ఫిష్ హలీమ్
హలీమ్... బాబోయ్ ఎంత హెవీగా ఉంటుందో... అది తింటే ఇక ఆ రోజు ఏమీ తినకూడదంతే... అనే ‘డైట్’ కాన్షస్నెస్ సిటీలో చాలా మందికి ఉంది. హెల్దీగా ఉండాలి. హెవీగా అనిపించకూడదు. ఈజీగా డెజైస్ట్ కావాలి. ఇలాంటి ఆలోచనలున్న కొందరి కోసం అన్నట్టుగా వచ్చిందే ఫిష్ హలీమ్. చేప ఆరోగ్యకరమైన నాన్‌వెజ్ వంటకాల్లో అగ్రగామి అని తెలిసిందే. ఇది దృష్టిలో ఉంచుకునే సంప్రదాయ హలీమ్‌కు ప్రత్యామ్నాయంగా నగరానికి చెందిన మహ్మద్ అనీఫుద్దీన్ దీనికి నాంది పలికారు. ‘కంటిచూపు మెరుగవడానికి, డయాబెటిస్ నివారణకు, మేధస్సుకు కూడా చేప వినియోగం మంచిది. హలీమ్ ప్రియులకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం ఈ ఫిష్ హలీమ్’ అంటున్నారు.
తానెన్నో చేపలతో ప్రయోగాలు చేశానని, అయితే చివరికి ముర్రెల్ (కొర్రమీను) హలీమ్‌కు సరైనదని నిర్ధారించుకున్నానంటున్నారు. దీన్లో అతి తక్కువ బోన్స్ ఉండటం వల్ల వాసన కూడా తక్కువగా ఉంటుందట. ఈ బోన్‌లెస్ చేపతో పాటుగా గోధుమలు, నెయ్యి, ఇతర మసాలా, ఫ్లేవర్స్‌ను కలిపి దాదాపు 4-5 గంటల పాటు వండితే గానీ సిసలైన ఫిష్ హలీమ్ తయారు కాదు. దీన్ని ఆయన నగరానికి పరిచయం చేసి ఏడేళ్లయింది. తొలుత దీనిపై ఎవరూ అంతగా ఆసక్తి చూపకపోరుునా... ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. లక్డీకాపూల్ సలీం మేన్షన్ ఫంక్షన్ ప్యాలెస్‌లో స్టాల్స్ ఏర్పాటు చేసి దీన్ని విక్రయిస్తున్నారు.
- సంకల్ప్
sేస్ట్ స్పెషలిస్ట్