బాలిక కుటుంబానికి హెడ్ కానిస్టేబుల్ బెదిరింపులు
బ్రహ్మసముద్రం : అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో దారుణం చోటుచేసుకుంది. ప్రజలను కాపాడాల్సిన ఖాకీలే వారిపై దౌర్జన్యం చేస్తున్నారు. విషయం బయటపెడితే చంపుతానంటూ ఇటీవలే ప్రసవించిన బాలిక కుటుంబంపై హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరయ్య బెదిరింపులకు పాల్పడుతున్నారు. అనంతరపురం జిల్లా వ్యాప్తంగా కస్తూర్భా స్కూళ్లలో వికృత చేష్టలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల పుట్లూరు కస్తుర్భా పాఠశాలలో బాలిక ప్రసవించిన విషయం విదితమే. తనకల్లులో ఆ బాలికతో ఆమె కుటుంబానికి వేధింపులు ఎదురవుతున్నాయి. బాలికలపై వేధింపులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.