Harvard University scientists
-
కరోనా టీకాకు మరిన్ని ఆయుధాలు!
బోస్టన్: కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా వైరస్ వేరియంట్లను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన టీకాల కోసం శాస్త్రవేత్తలు కొత్త చిట్కాను కనిపెట్టారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా మానవ కణాలు ప్రతిస్పందించే తీరు ఆధారంగా దీన్ని కనుగొన్నట్లు తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకిన అనంతర మానవ శరీరం టీసెల్స్ సాయం పొందడం కోసం చూపే స్పందనలను గుర్తించినట్లు బోస్టన్, హార్వర్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఇప్పటివరకు కోవిడ్ టీకాలు శరీరంలో బీ సెల్స్‌ను యాక్టివేట్ చేసేలా రూపొందించడం జరిగింది. శరీరంలో ఉద్భవించే ఈ బీ సెల్స్ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఇంతవరకు టీ సెల్స్‌ను యాక్టివేట్ చేసే దిశగా ఎలాంటి టీకాలు రాలేదు. తాజా పరిశోధనలో టీ సెల్స్ యాక్టివేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. టీసెల్స్ కూడా యాక్టివేట్ అయితే శరీరంలో రోగనిరోధకత మరింతగా పెరుగుతుందని, పలు వేరియంట్లను సమర్ధవంతంగా ఎదుర్కుంటుందని వివరించారు. బీసెల్స్ లాగా కాకుండా టీ సెల్స్‌కు మెమరీ పవర్ ఉంటుంది. అంటే ఒకసారిఎదుర్కొన్న ఇన్ఫెక్షన్ను అవి గుర్తుంచుకొని తర్వాత ఎప్పుడు ఈ తరహా ఇన్ఫెక్షన్ ఎదురైనా వెంటనే ప్రతిస్పందిస్తాయి. ఈ వివరాలను జర్నల్ సెల్లో ప్రచురించారు. సంపూర్ణ ఇమ్యూన్ రెస్పాన్స్ ప్రస్తుత టీకాల్లో అన్నిరకాల ఇమ్యూనిటీ రెస్పాన్స్‌లను యాక్టివేట్ చేసే వైరల్ మెటీరియల్ లేదని గుర్తించామని సైంటిస్టులు తెలిపారు. సంపూర్ణ రోగనిరోధకతను ప్రేరేపించేందుకు అవసరమైన మిస్సింగ్ వైరల్ ప్రోటీన్ మెటీరియల్ కోసం కరోనా సోకిన మానవ కణాలను వీరు పరిశోధించారు. ఈ మిస్సింగ్ ప్రోటీన్ల ఆధారంగా కంపెనీలు టీకాలను రీడిజైన్ చేయాలని పరిశోధకుల్లో ఒకరైన మోషాన్ సయీద్ సూచించారు. తాజా పరిశోధన ప్రకారం మానవ ఇమ్యూనిటీ వ్యవస్థను యాక్టివేట్ చేసే వైరల్ ప్రోటీన్స్‌లో 25 శాతం ఈ నూతన ప్రోటీన్ నుంచి వస్తోందని గుర్తించారు. ఇది చాలా కీలకమైన ఆవిష్కరణని ప్రొఫెసర్ గబ్బే చెప్పారు. ఈ ఆవిష్కరణతో వైరస్‌లను పూర్తిగా అనుకరించే టీకాలను ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. -
2022 వరకు భౌతిక దూరం పాటిస్తేనే..
వాషింగ్టన్: కేవలం ఒకేసారి లాక్డౌన్ అమలు చేయడం ద్వారా మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తిని కట్టడి చేయలేమని హార్వర్డ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2022 వరకు భౌతిక దూరం పాటించేలా పటిష్ట చర్యలు చేపడితేనే ప్రాణాంతక వైరస్ నుంచి విముక్తి పొందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య తారస్థాయి(25 వేలు దాటింది)కి చేరడం సహా లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో మహమ్మారి ప్రభావంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. జులుబు మాదిరి కోవిడ్-19 సీజనల్ వ్యాధిగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ దీని ప్రభావం తీవ్రతరమవుతుందని పేర్కొన్నారు. (ఆ రెండు రకాల గబ్బిలాల్లో కరోనా!) ఇక సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడం సరైన చర్యే అయినప్పటికీ.. తరచుగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భౌతిక దూరం వల్ల రోగనిరోధక శక్తి పెరగదని.. దీని ద్వారా వైరస్ వ్యాప్తిని మాత్రం నియంత్రించవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా కరోనాను అంతం చేసే అంతిమ ఆయుధం వ్యాక్సిన్నే అని.. అయితే దానిని తయారు చేసేందుకు మరికొంత ఎక్కువ సమయం పట్టవచ్చని అంచనా వేశారు.(కరోనా: డబ్ల్యూహెచ్ఓకు షాకిచ్చిన ట్రంప్!) అదే విధంగా రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు కరోనాను జయిస్తున్నారని.. అయితే ఏడాది పాటు వారు తరచుగా కరోనా పరీక్షలు నిర్వహించుకుంటే దీని నుంచి పూర్తిస్థాయిలో విముక్తి పొందినట్లు భావించవచ్చన్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉందని.. కరోనా నుంచి కోలుకున్న వారు మళ్లీ ఆస్పత్రిలో చేరుతున్న ఉదంతాలు ఇందుకు నిదర్శనమన్నారు. ఇటువంటి తరుణంలో లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. -
ఆరోగ్యంతో ‘దోస్తీ’ చేద్దాం
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. అన్నాడో కవి. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. మంచి మిత్రుడు తోడుంటే ఆ ధైర్యమే వేరు. జీవితంలో మిత్రులు లేకున్నా .. ధూమపానం చేసినా శరీరానికి ఒకే రకమైన హాని కలుగుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఒంటరితనం వల్ల ఒత్తిడి పెరిగి రక్తంలో ఫైబ్రోనోజిన్ ప్రోటీన్ స్థాయి పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ ప్రోటీన్ రక్తంలో కొవ్వు పేరుకుపోయేలా చేసి రక్తపోటును పెంచుతుంది. దీనివల్ల గుండెపోటుతో పాటు తదితర వ్యాధులు వస్తాయి. కుటుంబంలోని వ్యక్తులు, వారికున్న స్నేహితులను బట్టి వారి రక్తంలో ఫైబ్రోనోజిన్ స్థాయిలకు ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐదుగురు స్నేహితులు ఉన్న వారి రక్తంలో ఫైబ్రోనోజిన్ స్థాయి 10 మంది స్నేహితులు ఉండే వారి కన్నా 20 శాతం అధికంగా ఉంది. ఐదుగురి కన్నా తక్కువ మంది స్నేహితులు ఉన్న వారిలో ధూమపానం చేస్తే పెరిగే స్థాయిలో రక్తంలో ఫైబ్రోనోజిన్ పెరుగుతుందని శాస్త్రవేత్తలు అన్నారు. సమాజంతో మనకున్న సంబంధాలు రక్తంలో ఫైబ్రోనోజిన్ స్థాయి పెరుగుదలకు మధ్య సంబంధాలు ఉంటాయని పరిశోధకులు తెలిపారు. హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం ఫలితాలను విడుదల చేశారు. -
పంది అవయవాలు మనుషులకు!
వాషింగ్టన్: పంది అవయవాలను మనుషులకు అమర్చడం భవిష్యత్తులో సాధ్యం కావొచ్చు. ఈ దిశగా ఉన్న అతిపెద్ద అడ్డంకిని శాస్త్రవేత్తలు అధిగమించారు. వరాహ జన్యువులోని రిట్రోవైరస్‌లను క్రియారహితంగా మార్చడం ద్వారా వీటి అవయవాలు మనుషులకు సరిపడేలా చేయగలిగారు. ఈ రిట్రోవైరస్‌లు పందిలోని ప్రతి కణంలో ఉంటాయి... అయితే దానికి హాని చేయవు. మరో జీవి శరీరంలో ప్రవేశపెడితే మాత్రం రోగకారకాలవుతాయి. గతంలో అత్యధికంగా ఆరుచోట్ల మాత్రమే పంది జన్యువుల్లో మార్పులు జరగ్గా... హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు... అత్యంత శక్తిమంతమైన జన్యు మార్పు ప్రకియ ద్వారా ఏకంగా 62 చోట్ల పంది జన్యువులో మార్పు చేయగలిగారు. ప్రమాదకరమైన రిట్రోవైరస్‌లను తొలగించడంలో సఫలమయ్యారు. తద్వారా పంది అవయవాలను మనిషికి అమర్చే దిశగా పెద్ద ముందడుగు పడింది. -
ప్రపంచంలోనే అతిచిన్న ద్రోన్..
రాజమౌళి సినిమాలో ఈగ మాదిరిగా రకరకాల విన్యాసాలు చేసే ఈ ‘రోబో ఈగ’ ప్రపంచంలోనే అతిచిన్న ద్రోన్ . కార్బన్ ఫైబర్‌తో తయారుచేసిన ఈ ద్రోన్ 106 మిల్లీగ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. తలపై పిరమిడ్ ఆకారంలో ఉండే లైట్ సెన్సర్ ఆధారంగా దేహాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎలక్ట్రానిక్ కండరాలతో రెక్కలను ఆడిస్తూ ఇది ముందుకెళుతుంది. తేలికైన, అతిసన్ననైన తీగ సాయంతో విద్యుత్‌ను అందుకుని పనిచేస్తుంది. భవనాలు కూలినప్పుడు, ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు చిన్న రంధ్రాల్లోంచి సైతం శిథిలాల కిందికి వెళ్లి పరిస్థితిని తెలియజేసేందుకు, పర్యావరణ సంబంధిత పర్యవేక్షణకు, వివిధ పంటల మధ్య పరాగ సంపర్కం జరపడానికీ ఈ రోబో ఈగ ఉపయోగపడుతుందట. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమను తాము వేగంగా నియంత్రించుకుంటూ కీటకాలు ఎగరడాన్ని స్ఫూర్తిగా తీసుకున్న హార్వార్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిని తయారు చేశారు.