Guru Graham
-
రవి గ్రహం మార్పు వల్ల ఈ రాశుల వారికి అనుకూలం
నవగ్రహాలలో ప్రతినెల మారే గ్రహం రవి గ్రహం. ఈ క్రమంలోనే మే15వ తేదీన రవి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. మిథున రాశి నుంచి వృషభ సంచారం చేయనున్నాడు రవి. ఈ కారణంగా పలు రాశిల వారికి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏయే రాశుల వారికి రవి అనుకూలంగా ఉంటాడో ఒకసారి చూద్దాం. మేష రాశి: ఈ రాశికి రెండో ఇంట్లో రవి సంచారం జరుగనుంది. అంటే మేష రాశికి ధన స్థానంలోకి(ద్వితీయ స్థానం) రవి రానున్నాడు. దాంతో ఈ రాశివారికి ఆర్థికంగా లాభం చేకూరనుంది. అనుకున్న ప్రణాళిక సాఫీగా సాగే అవకాశం ఎక్కువగా ఉంది. వృషభం: ఈ రాశిలోకే రవి సంచారం జరగడం వల్ల వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ సమయంలో ఉద్యోగస్థులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారు కూడా తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించే అవకాశాలు ఎక్కువ. ఆర్థికంగా మరింత మెరుగవుతారు. కుటుంబ పరంగా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి: ఈ రాశికి 11వ ఇంట రవి సంచారం ఉంటుంది. అంటే ఇది లాభ స్థానం. దాంతో ఈ రాశి వారు ఆర్థికంగా పుంజుకునే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో వారికి ఇది చక్కటి కాలం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సింహ రాశి: ఈ రాశికి 10వ ఇంట అంటే దశమ స్థానంలో రవి సంచరించనున్నాడు. రవి మార్పుతో ఊహించని విజయాలు చూసే అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు ఇదొక మంచి అవకాశం. వీరు అనుకున్న పనులు సాఫీగా సాగే అవకాశం ఉంది. అవాంతరాలకు పెద్దగా ఆస్కారం లేదు. కన్యా రాశి: ఈ రాశి వారికి తొమ్మిదో ఇంట అంటే భాగ్య స్థానంలో రవి సంచారం జరుగనుంది. ఇది కన్యా రాశి వారికి మిక్కిలి లాభించే అవకాశం ఉంది. రవి సంచారం ఉన్న నెలలో వీరు విజయాలు సొంతం చేసుకునే అవకాశం ఉంది. పైన చెప్పింది రవి గ్రహం అనుకూలంగా ఉన్న రాశులకు మాత్రమే. అలా అని మిగతా రాశులు బాలేదని కాదు. వేరే గ్రహాల ప్రభావంతో తక్కిన రాశులు ఫలితాలు ఆధారపడి ఉంటాయి. వేరే గ్రహాల వీక్షణ బాగున్న వాళ్లు మంచి ఫలితాల్ని చూస్తారు. (గ్రహ ఫలితాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించడం జరిగింది) -
శని గ్రహం మార్పుతో వీరికి యోగం!
శని గ్రహం.. నవ గ్రహాలలో అత్యధిక ప్రాధాన్యత ఉన్న గ్రహమనే చెప్పాలి. ఎందుకంటే మిగతా గ్రహాలు ఫలితాలు వారి చూసే చూపుల్ని బట్టి ఒక్కోసారి శుభాశుభ ఫలితాలు వస్తే, శని గ్రహం మాత్రం కచ్చితమైన ఫలితాల్ని ఇస్తాడనే జ్యోతిష్యం చెబుతుంది. చాలామందికి శని గ్రహం అంటే చెడు సంకేతంగా భావిస్తారు కానీ అది వాస్తవం కాదని శాస్త్రం చెబుతోంది. శని గ్రహం మంచిని కానీ, చెడు కానీ ఒకే రకంగా ఇస్తాడు. ఆ గ్రహం శుభ స్థానంలో ఉంటే శుభ ఫలితాన్ని, చెడు స్థానంలో చెడు ఫలితాన్ని కచ్చితంగా కలగజేస్తాడు. అందుకే శని గ్రహ సంచారం మారితే ఎలా ఉంటుందో అనే సందిగ్ధం జ్యోతిష్యం నమ్మివారిని ఎక్కువ కలవర పరుస్తూ ఉంటూంది. శని సాధారణంగా 3, 6, 7, 10 స్థానాల్లో ఉంటే మంచిది అని చెబుతారు. ఆ స్థానాల్లో శని ఉంటే మంచి జరుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది. అసలు ఈ ఏడాది శని గ్రహ ప్రభావంతో ఎవరికి యోగం కలుగుతుందో ఒక్కసారి చూద్దాం. ఈనెల(ఏప్రిల్) 29వ తేదీన శని గ్రహం సంచారం మారుతుంది. ఆ తేదీన శని గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఆయన స్వక్షేత్రం(సొంత ఇల్లు). అంతకుముందు వరకూ మకర రాశిలో ఉన్నాడు శని. ఇది కూడా శనికి సొంత ఇల్లే .అంటే శనికి రెండు ఇళ్లు అన్నమాట. మకర రాశి నుంచి అంటే సొంత ఇంటి నుంచి అతని సొంత ఇళ్లు అయిన కుంభంలోకి శని వస్తున్నాడు. దాంతో కొన్ని రాశుల వారికి ప్రయోజనం ఉండనుంది. వీటిలో వృషభ రాశి ఒకటి. వృషభ రాశి వారికి శని తన స్థానాన్ని మార్చుకోవడం వల్ల యోగం పట్టే అవకాశం ఉంది. శని గ్రహం అనుగ్రహంతో వృషభ రాశి వారికి అదృష్టం మారనుంది. ఏప్రిల్ 29వ తేదీన వృషభ రాశి వారికి దశమంలోకి శని రావడంతో వారి దశ మారనుంది. వీరు ఆర్థిక పురోగతిని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారం, ఉద్యోగ విషయాలలో కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. సింహ రాశి.. ఈ రాశి వారికి కూడా శని గ్రహం అనుగ్రహం ఉండనుంది. వీరికి సప్తమ శని వల్ల యోగం సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి జీవితాల్లో మార్పులతో పాటు ఆర్థిక ప్రగతి కూడా సాధిస్తారు. ఉద్యోగస్తులు ఊహించని ఫలితాలు కూడా చూస్తారు. అలానే ఈ రాశిలో వ్యాపారస్తులు కూడా అనుకోని విజయాన్ని పొందుతారు. కన్యా రాశి.. ఈ రాశి వారికి శని సంచారం ఆరు అవుతుంది. అంటే వీరు కూడా అదృష్టవంతులనే చెప్పాలి. సింహ రాశికి పక్కనే కన్యా రాశి వారికి శని గ్రహ సంచారం వల్ల ఏప్రిల్ 29వ తేదీ నుంచి కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా అప్పులు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే అవి శని గ్రహ మార్పుతో తొలగిపోయి ఊపిరి తీసుకునే అవకాశం ఉంది. కన్యా రాశి వారు ఊహించిన విజయాలు శని గ్రహ మార్పుతో చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ధనస్సు రాశి.. ఈ రాశి వారికి శని సంచారం వల్ల గతం కంటే మెరుగ్గా వారి జీవితం సాగే అవకాశం ఉంది. ప్రధానంగా ధన లాభంతో పాటు ఏమైనా చిక్కులు ఎదురైనా అవి వీరిపై పెద్దగా ప్రభావం చూపలేవు. విద్యార్థులు, ఉద్యోగులు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. శని గ్రహం ఒక్కో ఇంట్లో రెండున్నరేళ్లు ఉంటాడు. అంటే కుంభంలో రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత తన గమనాన్ని మార్చుకుంటాడు. అంటే మొత్తం 12 రాశుల్ని శని చుట్టి మళ్లీ ఇప్పుడు స్థానానికి రావాలంటే 30 ఏళ్లు పడుతుంది. పైన చెప్పింది శని గ్రహం అనుకూలంగా ఉన్న రాశులకు మాత్రమే. అలా అని మిగతా రాశులు బాలేదని కాదు. వేరే గ్రహాల ప్రభావంతో తక్కిన రాశులు ఫలితాలు ఆధారపడి ఉంటాయి. వేరే గ్రహాల వీక్షణ బాగున్న వాళ్లు మంచి ఫలితాల్ని చూస్తారు. (గ్రహ ఫలితాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించడం జరిగింది) -
గురుడు రాజయోగం ఇచ్చే రాశులు..!
ద్వాదశ రాశుల గ్రహ కూటమిలో గురు గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గురు గ్రహం బాగుంటే మనకు దాదాపు అంతా బాగున్నట్లే భావిస్తాం. ప్రస్తుత గోచారం ప్రకారం గురుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఏప్రిల్ 13వరకూ కుంభ రాశిలో ఉండే గురుడు.. ఆపై మీనంలోకి వస్తాడు. అంటే ఏప్రిల్ 14వ తేదీ నుంచి గురు సంచారం మీన రాశాలో ఉంటుంది. గురుడు ఒక్క రాశిలో ఉండే కాలం ఏడాది. అంటే ఏడాది పాటు గురుడు మీన రాశిలో ఉంటాడనే చెప్పాలి. ఏప్రిల్ 2వ తేదీ ఉగాది పండుగను జరుపుకున్న క్రమంలో ఈ ఏడాది ఎవరికి ఏ రాశులు ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని తెలుగు పంచాంగం ద్వారా ఇప్పటికే తెలుసుకున్నాం. మరి ఏప్రిల్ 13వ తేదీ దాటిన తర్వాత గురుడు మంచి ఫలితాల్ని ఇచ్చే రాశులు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. వృషభ రాశి- ఈ రాశి వారికి గురుడు 11వ స్థానంలో సంచరించనున్నాడు. అంటే ఇది లాభ స్థానం. జ్యోతిష్య శాస్త్రంలోని రాశి కుండలి ప్రకారం 11వ స్థానాన్ని లాభ స్థానంగా పరిగణిస్తారు. గురుడు మంచి ఫలితాలను ఇచ్చే స్థానాల్లో 11వ స్థానం ఒకటి. దాంతో వృషభ రాశి వారికి ఈ ఏడాది అనుకున్న దానికంటే మంచి ఫలితాల్నే గురు గ్రహం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం, ఉద్యోగం, తలపెట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే వృషభ రాశి వారు ఊహించని విజయాల్ని సొంతం చేసుకుంటారు. కర్కాటక రాశి- ఈ రాశి నుంచి చూస్తే గురు సంచారం 9వ స్థానం అవుతుంది. గురుడు 9వ స్థానంలో ఉండటం అత్యంత శుభకరమనే చెప్పవచ్చు. గురుడు ఎప్పుడూ 5,7,9 రాశులను చూస్తాడు. అటువంటిది గురుడు 9వ స్థానంలో ఉంటే, అది కూడా తన స్వక్షేత్రమైన మీన రాశిలో ఉండటం కచ్చితమైన మెరుగైన ఫలితాలు ఇవ్వడానికి దోహదం చేస్తుంది. ఇక్కడ గురుడు శుభ దృష్టి కారణంగా(కర్కాటక రాశిని అంటే ఉచ్ఛ స్థానాన్ని చూడటం) వీరి గ్రాఫ్ మరింతగా పెరుగుతుంది. కార్యజయంలో వీరికి తిరుగుండదు. కన్యారాశి- ఈ రాశి వారికి గురుడు సంచారం ఏడవ స్థానంలో ఉంటుంది. గురుడు సాధారణంగా ఏడో చూపు చూస్తాడు కాబట్టి ఆ స్థానంలో ఉండటంతో పాటు ఆ గ్రహానికి స్వక్షేత్రాల్లో ఒకటైన మీనంలో సంచరించడం శుభ ప్రదమంగా పేర్కొనవచ్చు. ప్రధానంగా కన్యా రాశికి సప్తంలో ఉండటం వల్ల, దాన్ని కళత్ర స్థానం (పెళ్లి, భార్య స్థానాలు)గా చెప్పుకోవడం వల్ల సంసారం జీవితం సాఫీగా అందంగా సాగిపోతుంది. పెళ్లి కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. వీరి మాటకు అత్యంత విలువ కూడా ఉంటుంది. వృశ్చిక రాశి- ఈ రాశి నుంచి గురుని సంచారం 5లో కొనసాగనుంది. గురు గ్రహం చూసే వీక్షణల్లో ఐదో స్థానం ఒకటి కాబట్టి ఈ రాశి వారు అనుకున్న విజయాలు సాధించి తీరుతారు. పంచమ స్థానం కాబట్టి సంతాన విషయంలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. గురువు సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా ఆర్థిక పరమైన చికాకులు వీడి గాడిలో పడే అవకాశాలు ఎక్కువ. కుంభ రాశి- కుంభ రాశి వారికి గురుని సంచారం రెండులో ఉండనుంది. అంటే ఇది ధన స్థానం. ధనపరమైన చిక్కులు ధాదాపు తొలగిపోయే అవకాశం. కుటుంబం పరంగా చక్కటి సహకారం అందుతుంది. ఏ పని తలపెట్టినా ముందుకు సాగుతారు. ఆరోగ్య పరంగా సమస్యలు ఏమైనా ఉన్నా దాన్ని జయించగలగడానికి అనుకూల సమయం. మిథునరాశి- ఈ రాశికి గురుని సంచారం దశమ భావంలో కొనసాగనుంది. గురుడు 10వ స్థానంలో ఉంటే అ వ్యక్తికి సంపదపెరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. సంపన్న జీవితం ఉంటుంది. గృహ యోగం, వాహన యోగం ఈ రాశి వారికి ఉంటుంది. ప్రస్తుతం గురుడు ఈ రాశి వారికి భాగ్య స్థానంలో ఉండటం వల్ల భాగ్యాన్ని ఇచ్చి వెళతాడు. గృహ యోగం, వాహన యోగం అనేది ఇప్పటికే జరిగి ఉంటే ఆపై ఆర్థికమైన పరమైన ఇబ్బందులు ఉండవనే చెప్పాలి. గురు గ్రహం బలంగా కారణంగా ఈ ఆరు రాశుల వారికి రాజయోగం సిద్ధించే అవకాశం ఉంది. (గ్రహ ఫలితాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించడం జరిగింది)