Haritha Haram scheme
-
మొక్కల పెంపకంలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మొక్కల పెంపకంలో తెలంగాణ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. కేంద్ర అటవీ శాఖ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2017–18లో 4,89,673 హెక్టార్లలో మొక్కలు నాటడం ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. 3,82,364 హెక్టార్లలో మొక్కలు నాటిన ఒడిశా రెండో స్థానంలో నిలిచింది. సోమవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ సమాధానం ఇచ్చిన సందర్భంగా దీనికి సంబందించిన గణాంకాలను వెల్లడించా రు. అంతకుముందు 2016–17లో 4,38,059 హెక్టార్లలో, 2015–16లో 2,36,598 హెక్టార్లలో మొక్కలు నాటడం ద్వారా జాతీయస్థాయిలో ఎక్కువ మొక్క లు నాటిన రాష్ట్రంగా తెలంగాణ తొలి స్థానాన్ని సాధించింది. ఇదిలా ఉంటే 2018–19 సంవత్సరానికి గాను ఒడిశాకు 2,82,755 హెక్టార్లలో, తెలంగాణకు 2,76,870 హెక్టార్లలో మొక్కలు నాటాలని కేంద్రం లక్ష్యాలను నిర్దేశించింది. గతేడాదికి సంబంధించి లక్ష్యాల సాధన గణాంకాలు ఇంకా సిద్ధం చేయలేదని రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర అటవీ శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ చర్యలతో సత్ఫలితాలు.. మొక్కల పెంపకంలో తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని కేంద్ర అటవీ శాఖ గణాంకాలను వెల్లడించిన నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. మొక్కల పంపకం, అటవీ పునరుజ్జీవనం, అటవీ రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అటవీ రక్షణ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, ఆకుపచ్చ తెలంగాణ సాధన లక్ష్యానికి చేరువలో ఉన్నామని, అధికారులు, సిబ్బంది మరింత కష్టపడి ఆ దిశగా పని చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో అటవీ పునరుజ్జీవనంపై మరింత దృష్టి పెట్టనున్నట్లు ఈ సందర్బంగా మంత్రి వెల్లడించారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కను నాటి సంరక్షించాలని మంత్రి కోరారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా ఆయన పుట్టిన రోజున మొక్కను నాటి కానుకగా ఇద్దామని అన్నారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వడం ఆదర్శనీయమన్నారు. కేసీఆర్ బర్త్‌డే రోజున మొక్కలు నాటుదాం: మంత్రి సబిత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా ఈ నెల 17న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో 1,01,116 మొక్కలు నాటి సంబురాలు నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. సీఎం పుట్టిన రోజున ఆయనకు కానుకగా ప్రతి ఒక్క విద్యార్థి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు. పాఠశాలలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో మొక్కలు నాటేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించామని మంత్రి చెప్పారు. మొక్కలు నాటడమే కాకుండా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వాటి సంరక్షణా బాధ్యతలు కూడా స్వీకరిస్తామన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాటేందుకు అవసరమైన మొక్కలను అందుబాటులో ఉంచామని వివరించారు. కార్యక్రమంలో స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వాములను చేయనున్నామని పేర్కొన్నారు. -
మొక్కల పండుగకు సన్నద్ధం
రెబ్బెన(ఆసిఫాబాద్): తెలంగాణకు పచ్చని హారంలా మారిన హరితహారం పథకం ఐదో విడతకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెలలో నిర్వహించే కార్యక్రమానికి సరిపడా మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం మొక్కల పెంపకం చేపడుతున్న అధికారులు లక్ష్యాన్ని చేరుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈసారి జిల్లా వ్యాప్తంగా 1.23 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోగా మొత్తం 215 నర్సరీల్లో వీటి పెంపకం చేపడుతున్నారు. అన్ని శాఖలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉపాధిహామీ, అటవీ శాఖ ద్వారా నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో హరితహారంపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. కోడ్ ముగియగానే తేదీని ఖరారు చేసే అవకాశమున్న నేపథ్యంలో అధికారులు ముందస్తుగా సిద్ధమవుతున్నారు. 1.23 కోట్ల మొక్కలు లక్ష్యం.. గతేడాది కంటే ఈసారి హరితహారం మొక్కల లక్ష్యాన్ని పెంచారు. ఈసారి ఉపాధిహామీ పథకం ద్వారా 83 లక్షలు, అటవీశాఖ ద్వారా 40 లక్షల మొక్కలను నాటాలని నిర్దేశించారు. ఈ మేరకు ఇప్పటికే ఈజీఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 215 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీలో సుమారు 20 వేల నుంచి లక్ష వరకు మొక్కలను సిద్ధం చేశారు. మరో 20 రోజుల్లో మొక్కలు అందుబాటులోకి రానున్నాయి. ఇక అటవీశాఖ సైతం హరితహారానికి కావాల్సిన మొక్కలను సిద్ధం చేసింది. అటవీజాతి మొక్కలతో పాటు పండ్ల మొక్కలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీశాఖ ప్రధానంగా ఎవెన్యూ ప్లాంటేషన్‌ను దృష్టిలో ఉంచుకుని అటవీజాతి మొక్కలను అధిక మొత్తంలో సిద్ధం చేస్తోంది. రహదారుల వెంట ఎక్కువగా నాటేలా ప్రణాళికలు చేశారు. రెండో వారంలో కమిటీలు.. హరితహారం ఐదో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో ఎంపీడీవోల ఆధ్వర్యంలో ఈ కమిటీలు పనిచేయనున్నాయి. అయితే జూన్ మొదటి లేదా రెండో వారంలో కమిటీలు ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. కమిటీలు పూర్తయిన వెంటనే అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తూ శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. దాంతో పాటు గ్రామాల్లోనూ పంచాయతీలవారీగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసి అన్ని శాఖలు సమన్వయంతో లక్ష్యాన్ని సాధించేలా చర్యలు చేపట్టనున్నారు. సింగరేణి యాజమాన్యం సైతం ప్రతిఏట తనవంతు బాధ్యతగా హరితహారంలో పాలుపంచుకుంటూ విరివిగా మొక్కలు నాటుతోంది. గత సంవత్సరం సుమారు 6లక్షల మొక్కలు నాటగా ఈసారి ఆ సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. సంరక్షిస్తేనే మనుగడ.. మొక్కలను నాటడంలో చూపుతున్న శ్రద్ధ వాటిని సంరక్షించడంలో లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లక్షల్లో మొక్కలు నాటుతున్నట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వాటి ఆనవాళ్లు కూడా లేకుండా పోతున్నాయి. మొక్కల సంరక్షణ చర్యలు సరిగా లేకపోవడంతో నాటిన కొద్ది రోజులకే మొక్కలు చనిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రభుత్వం ఆశించిన ఫలితం కనిపించడం లేదు. కేవలం మొక్కలను నాటడంతో తమ పనై పోయిందని అధికారులతో పాటు ప్రజలు భావిస్తుండటంతో పథకం లక్ష్యాన్ని చేరడం లేదన్నది నిజం. నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే పచ్చదనం వెల్లివిరుస్తుంది. ప్రతిఒక్కరూ మొక్కల సంరక్షణను తమ వంతు బాధ్యతగా చేపట్టాల్సిన అవసరముంది. అధికారులు సైతం మొక్కల సంరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. -
పంచాయతీలదే పూర్తి బాధ్యత
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హరితహారం కార్యక్రమ సంపూర్ణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకే అప్పగించనున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా హరితహారం కార్యక్రమం కింద నర్సరీల్లో మొక్కలను పెంచడం, వాటిని నాటించడం, సంరక్షించడం అంతా పంచాయతీలకే ప్రభుత్వం అప్పగించింది. గతంలో హరితహారం కార్యక్రమాన్ని పంచాయతీల ఆధ్వర్యంలోనే నిర్వహించినా వివిధ ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించడంతో అందరి సహకారంతోనే హరితహారం కార్యక్రమం కొనసాగింది. అయితే ఇప్పటి నుంచి పంచాయతీలే హరితహారానికి సంబంధించిన అన్ని బాధ్యతలను నిర్వహించాల్సి ఉంది. దీంతో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీలను ఏర్పాటు చేశారు. గతంలో రెండు మూడు గ్రామాలకు ఒక నర్సరీని నిర్వహించారు. ఉపాధి హామీ పథకం, సామాజిక అటవీ శాఖలు వేరు వేరుగా నర్సరీలను నిర్వహించి గ్రామాలకు అవసరమైన మొక్కలను సరఫరా చేశారు. అయితే సవరించిన పంచాయతీరాజ్ చట్టంలో హరితహారం కార్యక్రమ బాధ్యతలను ప్రభుత్వం పంచాయతీలకు అప్పగించడంతో ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఆ గ్రామ పంచాయతీ నర్సరీలను నిర్వహించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో 656 గ్రామ పంచాయతీలు ఉండగా అంతే మొత్తంలో నర్సరీలను ఏర్పాటు చేశారు. వచ్చే జూన్, జూలై మాసాల్లో హరితహా రం ఐదవ విడత కార్యక్రమాన్ని నిర్వహించనుండటంతో ఈ కార్యక్రమం పూర్తిగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలోనే సాగనుంది. ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ, అటవీశాఖ, ఎక్సైజ్ శాఖ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖలు హరితహారం బాధ్యతలను నిర్వహించాయి. ఇక నుంచి గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే అన్ని శాఖలు మొక్కలు నాటే కార్యక్రమంలో పాలుపంచుకోనున్నాయి. గ్రామానికి 40 వేల మొక్కలు.. హరితహారం కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో ఏటా 40 వేల మొక్కలను నాటించాలని ప్రభుత్వం గతంలోనే లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే అన్ని ప్రభుత్వ శాఖలకు భాగస్వామ్యం కల్పించడంతో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటించారు. ఇప్పుడు మాత్రం పంచాయతీల ప్రతినిధులు ఈ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంది. కాగా భౌగోళికంగా చిన్నగా ఉన్న పంచాయతీల్లో ఇంత మొత్తంలో మొక్కలు నాటడం సాధ్యం అవుతుందా లేదా అనే సంశయం వ్యక్తం అవుతోంది. మేజర్ పంచాయతీలు, భూ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న గ్రామాలలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటించడం సాధ్యం అవుతుంది. చిన్న పంచాయతీల్లో మాత్రం భారీ లక్ష్యం సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయిన తరుణంలో కొత్త పాలక వర్గాలు కొలువుదీరగా వాటికి ప్రభుత్వం పెద్ద బాధ్యతనే అప్పగించిందని అంటున్నారు. -
పంచాయతీకో నర్సరీ
నేరడిగొండ(ఆదిలాబాద్): పచ్చదనానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.. గ్రామాలను పచ్చలహారంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా పల్లెలు, పట్టణాల్లో విరివిగా మొ క్కలు నాటిస్తుండగా.. దీనిని ఉద్యమంలా కొనసాగించేందుకు ప్రతీ పంచాయతీలో న ర్సరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. పాత పంచాయతీలతోపాటు కొత్త గ్రామపంచాయతీల్లోనూ మొక్కలు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. రైతులు నివాస, పరిసర ప్రాంతాల్లో నాటేందుకు అవసరమైన మొక్కలను ఆ గ్రామ పరిధిలోని నర్సరీలోనే పెంచే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. పూలు, పండ్ల మొక్కలతోపాటు ప్రజలకు అవసరమైన మొక్కల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా.. పంచాయతీ పరిధిలోని నర్సరీలో మొక్కలు పొందే విధంగా చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్ నూతన చట్టం ప్రకారం ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటు బాధ్యతను గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీ శాఖలకు అప్పగించింది. జిల్లాలోని 467 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలకు అదనంగా కొత్త నర్సరీలు ఏర్పాటు చేయాలని, ప్రతీ పంచాయతీలో నర్సరీ ఉండాలని సూచనల్లో పేర్కొంది. దీంతో పాత, కొత్త గ్రామపంచాయతీల పరిధిలో నూతన నర్సరీలు ఏర్పాటు కానున్నాయి. ఈ నెల 15లోగా ఏర్పాటు.. గ్రామాలను పచ్చని తోరణాలుగా మలిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రతీ పంచాయతీలో ప్రభుత్వం నర్సరీని ఏర్పాటు చే స్తోంది. ఇప్పటివరకు మండలానికి రెండు నుంచి ఐదు నర్సరీలు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్య ను పెంచి ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసే లా మార్గదర్శకాలు విడుదల చేసింది. స్థలాలను ఎంపిక చేయాలని ఇప్పటికే జిల్లా అధికారులకు సూచించింది. ఈ నెల 15వ తేదీలోగా నర్సరీల వారీగా స్థలాలను నిర్ణయించి.. నివేదిక అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతోపాటు వన సేవకులను కూడా గుర్తించాలని సూచించింది. ఆగస్టు 31లోగా ఎంపిక చేసిన నర్సరీ స్థలాల్లో నీటి సౌకర్యం, పైపులైన్ నిర్మాణం ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటితోపాటు అవసరమైన టేకు స్టంప్స్, విత్తనాలు సిద్ధం చేసుకొని వాటిని నాటేందుకు పాలిథిన్ సంచులు సమకూర్చుకోవాల్సి ఉంది. సెప్టెంబర్ 15లోగా నర్సరీల్లో విత్తన బ్యాగులు ఏర్పాటు చేసేందుకు బెడ్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అక్టోబర్ 20లోగా పాలిథిన్ బ్యాగుల్లో మట్టిని నింపి సిద్ధం చేసుకోవాల్సి ఉంది. అక్టోబర్ 31లోగా వాటిలో ఆయా పండ్ల విత్తనాలు, టేక్ స్టంప్స్ నాటాల్సి ఉంది. 467 నర్సరీలు. జిల్లాలో 467 నర్సరీల ఏర్పాటుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక్కో మండలంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 20 నర్సరీలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో 8 నర్సరీలు పెంచేలా ప్రభుత్వం జిల్లా అధికారులకు సూచనలు చేసింది. జిల్లా వ్యాప్తంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 419 నర్సరీల్లో 99లక్షల మొక్కలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో 48 నర్సరీల్లో 41లక్షల మొక్కలు పెంచేలా ప్రణాళికలు రూపొందించారు. ఆ ప్రకారం జిల్లాలో నర్సరీలు ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. జనాభా ప్రాతిపదికన మొక్కల పెంపకం.. ప్రభుత్వం కొత్త పంచాయతీల్లో ఏర్పాటు చేసే న ర్సరీల్లో జనాభా ప్రాతిపదికన మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రతీ పంచా యతీ పరిధిలో గ్రామాలు, స్థానికులు వినియోగించుకునేలా నర్సరీల్లో మొక్కలు పెంచేలా చర్యలు చేపట్టింది. వెయ్యికి పైగా జనాభా ఉన్న గ్రామంలో లక్ష మొక్కలు పెంచేలా నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తే అందుకు అనుగుణంగా మొక్కల పెంపకం శాతా న్ని పెంచాలని సూచించింది. గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేసే నర్సరీల్లో మొక్కల పెంపకం స్థానికుల అభీష్టం మేరకే ఉండనున్నది. రైతుల పొలాల్లో నాటేందుకు, నివాస పరిసరాల్లో నాటేందుకు అనువైన మొక్కలు పెంచేందుకు ప్ర భుత్వం నిర్ణయించింది. స్థానిక రైతులు, ప్రజలు తమకు అవసరమైన మొక్కలను సూచిస్తే.. వాటిని మాత్రమే ఆ నర్సరీల్లో పెంచేలా ప్రణాళికలు రూపొందించింది. వీటిలో అత్యధిక శాతం పూలు, పండ్ల మొక్కలను మాత్రమే పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొక్కల రక్షణకు గ్రామ కమిటీలు.. గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల పెంపకానికి, రక్షణకు ప్రభుత్వం గ్రామ కమిటీలు వేయనుంది. పంచాయతీ పరిధిలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితోపాటు గ్రామంలో మొక్కల పెంపకంపై ఆసక్తి కలిగిన రైతులు, యువకులను ఇందులో సభ్యులుగా నియమించనుంది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణ, మొక్కల రక్షణ, పెంపకం అంతా కమిటీలే చూసుకోవాలి. వాటి నిర్వహణకయ్యే ఖర్చు ప్రభుత్వం భరించనుంది. నర్సరీల నిర్వహణకు ఉపాధిహామీ పథకంలోని కూలీలను వినియోగించుకునేలా వీలు కల్పించింది. కొత్త నర్సరీల ఏర్పాటుకు చర్యలు ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో కొత్త నర్సరీల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాం. పంచాయతీల్లో నర్సరీల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేసేలా ఫీల్డ్ అసిస్టెంట్లు, మండలస్థాయి సిబ్బందికి సూచనలు చేశాం. ప్రభుత్వం విధించిన గడువులోగా జిల్లాలో నర్సరీలు ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాం. డీఆర్డీఓ ఆధ్వర్యంలో 419, అటవీ శాఖ ఆధ్వర్యంలో 48 నర్సరీల ఏర్పాటుకు దాదాపు స్థలాల ఎంపిక పూర్తయ్యింది. ఆయా స్థలాల్లో అవసరమైన వసతులు త్వరితగతిన సమకూర్చి లక్ష్యాలను చేరుకుంటాం. – రాథోడ్ రాజేశ్వర్,జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి -
‘హరీ’తహారం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): అట్టహాసంగా ప్రారంభించిన హరితహారం లక్ష్యం అభాసుపాలవుతోంది.. ప్రారంభంలో మొక్కలపై ఉన్న శ్రద్ధ ప్రస్తుతం లేకపోవడంతో పెరిగిన మొక్కలు నర్సరీల్లో బిక్కుబిక్కుమంటున్నాయి. పట్టించుకునే నాథులే లేకపోవడంతో చాలామొక్కలు నర్సరీల్లోనే చనిపోతున్నాయి. గతేడాది హరితహారం కార్యక్రమం కింద ఉత్తునూర్ గ్రామంలోని ఎల్లమ్మగుడి ఆలయ ప్రాంగణంలో ఏడాది క్రితం అటవీశాఖ ఆధ్వర్యంలో లక్ష మొక్కలతో వన నర్సరీని ఏర్పాటు చేశారు. నర్సరీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో ఏర్పాటు చేసిన లక్ష మొక్కలకు నీరు పట్టే వారు లేక నర్సరీలోనే ఎండిపోయాయి. నర్సరీని ఏర్పాటు చేయడానికి తీసుకున్న స్థల నిర్వహకులకు కూడా ఇప్పటికీ డబ్బులు కూడా చెల్లించలేదు. ఇవన్ని కలిపి హరితహారం పథకానికి తూట్లు పొడుస్తున్నాయి. ప్రస్తుతం సగానికి పైకా మొక్కలు చనిపోయాయి. రికార్డుల్లో ఘనం.. గ్రామాల్లో హరితహారం కింద లక్షల్లో మొక్కలు నాటినట్లు రికార్డులు సృష్టించారే తప్పా గ్రామాల్లో మొక్కలు నాటలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరిత తెలంగాణగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం అడుగడుగున నిర్వీర్యం అవుతుంది. వన నర్సరీల్లో ఏర్పాటు చేసిన మొక్కలు చెట్లుగా మారుతున్నా. పట్టింపు లేదు. అధికారుల నిర్లక్షం కూడా తోడవుతుంది. దీనంతటికి కారణం క్షేత్ర స్థాయిలో అధికారులు పట్టించుకోక పోవడం, ఏర్పాటు చేసిన నర్సరీలపై కనీసం దృష్టి సారించక పోవడంతో హరిత లక్ష్యం హరీమంటుంది. గ్రామాల్లో 40 వేల చొప్పున మొక్కలు నాటాలని విధించిన నిబంధన ఏ మాత్రం ప్రయోజనం లేకుండా ఉందని తెలుస్తోంది. మొక్కల సంరక్షణకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో పథకం అభాసుపాలవుతుంది. పథకం అమలులో సరైనా ప్రణాళిక లేకపోవడంతో హరితహారం పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికైన అధికారులు స్పందించి హరితహారం పథకాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మొక్కలను వృథా చేశారు.. గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో పెంచిన లక్ష మొక్కలను వృథా చేశారు. ఎండిపోయిన మొ క్కలను అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తయారైంది. – వెంకట్రావ్, ఉత్తునూర్ ఎండబెట్టారు హరితహారంలో నాటాల్సిన మొక్కలను ఎండబెట్టారు. దీంతో ప్రభుత లక్ష్యం నీరుగారింది. నర్సరీని ఏర్పాటు చేసిన అధికారులు నర్సరీపై దృష్టి పెట్టకపోవడంతో మొక్కలు ఎండుముఖం పట్టాయి. అధికారులు దృష్టి సారించి పథకాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. – రాజు, ఉత్తునూర్ -
హరిత‘హతం!’
ముకరంపుర/రారుుకల్ : పచ్చవనానికి ఆదిలోనే సంకట పరిస్థితులు ఎదురవుతున్నాయి. జిల్లాలో అటవీ సంపదను పెంచి వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కునేందుకు సర్కారు చేపట్టిన హరితవనం ‘నీరు’ గారుతోంది.. పై చిత్రాలు మచ్చుకు కొన్ని మాత్రమే.. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఈ పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. మరోవైపు ఎండలు మండుతుండడంతో మొక్కల పంపిణీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎండలు తగ్గేవరకూ ఈ కార్యక్రమం నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. హరితహారం పథకంలో భాగంగా నియోజకవర్గానికి 40 లక్షల చొప్పున జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 5.20 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణరుుంచారు. మొదటి విడతగా 3.50 కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధమై ఇప్పటివరకు 14 లక్షల గుంతలు తవ్వి, 10 లక్షల మొక్కలు నాటారు. మొక్క లు నాటేందుకు అటవీ, అటవీయేతర భూములని రెండు రకాలుగా విభజించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఊరూవాడా విసృ్తత ప్రచారం చేరుుస్తున్నారు. స్వయంగా ఆయనే బస్సు యూత్ర చేపట్టి జిల్లాలో రెండు రోజులపాటు ఉండి మొక్కలు నాటించే పని మొదలెట్టారు. మొక్కలు నాటడమే కాదు... వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని, స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు బాధ్యులవుతారని, కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. ఈ మేరకు ప్రతీ గ్రామపంచాయతీలో కో ఆర్డినేషన్ అధికారులను నియమించారు. ఆ గ్రామంలో సర్పంచ్, వీఆర్ఏ, ఎంపీటీసీలు, స్వశక్తి సంఘాల మహిళలు, యువజన సంఘాలు, ప్రజలను సమన్వయం చేసుకుంటూ మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ బాధ్యతను కూడా అంతే శ్రద్ధగా చర్యలు తీసుకోవాల్సి ఉండగా... క్షేత్రస్థారుులో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొన్నింటికి బాధ్యత ఉండి బతికుంటే మరికొన్ని పట్టించుకోకుండా ఎండిపోతున్నారుు. లక్ష్యసాధనలో భాగంగా వానలు, నీరు లేని ప్రాంతాల్లో మొక్కలు నాటించడంతో అవి ఎండ తీవ్రతకు వాడిపోతున్నారుు. నీళ్లు పోసే దిక్కు లేదు మొక్కలు నాటడం వరకే మా పని... సంరక్షణ బాధ్యత దేవుడెరుగు అన్నట్లుగా... మరుసటి రోజు నుంచి ఆ మొక్కలవైపు కన్నెత్తి చూడకపోవడంతో పచ్చని ప్రాణాలు ఎండలో ఎండిపోతున్నారుు. పచ్చని పండుగకు వానలు లేక ఇబ్బందులు ఎదురవుతుండగా ఆదరాబాదరాగా నాటిన మొక్కలకు నీళ్లు పోసే దిక్కులేక... ట్రీగార్డులు దొరకక... పశువులకు మేతగా చిక్కిపోతూ కొన్ని మొక్కలు మొగ్గలోనే కనుమరుగవుతున్నారుు. ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వ లక్ష్యం కనుమరుగయ్యే ప్రమాదముంది. వానాకాలం వేసవిని తలపిస్తోంది.. లక్ష్యానికి ఎండ గండికొడుతోంది.. పట్ణణ ప్రాంతాల్లో రోడ్లకిరువైపులా, డివైడర్ల మధ్య నాటిన మొక్కలకు ట్యాంకర్లతో నీరు పోయించే ప్రయత్నాలు నెమ్మదిగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ సిబ్బంది. పంచాయతీ కార్మికులు సమ్మెలో ఉండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో మొక్కలు నాటించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కో గుంత ఎటుచూసినా 4 ఫీట్ల లోతు, వెడల్పు కొలతల ప్రామాణికంగా ఉంటే ఆ మొక్కకు మరింత జీవం పోయవచ్చు. ఆ కొలతల ప్రామాణికాలు, కూలీల చెల్లింపు బాధ్యతలు నిర్వహించే ఉపాధి సిబ్బంది సమ్మెలో ఉన్నారు. దీంతో ఇష్టారీతిన గుంతలు తవ్వుతున్నారు. ఇప్పటివరకు నాటిన మొక్కల్లో 30 శాతం వరకు ఎండతీవ్రత , నీరు లేక, సంరక్షణలో నిర్లక్ష్యం కారణంగా వాడిపోయాయి. ప్రతిష్టాత్మక హరితహారంలో నిధులు ఎండకు ఆవిరవుతున్నాయి. చెట్టుతో కావాలి చెలిమి ఆదిలోనే మొక్కలు ఎండిపోవడానికి కారణం ఎవరు? చర్యలు ఎవరిపైన?.. తక్షణ కర్తవ్యమేమిటి? అని ఒక్క క్షణం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాతావరణ ప్రతికూల పరిస్థితులను.. కరువు కాటకాలను కనుమరుగు చేసేందుకు సర్కారు ఓ మహాయజ్ఞం లాంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇది ప్రజల కార్యక్రమం.. ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలి. నాటిన మొక్కను చెట్టుగా ఎదిగే వరకు చేయీ చేయీ కలపాలి.. ఊరూ..వాడా విద్యాసంస్థలు, రహదారులు, కాలనీలు, ఇళ్లు, పొలంగట్లు.. ఇలా ప్రతిచోట చెట్టుతో చెలిమి చేయాలన్న సందేశం భవిష్యత్తు ఫలితాన్ని కళ్లముందు చూపుతోంది.. ఇది అందరి సామాజిక బాధ్యత... అందరికోసమే హరితహారం.. అన్న మాటలు హరితవిప్లవానికి మార్గదర్శనమవుతోంది. మొక్కల పంపిణీకి తాత్కాలిక బ్రేక్! జిల్లాలో మొక్కల పంపిణీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. వారం రోజులుగా వేసవి కాలం మాదిరిగా ఎండలు మండుతున్నారుు. 30 నుంచి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నారుు. జిల్లాలో 572 నర్సరీల్లో మొక్కలు పెంచారు. నల్లతుమ్మ, గిరిశనము, వేప, సీమతంగెడు, కానుగ, ఉసిరి, సుబాబుల్, నేరేడు, మునగ, సీమచింత, చింత, టేకు, బాహీనియూ, గుల్మొమర్, టూబుబియూ, ఎడాకులపాల, మామిడి, బోగన్విల్లియూ, టైకోమా తదితర మొక్కలు పెం చారు. నాలుగు రోజుల క్రితం హరితహారం పథకం ప్రారంభించి మొక్కలు నాటుతున్నారు. అరుుతే మొక్కలు బతకాలంటే తప్పనిసరిగా నీరు ఉండాలి. వర్షాలు లేకపోవడంతో మొక్కలు బతికే పరిస్థితి లేదని గ్రహించిన అటవీశాఖ అధికారులు తాత్కాలికంగా మొక్కల పంపిణీకి బ్రేక్వేశారు. వర్షాలు కురిసిన తర్వాతే పంపిణీ చేయూలని జిల్లాలోని సబ్ డీఎఫ్‌వోలకు, ఎఫ్ఆర్వోలకు మంగళవారం మౌఖికంగా, ఎస్ఎంఎస్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. భానుడి ఎఫెక్ట్‌తో నర్సరీల్లో మొక్కలను బతికించడం కోసం అటవీశాఖ అధికారులు కూలీలతో రోజుకు 5-6 సార్లు నీటిని పట్టిపిస్తున్నారు.