నేటి నుంచి ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు
విద్యారణ్యపురి : ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు జరగనున్నారుు. జిల్లాలో 4,273మంది ఎస్సెస్సీ పరీక్షలు, 7,730 మంది ఇంటర్ పరీక్షలు రాయనుండగా, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ పి.రాజీవ్, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ శంకర్‌రావు తెలిపారు. అన్ని పరీక్షలకు కలిపి 30 కేంద్రాలు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. కాగా, ఉదయం 9-30గంటల పరీక్షలు ప్రారంభం కానుండగా, గంట ముందు నుంచే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తామని, నిర్దేశిత సమయం తర్వాత ఐదు నిమిషాలు దాటినా లోపలకు రానివ్వమని స్పష్టం చేశారు.
కాగా, పరీక్షలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌లు, డీవోలను ఆదేశించామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందని, విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ పెన్‌లనే వినియోగించాలని సూచించారు. విద్యార్థులు హాల్‌టికెట్ తప్ప ఎలాంటి కాగితాలు తీసుకురావొద్దని, సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, బ్లూ టూత్ తదితర పరికరాలు అనుమతించేది లేదని డీఈఓ, కోఆర్డినేటర్ స్పష్టం చేశారు. కాగా, పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు ఫ్లరుుంగ్ స్క్వాడ్‌లను నియమించినట్లు వివరించారు.