Haveli
-
బ్యాంకు ఉద్యోగి నిర్వాకం.. ఖాతాదారుల సొమ్ముతో ఆన్లైన్లో రమ్మీ ఆట
బెంగళూరు: కర్ణాటకలో ఓ ప్రైవేటు బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారుల సొమ్మును కాజేశాడు. ఆన్లైన్లో రమ్మీ వంటి గ్యాంబ్లింగ్ గేమ్స్‌కు బానిసైన అతడు మొత్తం రూ.2.36 కోట్లు తన స్నేహుతుడి ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. వాటితో తరచూ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడాడు. బ్యాంకుకు రూ.2.36 కోట్లు నష్టం రావడంతో షాక్ అయిన మేనేజర్ పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. అసిస్టెంట్ మేనేజరే ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వీరేశ్ కేషిమఠ్(28) కర్ణాటక హవేరిలోని ఓ ప్రైవేటు బ్యాంకు శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్లో గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడి వాటికి బానిసయ్యాడు. బ్యాంకింగ్ ఆపరేషన్స్ కోసం ప్రతిరోజు రూ.5లక్షలు బదిలీ చేసే అధికారం ఇతనికి ఉంటుంది. దీన్నే అదునుగా తీసుకొని ఖాతాదారుల ఖాతాల నుంచి తరచూ రూ.5లక్షలు తన స్నేహితుడు మహంతేషయ్య పీ హిరేమఠ్కు బదిలీ చేశాడు. వాటితో రమ్మీ, ఇతర ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. గతేడాది ఆగస్టు నుంచి ఇలా చేస్తున్నాడు. కొన్ని నెలలపాటు ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు కూడా గుర్తించలేకపోయారు. అయితే ఇటీవల ఈ బ్రాంచ్‌లో ఆడిటింగ్ నిర్వహించినప్పుడు రూ.2.36కోట్ల అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో మేనెజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో అసిస్టెంట్ నిర్వాకం బహిర్గతమైంది. గతేడాది ఆగస్టు నుంచి జరగుతున్న ఈ వ్యవహారం గురించి ఈ ఏడాది ఫిబ్రవరి 7న బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియడం గమనార్హం.మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేషిమఠ్ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రూ.2 కోట్లకు పైగా మోసం జరగడంతో ఈ కేసును రాష్ట్ర సీఐడీకి బదిలీ చేశారు. చదవండి: ముంబైలోకి ప్రవేశించిన 'డేంజర్ మ్యాన్'.. చైనా, పాకిస్తాన్, హాంకాంగ్‌లో శిక్షణ.. -
అలా పెళ్లి చేసుకోవాలని ఉంది
పెళ్లి విషయాల్లో అమ్మాయిలకు ఎన్నో కలలుంటాయి. ‘రెక్కల గుర్రం మీద రాకుమారుడు రావాలి, ఊరంతా చెప్పుకునేలా పెళ్లి జరగాలి’ అని ఎవరి కలలు వాళ్లవి. మరి మీ డ్రీమ్ వెడ్డింగ్ ఏంటి? అనే ప్రశ్నను అదితీరావ్ హైదరీని అడిగితే ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ‘‘నా పెళ్లిలో నేను అచ్చు రాజారవివర్మ బొమ్మను తలపించేలా ఉండాలి. మా అమ్మగారి వివాహం జరిగినప్పుడు ఆమె మేకప్ లేకుండా సింపుల్‌గా ఉన్నారు. నేనూ అలానే ఉంటాను. నా పెళ్లి బీచ్ ఒడ్డున ఉండే రాజుల నాటి భారీ కోటలో జరగాలి. పెళ్లికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాక చెప్పులు తీసేసి బీచ్‌లో పరిగెడతాను. రాత్రంతా డ్యాన్స్ చేస్తూనే ఉంటాను. నేను చెప్పేవన్నీ ఒకదానికి ఒకటి పొంతన లేకపోవచ్చు. కానీ నేనంతే. నా ఆలోచనలన్నీ ఒకేలా ఉండవు’’ అన్నారు. ఇదిలా ఉంటే అదితీరావ్కి ఆల్రెడీ పెళ్లయింది. కానీ భర్త నుంచి విడిపోయారామె. -
8 నెలలు..320 కేసులు
రఘునాథపాలెం: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పెట్టిన నూతన పోలీస్ స్టేషన్లలో రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 11–11–2016న పోలీస్ స్టేషన్ పెట్టినప్పటికీ..నాలుగు నెలల పాటు ఖానాపురం హవేలిలోనే కేసులు నమోదయ్యాయి. 8–4–17 నుంచి ఇప్పటి వరకు 8నెలల కాలంలో రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లో మొత్తం 320 కేసులు నమోదయ్యాయి. దీని పరిధిలో మండలంలోని 17గ్రామ పంచాయతీలు, రూరల్ మండలం దారేడు, కామంచికల్ పంచాయతీలు, మొత్తం 34 శివారు గ్రామాలు దీని పరిధిలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్విభజన తర్వాత 66 కొత్త పోలీస్ స్టేషన్లు ప్రారంభం కాగా..వీటన్నింటిలో రఘునాథపాలెంలోనే కేసులు ఎక్కువ. వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఎక్కువ. డిసెంబర్లోనే ఇలా పది కేసులు ఉన్నాయి. స్టేషన్ ఆవిర్భావం నుంచి గతేడాది డిసెంబర్ వరకు ఇక్కడ గోపి పనిచేశారు. డిసెంబర్లో ఈయన పదోన్నతిపై గుండాల సీఐగా వెళ్లారు. ప్రస్తుతం ఆర్.కృష్ణ విధులు నిర్వర్తిస్తున్నారు. దర్యాప్తు ముమ్మరం.. కేసులు పెరిగినప్పటికీ..దర్యాప్తును మరింత జాగ్రత్తగా నిర్వహిస్తున్నాం. పరిధి ఎక్కువ కావడం వల్ల కేసులు పెరిగాయి. బాధితులు మధ్య వర్తుల ద్వారా కాకుండా నేరుగా..స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. – ఆర్.కృష్ణ, ఎస్సై, రఘునాథపాలెం -
లెజెండరీ నటుడి 'హవేలి'ని కూల్చేస్తున్నారు!
పెషావర్: పాకిస్థాన్ పెషావర్‌లోని బాలీవుడ్ లెజెండరీ నటుడు రాజ్‌కపూర్‌కు చెందిన చారిత్రక నివాసాన్ని పాక్షికంగా కూల్చేశారు. ఈ నివాసం స్థానంలో ఓ ప్లాజా కట్టాలని భావిస్తున్న యజమానులు.. దాని మొదటి అంతస్తును కూల్చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఖైబర్ పఖ్తూన్ఖా అధికారులు కూల్చివేతను ఆపివేయించారు. స్థానిక కోర్టులో స్టే ఉత్తర్వులు తీసుకురావడం ద్వారా తాత్కాలికంగా కూల్చివేతకు బ్రేక్ పడింది. అయితే ఈ ఉత్తర్వులు వచ్చేలోపు యజమానులు 'హావేలి' (కోట) మొదటి అంతస్తును మొత్తం కూల్చేశారు. బాలీవుడ్ దిగ్గజ నటులు రాజ్‌కపూర్, దిలీప్కపూర్ పెషావర్‌లో జన్మించారు. దీంతో వారి నివాసాలను చారిత్రక వారసత్వ సంపదగా కాపాడుతామని ఖైబర్ పఖ్తూన్కా ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయినప్పటికీ రాజ్‌కపూర్ 'హవేలి' భారీగానే ధ్వంసమైంది. పాక్ ప్రభుత్వం ఏమైనా చేసుకోని! రాజ్‌కపూర్ నివాసాన్ని కూల్చివేయడంపై ఆయన కుమారుడు, నటుడు రిషి కపూర్ స్పందించారు. పెషావర్‌లోని తమ తాత పృథ్వీరాజ్ కపూర్ నివాసంతో తమకు ఎలాంటి భావోద్వేగమైన అనుబంధం లేదని, ఆ నివాసాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం ఏం కావాలంటే అది చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఆ నివాసాన్ని తామెన్నడూ చూడలేదని ఆయన చెప్పారు.