hanma konda
-
పరకాలలో ఫైరింగ్ కలకలం
సాక్షి, హన్మకొండ జిల్లా: పరకాలలో ఫైరింగ్ కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన బిల్డర్ తిరుపతిరెడ్డి లైసెన్స్ తుపాకితో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఐదురోజుల క్రితం కాల్పుల ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. తుపాకీని సీజ్ చేశారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లైసెన్స్ తుపాకీతో సంవత్సరికం పంక్షన్లో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడానికి గాలిలోకి కాల్పులు జరిపాడని సీఐ వెంకటరత్నం వెల్లడించారు. నిందితున్ని కోర్టులో హాజరుపర్చిగా న్యాయస్థానం రిమాండ్ విధించిందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం డాక్టర్ దుర్మరణం -
బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ బీజేపీ ఆందోళనలు
-
లెక్క తప్పైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కేటీఆర్
సాక్షి, హన్మకొండ: ‘ఏడేళ్లలో తెలంగాణ నుంచి కేంద్రం పన్నుల రూపంలో రూ. 3,65,797 కోట్లు రాబట్టింది. అందులో రూ.1,68,647 కోట్లే రాష్ట్రానికి తిరిగి ఇచ్చింది. ఈ లెక్కలు తప్పని కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు నిరూపిస్తే మంత్రి పదవిని ఎడమకాలి చెప్పులా వదిలేస్తా. సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతా’అని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ‘కేసీఆర్ అనే మూడక్షరాల పదం లేకపోతే టీపీసీసీ, టీబీజేపీలు ఎక్కడివని.. ఇవాళ మొరుగుతున్న కుక్కలు, గాడిదలకు ఆ పదవులు కేసీఆర్ వల్ల ఆ పార్టీలు పెట్టిన భిక్ష కాదా?’అని ధ్వజమెత్తారు. బుధవారం హనుమకొండ, వరంగ ల్ జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి కేటీఆర్.. సాయంత్రం హనుమకొండ హయగ్రీవాచారి (కుడా) మైదానంలో టీఆర్ఎస్ ప్రతినిధుల సమా వేశంలో మాట్లాడారు. ‘తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన జరగకపోతే ఎవడీ రేవంత్ రెడ్డి, ఎవడీ బండి సంజయ్? నోటికొచ్చినట్లు చిల్లర మాటలు మాట్లాడుతున్నరు. మోదీని మేం తిట్టలేమా? కానీ మాకు కేసీఆర్ సంస్కారం నేర్పారు. మేం నోరు విప్పితే మా కంటే ఎవరూ బాగా మాట్లాడలేరని గుర్తుంచుకోవాలి’అని హెచ్చరించారు. కేసీఆర్‌పై కుక్కల్లా మొరిగే వారిని గులాబీ సైనికులు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మోదీవన్నీ గాలి మాటలే తెలంగాణ బిడ్డల చెమట, రక్త సమానమైన పన్నులను కేంద్ర పాలకులు గుజరాత్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు ధారాదత్తం చేశారని కేటీఆర్ అన్నారు. ప్రధాని మోదీ మొదటి నుంచీ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారని, ఆయన చెప్పేవన్నీ గాలిమాటలేనని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నేతలు, ఎంపీలకు వెన్నెముక లేదని, తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంటే కనీసం ప్రధానిని అడిగే దమ్ములేదన్నారు. తెలంగాణ విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీల జాడేదని ప్రశ్నించారు. కాజీపేటకు సాధ్యం కాదన్న ఫ్యాక్టరీని బీజేపీ మహారాష్ట్రలోని లాతూరుకు తరలించి తెలంగాణ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. కిషన్‌రెడ్డి ఏం జవాబిస్తారు? ‘దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. 7 ఎయిమ్స్‌లను మంజూరు చేసినా రాష్ట్రానికి రిక్తహస్తం చూపింది. 7 ఐఐటీల్లో రాష్ట్రానికి ఒక్కటి కూడా దక్కలేదు. ఎస్ఐటీలు 4, నవోదయాలు 84 వివిధ రాష్ట్రాలకు కేటాయించినా తెలంగాణకు చోటివ్వలేదు. రాష్ట్రానికి వచ్చిన సంప్రదాయ వైద్య కేంద్రం గుజరాత్‌కు తరలిపోయింది. ఈ వైద్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇప్పుడేం చెబుతారు?’అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొంటూ పట్టుబడ్డ దొంగ రేవంత్ ‘కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. పట్టపగలే ఎమ్మెల్యేలను డబ్బుతో కొంటూ పట్టుబడ్డ దొంగ రేవంత్. ఆయన కూడా కేసీఆర్, టీఆర్ఎస్పై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నడు’అని కేటీఆర్ మండిపడ్డారు. కాగా, వరంగల్, నర్సంపేటలో రూ.185 కోట్ల పనులకు కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సభ కోసం ఏర్పాటు చేసిన టెం ట్లు మధ్యాహ్నం గాలివాటానికి కూలిపోయాయి. దీంతో రెండు జేసీబీలు తీసుకొచ్చి లాగికట్టారు. బీజేపీ ఎంపీలు చిల్లరగాళ్లు ‘తెలంగాణ బీజేపీ నేతలు, ఎంపీలకు వెన్నెముక లేదు. ఒకడు కరీంనగర్లో ఏం పీకలేదు.. కానీ పాలమూరులో తిరుగుతుండు. ట్రిపుల్ ఐటీని తీసుకురాలేని దద్దమ్మ పాలమూరును ఉద్ధరిస్తడంటా?’’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘బీజేపీ బేకార్ నాయకుల్లారా.. రాష్ట్రానికి మీరేం చేశారు? పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డును కాళ్లతో తన్నింది మీరు కాదా? 7 మండలాలను గుంజుకుపోయి కలిపింది మోదీ కాదా? 7 మండలాల్లోని లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రాలో కలిపింది బీజేపీ కాదా?’అని కేటీఆర్ నిలదీశారు. ‘రాష్ట్రంలో ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు చిల్లరగాళ్లు. నిజామాబాద్ ఎంపీ 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి మోసం చేశాడు. బూతులు తప్ప ఏం మాట్లాడడు. ఆదిలాబాద్ ఎంపీ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెరిపిస్తానని చెప్పి అడ్రస్ లేకుండా పోయాడు’అన్నారు. తెలంగాణపై మోదీ వివక్ష: కేటీఆర్ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ విభాగం హైదరాబాద్‌లో ‘గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఆయుష్ మెడిసిన్‘ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘కిషన్‌రెడ్డి గారూ.. ఎన్పీయే (నిరర్థక) ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్న మీరు రాష్ట్రానికి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థను తెస్తున్నందుకు అభినందనలు. ఓహ్.. కాస్త ఆగండి. యథావిధిగా గుజరాత్ ప్రధాని దీన్ని జామ్‌నగర్‌కు తరలించాలని నిర్ణయించారు. తెలంగాణకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ వివక్ష నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది’అని కేటీఆర్ ట్వీట్ చేశారు. -
వరంగల్‌లో దళారీ దందా
సాక్షి, హన్మకొండ : జిల్లా కేంద్రంలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రభుత్వ కార్యాలయం ఏదైనా ఉందంటే అది కాజీపేట తహసీల్దార్ కార్యాలయమే అని చెప్పాలి. జిల్లాల విభజన, కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు క్రమంలో హన్మకొండ, ధర్మసాగర్ మండలాల నుంచి కొన్ని గ్రామాలను కలిపి కాజీపేట మండలాన్ని ఏర్పాటు చేశారు. తొలుత మడికొండలో ఏర్పా టు చేసిన ఈ కార్యాలయాన్ని ఆ తర్వాత కాజీ పేట మినీ మునిసిపాలిటీ భవనంలోకి మార్చారు. ప్రస్తుతం ఒకే హాల్లో కొనసాగుతున్న ఈ కార్యాలయంలో దళారులు రాజ్యమేలుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా రెవెన్యూ కార్యాలయానికి ఏదైనా పనిపై వెళ్లాలంటే ఉద్యోగులు ఎన్ని కొర్రీలు పెడతారోననే అంతా ఆందోళన చెందుతారు. కానీ ఇక్కడ మాత్రం దళారుల తీరు ఆ ఉద్యోగులకే ముచ్చెమటలు పట్టిస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ వ్యవసాయ భూములే... కాజీపేట తహసీల్ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎక్కువగా వ్యవసాయ భూములు ఉన్నాయి. గత దశాబ్దాల కాలంగా ఆయా గ్రామాల్లో పనిచేసిన వీఆర్వోలు, ఇతర రెవెన్యూ అధికారుల కారణంగా గ్రామాల్లో భూసమస్యలు కోకొల్లలు. ఇక రికార్డుల్లో పేర్లు లేకున్నా రైతుల దగ్గర పాస్ పుస్తకాలు ఉంటాయి. పుస్తకాల్లో ఒక పేరుం టే రికార్డుల్లో మరో పేరు ఉంటుంది. ఇలా ఈ మండలం పరిధిలోని ఒక్కో గ్రామానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. ఇలాంటి అంశాలే ప్రసుత్తం దళారులకు ఆదాయ వనరులుగా మారాయి. కాజీపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిత్యం పదుల సంఖ్యలో దళారులు సమస్యలపై వచ్చిన రైతులు, బాధితులను వలలో వేసుకుంటున్నారు. అన్నన్నా మనోడే కార్యాలయానికి వచ్చే బాధితులను దళారులు ఆవరణలో కలిసి మాట కలుపుతారు. ఆ తర్వాత ఏ పని పై వచ్చింది తెలుసుకుంటారు. ఆ పని చేయాలంటే కార్యాలయంలో పెద్ద మొత్తంలో డబ్బు అడుగుతారని బెదిరిస్తారు. అయితే, తమకు కొద్ది మొత్తం ఇస్తే చాలు పని చేయిస్తామని నమ్మబలికి వారి దరఖాస్తు తీసుకుని సెటిల్ చేసుకుంటున్నారు. ఇక అధికారుల వద్దకు వెళ్లి ‘అన్నా మనోడే.. చాలా దగ్గర’ పని చేసి పెట్టాలని చెపుతున్నారు. అయితే, ఎవరైనా అధికారి కానీ ఉద్యోగి కానీ ఈ దళారుల వ్యవహారాన్ని గమనించి ఇదేంటని ప్రశ్నించినా, పనిచేయకుండా దరఖాస్తు పక్కన పెట్టినా.. ఇక వారికి చుక్కలు చూపిస్తున్నారు. దళారులంతా ఒక్కటై ఉద్యోగుల విషయంలో అధికారుల ఫిర్యాదు చేయడం... ఆకాశ రామన్న ఉత్తరాలు రాయడం, పలు సంఘాల నాయకులు, లోకల్ లీడర్లతో ఫోన్ చేయిండం వంటివి నిత్యకృత్యమయ్యాయి. దీంతో చేదేసేం లేక ఉద్యోగులు తమ ఇబ్బందులను అధికారులకు మొరపెట్టుకున్నారు. స.హ. చట్టం పేరుతో... మరికొందరు దళారులు తమ మాట వినని అధికారికి చుక్కలు చూపించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. సమాచార హక్కు చట్టం ద్వారా దశాబ్దాల రికార్డులు కావాలని దరఖాస్తు చేయడం.. సమయానికి సమాచారం ఇవ్వకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడాన్ని అలవాటుగా పెట్టుకున్నారు. ఒకే వ్యక్తి పేరుతో పదే పదే దరఖాస్తులు రావడంతో అధికారులకు అనుమానం వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ సమాచారం ఇవ్వలేని పక్షంలో పైఅధికారులకు అప్పీల్ చేసుకోవాలని సూచించినా గొడవలకు దిగుతున్నారు. దీంతో అధికారులు చేసేదేం లేక దళారులకు తొలిప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సమస్యను అధిగమిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఇదే ఇబ్బందిగా మారుతోంది. లేనిపోని గొడవలు తమకెందుకని నేరుగా వచ్చిన దరఖాస్తులు పక్కన పెట్టి మరీ దళారులతో వచ్చిన వారికి ముందు పనిచేసి పెడుతున్నారని ఆరోపణలు ఉద్యోగులపై ఎక్కువయ్యాయి. అధికారుల మందలింపు దళారుల ఆగడాలు పెచ్చుమీరి పోవడంతో చేసేది లేక స్వయంగా ఉన్నతాధికారే... ఇటీవల కొందరిని పిలిచి సుతిమొత్తగా మందలించినట్లు తెలిసింది. ‘చూడండి ఆఫీస్‌కు వచ్చే ప్రతివారిని మీరే అడ్డగించి మా వారే అంటూ పైరవీ చేస్తే కష్టం... ఏదో ఒకటి రెండు పనులు ఉంటే రండి, చేయించుకోండి వెళ్లండి. కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా కార్యాలయం, ఆవరణలో మీరే ఉంటే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.’ అంటూ స్వయంగా కార్యాలయంలోని ఉన్నతాధికారులు దళారులతో మాట్లాడారంటే కార్యాలయంలో వారి హవా ఏంటో తెలుస్తోంది. ఇప్పటికైనా వీరి విషయంలో అధికారులు కఠిన నిర్ణయం తీసుకోకపోతే తాము పనిచేయడం కష్టమని ఉద్యోగులు వాపోతున్నారు. పక్కనే మినీ మునిసిపల్ కాజీపేట మినీ మున్సిపల్ కార్యాలయం కూడా కాజీపేట తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉం టుంది. అక్కడా నిత్యం పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు సమస్యలపై వస్తుంటారు. అలాంటి వారిని దళారులు అడ్డగించి తాము పనిచేయిస్తామని డబ్బు లాగుతున్నట్లు సమాచారం. -
వెండితో ‘కీర్తి స్తూపం’
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యంలో వరంగల్ జిల్లా హన్మకొండ టైలర్స్ట్రీట్కు చెందిన స్వర్ణకారుడు ఎర్రోజు శ్రీనివాస్ గ్రామున్నర వెండితో సెంటీమీటర్ పొడవున్న తెలంగాణ కీర్తి స్తూపాన్ని తయారు చేశాడు. ఆరు గంటలపాటు శ్రమించి తెలంగాణపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. హన్మకొండ -
జుట్టు పంచాయితీ.. తెగేదెప్పుడు?
సాక్షి, హన్మకొండ: మేడారం జాతర సమయం దగ్గర పడుతున్నా తలనీలాలు సేకరించే పని ఎవరికి అప్పగించాలనే అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. గత జాతరలో నిర్వహించిన మాదిరిగానే నామినేషన్ పద్ధతినే కొనసాగించాలని పూజారుల సంఘం కోరుతుండగా.. టెండర్‌తో మరింత ఆదాయం సమకూరుతుందని దేవాదాయశాఖ వాదిస్తోంది. తలనీలాల పనులు తమకు కేటాయించకుంటే జాతర పనులకు సహకరించబోమంటూ డిసెంబరు 15న పూజారుల సంఘం సమ్మె నోటీసు కూడా ఇచ్చింది. నెల రోజులు గడుస్తున్నా దేవాదాయశాఖ నుంచి ఎటువంటి స్పందనా లేదు. మరోవైపు జాతరకు మరో ఇరవై రోజులే గడువు ఉంది. ఇప్పటికే ప్రతీ ఆది, బుధవారాల్లో వేలసంఖ్యలో భక్తులు మేడారానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలా.. మేడారం జాతర 1967లో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి దేవాదాయశాఖ పర్యవేక్షణలో జారత సాగుతోంది. జాతర ద్వారా సమకూరే ఆదాయంలో 33 శాతాన్ని పూజారుల సంఘానికి చెల్లిస్తారు. అదేవిధంగా జాతరలో భక్తులు మొక్కుగా సమర్పించే తలనీలాలను.. సేకరించే పనిని నామినేషన్ పద్ధతిపై పూజారుల సంఘానికి అప్పగిస్తున్నారు. ఈ తలనీలాల సేకరణ ద్వారా దేవాదాయశాఖ ప్రమేయం లేకుండా పూజారుల సంఘానికి మరికొంత ఆదాయం సమకూరుతోంది. గత జాతర సమయంలో 80 లక్షల మంది హాజరవుతారని భావించి రూ.42 లక్షలు చెల్లించి పూజారుల సంఘం తలనీలాల సేకరణ పనులు(తల వెంట్రుకలను సేకరించడం) దక్కించుకుంది. ఈసారి కోటికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో రూ.75 లక్షలు చెల్లించేందుకు పూజారుల సంఘం సిద్ధమైంది. ఇప్పుడు టెండర్లకు మొగ్గు.. అంతర్జాతీయ మార్కెట్లో తలనీలాలకు డిమాండ్ ఉండడంతో నామినేషన్ పద్ధతిన పూజారుల సంఘానికే ఇ వ్వడం కాకుండా టెండర్లు పిలిస్తే కాం ట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి ఎక్కు వ ఆదాయం వస్తుందని దేవాదాయ శా ఖ అంచనా వేస్తోంది. 2014 జాతర విషయంలో తలనీలాల సేకరణకు టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయిం చింది. టెండర్ల పద్ధతిలో కాంట్రాక్టర్లు రింగైతే మొత్తం దేవాదాయశాఖకు వచ్చే రాబడి తగ్గిపోతుందని, ఫలితం గా తమకు వచ్చే 33 శాతం ఆదాయంపై కోత పడుతుందని పూ జారులు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. గతంలో 2004, 2006 జాతర సమయాల్లో టెండర్లు పిలిస్తే పది లక్షలకు మించి ధర పలకలేదు. దాంతో 2008 జాతర నుంచి మళ్లీ నామినేషన్ పద్ధతిని అమల్లోకి తెచ్చారు. మళ్లీ విఫలమైన ప్రయోగాన్ని తమ నెత్తిన ఎందుకు రుద్దుతారంటూ పూజారుల సంఘం వాదిస్తోంది. మమ్మల్ని దూరం పెడుతున్నారు. జాతరలో రానురాను తమకు ప్రాధాన్యం తగ్గిపోతోందని వడ్డెలు(గిరిజన పూజారులు) ఆందోళన చెందుతున్నా రు. క్రమంగా హిందూ మత ప్రభావానికి తోడు వ్యాపార ధోరణి పెరిగిపోతున్నదని చెబుతున్నారు. వీటి కారణంగా తమ ఆచారాలకు ప్రాధాన్యం తగ్గుతుందన్న ఆవేదన గిరిజనుల నుంచి వ్యక్తమవుతోంది. తమ చేతి నుంచి ఒక్కో వ్యవహారాన్ని క్రమంగా దేవాదాయ శాఖ దూరం చేస్తున్నదని, అందులో భాగంగా పనులను తమకు కాకుండా చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తున్నారు. జాతర గడువు సమీపిస్తున్నా తలనీలాల సేకరణపై ఏ విషయమూ తేల్చకపోవడం తమను అవమానించడమేనని గిరిజన పూజారులు అంటున్నారు. -
హోరెత్తిన తెలం‘గానం’
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : రెండు వందల మంది కళాకారులు.. సుమారు 8 గంటలు.. ఒక్కో గొంతుక నుంచి ఒక్కో ఉద్యమ గానం అదే ప్రత్యేక తెలంగాణం. కళాకారుల ఆట పాటలకు అనుగుణంగా హాజరైన ప్రజల ఈలలు, చప్పట్లతో హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణం మారుమోగింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అనేక ధూం ధాంలు నిర్వహించి బాసటగా నిలిచిన కళాకారులు.. తెలంగాణ కల సాఫల్యమవుతున్న నేపథ్యంలో మరోసారీ ఒక్కచోట చేరా రు. తెలంగాణ జానపద కళాకారులైన వరంగల్ శంకర్, దీకొండ సారంగపాణిలను స్మరించుకుంటూ తెలంగాణ క్రాంతి దళ్ చేపట్టిన‘మువ్వల సవ్వడి’ వారందరినీ ఏకం చేసింది. క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంగంరెడ్డి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో కొనసాగిన ధూం ధాంకు ప్రజా యుద్ధనౌ క గద్ధర్, ప్రజాగాయని విమలక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకర్, సారంగపాణి, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ జానపదం అంట రానితనం భరిస్తున్న దళిత స్త్రీ నుంచి వచ్చిందని, అది ఉద్యమ పాటకు దారి తీసిందన్నారు. తెలంగాణ వనరులు దోపిడీకి గురవుతుంటే వాటిని పరిరక్షించుకునే క్రమంలోనే తెలంగాణలో కవులు, కళాకారులు పుట్టారని పేర్కొన్నారు. తాను రాసిన భాగవతాన్ని ఆనాడు కన్నడ రాజు తనకు అంకితం చేయాలని కోరితే ధైర్యంతో ఎదురొడ్డిన గొప్ప ధీశాలి పోతన.. ఆయన వరంగల్ జిల్లాకు చెందిన వాడు కావడం గర్వకారణమన్నారు. అరుణోదయ విమలక్క మాట్లాడుతూ సంక్రాంతి, అట్లతద్ది పండుగులను జరుపుతున్న ఆంధ్రా పాలకులు తెలంగాణ బతుకమ్మలను మరిచిపోయిండ్లని విమర్శించారు. ప్రస్తుతం మూడు జాతరలు జరుగుతున్నా యని, అందులో ఒకటి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర, మరోటి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ఎన్నికల జాతర ప్రారంభమైందన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి టికెట్లు ఇస్తామంటూ ఇప్పటికే తెలంగాణలో నాయకుల జాతర కొనసాగుతోందని చెప్పారు. సీనియర్ జర్నలి స్టు పాశం యాదగిరి మాట్లాడుతూ ప్రజలు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నారే తప్ప ఎవరూ ఇవ్వలేదు. తెలంగాణ పునర్నిర్మాణంలో పార, గడ్డపార పట్టిన వాళ్లనే గెలిపిద్దామన్నారు. ముఖ్యమంత్రినే ఎదురించినానంటూ గొప్ప లు చెబుతున్న మంత్రి శ్రీధర్‌బాబు ల్యాండ్, సాండ్, గ్రానైట్ మాఫియాకు అధిపతి అని చెప్పారు. తెలంగాణ గురించి మాట్లాడుతున్న ఆయన 1200ల మంది విద్యార్థులు మరణించినపుడు ఎక్కడపోయిండని ప్రశ్నించారు. మళ్లీ మంత్రి కావాలంటే ముక్కు నేలకు రాసి, తప్పులను ఒప్పుకోవాలని చెప్పారు. ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య మాట్లాడుతూ కళ లేని దేశం దీపం లేని ఇల్లు లాంటిది.. కళలను, కళాకారులను ప్రజలు ఆదరించినపుడే భవిష్యత్ తరాలకు అందుతాయన్నారు. గొల్లమల్లమ్మ కోడలా అంటూ కొందరు రాసి న పాట ఎందరినో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాటలు రాసేప్పుడు ఆలోచించాలని హితవుపలికారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేందుకు ఎంపీ, ఎమ్మెల్యేలు పదవులు పోతాయని భయపడ్డరు.. ఇప్పుడు ముం దుండి నడిపిస్తున్నరు.. వారికి అండగా ఉందామని చెప్పా రు. జానపద పాటలను అనేక రాష్ట్రాలకు పరిచయం చేసింది శంకర్, సారంగపాణిలేనని పేర్కొన్నారు. తెలంగాణ క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరా జ్ మాట్లాడుతూ జానపద గాయకులైన వరంగల్ శంకర్, దీకొండ సారంగపాణి విగ్రహాలను పబ్లిక్‌గార్డెన్‌లో ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఇడ్లి సాంబార్, విద్యార్థి ఉద్యమంలో తుపాకీ తూటాలకు బలైన అమరుల పేర్లు ఇప్పటికీ తెలంగా ణ నాయకులకు తెలియకపోవడం బాధాకరమని అన్నారు. రజాకార్లకు భయపడి ఆంధ్రాకు వలస పోయిన తెలంగాణ ప్రజలను పిరికివాళ్లుగా భావించి పప్పులు, కూరగాయలు, ఇంటి కిరాయిలు పెంచి కమర్శియల్‌గా సంపాధించుకున్న ఆంద్రోళ్లు నేడు తెలుగు భాష మాట్లాడే వారంతా ఒక్కటిగా ఉండాలనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ కవులను, కళాకారులను వారు విస్మరించారని మండిపడ్డారు. పద్మశ్రీ నేరేళ్ల వేణుమాధవ్ మాట్లాడుతూ 1971లో ఐక్య రాజ్యసమితిలో తాను మిమిక్రీ కళను ప్రదర్శించేందుకు వెలితే అమెరికా అధ్యక్షుడు ఈ కళ ఎప్పడి నుంచి ఉందని అడిగితే మీదేశం పుట్టక ముందు నుంచి ఉందని చెప్పానని చమత్కరించారు. మిమిక్రీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహాభారతంలో భీముడు స్త్రీలా మాట్లాడి శత్రువును సంహరిస్తాడని గుర్తు చేశారు. మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ మాట్లాడుతూ నేరేళ్ల వేణుమాధవ్, తాను క్లాస్మేట్స్ అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. విద్యార్థిగా హైద్రాబాద్‌లో ఉద్యమంలో పాల్గొన్న విషయాలను నెమరువేసుకున్నాడు. నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిపై రాసిన కవితను చదివి వినిపించాడు. మా ఆయన పాటలంటే ప్రాణం కళనే నమ్ముకున్న నా భర్త తదనానంతరం నన్ను ఎవరూ చేరదీయలేదు. ఇద్దరు పిల్లల తో ఎన్నో కష్టాలు పడ్డాను. భర్త ఉద్యోగంతోనే నేడు బతుకుతున్నాను. అయినప్పటికీ శంకర్ నుంచి వచ్చిన జానపద పాటలంటే ప్రాణం. - సంధ్య, వరంగల్ శంకర్ సతీమణి భర్త స్నేహితులే ఆదుకున్నారు జానపద కళాకారుడిగా నా భర్త సారంగపాణి సంపాధించింది ఏమీ లేదు. ఆయన మరణాంతరం స్నేహితులే కుటుంబాన్ని ఆదుకున్నారు. పిల్లలను చదివించి ప్రయోజకులను చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. భర్త లేని తనకు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆర్థిక సాయం అందించాడు. - ప్రమీల, సారంగపాణి సతీమణి చదివించారు ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, కాకతీయ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవి ఫీజులు లేకుండా చదివించారు. - రాజమహేందర్, సారంగపాణి కొడుకు -
అలరించిన డాగ్ షో
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : హన్మకొండలోని సెయింట్ పీటర్స హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన డాగ్‌షో అలరించింది. వివిధ రకాల శునకాలు పాల్గొ న్న ఈ ప్రదర్శనను నగర ప్రజలు ఆసక్తిగా తిలకించారు. కాకతీయ కెన్నల్ అసోషియేషన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో వరంగల్‌తోపాటు పలునగరాలకు చెంది న శునకాలు పాల్గొన్నాయి. శునకాల యజమానులు వాటితో ప్రదర్శనలు ఇప్పించారు. అంతర్జాతీయ జడ్డీ మాథ్యు సి జాన్ ఈ ప్రదర్శనలో జడ్జీగా వ్యవహరించి వాటిని పరిశీలించారు. అత్యుత్తమ ప్రదర్శనతోపాటు, ఆరోగ్యకరంగా ఉన్న వాటిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కాకతీయ కెన్నల్ అసోషియేషన్ అధ్యక్షుడు కె.రామస్వామి, కార్యదర్శి వి.రమణారెడ్డి మాట్లాడుతూ కెన్నల్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా అనుబంధంగా తమ అసోషియేషన్ పనిచేస్తుందన్నారు. ఈ ప్రదర్శనలో 28 జాతులకు చెందిన 133 డాగ్స్ పాల్గొనగా, ఇందులో వరంగల్ నుంచి 50 శునకాలు పాల్గొన్నాయి. ప్రదర్శనలో హైదరాబాద్ శ్రీనివాస్‌కు చెందిన డాగ్ రాట్వెల్లరీ ప్రథమ బహుమతి గెలుచుకుంది. హేమంత్(హైదరాబాద్)కు చెందిన జర్మన్ షెఫర్డ్ ద్వితీయ బహుమతి, ప్రవీణ్(హైదరాబాద్)కు చెందిన బిగేల్ తృతీయ బహుమతి పొందాయి. వరంగల్ ఆదిత్యకు చెందిన డాషౌండ్, అర్జున్‌కు చెందిన బ్రెడన్, కరణ్‌కు చెందిన బుల్మాసిఫ్, కృష్ణకు చెందిన ల్యాబెడ ర్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వాటికి నిర్వాహకులు షీల్డ్‌లు బహుకరించారు. అసోసి యేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్‌రెడ్డి, హరి నాథ్, దేవేందర్, అనంతకృష్ణ పాల్గొన్నారు. -
నేటి నుంచి కాకతీయ ఉత్సవాలు
సాక్షి, హన్మకొండ ఎట్టకేలకు కాకతీయ ఉత్సవాలు పునః ప్రారంభం కానున్నా యి. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు గణపురం మం డల కేంద్రంలోని గణపేశ్వరాలయం (కోట గుళ్లు)లో ఉత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 27న హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానున్న ఉత్సవాలకు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డితోపాటువరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కలెక్టర్ జి.కిషన్, ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్ హాజరుకానున్నారు. నాలుగు నెలల సుదీర్ఘ విరామం అనంతరం ఉత్సవాలు పునఃప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి స్థానిక కళాకారులకు పెద్దపీట కాకతీయ ఉత్సవాల్లో భాగంగా స్థానిక కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. కానీ, ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాల్లో స్థానికేతరులకే పెద్దపీట వేశారు. 2012 డిసెంబర్లో జరిగిన ప్రారంభోత్సవంలో రాధారాజారెడ్డి, ఎల్లా వెంకటేశ్వర్లు వంటి ప్రసిద్ధులు. ఆ తర్వాత ఏప్రిల్‌లో మరోసారి జరిగిన ఉత్సవాల్లో పద్మభూషణ్ స్వప్నసుందరి, పద్మశ్రీ ఆనందశంకర్ వంటి స్థానికేతరులైన జాతీయ స్థాయి కళాకారులకే ఎక్కువ ప్రాధాన్యం దక్కిం ది. అరుుతే ఈ సారి గతానికి భిన్నంగా స్థానిక కళాకారుల ప్రదర్శనలకు అవకాశం కల్పిం చారు. బుక్క సాంబయ్య, ఆజ్మీర గోవింద్‌నాయక్, పోరిక శ్యాం, నారగోని విశ్వనాథం, వెంకట్రాం నాయక్, గడ్డం సారయ్య వంటి జిల్లాకు చెందిన ప్రముఖ కళాకారులు తమ బృందాలతో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ మూడు రోజుల వేడుకల్లో జిల్లాకు చెందిన 300 మంది కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. వీరితోపాటు జిల్లాకు చెందిన ప్రముఖ కళాకారుడు చుక్కా సత్తయ్య బృందం.. శివసత్తుల ప్రదర్శన ఇవ్వనుంది . వీడని నిధుల గ్రహణం ఏప్రిల్‌లో కాకతీయ ఉత్సవాలు జరిగాయి. నాలుగు నెలల విరామం తర్వాత కాకతీయ ఉత్సవాలు పునఃప్రారంభమవుతున్నా... నిధులకు గ్రహణం వీడలేదు.కాకతీయ ఫెస్టివల్ నిర్వహణకు నిధుల కేటాయిస్తామన్న ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో 2012 డిసెంబర్ నుంచి 2013 ఏప్రిల్ వరకు ప్రతి నెలా ఉత్సవాల నిర్వహణ కష్టంగా మారింది. చివరకు కాకతీయ ఫెస్టివల్లో ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు పారితోషికం చెల్లించలేని స్థితి ఏర్పడింది. ఫలితంగా మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కార్యక్రమాలు కొన్ని వాయిదా పడగా.. మరి కొన్ని రద్దయ్యూరుు. ప్రస్తుతం * 30 లక్షలు విడుదలైనప్పటికీ ఇందులో సగానికి పైగా నిధులు కళాకారుల పారితోషికాలకే సరిపోతాయి. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు మంజూరు చేయించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. లేని పక్షంలో డిసెంబర్ వరకు నిరాటంకంగా ఉత్సవాల నిర్వహణ జిల్లా యంత్రాంగానికి తలకుమించిన భారంగా మారే అవకాశం ఉంది. కార్యక్రమ విశేషాలు కుప్ప పద్మజా బృందంలో మొత్తం 12 మంది సభ్యులున్నారు. డి ప్రవళిక, ఆర్.నిమిష, ఎల్.హర్షిణి, బి.శ్వేత, కె.కల్యాణి, ఎ.అనుశ్రీ, పి.చైతన్య, కె.ప్రణవ, పి.సౌందర్య, జి.వర్షిక, సహ్యూలతో కూడిన బృందంతో 45 నిమిషాల పాటు కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుంది. ఈ బృందంలోని సభ్యులందరూ వరంగల్ జిల్లాకు చెందిన వారే. కన్నా సాంబయ్య బృందం వీర బ్రహ్మేంద్రస్వామి జననం బుర్రకథ ఉంటుంది. కన్నా సాంబయ్యతోపాటు ఎం.సదానందం, ఆర్.అశోక్ ఉన్నారు. ఈ కళారూపం గంటపాటు ఉంటుంది. కోటగుళ్లలో ఏర్పాట్లు పూర్తి గణపురం : కాకతీయ ఉత్సవాల నిర్వహణకు గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లు ముస్తాబయ్యూరుు. ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. ఉత్సవాలకు ఇన్చార్జ్గా ఉన్న ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్ రెండు పర్యాయాలు గణపేశ్వరాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్రనాథ్, అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ప్రతిఒక్కరికి బాధ్యతలను అప్పగించారు. కార్యక్రమాలు నిర్వహించే వేదికతోపాటు సౌండ్స్, లైటింగ్, తాగునీటి వసతి, ఉత్సవాలకు వచ్చే కళాకారులు, అతిథులకు చేసే ఏర్పాటపై సోమవారం సాయంత్రం ఎంపీడీఓ గుళ్లపల్లి విద్యాసాగర్, తహసీల్దార్ రజితతో ఐటీడీఏ పీఓ మాట్లాడారు. అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యూయని అహ్మద్‌కు వారు తెలిపారు. కాగా, మూడు రోజులుగా వర్షాలు పడుతుండడంతో దేవాలయ ప్రాంగణంలో అక్కడక్కడ నీరు నిలిచింది. దీంతో తహసీల్దార్ రజిత పర్యవేక్షణలో సిబ్బంది 150 ట్రాక్టర్ల మొరం తెప్పించి బురద గుంటలను పూడ్చారు.మట్టి కోట చుట్టు ఉన్న పిచ్చి మొక్కలను తొలగించేందుకు మూడు రోజులుగా 300 మంది కూలీలతో పనులు చేయించారు. ఇదిలా ఉండగా, విద్యుత్ సౌకర్యం కోసం ట్రాన్స్‌కో అధికారులు రెండు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తలో భాగంగా మూడు జెనరేటర్లను అందుబాటులో ఉంచారు. ఉత్సవాలకు వచ్చే సందర్శకుల కోసం ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో రెండు ప్రాంతాల్లో 10 మరుగుదొడ్లను నిర్మించారు. కేటీపీపీ అధికారులు మూడు రోజులపాటు ప్రతి రోజు 20 వేల తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. నేటి షెడ్యూల్ (సాయంత్రం నుంచి) 4:00 గంటలు సాయిబాబా గుడి నుంచి కోటగుళ్ల వరకు కళాకారుల ర్యాలీ 5:30 గంటలు ప్రారంభ సభ 6:30 గంటలు గణపురం- కోటగుళ్లు పుస్తకావిష్కరణ 6:45 గంటలు వరంగల్ జయపసేనాని బృందం పేరిణి నృత్య ప్రదర్శన 7:45 గంటల నుంచి కుప్ప పద్మజా బృందం కూచిపూడి నత్య ప్రదర్శన వెంకటరాంనాయక్ బృందం జానపద నృత్యాలు రాజేశ్‌ఖన్నా బృందం కాకతీయ కళాతోరణం నృత్యరూపకం కన్నా సాంబయ్య బుర్ర కథ