handshake
-
పాక్ అధ్యక్షుడితో ప్రధాని కరచాలనం..
బీజింగ్ : భారత్, పాకిస్తాన్ నేతలు ఉమ్మడి వేదికను పంచుకున్న ప్రతిసారీ వారి కదలికలపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమవుతుంది. ఆదివారం నాటి షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) భేటీలోనూ ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్‌ల మధ్య చోటుచేసుకున్న మర్యాదపూర్వక సందర్భం అందరినీ ఆకర్షించింది. ఎస్సీఓ సదస్సు నేపథ్యంలో క్వింగ్డాలో మీడియా సమావేశానంతరం మోదీ, హుస్సేన్‌లు కరచాలనం చేసుకున్నారు. భారత్, పాకిస్తాన్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇరువురి నేతల మధ్య కరచాలనం ఉత్కంఠ వాతావరణాన్ని తేలికపరిచినా సమస్యలపై లోతైన చర్చల పట్ల మాత్రం సందేహాలు అలాగే ఉన్నాయి. 2016లో యూరి సైనిక శిబిరంపై దాడి అనంతరం భారత్, పాకిస్తాన్ సంబంధాలు బెడిసికొట్టాయి. ఈ దాడికి నిరసనగా భారత్ 19వ సార్క్ సదస్సునూ బహిష్కరించింది. భారత్ నిర్ణయంతో బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్తాన్‌లు సైతం ఇస్లామాబాద్‌లో జరిగే భేటీకి దూరమవుతామని ప్రకటించడంతో సదస్సు రద్దయింది. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లోని పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులు, ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
అయ్యో పాపం ట్రంప్.. కెమెరా ముందే మళ్లీనా..
వార్సా: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మీడియా దిష్టి గట్టిగానే తగిలినట్లుంది.. అదేమిటీ అనుకుంటున్నారా.. ఈ మధ్య ఆయన అధికారికంగా కెమెరాల ముందుకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పరాభవాన్ని ఎదుర్కొంటున్నారు. తొందరపాటు మాటల కారణంగా నవ్వుల పాలయ్యే ట్రంప్ ఆయన కదలికలు, హావభావాల మూలంగా కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అది మీడియా కెమెరాలన్నీ కూడా ఆయన వైపు తదేకంగా చూస్తున్న సమయంలోనే. ఏ చిన్న పొరపాటు జరిగినా అలా చటుక్కున బందించేసి ఇలా సోషల్ మీడియాలో పెట్టడమే ఆలస్యం అది చూసిన వాళ్లంతా గొల్లుమని నవ్వుతున్నారు. ఈ మధ్య యూఏఈ పర్యటనకు వెళ్లినప్పుడు డోనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్ చేయిపట్టుకునే ప్రయత్నం చేయగా ఆమె విసిరి కొట్టింది. ఇలా రెండుసార్లు జరిగింది. ఇది చూసిన వాళ్లంతా కూడా తెగ నవ్వుకున్నారు. అయితే, తాజాగా జీ 20 సదస్సులో భాగంగా ట్రంప్ గురువారం పోలాండ్‌కు చెందిన వార్సాలో అడుగుపెట్టిన సందర్భంగా మరోసారి అలాంటి సీనే రిపీటయింది. అయితే, ఈసారి వేరే తీరుగా.. వేరే వ్యక్తి ద్వారా ట్రంప్ ఆ అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఏం జరిగిందంటే వార్సాలో పోలాండ్ అధ్యక్షుడు ఆయన భార్యను కలుసుకున్న సందర్భంగా ట్రంప్ తొలుత పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన పక్కనే పోలాండ్ ప్రథమ మహిళ అగట కార్న్హౌషర్ దుడా ఉన్నారు. తొలు ఆండ్రేజ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే అగట ట్రంప్ వైపు వస్తుండగా తన వద్దకే వచ్చి తనకే ముందు షేక్ హ్యాండ్ ఇస్తారని అనుకున్న ట్రంప్ తొందరపాటుతో చేయి సాచారు. అయితే, ఆమె అనూహ్యంగా ట్రంప్‌కు ఇవ్వకుండా ఆయన భార్య మెలానియా వద్దకు వెళ్లి ఇచ్చింది. దీంతో అవాక్కయిన ట్రంప్ తన హావభావాలు చాలా వెరైటీగా పెట్టారు. ఇది చూసిన అక్కడి కెమెరాలు నవ్వుకున్నాయి. ఇదేమిటి ఇలా జరిగిందని అనుకునే లోపే ఆమె ట్రంప్ వైపు తిరిగి షేక్ హ్యాండ్ ఇవ్వగా నైస్ టూ మీట్ యూ అంటూ ట్రంప్ వెళ్లిపోయారు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ట్రంప్ షేక్ హ్యాండ్ ఇచ్చిన వీడియో రూపంలో కాకుండా ఆయనకు షేక్ ఇవ్వని సమయంలో ఆయన పెట్టిన హావభావాలతో ఉన్న వీడియోను మాత్రమే జిఫ్ ఫార్మాట్లో పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ పడిపడీ నవ్వుతున్నారు. I love that this failed Trump handshake in Poland is already a gif. Thank you, millennials. pic.twitter.com/5Kwm3eBMac — OhNoSheTwitnt (@OhNoSheTwitnt) 6 July 2017 Folks, Poland's first lady did not diss Trump's handshake attempt. She was looking at Melania, shook her hand, then shook Trump's. Stop. pic.twitter.com/ta8DNsv0Th — Bradd Jaffy (@BraddJaffy) 6 July 2017 Polish first Lady Agata Dudas did shake President Trump's hand, see full video. pic.twitter.com/BOw5tY4R4R — Beatrice-Elizabeth (@MissBeaE) 6 July 2017 -
ఆరోగ్యానికి కరచాలనమే కొలమానం
లండన్: దృఢంగా కరచాలనం చేసేవారు మానసికంగా దృఢంగా ఉంటారని ఇంతకాలం మానసిక వైద్యులు భావిస్తూ వచ్చారు. వారు మానసికంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా దృఢంగా ఉంటారని వియన్నా యూనివర్శిటీ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో తేలింది. వైద్యులు ఇక రోగి తమ వద్దకు రాగానే బీపీ చూసి ఆయన లేక ఆమె ఆరోగ్యం ఎలా ఉందో అంచనా వేయాల్సిన అవసరం లేకుండా రోగితో కరచాలనం చేసి రోగి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చని పరిశోధనల్లో పొల్గొన్న నడియా స్టీబర్ తెలిపారు. కొందరు కరచాలనం చేస్తే దూదిని పట్టుకున్నట్టు మెత్తగా ఉండడం, కొందరు చేసి చేయనట్లు మృదువుగా ఉండడం తెల్సిందే. కరచాలనం ద్వారా ఎవరి ఆరోగ్యానైనా అంచనా వేయాలంటే కరచాలనం ద్వారా వారి చేతి గ్రిప్పును పరిశీలించాలి. గ్రిప్పు బలంగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తారు. తక్కువ గ్రిప్పు కలిగిన వారు ఎక్కువ గ్రిప్పు కలిగినవారికన్నా 70 శాతం ముందుగా చనిపోతారని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కరచాలనం చేసే వారి గ్రిప్పుకు వారి వయస్సుకు, ఎత్తుకు కూడా సంబంధం ఉంటుంది. 30 నుంచి 40 ఏళ్ల వయస్సులో కరచాలనం చేసేవారిలో గ్రిప్ప్ పీక్ స్థాయిలో ఉంటుంది. ఆ తర్వాత వయస్సు, ఆరోగ్య పరిస్థితిబట్టి గ్రిప్పు తగ్గుతూ 60 ఏళ్ల తర్వాత ఎక్కువ తగ్గుతుంది. ఎత్తు ఎక్కువ ఉన్నవారికి గ్రిప్పు ఎక్కువగా ఉంటుంది. పురుషులు, మహిళల మధ్య కూడా కరచాలనం గ్రిప్పులో తేడా ఉంటుంది. ఎనిమిది అంగుళాలు ఎత్తు ఎక్కువ ఉన్నవారికి, తక్కువున్న అంతే వయస్సు గల వారిమధ్య కరచాలనం గ్రిప్పులో 20 ఏళ్ల తేడా కనిపిస్తుంది. మొత్తంగా చేతి కండరాల్లో ఉండే బలం ఆ వ్యక్తి ఆరోగ్యం మొత్తంగా ఎలా ఉందనే విషయాన్ని కచ్చితంగా సూచిస్తోందని పరిశోధకులు తేల్చారు. జర్మనీకి చెందిన వివిధ వయస్సులుగల స్త్రీ, పురుషులను ఎంపిక చేసి వియన్నా యూనివర్శిటీ పరిశోధకులు కరచాలనంకు, వారి ఆరోగ్యంగా పరిస్థితిగల సంబంధాన్ని అధ్యయనం చేశారు. ఈ ప్రయోగానికి జర్మన్లనే ఎంపిక చేసుకోవడానికి కారణం కూడా ఉంది. బ్రిటన్లకంటే జర్మన్ల కరచాలనం బలంగా ఉంటుంది. జపాన్ వారికంటే బ్రిటన్ల కరచాలనం బలంగా ఉంటుందనుకోండి. వయస్సు, ఎత్తు కారణంగా ఎవరి కరచాలనం ఎంత దృడంగా ఉండాలో టేబుళ్లను రూపొందించినట్లు ‘పోస్ వన్ జర్నల్’లో పరిశోధకులు తెలియజేశారు.