ముకరంపుర/రారుుకల్ : పచ్చవనానికి ఆదిలోనే సంకట పరిస్థితులు ఎదురవుతున్నాయి. జిల్లాలో అటవీ సంపదను పెంచి వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కునేందుకు సర్కారు చేపట్టిన హరితవనం ‘నీరు’ గారుతోంది.. పై చిత్రాలు మచ్చుకు కొన్ని మాత్రమే.. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఈ పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. మరోవైపు ఎండలు మండుతుండడంతో మొక్కల పంపిణీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎండలు తగ్గేవరకూ ఈ కార్యక్రమం నిలిచే పరిస్థితి కనిపిస్తోంది.
హరితహారం పథకంలో భాగంగా నియోజకవర్గానికి 40 లక్షల చొప్పున జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 5.20 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణరుుంచారు. మొదటి విడతగా 3.50 కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధమై ఇప్పటివరకు 14 లక్షల గుంతలు తవ్వి, 10 లక్షల మొక్కలు నాటారు. మొక్క లు నాటేందుకు అటవీ, అటవీయేతర భూములని రెండు రకాలుగా విభజించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఊరూవాడా విసృ్తత ప్రచారం చేరుుస్తున్నారు.
స్వయంగా ఆయనే బస్సు యూత్ర చేపట్టి జిల్లాలో రెండు రోజులపాటు ఉండి మొక్కలు నాటించే పని మొదలెట్టారు. మొక్కలు నాటడమే కాదు... వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని, స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు బాధ్యులవుతారని, కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. ఈ మేరకు ప్రతీ గ్రామపంచాయతీలో కో ఆర్డినేషన్ అధికారులను నియమించారు. ఆ గ్రామంలో సర్పంచ్, వీఆర్‌ఏ, ఎంపీటీసీలు, స్వశక్తి సంఘాల మహిళలు, యువజన సంఘాలు, ప్రజలను సమన్వయం చేసుకుంటూ మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ బాధ్యతను కూడా అంతే శ్రద్ధగా చర్యలు తీసుకోవాల్సి ఉండగా... క్షేత్రస్థారుులో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొన్నింటికి బాధ్యత ఉండి బతికుంటే మరికొన్ని పట్టించుకోకుండా ఎండిపోతున్నారుు. లక్ష్యసాధనలో భాగంగా వానలు, నీరు లేని ప్రాంతాల్లో మొక్కలు నాటించడంతో అవి ఎండ తీవ్రతకు వాడిపోతున్నారుు.
నీళ్లు పోసే దిక్కు లేదు
మొక్కలు నాటడం వరకే మా పని... సంరక్షణ బాధ్యత దేవుడెరుగు అన్నట్లుగా... మరుసటి రోజు నుంచి ఆ మొక్కలవైపు కన్నెత్తి చూడకపోవడంతో పచ్చని ప్రాణాలు ఎండలో ఎండిపోతున్నారుు. పచ్చని పండుగకు వానలు లేక ఇబ్బందులు ఎదురవుతుండగా ఆదరాబాదరాగా నాటిన మొక్కలకు నీళ్లు పోసే దిక్కులేక... ట్రీగార్డులు దొరకక... పశువులకు మేతగా చిక్కిపోతూ కొన్ని మొక్కలు మొగ్గలోనే కనుమరుగవుతున్నారుు. ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వ లక్ష్యం కనుమరుగయ్యే ప్రమాదముంది. వానాకాలం వేసవిని తలపిస్తోంది.. లక్ష్యానికి ఎండ గండికొడుతోంది.. పట్ణణ ప్రాంతాల్లో రోడ్లకిరువైపులా, డివైడర్ల మధ్య నాటిన మొక్కలకు ట్యాంకర్లతో నీరు పోయించే ప్రయత్నాలు నెమ్మదిగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ సిబ్బంది.
పంచాయతీ కార్మికులు సమ్మెలో ఉండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో మొక్కలు నాటించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కో గుంత ఎటుచూసినా 4 ఫీట్ల లోతు, వెడల్పు కొలతల ప్రామాణికంగా ఉంటే ఆ మొక్కకు మరింత జీవం పోయవచ్చు. ఆ కొలతల ప్రామాణికాలు, కూలీల చెల్లింపు బాధ్యతలు నిర్వహించే ఉపాధి సిబ్బంది సమ్మెలో ఉన్నారు. దీంతో ఇష్టారీతిన గుంతలు తవ్వుతున్నారు. ఇప్పటివరకు నాటిన మొక్కల్లో 30 శాతం వరకు ఎండతీవ్రత , నీరు లేక, సంరక్షణలో నిర్లక్ష్యం కారణంగా వాడిపోయాయి. ప్రతిష్టాత్మక హరితహారంలో నిధులు ఎండకు ఆవిరవుతున్నాయి.
చెట్టుతో కావాలి చెలిమి
ఆదిలోనే మొక్కలు ఎండిపోవడానికి కారణం ఎవరు? చర్యలు ఎవరిపైన?.. తక్షణ కర్తవ్యమేమిటి? అని ఒక్క క్షణం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాతావరణ ప్రతికూల పరిస్థితులను.. కరువు కాటకాలను కనుమరుగు చేసేందుకు సర్కారు ఓ మహాయజ్ఞం లాంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇది ప్రజల కార్యక్రమం.. ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలి. నాటిన మొక్కను చెట్టుగా ఎదిగే వరకు చేయీ చేయీ కలపాలి.. ఊరూ..వాడా విద్యాసంస్థలు, రహదారులు, కాలనీలు, ఇళ్లు, పొలంగట్లు.. ఇలా ప్రతిచోట చెట్టుతో చెలిమి చేయాలన్న సందేశం భవిష్యత్తు ఫలితాన్ని కళ్లముందు చూపుతోంది.. ఇది అందరి సామాజిక బాధ్యత... అందరికోసమే హరితహారం.. అన్న మాటలు హరితవిప్లవానికి మార్గదర్శనమవుతోంది.
మొక్కల పంపిణీకి తాత్కాలిక బ్రేక్!
జిల్లాలో మొక్కల పంపిణీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. వారం రోజులుగా వేసవి కాలం మాదిరిగా ఎండలు మండుతున్నారుు. 30 నుంచి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నారుు. జిల్లాలో 572 నర్సరీల్లో మొక్కలు పెంచారు. నల్లతుమ్మ, గిరిశనము, వేప, సీమతంగెడు, కానుగ, ఉసిరి, సుబాబుల్, నేరేడు, మునగ, సీమచింత, చింత, టేకు, బాహీనియూ, గుల్‌మొమర్, టూబుబియూ, ఎడాకులపాల, మామిడి, బోగన్‌విల్లియూ, టైకోమా తదితర మొక్కలు పెం చారు.
నాలుగు రోజుల క్రితం హరితహారం పథకం ప్రారంభించి మొక్కలు నాటుతున్నారు. అరుుతే మొక్కలు బతకాలంటే తప్పనిసరిగా నీరు ఉండాలి. వర్షాలు లేకపోవడంతో మొక్కలు బతికే పరిస్థితి లేదని గ్రహించిన అటవీశాఖ అధికారులు తాత్కాలికంగా మొక్కల పంపిణీకి బ్రేక్‌వేశారు. వర్షాలు కురిసిన తర్వాతే పంపిణీ చేయూలని జిల్లాలోని సబ్ డీఎఫ్‌వోలకు, ఎఫ్‌ఆర్వోలకు మంగళవారం మౌఖికంగా, ఎస్‌ఎంఎస్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. భానుడి ఎఫెక్ట్‌తో నర్సరీల్లో మొక్కలను బతికించడం కోసం అటవీశాఖ అధికారులు కూలీలతో రోజుకు 5-6 సార్లు నీటిని పట్టిపిస్తున్నారు.
హరిత‘హతం!’
Published Wed, Jul 8 2015 1:54 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement
Advertisement