Harsimrat Badal
-
పాక్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: భారత్
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: కర్తార్‌పూర్ సాహెబ్ గురుద్వారా నిర్వహణ అంశంలో దాయాది దేశం పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయంపై భారత్ స్పందించింది. ఈ విషయంపై వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా పాక్ దౌత్యవేత్తకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు.. సిక్కుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఉన్న పాక్ ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ సాహెబ్ తనువు చాలించిన కర్తార్‌పూర్ గురుద్వారను సిక్కులు పవిత్ర స్థలంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గల కర్తార్‌పూర్(భారత్- పాకిస్థాన్ సరిహద్దు నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది)లో ఉన్న ప్రసిద్ధ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని భావిస్తారు. అంతటి ప్రాముఖ్యం గల ఈ గురుద్వార నిర్వహణను ఇప్పటి వరకు పాకిస్తాన్ సిక్కు గురుద్వార ప్రబంధక్ కమిటీ(పీఎస్‌జీపీసీ) పర్యవేక్షించేది. అయితే ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఈ బాధ్యతలను ఎవక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు(ఈటీపీబీ- ముస్లిం బాడీ- ప్రభుత్వ సంస్థ)కు అప్పగించిది. ఈ మేరకు నవంబరు 3న ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిక్కువర్గం, పీస్‌జీపీసీకి తిరిగి బాధ్యతలు అప్పగించాల్సిందిగా డిమాండ్ చేస్తోంది. భారత్‌లోనూ ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో శిరోమణి గురుద్వార ప్రభందక్ కమిటీ(ఎస్జీపీసీ) పాకిస్తాన్ హైకమిషన్‌కు లేఖ రాసింది. ఇక పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ఈ అంశంలో జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.(చదవండి: భగ్గుమన్న భారత్.. పీఓకే ఆక్రమణ..!) సిక్కులపై వివక్ష చూపుతున్న పాక్, కనీస మర్యాద లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ఇక కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ సైతం.. పాక్ నిర్ణయం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, గురుద్వార బాధ్యతలు తిరిగి సిక్కు బోర్డుకు అప్పగించాలన్న డిమాండ్‌ను పాక్ తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం, పాక్ దౌత్యవేత్త వివరణ కోరుతూ సమన్లు జారీ చేయడం గమనార్హం. కాగా గురునానక్ 550వ జయంతి సందర్భంగా... గతేడాది నవంబరు 9న కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తద్వారా భారత్‌లోని సిక్కు తీర్థ యాత్రికులు వీసా లేకుండా పవిత్ర కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే అవకాశం లభించింది. -
ఒక్కొక్కరికి 20 డాలర్లు; పాక్ చర్య సిగ్గుచేటు
న్యూఢిల్లీ : పాకిస్తాన్లో గల కర్తార్‌పూర్ సాహెబ్ గురుద్వారా ప్రవేశానికై 20 డాలర్లు వసూలు చేయడం దారుణమని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ విమర్శించారు. తమ మత విశ్వాసంపై పాక్ వ్యాపారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా... కర్తార్‌పూర్ కారిడార్‌ను నవంబర్ 9న ప్రారంభించనున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌లోని సిక్కు తీర్థ యాత్రికులు వీసా లేకుండా పవిత్ర కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే అవకాశం లభించింది. అయితే గురుద్వార ప్రవేశానికై ఒక్కో భక్తుడు 20 యూఎస్ డాలర్లు చెల్లించాలని పాక్ పేర్కొంది. అదే విధంగా ఈ కారిడార్‌ను ప్రారంభించడం వల్ల స్థానికులకు ఆతిథ్య రంగంలో ఉపాధి లభిస్తోందని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై స్పందించిన హర్సిమ్రత్ కౌర్ సోషల్ మీడియా వేదికగా ఇమ్రాన్ ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు... ‘ కర్తార్‌పూర్ సాహిబా సందర్శనకు వచ్చే భక్తుల నుంచి 20 డాలర్లు వసూలు చేస్తామని పాక్ చెప్పడం దారుణం. పేద భక్తుల పరిస్థితి ఏంటి? వారు ఎలా అంతమొత్తం చెల్లించగలరు. మా విశ్వాసంతో పాక్ వ్యాపారం చేయాలని చూస్తోంది. ప్రవేశ రుసుం వసూలు చేయడం వల్ల విదేశీ మారకద్రవ్యం పెరిగి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని.. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పడం నిజంగా సిగ్గుచేటు’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ సాహెబ్ తన జీవితంలోని చివరి 18 ఏళ్ల కాలాన్ని కర్తార్‌పూర్ సాహెబ్ గురుద్వారాలో గడిపారు. 1539లో అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఈ గురుద్వార పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గల కర్తార్‌పూర్(భారత్- పాకిస్థాన్ సరిహద్దు నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది) గ్రామంలో ఉంది. ఈ నేపథ్యంలో గురునానక్ 550 జయంతి సందర్భంగా అంతర్జాతీయ సరిహద్దు నుంచి డేరాబాబా నానక్ వరకు కారిడార్ నిర్మాణానికి భారత్ సంకల్పించింది. అటువైపు దార్బర్ సాహిబ్ వరకు కారిడార్‌ను పాక్ చేపట్టింది. The $20 fee each charged by Pak for #KartarpurSahib darshan is atrocious. How will a poor devotee pay this amount? Pakistan has made a business out of faith. @ImranKhanPTI's statement that this fee will boost Pak's economy & result in earning foreign exchange is highly shameful. pic.twitter.com/a0sidEDIPZ — Harsimrat Kaur Badal (@HarsimratBadal_) October 20, 2019 -
సిద్ధూ మానవబాంబు లాంటివాడు: డిప్యూటీ సీఎం
కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే మళ్లీ మాతృసంస్థలోకి వచ్చినట్లుందన్న మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ వ్యాఖ్యలపై పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్, ఆయన భార్య హర్సిమ్రత్ బాదల్ మండిపడ్డారు. సిద్ధూ మానవబాంబు లాంటివాడని, అతడు ఆరు నెలల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేయడం ఖాయమని, కావాలంటే రాసిస్తానని కూడా అన్నారు. సిద్ధూ ప్రతి రెండు రోజులకు ఒకసారి తన తల్లిని మార్చేస్తారని, ఆయనకు ఎంతమంది తల్లులు (పార్టీలు) ఉన్నారో అడగాలనుకుంటున్నానని ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ బాదల్ ఎద్దేవా చేశారు. ఇక అరవింద్ కేజ్రీవాల్‌కు పంజాబ్ ముఖ్యమంత్రి కావాలన్నదే ఏకైక ఎజెండా అని, దాంతోపాటు ప్రతి విషయానికీ ప్రధానమంత్రిని వ్యతిరేకిస్తుంటారని విమర్శించారు. సిక్కులను ఊచకోత కోసిన పార్టీలోకి వెళ్లి, దాన్ని ఘర్వాప్సీ అంటూ వ్యాఖ్యానించిన సిద్ధూకు అభినందనలని సుఖ్బీర్ భార్య హర్సిమ్రత్ బాదల్ ఎద్దేవా చేశారు. కొంతమంది వ్యక్తులు తమ కాళ్లను రెండు పడవల మీద కాకుండా మూడు పడవల మీద పెడతారని, కొన్నాళ్లు బీజేపీ.. మరికొన్నాళ్లు కాంగ్రెస్ అంటారని, ఇంకొంత దూరం వెళ్లి పాకిస్థాన్‌లో కూడా చేరొచ్చు కదా అని మండిపడ్డారు. ఇక పంజాబ్‌లో 70 శాతం మంది ఎప్పుడూ మత్తులో ఉంటారన్న రాహుల్ గాంధీయే బహుశా అందరికంటే ఎక్కువ మత్తులో ఉండి ఉంటారని తనకు అనిపిస్తోందని కూడా హర్సిమ్రత్ విమర్శించారు. -
సీఎం తలుచుకుంటే.. మీరు ప్రాణాలతో మిగలరు!
శిరోమణి అకాలీ దళ్ నాయకురాలు, కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి బుధవారం ఘాటుగా హెచ్చరికలు చేశారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ప్రకాశ్ సంగ్ బాదల్ హింసాత్మక దాడులకు దిగాలని అకాలీ శ్రేణులకు పిలుపునిస్తే.. పంజాబ్ లో ఆప్ మద్దతుదారులు ఒక్కరూ కూడా ప్రాణాలతో మిగలబోరని ఆమె పేర్కొన్నారు. సీఎం బాదల్ పై ఒక నిరసనకారుడు చెప్పు విసిరిన నేపథ్యంలో బఠిండా ఎంపీ అయిన ఆమె అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ పరుషమైన వ్యాఖ్యలు చేశారు. బాదల్ కుటుంబం లక్ష్యంగా గత నాలుగురోజుల్లో రెండుసార్లు దాడులు జరిగాయి. కొన్నిరోజుల కిందట హర్సిమ్రత్ కౌర్ భర్త అయిన డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్ కాన్వాయ్ లక్ష్యంగా రాళ్ల దాడి జరిగింది. తాజాగా సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ పై సిక్కు రాడికల్ యువకుడు ఒకడు చెప్పుతో దాడి చేశాడు. అయితే, ఈ దాడులు ఆప్ కావాలనే చేయిస్తున్నదని, తాము తిరగబడితే ఆప్ నామరూపాలు లేకుండా పోతుందని హర్సిమ్రత్ కౌర్ హెచ్చరించారు. హర్యానా మూలాలు ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు పంజాబ్ సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆమె విమర్శించారు. అయితే, ఈ దాడులకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పంజాబ్ ఆప్ ఎంపీ భగవంత్ సింగ్ మాన్ అంటున్నారు. -
'వీడియో'పై దద్దరిల్లిన పార్లమెంట్
-
'వీడియో'పై దద్దరిల్లిన పార్లమెంట్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ వీడియో వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం దద్దరిల్లాయి. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని అధికార బీజేపీ, అకాలీదళ్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో ఉభయసభల్లోనూ గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. సభా కార్యక్రమాలు స్తంభించిపోవడంతో పార్లమెంట్ ఉభయ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. భగవంత్ మాన్ తీసిన వీడియో తీవ్రవాదుల చేతుల్లో పడితే ఎవరు బాధ్యత వహిస్తారని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి, హరసిమ్రత్ బాదల్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తప్పనిసరిగా దర్యాప్తు విచారించాలని, పార్లమెంట్ కార్యకలాపాలను వీడియో తీయడం వెనుకున్న ఉద్దేశాన్ని వెల్లడి చేయాలని డిమాండ్ చేశారు. తన చర్యను భగవంత్ సమర్థించుకున్నారని, మరోసారి ఇలా చేస్తే చర్యలు తప్పవని రాజ్యసభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. మరోవైపు స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎదుట హాజరై భగవంత్ వివరణయిచ్చారు. జీవో అవర్ లో విపక్షాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు చూపించేందుకే వీడియో తీశానని భగవంత్ చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చలు లక్కీ డ్రా మాదిరిగా జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ భద్రతకు భంగం కలిగించలేదన్నారు. జీవో అవర్ లో చేసిన వీడియోను ఫేస్బుక్ లో పోస్ట్ చేయడంతో భగవంత్ వివాదంలో చిక్కుకున్నారు.