guilty of contempt
-
ధిక్కారణాధికారాన్ని తొలగించలేరు!
న్యూఢిల్లీ: కోర్టులకు ఉండే ధిక్కార శిక్షాధికారాన్ని ఎలాంటి చట్టంతో తొలగించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక ఎన్జీఓ చైర్‌పర్సన్‌ను కోర్టు ధిక్కారం కింద విచారిస్తూ గతంలో విధించిన రూ.25 లక్షల జరిమానాను చెల్లించకపోవడం ధిక్కరణేనని స్పష్టం చేసింది. ముద్దాయివి ధిక్కరణ చర్యలేనని, అలాంటి వాటిని శిక్షించకుండా కోర్టు వదిలేయదని జస్టిస్ సంజయ్ కిషన్‌తో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. సూరజ్ ట్రస్ట్ ఇండియా అనే సంస్థ అధిపతి రాజీవ్ దైయాపై కోర్టు ధిక్కార ఆరోపణలను సుప్రీం విచారించింది. గతంలో రాజీవ్ 64 ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. అయితే ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేదు. దీంతో రాజీవ్‌కు సుప్రీంకోర్టు రూ.25 లక్షల జరిమానాను 2017లో విధించింది. దీనిపై పునఃపరిశీలన జరపాలని రాజీవ్ తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు రాజీవ్‌ది ధిక్కారమేనని తేలి్చచెప్పింది. రాజీవ్ కోర్టులపై బురద జల్లుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు ధిక్కారణాధికారం తమకు రాజ్యాంగం ఇచి్చందని తెలిపింది. రాష్ట్రపతితో జస్టిస్ ఎన్.వి. రమణ భేటీ సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. శనివారం విజ్ఞాన్ భవన్లో న్యాయ సేవలపై అవగా హనా కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఈ సదస్సు వివరాలను జస్టిస్ ఎన్.వి.రమణ రాష్ట్రపతికి వివరించారు. -
జస్టిస్ కర్ణన్‌కు ఆర్నెల్లు జైలుశిక్ష
-
జస్టిస్ కర్ణన్‌కు ఆర్నెల్లు జైలుశిక్ష
న్యూఢిల్లీ: కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ కర్ణన్ వివాదం మరో మలుపు తిరిగింది. ఆయన వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, కోర్టు ధిక్కరణ నేరం కింద కర్ణన్‌కు ఆరు నెలలు పాటు జైలుశిక్ష విధించింది. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో ఆయన్ని ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్, మరో ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు జస్టిస్ కర్ణన్ అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ ఎనిమిదిమంది ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరాలకు పాల్పడ్డారంటూ కర్ణన్ సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు ...జస్టిస్ కర్ణన్ కోర్టు థిక్కరణకు పాల్పడ్డారంటూ జైలుశిక్ష విధించింది. తోటి హైకోర్టుల జడ్జిలపై ఆరోపణలు చేసినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలో ఏడుగురు జడ్జిల బెంచ్ కర్ణన్‌ను విచారించిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం జడ్జిలతో కూడిన బెంచ్ దళితుడినని తనను అవమానించిందని కర్ణన్ ఆరోపించారు. తన కేసును సుమోటోగా తీసుకుని న్యాయపరమైన, చట్టపరమైన ఆదేశాలు జారీ చేసేందుకు అనర్హుడిని చేయడాన్ని ఆయన విమర్శించారు. -
విజయ్ మాల్యాపై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
విజయ్ మాల్యాపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఆస్తుల బదలాయింపుల కేసులో పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయన జూలై 10న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా మాల్యా వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సమన్లు జారీ చేసింది. ఇంతకు ముందే ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఆయనను ఆదేశించినా స్పందించకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఒకవేళ మ్యాలా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాకపోతే ఆయనకు ఆరు నెలలపాటు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే అనేక కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న మాల్యాకు న్యాయస్థానం తాజా ఆదేశాలతో ఆయన చుట్టు ఉచ్చు బిగుస్తోంది. మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. కాగా ఉద్దేశపూర్వక రుణ ఎగవేతపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని అలాగే డియోజీయో సంస్థ నుంచి పొందిన 40 మిలియన్ డాలర్లను డిపాజిట్ చేసేలా ఆయనపై చర్యలు తీసుకోవాలని దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. వడ్డీసహా దాదాపు రూ.9,000 కోట్ల రుణ బకాయి కేసులో బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియం ఈ పిటిషన్లను దాఖలు చేసింది.