Harris Jayaraj
-
హీరో విజయ్ 10 సినిమాలు రిజెక్ట్ చేశా: మ్యూజిక్ డైరెక్టర్
హరీశ్ జయరాజ్ (Harris Jayaraj).. తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మధ్య కాస్త సినిమాలు తగ్గించేశాడు. మిన్నలే (తెలుగులో చెలి చిత్రం) సినిమాతో ఈయన సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆరంభించాడు. వాసు, ఘర్షణ, ప్రేమించి చూడు, ఘజిని, సైనికుడు, మున్నా, ఆరెంజ్, రంగం, స్నేహితుడు, సెవంత్ సెన్స్, తుపాకీ, స్పైడర్ వంటి చిత్రాలకు సంగీతం అందించి తెలుగువారికీ దగ్గరయ్యాడు.ఇంట్లో తిట్టేవారుతాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో హరీశ్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. నాకు జీతం రాగానే సంగీత పరికరాలను కొనుగోలు చేసేవాడిని. వాటితోనే ఇంట్లో అడుగుపెట్టేవాడిని. అది చూసి ఇంట్లో వాళ్లు చాలాసార్లు నన్ను తిట్టారు. మంచి పాట ఇవ్వాలంటే అది హృదయం నుంచి రావాలి. హిట్ సాంగ్ ఇవ్వాలంటే అది మన మెదడు నుంచి రావాలి. ఈ రెండింటిలో ఏది కావాలన్నది మనం ఎంచుకోవాలి. అయితే మనం మనసు పెట్టి ట్యూన్ చేసిన పాట ఎన్నేళ్లయినా అదలాగే ఉండిపోతుంది. అది పదేళ్లే కావచ్చు.. వందేళ్లు కూడా కావచ్చు.విజయ్ 10 సినిమాలు రిజెక్ట్ చేశాహీరో విజయ్ (Vijay) పది సినిమాలను రిజెక్ట్ చేశాను. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ సినిమాలకు పని చేయడం ఒత్తిడితో కూడుకున్నది. అది నాకు మెంటల్ టార్చర్లా అనిపిస్తుంది. పనిని ఆస్వాదిస్తూ చేయాలి తప్ప భారంగా కాదు. మనం చేసే పని ముందు మనకు సంతృప్తి ఇవ్వాలి అంతే కానీ మన జేబు నింపుకోవడానికి కాదు. డబ్బుపై నాకు ఆశలేదు. అందుకే ఆయన 10 సినిమాలు తిరస్కరించాను. అవన్నీ ఒప్పుకుని ఏదో తూతూమంత్రంగా చేసివ్వడం, వేరేవారిని వెయిట్ చేయించడం ఇష్టం లేకే రిజెక్ట్ చేశాను. 11వ సారి మాత్రం ఒప్పుకున్నాను అని చెప్పుకొచ్చాడు.విజయ్‌తో రెండు సినిమాలుకాగా విజయ్ హీరోగా నటించిన నంబన్ (స్నేహితుడు), తుపాకీ చిత్రాలకు హరీశ్ శంకరే సంగీతం అందించాడు. నంబన్ సినిమా కంటే ముందు విజయ్ నుంచి 10 సినిమాల వరకు ఆఫర్లు రాగా వాటిన్నింటినీ తిరస్కరించానని హరీశ్ చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.చదవండి: నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల -
సీనియర్ హీరోయిన్‌కు డాక్టరేట్
సీనియర్ నటి, నాట్యకళాకారిణి శోభన, సంగీతదర్శకుడు హరీశ్జయరాజ్లకు ఎంజీఆర్ విద్యా పరిశోధన సంస్థ గౌరవ డాక్టరేట్లను ప్రకటించింది. ఈ విద్యాసంస్థ విద్యార్థులకు పట్టాలను అందించే కార్యక్రమం ఈ నెల 10వ తేదీన వేలప్పన్ చావడిలోని ఏసీఎస్ కన్వెన్సన్ సెంటర్లో సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. ఎంజీఆర్ విద్య, పరిశోధన సంస్థ అధినేత ఏసీ.షణ్ముగం నేతృత్వంలో జరగనున్న ఈ కార్యక్రమంలో విక్రం సారాబాయ్, స్పేస్ డైరెక్టర్ సోమనాథ్, నటి, భరతనాట్యకళాకారిణి శోభన, సంగీత దర్శకుడు హరీశ్జయరాజ్లను గౌరవ డాక్టరేట్లతో ఘనంగా సత్కరించనున్నారు. కార్యకమంలో రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఈ వేదికపై 3,300 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ అందించనున్నారు. -
‘చిరునవ్వుల చిరుజల్లు’ స్టిల్స్
-
చిరునవ్వుల పాటల జల్లు
‘‘తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులక్కూడా ఈ చిత్రం నచ్చుతుంది. సంగీత దర్శకుడు హ్యారిస్ జైరాజ్‌తో నాది హిట్ కాంబినేషన్’’ అని జీవా చెప్పారు. జీవా, త్రిష, ఆండ్రియా, వినయ్ కాంబినేషన్లో ఐ. అహ్మద్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రాన్ని తెలుగులో ‘చిరునవ్వుల చిరుజల్లు’గా అనువదిస్తున్నారు జాని, వి.ఎస్. రామిరెడ్డి. ఈ సినిమా పాటల్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. సినిమా బాగా నచ్చి అనువదిస్తున్నామని నిర్మాతలు జాని, రామిరెడ్డి తెలిపారు. హ్యారిస్ జైరాజ్ సంగీతం ఆకట్టుకుంటుందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్, వినయ్, కుమరన్, ప్రసన్నకుమార్, భవానీ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. -
గీత స్మరణం
పల్లవి : ఒకే కావ్యం... ఒకే శిల్పం... ఒకే చిత్రం... అదే ప్రణయం మన తనువు మారును తరము మారును స్వరము మార్చదు ప్రేమ ప్రేమ మరణం... ప్రేమ మరణం రెండూ ఒకటే అంటే నమ్మాలి ఆ స్వర్గం అంటూ చూడాలంటే రెండూ ఉండాలి ॥మరణం॥॥కావ్యం॥ చరణం : 1 తనువులేకం కాకముందు మనసులౌను ఏకమే తనువు తనువుకి ప్రాణ ద్వారం ప్రేమే ఎదలు రె ండు దూరమైన పెదవులౌను చేరువే పెదవి ద్వారా ఎదను చేరెను ప్రేమే ముళ్లలాంటి కళ్లతోటి అంతుచూస్తుంది పువ్వులాంటి నవ్వుతోటి ఆయువిస్తుంది ॥మరణం॥ చరణం : 2 ప్రేమ పాట పాతది... పూట పూట కొత్తది గాలిలేని చోటైన మోగేనిది ప్రేమ అంటే విషములే... విషములోన విశేషమే ఇదే జన్మలో మరో జన్మకు మార్గమే బీడుభూమిలో మెట్టభూమిలో మొగ్గ ప్రేమేలే మండుటెండలో ఎండమావిలో నీడ ప్రేమేలే భళా చాంగు భళా చాంగు... భళా చాంగు భళా నా ఫలాలన్నీ ఫలించేలా రావే పుష్పకళ ఫలాలన్నీ ఫలించేలా రావే పుష్పకళ నిను స్మరిస్తేనే నాలో స్వర్ణకళ తరంగంలా... తరంగంలా... రావే రావే... రావే రావే... విహంగంలా... విహంగంలా... చిత్రం : వర్ణ (2013) రచన : చంద్రబోస్ సంగీతం : హారీస్ జైరాజ్, గానం : ఎస్.పి.బాలు, బృందం నిర్వహణ: నాగేశ్