Hamsa
-
వేడుకగా హంస పురస్కారాల ప్రదానం
రాజానగరం: రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో హంస పురస్కారాల ప్రదాన కార్యక్రమం మంగళవారం వేడుకగా జరిగింది. తెలుగు భాషాభివృద్ది కి విశిష్ట సేవలందిస్తున్న తొమ్మిది మంది ప్రముఖులను ఘనంగా సన్మానించి, పురస్కారాలను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఆదికవి నన్నయ యూనివర్సిటీలోని తెలుగు విభాగం, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిది మందికి హంస పురస్కారాలు ప్రదానం చేశారు.వీరిలో సాహిత్యంలో ఎస్.అబ్దుల్ అజీజ్ (రచయిత, కర్నూలు), మెడుగుల రవికృష్ణ (ఉపాధ్యాయుడు, గుంటూరు), డాక్టర్ జడా సుబ్బారావు (అసిస్టెంట్ ప్రొఫెసర్, నూజివీడు), వైహెచ్‌కే మోహనరావు (విలేకరి, పిడుగురాళ్ల), సామాజిక రచనలో ఎండపల్లి భారతి (రచయిత్రి, చిత్తూరు), కవిత్వంలో మాడభూషి సంపత్‌కుమార్ ఆచార్యులు (నెల్లూరు), అవధానంలో సూరం శ్రీనివాసులు (రిటైర్డ్ హెచ్ఎం, నెల్లూరు), సాంకేతిక రచనలు డాక్టర్ కేవీఎన్డీ వరప్రసాద్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, రాజమహేంద్రవరం) ఉన్నారు. వ్యాసరచన పోటీల్లో గండికోట హిమశ్రీ (బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు), జస్మితరెడ్డి (మంగళగిరి)లకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి,‘నన్నయ’ వీసీ ఆచార్య పద్మరాజు, సాహితీవేత్త, సంఘ సేవకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ప్రముఖ సాహితీవేత్త శలాక రఘునాధశర్మ, రిజిస్ట్రార్ ఆచార్య కె. సుధాకర్ ప్రసంగించారు. -
శిల్పం చేసి.. ప్రాణం పోసి
కడప కల్చరల్: జిల్లాకు చెందిన చిత్ర, శిల్పకారుడు, రాష్ట్ర ప్రభుత్వ కళారత్న (హంస) పురస్కార గ్రహీత గొల్లపల్లి జయన్న శిల్పకళా ప్రదర్శన నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రెండో రోజు ఆదివారం నగరం నలుమూలల నుంచి కళాభిమానులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ప్రదర్శనను తిలకించారు. పల్లెటూరు, బాల్యాన్ని ఈ శిల్పాలు మళ్లీ గుర్తుకు తెచ్చాయని, ఆ అనుభూతిని అందించినందుకు జయన్నకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జయన్నను ‘సాక్షి’ పలుకరించింది. ♦ ప్రదర్శనకు ఆదరణ ఎలా ఉంది? మనవైపు శిల్పకళ తక్కువేనని చెప్పాలి. ప్రసార మాధ్యమాల ద్వారా శిల్పకళకు మంచి ఆదరణ ఉంది. రెండు రోజులుగా పాఠశాల, కళాశాలల విద్యార్థులే కాకుండా నగర వాసులు కుటుంబాలతో కలిసి వస్తుండడంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ♦ పుట్టిన గడ్డపై తొలి ప్రదర్శన..మీ అనుభూతి ఎలా ఉంది? చాలా రోజులుగా జిల్లాలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయాలని చూశాను. ఇప్పుడు అవకాశం లభించింది. శిల్పాలను చూసిన వారు జయన్న మన జిల్లా వాడా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రాంతానికి శిల్పం అరుదైన కళా ప్రక్రియ గనుక కాస్త కొత్తగా అనిపిస్తోంది. ♦ పేదరికం నేపథ్యం నుంచి ఈ స్థాయికి ఎలా ఎదిగారు? బద్వేలులోని కుగ్రామంలో పేద కుటుంబంలో పుట్టాను. చదువు, బతుకుదెరువు కోసం బద్వేలు పట్టణంలో సైన్‌బోర్డులు, బ్యానర్లు రాసేవాడిని. కళ, విద్య దాహం తీరక హైదరాబాదుకు చేరి జర్నలిజం, శిల్పంతోపాటు సాధారణ డిగ్రీ కూడా చేశాను. వృత్తి రీత్యా పలు రాష్ట్రాలు తిరగడంతో శిల్పకళలో వైచిత్రిని తెలుసుకున్నా. నా శిల్పాలన్నీ పల్లెటూరిని ప్రతిభింబిస్తాయి ♦ జిల్లాలో తర్వాత ప్రదర్శన ఎక్కడ? చర్చలు జరుగుతున్నాయి. త్వరలో తేదీ నిర్ణయించే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా కొండవీడులో కూడా ప్రదర్శన నిర్వహించాలని కోరుతున్నారు. ♦ యువ శిల్పకారులకు మీ సందేశం ? సందేశం ఇచ్చే అంతడి వాడిని కాను. జిల్లాలో కవులు, కళాకారులకు కొదవ లేదు. అవకాశాలు లేకనే అభివృద్ధికి నోచుకోవడం లేదు. వైవీయూ రాకతో ఇక ఆ కొరత తీరుతుంది. పట్టుదలతో శ్రమిస్తే ఫలితం తప్పక లభిస్తుంది. -
'రాయలసీమ సదస్సు జయప్రదం చేయండి'
అనంతపురం సిటీ: హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ (హంస) ఆధ్వర్యంలో ఈ నెల 18న వైస్సార్ కడప జిల్లాలో నిర్వహించే రాయలసీమ సదస్సును జయప్రదం చేయాలని కార్యదర్శి చాముండేశ్వరి పిలుపునిచ్చారు. ‘హంస’ నేతలు అనిల్‌కుమార్, అడిషనల్ డీఎం అండ్ హెచ్ఓ పద్మావతిలు మంగళవారం తమ ఛాంబర్లో రాయలసీమ సదస్సుకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. హక్కుల కోసం జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హంస నేతలు విజ్ఞప్తి చేశారు. -
వివాహిత ఆత్మహత్య
ఓ గృహిణి వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. శామీర్‌పేట్ పోలీసులు వివరాలు... మండలంలోని ఉద్దమర్రి గ్రామానికి చెందిన ఎ.హంస(23) రమేశ్ భార్యభర్తలు. గత రెండు మాసాల క్రితం హంస భర్త రమేశ్ అప్పుల బాధతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈక్రమంలో తీవ్ర మనస్థాపానికి గురయిన రమేశ్ భార్య హంస గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరులేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు కుటుంబీకులు 108, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న శామీర్‌పేట్ పోలీసులు మృతదేహానికి పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. కాగా ఉద్దమర్రికి చెందిన ఎ. హంస భర్త రమేశ్ ఇటీవల అప్పుల బాధతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో హంస తన భర్త లేని జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా హంసను ఆమె అత్తా,మామలు చంపేశారని హంస తల్లిదండ్రులు బందువులు ఆరోపించారు. మృతి చెందిన హంసకు ఒక బాబు ఉన్నాడు. -
రాలిన విద్యా కుసుమాలు
కూలి పనిచేస్తూ చదువుతున్న అజయ్ పెళ్లి పీటలు ఎక్కబోయి పాడెక్కిన హంస చిత్తూరు నగరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. విగత జీవులుగా పడి ఉన్న విద్యార్థులను చూసి ఆస్పత్రికి వచ్చిన వారు చలించిపోయారు. వారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు.. కుటుంబ నేపథ్యం చూస్తే మృత్యువు కూడా ఎందుకు వీరిపై యమపాశాన్ని విసిరామా..? అని కన్నీరు పెట్టకతప్పదు. చిత్తూరు (అర్బన్): యాదమరి మండలం కొట్టాలకు చెందిన శ్రీనివాసులు, కమలమ్మ రెండో కుమారుడు అజయ్ (16). ఊహ తెలిసిన నాటికే నాన్న చనిపోయాడు. నిరుపేద కుటుంబం. ఉండడానికి సొంత ఇళ్లు లేకపోవడంతో బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. తల్లి కూలి పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. కొట్టాల ప్రభుత్వ పాఠశాలలో 9.2 మార్కులతో పదో తరగతి పాసయిన అజయ్ పెద్దయితే ఇంజనీరయ్యి పేదరికాన్ని జయించాలని ఎంపీసీలో చేరాలనుకున్నాడు. కానీ దానికి డబ్బులు ఎక్కువవుతుందని తెలుసుకుని రాజీపడి సీఈసీ చదవడానికి చిత్తూరు నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇక్కడా పేదరికం వెక్కిరించడంతో రెండు నెలలుగా కళాశాల ఫీజు కట్టలేక కూలి పనికి వెళుతూ మంగళవారం రూ.1,500 ఫీజు చెల్లించాడు. బుధవారం మరో రూ.వెయ్యి చెల్లించి హాల్‌టికెట్టు తీసుకోవడానికి కళాశాలకు వచ్చాడు. రూ.200 చెల్లిస్తే కళాశాల వార్షికోత్సవానికి అనుమతిస్తామని యాజమాన్యం చెప్పడంతో వార్షికోత్సవానికి వెళ్లలేక బయట తిరుగుతూ ఉన్నాడు. గురువారం వచ్చి రూ.1,500 చెల్లించి హాల్‌టికెట్టు తీసుకుంటానని స్నేహితులకు చెప్పి బస్టాండులో బస్సు ఎక్కడానికి వెళుతున్నాడు. దీంతో ఒక్కసారిగా వాహనం రూపంలో వచ్చిన మృత్యువు అజయ్‌ను ఢీ కొట్టింది. రక్తస్రావం మధ్య అజయ్‌ను స్థానికులు ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతుండగా. ‘ నేను బతుకుతానా..? మా అమ్మను చూడాలి...’ అంటూనే కళ్లుమూశాడు. ఆస్పత్రిలో నిర్జీవంగా పడివున్న అజయ్ మృతదేహాన్ని చూసిన ఇతని తల్లి గుండెలు పగిలేలా రోదించడం పలువురిని కలచివేసింది. ఇక చిత్తూరు గ్రామీణ మండలం మర్రికుంటకు చెందిన నాగరత్నరాజు, రత్నమ్మ రెండో కుమార్తె హంస (21) నగరంలోని ఓ కళాశాలలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది. తాను.. తన చదువు.. కొందరు స్నేహితులు తప్ప హంసకు మరే ప్రపంచం తెలియదు. నెల రోజులుగా జ్వరంతో కళాశాలకు వెళ్లని హంస బుధవారం కళాశాకని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. తిరుపతిలో క్యాంపస్ సెలక్షన్ జరుగుతోందని తెలుసుకుని అక్కడి వెళ్లి ఇంటర్య్వూకు హాజరయ్యి చిత్తూరుకు చేరుకుంది. స్నేహితులతో కలిసి ఊరికి వెళ్లడానికి రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వస్తూ వ్యాన్ కింద పడి అక్కడిక్కడే మృత్యుఒడికి చేరుకుంది. ‘ ఇన్ని రోజులూ ఇంటి దగ్గరే ఉండి ఈ రోజనంగా కాలేజీకని చెప్పి మమ్మల్ని వదిలివెళ్లిపోయావా చెల్లీ...’ అంటూ మృతురాలి అక్క గీత, ‘నెల రోజుల్లో పెళ్లి పందిరి ఎక్కాల్సిన దానివి పాడె ఎక్కావమ్మా...?’ అంటూ మృతురాలి తండ్రి నాగరత్నరాజు ఆర్తనాదాలు చూస్తూ గుండెలు అవిసేలా రోదించడం చూపరులకు కంటతడి పెట్టించింది. రోడ్డు ప్రమాదం దోషులు పోలీసులే ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని నడిపింది గంగాధరనెల్లూరు పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పీ.పురుషోత్తం. విషయాన్ని బుధవారం రాత్రి వరకు పోలీసుశాఖ గోప్యంగా ఉచింది. అప్పటికే విషయం బయటకు పొక్కడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా వాహనం నడిపిన పురుషోత్తంను సస్పెండ్ చేస్తూ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రమాదానికి కారణమైన కేఏ 01-బీ 2141 వాహనం ఎర్రచందం తరలించే దొంగల నుంచి సీజ్ చేసిందని కొందరు, రికార్డులు సరిగా లేకపోవడంతో రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారని మరికొందరు చెప్పుకుంటున్నారు. పోలీసు స్టేషన్లో నెలల తరబడి కండిషన్లో లేనివాహనాన్ని కానిస్టేబుల్ పురుషోత్తంతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు చిత్తూరుకు తీసుకొచ్చినట్లు విశ్వశనీయంగా తెలిసింది. పరారీలో ఉన్న కానిస్టేబుల్‌ను అరెస్టు చేయడానికి తూర్పు సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఓ బృందాన్ని, వాహనం పోలీసు స్టేషన్ నుంచి ఎలా బయటకు వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవడానికి విచారణ అధికారిగా ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డిని నియమిస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారని చిత్తూరు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీకాంత్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా మృతుల కుటుంబాలను జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, ఎస్పీ శ్రీనివాస్ పరామర్శించారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఉన్న హసం, అజయ్ కుటుంబీకులను ఓదార్చారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అవసరమైతే వేలూరు, తిరుపతి ఆస్పత్రులకు తరలించి చికిత్స డాక్టర్లను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికీ రూ.1.50 చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కును ఎమ్మెల్యే సత్యప్రభ చేతులుమీదుగా అందజేశారు. -
ఆ ఘనత మాదే: సురేష్ కొండేటి
30న ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక సాక్షి, సిటీబ్యూరో: గత పదకొండేళ్లుగా ‘సంతోషం’ ఫిల్డ్ అవార్ట్స్ వేడుకను వైభవంగా నిర్వహిస్తున్న తాము 12వ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డు వేడుక మరింత ఘనంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నామని ‘సంతోషం’ సినీ వార పత్రిక అధినేత సురేష్ కొండేటి తెలిపారు. ఈ నెల 30న జరగనున్న ఈ వేడుక కర్టన్రైజ్ కార్యక్రామం ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలో సినీ తారలు ప్రణీత, హంసా నందిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్..‘దక్షిణాది ప్రాంతీయ భాషల్లో ఏ భాషలోనూ ఇంత సుదీర్ఘ కాలంగా ఫిల్మ్ అవార్డులు నిర్వహించిన పత్రిక లేదు. ఆ ఘనత మా పత్రికకే చెందుతుంది. ఇన్నేళ్లుగా చలన చిత్ర పరిశ్రమ పెద్దల ఆదరాభిమానాలతో అవార్డులు అందజేస్తూ వచ్చాను. ఈ ఏడాది జేఆర్సీ కన్వెషన్లో జరపనున్న వేడుకలో పలువురు చిత్రరంగ ప్రముఖులు పాల్గొంటారు’ అని చెప్పారు. గత ఏడాది ఓ కన్నడ చిత్రానికిగాను ‘సంతోషం’ అవార్డు అందుకున్నానని, తాను నటించిన ‘అత్తారింటికి దారేది’ ఈ ఏడాది నామినీగా నిలవడం ఆనందంగా ఉందనీ ప్రణీత తెలిపారు. నాలుగు భాషల వారికి అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం అనీ, నేను నటించిన రెండు చిత్రాలు పోటీలో ఉన్నాయని హంసా నందిని అన్నారు.