హైకోర్టు ‘హౌసింగ్’ ఎన్నికల్లో హరికృష్ణారెడ్డి ప్యానెల్ విజయం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ఉద్యోగుల కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ ఎన్నికల్లో పి.హరికృష్ణారెడ్డి–వినోద్ ప్యానెల్ ఘన విజయం సాధించిం ది. తొమ్మిది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల పోస్టుల కోసం 28 మంది పోటీ చేయగా హరికృష్ణారెడ్డి ప్యానెల్ నుంచి 8 మంది, మరో ప్యానెల్ నుంచి ఒకరు విజయం సాధిం చినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్.హరయ్య శనివారం రాత్రి ప్రకటించా రు.
హరికృష్ణారెడ్డి ప్యానెల్ నుంచి కె.వి.బి.జె.శర్మ, జి.అనిల్‌కుమార్, పల్లా వినోద్‌కుమార్, పి.అన్నపూర్ణ, పి.హరికృష్ణారెడ్డి, బి.శంకరయ్య, వి.అశోక్, సూదా వెంకటేశ్వరరావు.. మరో ప్యానెల్ నుంచి ఎస్.కిషన్ విజయం సాధించారు. గెలుపొందిన వారిలో హరికృష్ణారెడ్డికి అత్యధికంగా 544 ఓట్లు వచ్చాయి.