చేతబడి నెపంతో ముగ్గురి దారుణహత్య!
ఒడిశా: సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలపై విశ్వాసం చెరిగిపోవడం లేదు. మూఢ నమ్మకాలతో సాటిమనుషుల ప్రాణాలను సైతం బలిగొంటున్నారు. ఇలాంటి ఘటనలు మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట ప్రతినిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని రాయగఢ్ జిల్లా గుణుపురంలో చేతబడి చేస్తున్నారని నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని విచక్షణ లేకుండా దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది.
గతకొంత కాలంగా గ్రామంలో ముగ్గురు వ్యక్తులు చేతబడి చేస్తున్నారంటూ పుకార్లు లేచాయి. అది నిజమని నమ్మిన గుణుపురం గ్రామస్తులు.. ఆ ముగ్గురు కుటుంబ సభ్యులకు పురుగుల మందు తాగించి హతమార్చినట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.