haltiket
-
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
► రాష్ట్ర ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ ► 9వ తేదీ పరీక్షలు 19వ తేదీకి మార్పు ► జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఆదిలాబాద్ అర్బన్ : మార్చి ఒకటి నుంచి 19వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఇంటర్‌బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్, ప్రిన్సిపల్ సెక్రెటరీ రంజీవ్ ఆచార్య అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్మ నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై చర్చించారు. మార్చి 9న నిర్వహించే గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్షలను ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా 19వ తేదీకి మార్చిన విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని ఆదేశించారు. విద్యార్థులు bietelangana.cgg.gov.in వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ వారు పరీక్ష కేంద్రం లోకేషన్ యాప్‌ను విడుదల చేసిందని, దీని ప్రకారం విద్యార్థి హాల్‌టికెట్ నంబర్, కేంద్రం నంబర్ నమోదు చేస్తే యాప్ ద్వారా పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు రూట్‌మ్యాప్, చేరే సమయం తెలుసుకునే వీలుందని అన్నారు. కలెక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మొత్తం 56,655 మంది విద్యార్థులకు గాను 90 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 8.15 నుంచి 9గంటల వరకు పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తారని అన్నారు. నూతన ఆదిలాబాద్ జిల్లాలో మార్చి 14 నుంచి 30 వరకు, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షల్లో మొత్తం 10,410 విద్యార్థులకు 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామని, పరీక్ష సమయంలో అన్ని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని జిరాక్స్ సెంటర్ల యజమానులను ఆదేశించామని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, డీఆర్ఓ బానోత్ శంకర్, డీఐవో నాగేందర్, డీఈవో లింగయ్య, డీఎస్పీ లక్షీ్మనారాయణ, మున్సిపల్ కమిషనర్ మంగతాయరు తదితరులు పాల్గొన్నారు. -
ఐదు నిమిషాలు దాటితే నో ఎంట్రీ
నేటి నుంచి ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు విద్యారణ్యపురి : ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు జరగనున్నారుు. జిల్లాలో 4,273మంది ఎస్సెస్సీ పరీక్షలు, 7,730 మంది ఇంటర్ పరీక్షలు రాయనుండగా, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ పి.రాజీవ్, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ శంకర్రావు తెలిపారు. అన్ని పరీక్షలకు కలిపి 30 కేంద్రాలు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. కాగా, ఉదయం 9-30గంటల పరీక్షలు ప్రారంభం కానుండగా, గంట ముందు నుంచే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తామని, నిర్దేశిత సమయం తర్వాత ఐదు నిమిషాలు దాటినా లోపలకు రానివ్వమని స్పష్టం చేశారు. కాగా, పరీక్షలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌లు, డీవోలను ఆదేశించామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందని, విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ పెన్లనే వినియోగించాలని సూచించారు. విద్యార్థులు హాల్‌టికెట్ తప్ప ఎలాంటి కాగితాలు తీసుకురావొద్దని, సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, బ్లూ టూత్ తదితర పరికరాలు అనుమతించేది లేదని డీఈఓ, కోఆర్డినేటర్ స్పష్టం చేశారు. కాగా, పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు ఫ్లరుుంగ్ స్క్వాడ్లను నియమించినట్లు వివరించారు. -
విజయీభవ..
నేటి నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రేపు సెకండియర్ పరీక్షలు ఆరంభం హెల్ప్‌లైన్ నంబర్లు 040 - 23236433, 23242696 సిటీబ్యూరో: ఏడాదంతా చదివి...రాత్రింబవళ్లు కష్టపడి పరీక్షలకు సిద్ధమైన ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. బుధవారం నుంచి ప్రారంభమవుతున్న పరీక్షలకు విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో హాజరై.. అంతే ఉత్సాహంతో పరీక్షలు రాసి విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కాగా ఇంటర్ ఫస్టియర్‌కు సంబంధించి బుధవారం జంట జిల్లాల్లో 1.79 లక్షల మంది ద్వితీయ భాష పరీక్షను తొలిగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లో 189, రంగారెడ్డి జిల్లా పరిధిలో 244 కేంద్రాల్లో జరిగే పరీక్షల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు విద్యార్థులు 8 గంటల లోపే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకుంటే మేలు. 8.30 గంటలకు పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. విద్యార్థులను సకాలంలో కేంద్రాల వద్దకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే ఆర్టీసీ సమాయత్తమైంది. ‘ఎగ్జామ్ స్పెషల్’ పేరిట బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు పూర్తి చే సింది. హాల్‌టికెట్, పెన్నులు కచ్చితంగా విద్యార్థులు తీసుకెళ్లాలి. డౌన్లోడ్ చేసిన హాల్‌టికెట్‌తోపాటు కళాశాల గుర్తింపు కార్డు తప్పనిసరికాదు. కాకపోతే వెంట ఉంటే మేలు. ఇక గురువారం మొదలయ్యే సెకండియర్ పరీక్షలకు 1.98 లక్షల మంది సన్నద్ధం అవుతున్నారు. హెల్ప్‌లైన్ నంబర్లు: ఉదయం ఏడు గంటల నుంచే పనిచేస్తాయి. నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెంటనే సంప్రదింవచ్చు. హైదరాబాద్ జిల్లా 040-23236433 రంగారెడ్డి జిల్లా: 040-23242696, 23244625 హైదరాబాద్ జిల్లా పరీక్షల కమిటీ సభ్యుల నంబర్లు: 9908215359, 9347201789, 9849557401, 9391012604, 9849524111