gummadi sandhya rani
-
మంత్రి కాన్వాయ్ చూసి భయపడుతున్న జనం
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టారు. మంత్రి పదవి కూడా దక్కింది. జిల్లాలో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు, సమీక్షలు, సమావేశాలంటూ నిత్యం ఆమె బిజీగా ఉంటారు. రాష్ట్ర మంత్రి కావడంతో కేబినెట్ హోదాలో ఎస్కార్ట్ వాహనం, కాన్వాయ్ వంటి హంగులు, భద్రత అంతా సమకూరింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఆ కాన్వాయ్ అంటేనే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాలే అందుకు కారణం. గత నెల 26న మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరకు మంత్రి కాన్వాయ్ వల్ల పెనుప్రమాదమే తప్పింది. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా సాలూరు పట్టణంలోని పీఎన్ బొడ్డవలస వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ఆయన వెళ్లారు. కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణమైన సమయంలో మంత్రి కాన్వాయ్ బొడ్డవలస వైపు వెళ్తోంది. బంగారమ్మపేట వద్దకు వచ్చేసరికి వేగంగా వచ్చిన మంత్రి కాన్వాయ్.. రాజన్నదొర ప్రయాణిస్తున్న వాహనం మీదుకు దూసుకొచ్చింది. ఆయన డ్రైవర్ వాహనాన్ని చాకచక్యంగా వాహనాన్ని పూర్తిగా ఎడమవైపు తిప్పాడు. అప్పటికే మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం.. రాజన్నదొర వాహనం సైడ్ మిర్రర్‌ను రాసుకుంటూ వెళ్లిపోయింది. దీనిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనసంచార ప్రాంతంలో, ఇరుకు రహదారులపై అంతవేగంగా వాహన శ్రేణిని నడపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.సెప్టెంబరులో బూశాయవలస వద్ద ప్రమాదం..గత సెప్టెంబరు 12వ తేదీన ఉదయం రామభద్రపురం మండలంలోని బూశాయవలస–ఆరికతోట మధ్యలో జాతీయ రహదారిపై మంత్రి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం–ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ వాహన డ్రైవర్‌తోపాటు, ఆర్ఎస్సై, ముగ్గురుపోలీసులు, మినీ వ్యాన్‌లో ఉన్న మురో ముగ్గురికి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు రెండు ప్రమాదాల్లో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.ప్రజల్లో ఆందోళన..మంత్రి ప్రయాణించే కాన్వాయ్ తరచూ ప్రమాదాలకు గురవుతుండడంతో ప్రజలు కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారు. రాష్ట్రమంత్రి వాహన శ్రేణి కావడంతో అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. రద్దీ ప్రాంతాలు, సింగిల్ రోడ్లలో సైతం వాహన శ్రేణి అత్యంత వేగంగా వెళ్తోందని చెబుతున్నారు. మున్ముందు ఎటువంటి ప్రమాదాలూ జరగకుండా వాహన శ్రేణి చోదకులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. -
అసెంబ్లీలో టీడీపీ మంత్రి వ్యాఖ్యలకు పుష్ప శ్రీవాణి అదిరిపోయే సెటైర్లు
-
అంగన్వాడీల సదస్సుకు మంత్రి డుమ్మా!
సాక్షి, విజయవాడ: అంగన్వాడీల రాష్ట్రస్థాయి సదస్సుకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి డుమ్మా కొట్టారు. మంత్రి, కూటమి ప్రభుత్వ తీరుపై అంగన్వాడీ సదస్సు అసహనం వ్యక్తం చేసింది. ‘‘అంగన్వాడీలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోంది. మా సదస్సుకు మంత్రి గుమ్మడి సంధ్యారాణిని, అధికారులను ఆహ్వానించాం. సదస్సుకు కనీసం అధికారులు కూడా రాలేదు’’ అని అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు బేబిరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వస్తున్నామని చెప్పి మొహం చాటేశారు.. ఫోన్లు కూడా ఎత్తడం లేదు. ఎవరొచ్చినా రాకపోయినా మా ఉద్యమాలు ఆగవు. డిసెంబర్ 12వ తేదీన అంగన్వాడీల సమ్మె. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని బేబి రాణి డిమాండ్ చేశారు.మంత్రి రాకపోతే మాకేమీ నష్టంలేదు.. ఆవిడకే నష్టంగతంలో అంగన్వాడీలను చంద్రబాబు గుర్రాలతో తొక్కించారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు గుర్తు చేశారు. ‘‘2014-19 మధ్య కూడా చంద్రబాబు అంగన్వాడీలను పట్టించుకోలేదు. ఈ రోజు మంత్రి గుమ్మడి సంధ్యారాణి వస్తానన్నారు. ఆమె రాకపోతే మనకేమీ నష్టంలేదు.. ఆవిడకే నష్టం. ప్రభుత్వాలు ఏవైనా ఉద్యమాల ద్వారానే అంగన్వాడీల సమస్యలు పరిష్కారమవుతాయి. అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి. శాసనమండలి సమావేశాల్లో అంగన్వాడీల సమస్యలపై ప్రస్తావిస్తాం. అంగన్వాడీల సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చా. 42 రోజుల సమ్మె మినిట్స్ అమలు చేయాలని నిలదీస్తాం’’ అని లక్ష్మణరావు తేల్చి చెప్పారు.మంచి చేస్తామని చెప్పి.. అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం మౌనంగా ఉండాలనుకుంటున్నట్లు అనిపిస్తోందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి మండిపడ్డారు. ‘‘ఈ రోజు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ సదస్సుకు రాకపోవడం అలానే అనిపిస్తోంది. అంగన్వాడీల టెంట్ల వద్దకు వచ్చి మద్దతిచ్చిన టీడీపీ.. ఒక్క హామీ ఇవ్వలేదు. మన టెంట్ల వద్దకు వచ్చి మంచి చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. మనల్ని ఎలా బంధించాలా అని ప్రభుత్వం చూస్తోంది. మీ మౌనానికి.. మీ సంఖ్యా బలానికి అంగన్వాడీలు తలొగ్గరు’’ అని రమాదేవి పేర్కొన్నారు.ఇదీ చదవండి: వలంటీర్ల కొనసాగింపుపై పిల్లిమొగ్గలుఆ హామీలేమైపోయాయి..అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. ‘‘నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేయాలి. ప్రభుత్వం ప్రకటన చేయకపోతే నవంబర్ 16న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేస్తాం. జూలైలో అంగన్వాడీలను చర్చకు పిలవాలని మినిట్స్ లో రాసుంది. ఈ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలయ్యింది...ఇంతవరకూ ఎలాంటి చర్చలకు పిలవలేదు. అంగన్వాడీల సమ్మె టెంటుల వద్దకు వచ్చి ఇచ్చిన హామీలేమైపోయాయి’’ అంటూ ఆమె ప్రశ్నించారు.‘‘టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన అంగన్వాడీలకు గ్యాడ్యువిటీ హామీని నెరవేర్చాలి. అంగన్వాడీల సమస్యలను. పరిష్కరించకపోతే డిసెంబర్ 12న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతాం. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి.. మేం ఏ పెన్షనూ అడగం. మా ప్రభుత్వం ఇప్పుడే వచ్చిందంటున్నారు. చనిపోయిన అంగన్వాడీలకు మట్టి ఖర్చులకు జీవో ఇవ్వడానికి ఎంత టైమ్ పడుతుంది. అంగన్వాడీలకు కూడా దీపం పథకం అమలు చేయాలి. అంగన్వాడీలకు పెన్షన్ పంపిణీ డ్యూటీలు రద్దు చేయాలి‘‘ అని సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. -
అగ్నికి ఆజ్యంపోస్తున్న జనసేన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గిరిజన ముద్దుబిడ్డ పీడిక రాజన్నదొర కష్టం, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో సాలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీకి కంచుకో టగా మారింది. నాలుగు దఫాలుగా తిరుగులేని విజయాలతో రాజన్నదొర సాలూరును తన అడ్డాగా మార్చుకున్నారు. మళ్లీ అక్కడ ఎలాగైనా టీడీపీ ఉనికి చాటుకోవడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏకంగా రాజన్నదొరపై పసలేని ఆరోపణలను ఇటీవల అరకు సభలో సంధించినా గిరిజనం నుంచి పెద్దగా స్పందన లేదు. గాలిలో దీపం మాదిరిగా పరిస్థితి తారుమారు అయినా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మాత్రం తారస్థాయిలోనే జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పొత్తులో భాగంగా జతకట్టిన జనసేన నాయకులు ఇప్పుడు ఆ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. శంబర జాతర సందర్భంగా సాలూరు, మక్కువ మండలాల్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ఆ కుమ్ములాటకు అద్దంపట్టాయి. ‘వీళ్లు మారరురా’ అంటూ టీడీపీ కార్యకర్తలే నొచ్చుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆర్పీ భంజ్‌దేవ్, గుమ్మడి సంధ్యారాణి వర్గాల మధ్య అంతర్గత కుమ్ములాటల పంచాయితీ సాక్షా త్తూ చంద్రబాబు సమక్షంలోనే జరిగినా క్షేత్రస్థాయిలో ఏమీ మార్పు కనిపించట్లేదు. తమను టార్గెట్ చేసుకొని సంధ్యారాణి అనుచరులు పనిచేస్తున్నారని, పార్టీలో కలుపుకెళ్లే ప్రయత్నాలేవీ చేయట్లేదని భంజ్‌దేవ్ వర్గీయులు గళమెత్తుతున్నారు. వెనుకే ఉంటూ మోసం చేసే నాయకులను ముందుగానే దూరంపెట్టే పని సంధ్యారాణి చేస్తున్నారని ఆమె వర్గీయులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు, లేఖలతో మొదలైన యుద్ధం పోలీసు స్టేషన్లలో ఫిర్యాదుల వరకూ వెళ్లింది. ఇది ఇప్పుడు ఫ్లెక్సీల యుద్ధంతో తారస్థాయికి చేరింది. సంధ్యారాణి తీరుతో విసిగిపోయామని, ఆమెకు టికెట్ ఇస్తే ఏమాత్రం సహకరించబోమని భంజ్‌దేవ్ వర్గీయులు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. తెరపైకి తేజోవతి... సాలూరు టీడీపీ టికెట్ తనదేనని గుమ్మడి సంధ్యారాణి ధీమాగా చెబుతున్నప్పటికీ చంద్రబాబు ఇంకా స్పష్టంగా చెప్పకపోవడంతో ఆమె వర్గీయుల్లో సందేహం నెలకుంది. దీనికితోడు తేజోవతి రంగప్రవేశంతో ఇది మరింత పెరిగింది. ఇటీవల నూతన సంవత్సర వేడుకల్లో ఆమె భంజ్‌దేవ్ ఇంటి వద్ద ప్రత్యక్షమవ్వడం సంధ్యారాణి వర్గీయులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ పరిస్థితితో భంజ్‌దేవ్ వర్గీయులు నిరాశ వదిలేసి కొత్త ఉత్సాహంతో పార్టీలో క్రియాశీలకమయ్యారు. తేజోవతి సాలూరు గడ్డపై కాలుపెట్టడం వెనుక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చన్నాయుడి ప్రోత్సాహం ఉందని, ఆమెకు బొబ్బిలి నాయకుడు బేబీనాయన ఆశీస్సులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల బొబ్బిలిలో జరిగిన సభలోనే ఆమెకు టీడీపీ కండువా వేసి చంద్రబాబు పార్టీలోకి చేర్చుకోవడం వారి వాదనలకు బలం చేకూరుస్తోంది. అగ్నికి ఆజ్యంపోస్తున్న జనసేన తేజోవతికి మద్దతుగా ఉన్న భంజ్‌దేవ్ వర్గీయులను టార్గెట్ చేస్తూ ఇన్నాళ్లూ సంధ్యారాణి వర్గీయులు చేసినదాన్ని కన్నా అంతకుమించి జనసేన నాయకులు లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో సంధ్యారాణి, భంజ్‌దేవ్ వర్గాల మధ్య అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. తనను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టుచేసిన జనసేన కార్యకర్త త్రిపురనేని విజయ్ చౌదరిపై సాలూరు టౌన్ పోలీసుస్టేషన్లో భంజ్‌దేవ్ ఫిర్యాదు చేశారు. ఇలాంటి కేసులకు తాను భయపడనని సదరు జనసేన కార్యకర్త మరో వీడియో పోస్టు చేయడం గమనార్హం. ఫ్లెక్సీలతో యుద్ధం శంబర జాతర సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ సాలూరు, మామిడిపల్లి, శంబర ప్రాంతాల్లో తేజోవతి వర్గీయులు ఫ్లెక్సీలను పెట్టించారు. ఆ ఫ్లెక్సీల్లో తేజోవతి ముఖాన్ని ఎవరో చింపేశారు. కొన్నిచోట్ల ముఖం కనపడకుండా ఆమె ఫొటోపై సంధ్యారాణి ఫొటోలను అతికించారు. మరోవైపు శంబరలో పెట్టిన ఫ్లెక్సీలో సంధ్యారాణి ముఖం కనిపించకుండా పసుపు రాసేశారు. గెలిచే అవకాశం లేనిచోట నాయకుల కొట్లాటను చూసి జనం నవ్వుకుంటున్నారు. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి, విజయనగరం : టీడీపీలో వర్గ విభేదాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయనగరం జిల్లా సాలూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ సంధ్యారాణి, నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రతాప్ బంజ్దేవ్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సాలూరులో టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి తనను పిలవలేదని సంధ్యారాణి అలకబూనారు. బంజ్‌దేవ్ కావాలనే తన వర్గం వారిని పక్కన పెడుతున్నారని మండిపడుతున్నారు. కాగా సంద్యారాణిని బుజ్జగించేందుకు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ రంగంలోకి దిగారు. బంజ్‌దేవ్‌తో పాటు సంధ్యారాణి ఇంటికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సంధ్యారాణి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి డుమ్మా కొట్టడం గమనార్హం. -
సంధ్యారాణి డీలా భంజ్‌దేవ్ ఖుషీ
ఖుషి..ఖుషిగా ఉందిలే..అని ఓ వర్గం పాడుకుంటుంటే.. డామిట్ కథ అడ్డం తిరిగిదంటూ మరో వర్గం నిండా ఆవేదనలో మునిగిపోయింది. సాలూరు నియోజకవర్గ టీడీపీలో నెలకొన్న అంతర్గత పోరులో మాజీ ఎమ్మెల్యే భంజ్దేవ్దే పైచేయిగా నిలిచింది. ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణికి ఆ పార్టీ అధిష్టానం కాస్త ఝలక్ ఇచ్చింది. ప్రజాప్రతినిధి కాకపోయినప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జ్ హోదాలో భంజ్దేవ్కే పెద్ద పీట వేసింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇటీవల కాలంలో శాసన మండలి సభ్యురాలు గుమ్మడి సంధ్యా రాణి, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఆర్పి భంజ్‌దేవ్‌ల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువైంది. సమావేశ వేదికల సాక్షిగా వర్గాల వారీగా పొట్లాడుకుంటున్నారు. ప్రజాప్రతినిధి కాకపోయినప్పటికీ ప్రొటోకాల్ తరహాలో అన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ప్రజాప్రతినిధిగా చెలామణి అయిపోతున్నారని, నియోజకవర్గానికొచ్చిన అవకాశాలను ఒక్క సాలూరుకే పరిమితం చేస్తున్నారన్న ఆవేదనతో సంధ్యారాణి వర్గీయులున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా రచ్చకెక్కుతున్నారు. పార్టీ సీనియర్ అయిన ఆయన మాట చెల్లుబాటు కాకపోతే ఎలా అని, మొదటి నుంచి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయనను కాదని, అనుకోని పరిణామాలతో ఎమ్మెల్సీ అయిన సంధ్యారాణి పెత్తనమేంటని భంజ్‌దేవ్ వర్గీయులు మండిపడుతున్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ హోదాలో ఆయనకే పెద్ద పీట వేయాలని బాహాటంగానే డిమాండ్ చేస్తున్నారు. ఇరువర్గాల పోరుపై అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో ఆమధ్య పంచాయతీ కూడా జరిగింది. లోకేష్ డెరైక్షన్‌లో.. ఇరువర్గీయుల వ్యవహారం చినికి చినికి గాలివానగా మారి ఏకంగా రాష్ట్ర పార్టీ దృష్టికి వెళ్లింది. ఇంకేముంది ప్రభుత్వ స్థాయిలో షాడో నేతగా చెలామణి అవుతున్న చినబాబు లోకేష్ రంగంలోకి దిగారు. జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ను పిలిపించి సాలూరు వ్యవహారంపై డెరైక్షన్ ఇచ్చారు. నియోజకవర్గంలో ఏదైనా భంజ్‌దేవ్‌కు తెలిసే జరగాలని స్పష్టం చేశారు. అయినా దారికి రాకపోతే ఇకపై రాష్ట్ర పార్టీయే సాలూరు వ్యవహారాల్ని చూసుకుంటుందని హెచ్చరికలు కూడా పంపించారు. దీంతో ఆదివారం విజయనగరంలోని అశోక్ బంగ్లాలో సాలూరు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు జగదీష్ నిర్వహించారు. ఎమ్మెల్సీ సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్ తదితర నియోజకవర్గ నేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. లోకేష్ చెప్పినదంతా సమావేశంలో జగదీష్ వివరించారు. నియోజకవర్గ ఇన్చార్జ్గా భంజ్దేవే కీలక పాత్ర పోషిస్తారని, ఏదైనా ఆయన కనుసన్నల్లో జరగాలని, ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలు, అభివృద్ధి పనులు ఆయన ఇష్టానుసారమే జరగాలని, ఆయన చెప్పిందే అంతిమమని స్పష్టంగా చెప్పేశారు. కాకపోతే, సంధ్యారాణిని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత భంజ్‌దేవ్‌పై ఉందని సూచించారు. ప్రభుత్వ స్థాయిలో రావాల్సిన వాటి విషయంలో సంధ్యారాణి చొరవ తీసుకోవాలని తెలిపారు. ఇదే విషయాన్ని పార్టీలోని అట్టడుగు వర్గాలకు తెలియజేసేందుకు మార్చి 3వ తేదీన సాలూరులో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు జగదీష్ తెలిపారు. దీంతో అంతా తమకు అనుకూలంగా జరిగిందని భంజ్‌దేవ్ వర్గీయులు సంబర పడగా, సంధ్యారాణి వర్గీయులు కంగుతిన్నారు. -
కొత్తపల్లి గీత కులంపై వివాదం: హైకోర్టు విచారణ
హైదరాబాద్ : అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరపనుంది. అరకు లోక్‌సభ నియోజక వర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కొత్తపల్లి గీత పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఎన్నికల సందర్భంగా గీత నామినేషన్ వేసేటపుడు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు పొందుపరిచారంటూ ఎన్నికల సమయంలోనే అరకు నుంచి టీడీపీ తరపున లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన గుమ్మడి సంధ్యారాణి పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో తదుపరి విచారణను కోర్టు గురువారం చేపట్టనుంది. ఇదే విషయంపై గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ కొత్తపల్లి గీతపై తాను ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడం వాస్తవమేనన్నారు. ఆమె ఎస్టీ కాదని తాము ఫిర్యాదు చేశామని, కొత్తపల్లి గీత లేదా ఆమె తరపు న్యాయవాది గురువారం కోర్టుకు హాజరు కావాలని నోటీసులు పంపినట్లు చెప్పారు.