hacking risk
-
భారత్ అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర
పుణె: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా ఇన్ఫ్రా రంగానికి బ్యాంకులు దన్నుగా నిలవాలని, చిన్న–మధ్యతరహా సంస్థల అవసరాలకు తగ్గట్లుగా రుణ లభ్యత ఉండేలా చూడాలని ఆమె చెప్పారు. అలాగే, ఆర్థిక సేవలు అందుబాటులో లేని వర్గాలను బ్యాంకింగ్ పరిధిలోకి తేవాలని, బీమా విస్తృతిని మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 90వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. టెక్నాలజీతో కొత్త మార్పులు.. ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్‌ను సులభతరం చేసేందుకు ఉపయోగపడుతున్న టెక్నాలజీతో పరిశ్రమలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ ప్రాధాన్యం పెరుగుతోందని, ప్రస్తుతం భూటాన్, ఫ్రాన్స్ తదితర ఏడు దేశాల్లో ఈ విధానం అందుబాటులో ఉందని ఆమె తెలిపారు. అంతర్జాతీయంగా జరిగే రియల్–టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 45 శాతం వాటా భారత్‌దే ఉంటోందన్నారు.అయితే, టెక్నాలజీతో పాటు పెరుగుతున్న హ్యాకింగ్ రిస్కులను నివారించేందుకు, అలాంటి వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బ్యాంకుల్లో మొండిబాకీలు తగ్గుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ జూన్ ఆర్థిక స్థిరత్వ నివేదిక సూచిస్తోందని మంత్రి చెప్పారు. లాభదాయకతతో పాటు ఆదాయాలను పెంచుకునే దిశగా బ్యాంకులు తగు విధానాలను పాటించాలని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు సూచించారు. -
ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఫోన్ ఎవరిదంటే..
Queen Elizabeth II Uses Phone And Facebook: ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న సమస్య ‘స్మార్ట్‌ఫోన్ డాటా థ్రెట్’. ఫోన్ ఎంతటి అప్డేట్ వెర్షన్ అయినప్పటికీ.. డాటాను చోరీ చేయగలిగే సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు హ్యాకర్లు. ఈ క్రమంలో బిలియనీర్లు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలనే తేడా లేకుండా తమ చేత వాటం ప్రదర్శిస్తున్నారు. అయితే.. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II మాత్రం ఈ విషయంలో మినహాయింపు కలిగి ఉన్నారట! ఈ భూమ్మీద అత్యంత సెక్యూరిటీ కలిగి ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ ఫోన్‌ను క్వీన్ ఎలిజబెత్ II వాడుతున్నారట!. బకింగ్హమ్ ప్యాలెస్‌లో క్వీన్ ఛాంబర్లో ఇప్పటికీ సంప్రదాయ ల్యాండ్ లైన్ ఫోన్లను మాత్రమే ఉపయోగిస్తూ వస్తున్నారు. ఏ దేశాల నేతలు ఫోన్ చేసినా ఆమె ఆ ఫోన్‌తో మాత్రమే మాట్లాడతారు. అలాంటిది రాజవంశంలో మొట్టమొదటిసారి పాలించే ఓ వ్యక్తి.. వ్యక్తిగతంగా ఫోన్ ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది. న్యూస్ ఏజెన్సీ స్ఫుతినిక్ ప్రకారం.. క్వీన్ ఎలిజబెత్ II ఉపయోగించే మొబైల్ హైసెక్యూరిటీ వ్యవస్థను కలిగి ఉందట. బ్రిటిష్ నిఘా విభాగం ఎం16 రూపొందించిన ఈ వ్యవస్థ హ్యాకర్లకు చిక్కదని, పైగా ఆ ఫోన్లో ఫేస్బుక్ సైతం ఆమె ఉపయోగిస్తున్నారని ఆ కథనం ఉటంకించింది. ఇక ఫేస్బుక్ మెసేజ్‌లు ఇంకా ఎన్క్రిప్షన్కు(సెండర్- రీడర్ మాత్రమే చూడగలిగే సెక్యూరిటీ) నోచుకోని విషయం తెలిసిందే. యూజర్లకు అందుబాటులోకి రావడానికి మరో రెండేళ్లపైనే పట్టొచ్చని ఫేస్బుక్ ప్రకటించుకుంది కూడా. కానీ, ఎలిజబెత్ రాణి వాడుతున్న ఫోన్లో మాత్రం ఎం16 రూపొందించిన యాంటీ హ్యాకర్ ఎన్క్రిప్షన్ ఆప్షన్ ఉందని, అందువల్ల ఆ ఫోన్లో ఉండే ఫేస్బుక్ మాత్రమే కాదు.. ఫోన్లోని ఇతర డాటా మొత్తం చాలా భద్రంగా ఉంటుందని యూకేపాడ్కాస్ట్ ఓ కథనంలో వెల్లడించింది. ఇంతకీ ఫోన్ కంపెనీ ఏంటంటే.. శాంసంగ్. కెమెరాతో కూడిన ఈ అల్ట్రా స్లిమ్ ఫోన్‌ను ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫోన్‌గా పేర్కొంటున్నారు. ఈ ఫోన్‌ను చూసుకునేందుకు ప్రత్యేకంగా ముగ్గురు మనుషులు ఉన్నారట! వాళ్లు ఎప్పుడూ ఆ ఫోన్ ఛార్జ్ డౌన్ కాకుండా చూసుకుంటారట. అంతేకాదు ఆ ఫోన్లో ఆమె ఇద్దరితో ఎక్కువగా ఛాటింగ్ చేస్తోందని(ప్రైవసీ వల్ల వివరాలు వెల్లడించలేదు), ఆమె స్పందించనప్పుడు ఆమె ఫోన్‌ను హ్యాండిల్ చేసే వీలు ఇద్దరికి మాత్రమే ఉందని(ఒకరు ఆమె కూతురు యువరాణి అన్నె, రాణి మేనేజర్ జాన్ వారెన్) స్పుత్నిక్ సారాంశం. సీక్రెట్ ఫేస్బుక్ అకౌంట్ అమెరికా మెటా (ఒకప్పుడు ఫేస్బుక్) అందించే ఫేస్బుక్ మీద యూకేలో వ్యతిరేకత ఉంటుందన్నది తెలిసిందే. కానీ, బ్రిటన్ రాణి ఫోన్లో ఒక రహస్య ఫేస్బుక్ అకౌంట్ ఉండడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఇందులో ఆమె ఎక్కువగా వీడియోస్ చూస్తూ సమయం గడుపుతున్నారట. ఈ భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్.. అదీ 95 ఏళ్ల బ్రిటన్ మహరాణి వాడుతున్నారనే స్టింగ్ ఆపరేషన్ కథనాలు టెక్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఇప్పుడు. కరోనా పరిస్థితుల తర్వాత వీడియో కాల్స్ ఉద్దేశంతో ఆమె ఈ ఫోన్‌ను వాడుతున్నారని తెలుస్తోంది. -
ఆ కార్లకు హ్యాకింగ్ ముప్పు!
లాస్ ఎంజిల్స్: సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు ఈ డ్రైవర్ లెస్ కార్లను తయారుచేస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదనే చెప్పాలి. అయితే ఈ తరహా కార్లతో కొత్త సమస్యలు రాబోతున్నాయని చెబుతున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలున్నట్లు తమ పరిశీలనలో తేలినట్లు వెల్లడించారు. ఈ కార్ల తయారీలో ఉపయోగించే అత్యాధునిక కంప్యూటర్లు, సెన్సర్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ లాంటి సాంకేతిక పరిఙ్ఞానమే హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలను పెంచుతున్నట్లు తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన స్టిఫాన్ సావేజ్ తెలిపారు. హ్యాకింగ్ ద్వారా కారులోని బ్రేకులు, ఇతర ముఖ్యమైన వ్యవస్థను హ్యాకర్లు వారి చేతుల్లోకి తీసుకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. డ్రైవర్ లెస్ కార్లు వస్తున్నాయ్ అని సంబరపడిపోతున్న జనాలను ఈ పరిశోధన ఫలితాలు కలవరపెడుతున్నాయి.