International tests
-
ఐదు నిమిషాలు దాటితే నో ఎంట్రీ
నేటి నుంచి ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు విద్యారణ్యపురి : ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు జరగనున్నారుు. జిల్లాలో 4,273మంది ఎస్సెస్సీ పరీక్షలు, 7,730 మంది ఇంటర్ పరీక్షలు రాయనుండగా, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ పి.రాజీవ్, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ శంకర్రావు తెలిపారు. అన్ని పరీక్షలకు కలిపి 30 కేంద్రాలు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. కాగా, ఉదయం 9-30గంటల పరీక్షలు ప్రారంభం కానుండగా, గంట ముందు నుంచే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తామని, నిర్దేశిత సమయం తర్వాత ఐదు నిమిషాలు దాటినా లోపలకు రానివ్వమని స్పష్టం చేశారు. కాగా, పరీక్షలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌లు, డీవోలను ఆదేశించామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందని, విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ పెన్లనే వినియోగించాలని సూచించారు. విద్యార్థులు హాల్‌టికెట్ తప్ప ఎలాంటి కాగితాలు తీసుకురావొద్దని, సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, బ్లూ టూత్ తదితర పరికరాలు అనుమతించేది లేదని డీఈఓ, కోఆర్డినేటర్ స్పష్టం చేశారు. కాగా, పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు ఫ్లరుుంగ్ స్క్వాడ్లను నియమించినట్లు వివరించారు. -
బెస్ట్ ఆఫ్ లక్
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి 1,02,541 మంది విద్యార్థులు 110 పరీక్షా కేంద్రాలు ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఛాన్స్ విద్యార్థి దశలో ఎంతో కీలకమైన ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. జీవితాన్ని మలుపు తిప్పే ఈ పరీక్షలు బంగారు భవిష్యత్తుకు సోపానాలు వేస్తాయి. రేపటి మంచి రోజులకు భరోసా ఇస్తాయి. నేటి విద్యార్థులకు ఈ సంగతి తెలియంది కాదు.. అందుకే వారు అహర్నిశలూ శ్రమించారు. ఎన్నో ఆశలతో ఎగ్జామ్స్‌కు సిద్ధమయ్యారు. అయితే పరీక్షలు మొదలు కాబోతున్న వేళ కాస్త ఒత్తిడి, ఆందోళన సహజం. అందుకే విద్యార్థులంతా విజయం మీదే అని విశ్వసించండి.. మీమీద మీరు నమ్మకముంచండి. అంతా బాగుంటుందన్న పాజిటివ్ దృక్పథంతో పరీక్షకు సిద్ధం కండి.. ఆల్ ది బెస్ట్! విశాఖపట్నం: ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. బుధవారం నుంచి 21 తేదీ వరకూ జరిగే ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వం ఈసారి ఉదయం 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించకూడదన్న కఠిన నిర్ణయం తీసుకుంది. అందువల్ల అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,02,541 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం 52,107 మంది, ద్వితీయ సంవత్సరం 50,434 మంది ఉన్నారు. ఇందుకోసం 110 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో నగరంలో 56, గ్రామీణ జిల్లాలో 41, మన్యంలో 13 సెంటర్లు ఉన్నాయి. వీటిలో 16 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జెరాక్స్ సెంటర్లను తెరవడానికి అనుమతించలేదు. ఒకవేళ తెరిస్తే నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. జంబ్లింగ్ విధానం జిల్లాలోని మొత్తం 110 కేంద్రాల్లో జంబ్లింగ్ విధానం లో పరీక్షలు జరగనున్నాయి. కానీ కళాశాలకు, కళాశాలకు మధ్య 30 కి.మీలకు పైగా దూరంతో పాటు ఆయా చోట్లకు బస్సు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో ఐదు కళాశాలలకు జంబ్లింగ్ నుంచి మినహాయింపునిచ్చారు. దీంతో ఆ కళాశాలల్లో చదువుతు న్న దాదాపు 1200 మంది విద్యార్థులు అక్కడే పరీక్ష లు రాసుకునే వెసులుబాటు దక్కింది. వాటి వివరాలు.. కొయ్యూరు గిరిజన సంక్షేమ కళాశాల (బాలురు) ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కాలేజి పెదబయలు గిరిజన సంక్షేమశాఖ ఎస్టీ కళాశాల (బాలురు) అప్పర్ సీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల జీకేవీధి గిరిజన సంక్షేమశాఖ ఎస్టీ కళాశాల (బాలికలు) సమస్యాత్మక కేంద్రాలు జిల్లావ్యాప్తంగా 16 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను అధికారులు గుర్తించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కేడీపేట గిరిజన సంక్షేమ కళాశాల (బాలురు), కొయ్యూరు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, అనంతగిరి గిరిజన సంక్షేమ కళాశాల (బాలికలు) అనంతగిరి గిరిజన కళాశాల, అరకువేలి ప్రభుత్వ కళాశాల, అరకువేలి ప్రభుత్వ కళాశాల, ముంచంగిపుట్టు గిరిజన సంక్షేమ కళాశాల(బాలురు), పెదబయలు ప్రభుత్వ జూనియర్ కాలేజి, హుకుంపేట ప్రభుత్వ కళాశాల, పాడేరు గిరిజనసంక్షేమ కళాశాల (బాలికలు), పాడేరు ప్రభుత్వ కళాశాల, జి.మాడుగుల అప్పర్ సీలేరు ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ కళాశాల, చింతపల్లి గిరిజన కళాశాల, చింతపల్లి గిరిజన సంక్షేమ కళాశాల (బాలికలు) జీకేవీధి సీసీ కెమెరాలతో నిఘా మరో వైపు ఈ ఏడాది సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో సెంటరులో 2 నుంచి 4 వరకు అమరుస్తున్నారు. వీటికి తొలిసారిగా విశాఖలోని ఇంటర్ కార్యాలయం నుంచి హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయానికి ఇంటర్నెట్ ద్వారా అనుసంధానిస్తారు. దీంతో ఆయా కేంద్రాల్లో జరిగే పరీక్షల తీరును నేరుగా తెలుసుకో గలుగుతారు. దీని ద్వారా పరీక్షా కేంద్రాల్లో అవకతవకలు, అక్రమాలు, మాస్‌కాపీయింగ్‌ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముందుగానే చేరుకోవాలి పరీక్షలు ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతాయి. 9 గంటలు దాటాక ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకూడదని ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవా లి. ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే విద్యార్థి భవిష్యత్ దెబ్బతినే ప్రమాదం ఉం ది. అలాగే విద్యార్థులు ఓఎంఆర్ షీట్‌పై తమ పేరు, హాల్‌టిక్కెట్ నంబరు, మీడియం, సబ్జెక్టుతో ఆధార్ నంబరు సరిగా ఉందో లేదో సరి చూసుకోవాలి. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
రేపటి నుంచి నుంచి ఇంటర్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి * 4 ఫ్లయింగ్, 5 సిట్టింగ్ స్క్వాడ్ * బృందాలతో ప్రత్యేక నిఘా * ఆర్ఐఓ పాత్రుని పాపారావు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో బుధవారం నుంచి 21వ తేదీ వరకూ జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంటర్మీడియెట్ విద్యామండలి జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి(ఆర్ఐఓ) పాత్రుని పాపారావు తెలిపారు. అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన (ఉదయం 9 గంటల తరువాత) పరీక్ష రాసేందుకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఆర్ఐఓ కార్యాలయంలో సోమవారం సాయంత్రం డీఈసీ కమిటీ సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 96 (47 ప్రభుత్వ, 49 ప్రైవేటు కళాశాలలు) కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలకు జనరల్, ఒకేషనల్, ప్రైవేటు, బ్యాక్లాగ్ ఇలా మొత్తం 59,385 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం 29,549, ద్వితీయ సంవత్సరం 29,836 మంది ఉన్నారన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని.. విద్యార్థులు నిర్ణీత సమయానికి హాజరుకావాల్సిందేనన్నారు. గతంలో 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చేవారిని కూడా పరీక్షకు అనుమతించేవారని.. ఈ ఏడాది మాత్రం ఇంటర్‌బోర్డు అధికారులు ఆ అవకాశం ఇవ్వలేదని వివరించారు. పరీక్షల నిర్వహణ కోసం 96 మంది సీఎస్‌లు, 96 మంది డీవోలు, 49మంది ఏసీఎస్‌లను, 19 మంది కస్టోడియన్లను నియమించామన్నారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని 37 పోలీస్స్టేషన్లకు ఇప్పటికే ప్రశ్నపత్రాలను చేరవేశామన్నారు. సెల్ఫ్‌సెంటర్లతోపాటు సమస్యాత్మక కేంద్రాలు, గతంలో కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలున్న కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు తనిఖీ బృందాలను నియమించామన్నారు. డీఈసీ కమిటీ, ఒక హైపవర్ కమిటీతోపాటు 4 ఫ్లయింగ్, 5 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. విద్యత్‌శాఖ, వైద్యఆరోగ్యశాఖ, పోస్టల్‌శాఖ, ఏపీఎస్ ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నామన్నారు. సమావేశంలో డీఈసీ సభ్యులు సనపల ఈశ్వరరావు, ఐ.శంకరరావు, జీ.వి.జగన్నాథరావు, హైపవర్ కమిటీ సభ్యుడు బొడ్డేపల్లి మల్లేశ్వరరావు, జిల్లా బల్క్ ఇన్‌చార్జిపేడాడ రాంబాబు, ఏవో సుధాకర్ పాల్గొన్నారు. సుదూర ప్రాంతాలతోపాటు గ్రామీణా ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను తరలించేందుకు జిల్లా వ్యాప్తంగా 10 రూట్లలో ఆర్టీసీ బస్సులను నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ఎచ్చెర్ల-కింతలి, రణస్థలం-లావేరు, పోలాకి-ప్రియాగ్రాహారం, నౌపడ-పూండీ, భామిని-కొత్తూరు, కోల్లివలస-బూర్జ, పాలకొండ-సీతంపేట, సోంపేట-కంచిలి, పలాస-పెద్దమడి, టెక్కలి-నందిగాం, హరిపురం-మందస రూట్లలో పరీక్ష ప్రారంభానికి గంట ముందు, పరీక్ష పూర్తయిన 15 నిమిషాల తర్వాత బస్సులను నడపనున్నారు.