రఘునాథపాలెం పోలీస్ స్టేషన్
రఘునాథపాలెం: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పెట్టిన నూతన పోలీస్ స్టేషన్లలో రఘునాథపాలెం పోలీస్ స్టేషన్‌లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 11–11–2016న పోలీస్ స్టేషన్ పెట్టినప్పటికీ..నాలుగు నెలల పాటు ఖానాపురం హవేలిలోనే కేసులు నమోదయ్యాయి. 8–4–17 నుంచి ఇప్పటి వరకు 8నెలల కాలంలో రఘునాథపాలెం పోలీస్ స్టేషన్‌లో మొత్తం 320 కేసులు నమోదయ్యాయి. దీని పరిధిలో మండలంలోని 17గ్రామ పంచాయతీలు, రూరల్ మండలం దారేడు, కామంచికల్ పంచాయతీలు, మొత్తం 34 శివారు గ్రామాలు దీని పరిధిలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్విభజన తర్వాత 66 కొత్త పోలీస్ స్టేషన్లు ప్రారంభం కాగా..వీటన్నింటిలో రఘునాథపాలెంలోనే కేసులు ఎక్కువ. వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఎక్కువ. డిసెంబర్‌లోనే ఇలా పది కేసులు ఉన్నాయి. స్టేషన్ ఆవిర్భావం నుంచి గతేడాది డిసెంబర్ వరకు ఇక్కడ గోపి పనిచేశారు. డిసెంబర్‌లో ఈయన పదోన్నతిపై గుండాల సీఐగా వెళ్లారు. ప్రస్తుతం ఆర్.కృష్ణ విధులు నిర్వర్తిస్తున్నారు.
దర్యాప్తు ముమ్మరం..
కేసులు పెరిగినప్పటికీ..దర్యాప్తును మరింత జాగ్రత్తగా నిర్వహిస్తున్నాం. పరిధి ఎక్కువ కావడం వల్ల కేసులు పెరిగాయి. బాధితులు మధ్య వర్తుల ద్వారా కాకుండా నేరుగా..స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయొచ్చు.
– ఆర్.కృష్ణ, ఎస్సై, రఘునాథపాలెం
Comments
Please login to add a commentAdd a comment