్టిట్యూట్‌గా వ్యవహరించే ఇంపాక్ట్ ప్లేయర్ సారథిగా మాత్రం వ్యవహరించే వీలు ఉండదు. మొత్తంగా.. 11 మంది మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. చదవండి: IPL 2023: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ..