health officer
-
నిబంధనలు పాటించాల్సిందే..
సాక్షి, విజయనగరం : డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పోరేట్ వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం గుర్తింపు ఉన్న నెట్వర్క్ ఆస్పత్రులు కూడా నిబంధనలకు అనుగుణంగా రోగులకు వైద్య సేవలు అందించాలి. రోగులకు మౌలిక సౌకర్యాలు కూడా కల్పించాలి. కాని కొన్ని ఆస్పత్రులు నిబంధనలు పాటించడం లేదు. దీంతో ఆరోగ్యశ్రీ అధికారులు నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కొరడా ఝళిపించారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ, భోజనం సక్రమంగా లేని ఐదు ఆస్పత్రులకు నోటీస్‌లు జారీ చేశారు. కల్పించాల్సిన సౌకర్యాలు.. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స లేదా శస్త్రచికిత్స చేసుకున్న రోగులకు వైద్య పరీక్షలు, ఈసీజీ, స్కానింగ్, ఎక్సరే, తదితర అన్ని సేవ లు ఉచితంగా అందించాలి. ఆరోగ్యశ్రీ రోగులు చికిత్స పొందే ఇన్‌పేషేంట్ వార్డు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండాలి. బెడ్స్, బెడ్‌షీట్స్ పరిశుభ్రంగా ఉండాలి. అన్నింటి కంటే ముఖ్యంగా మంచి భోజనం అందించాలి. ఆకుకూరలు, ప ప్పు, పండు, పెరుగు, గుడ్డు, అన్నం, సాంబారుతో కూడిన మంచి భోజనాన్ని రోగులకు పె ట్టాలి. ఒక వేళ సంబంధిత ఆస్పత్రిలో స్కా నింగ్ లేదా ఎక్సరే, బయాప్సీ వంటి పరీక్షలు బయట స్కానింగ్ సెంటర్లో చేయించినట్లైతే తక్షణమే వాటి బిల్లులు రోగికి చెల్లించాలి. 29 ఆస్పత్రులు.. జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం గుర్తింపు ఉన్న ఆస్పత్రులు 29 ఉన్నాయి. వీటిల్లో 15 ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులున్నాయి. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదని ఆరోగ్యశ్రీ అధికారులు గుర్తించారు. అదేవిధంగా భోజనం కూడా చాలా ఆస్పత్రుల్లో నాణ్యంగా లేదని ఆరోగ్యశ్రీ అధికారులు గుర్తించారు. దీంతో ఐదు ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీస్‌లు జారీ చేశారు. పారిశుద్ధ్యం, భోజనం సక్రమంగా లేని మూడు ఆస్పత్రులకు, భోజనం సక్రమంగా లేదని మరో రెండు ఆస్పత్రులకు నోటీస్‌లు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు పుష్పగిరి కంటి ఆస్పత్రి, కొలపర్తి ఆస్పత్రి (ఎస్.కోట), మిమ్స్ ఆస్పత్రి ( నెల్లిమర్ల), తిరుమల నర్సింగ్ హోమ్, ఆంధ్ర ఆస్పత్రి, వెంకటపద్మ ఆస్పత్రి, వెంకటరామ ఆస్పత్రి, శ్రీ సాయి సూపర్ స్పెషాలటీ, శ్రీ సాయి పీవీఆర్ ఆస్పత్రి, మువ్వ గోపాల ఆస్పత్రి, అభినవ్ నర్సింగ్ హోమ్ (ఎస్.కోట), వరుణ్ డెంటల్ ఆస్పత్రి, ఆపిల్ డెంటల్ ఆస్పత్రి, విజయ డెంటల్ ఆస్పత్రి, బీఎస్ఆర్ ఈఎన్టీ డెంటల్ ఆస్పత్రి, స్వామి కంటి ఆస్పత్రి ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకం ఉన్న ప్రభుత్వాస్పత్రులు కేంద్రాస్పత్రి, ఎస్.కోట ఏరియా ఆస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి, ఘోషా ఆస్పత్రి, నెల్లిమర్ల, బొబ్బిలి, భోగాపురం, చీపురుపల్లి, సాలురు, కురుపాం, భద్రగిరి సీహెచ్‌సీలతో పాటు చినమేరంగి, బాడండి ఆస్పత్రులున్నాయి. చర్యలు తప్పవు.. ఆరోగ్యశ్రీ పథకం ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. రోగులకు నాణ్యమైన భోజనం పెట్టాలి. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలి. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలు పాటించని ఐదు ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు నోటీస్‌లు జారీ చేశాం. – డాక్టర్ పి. ప్రియాంక, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్. -
మరీ ఇంత అధ్వానమా..?
తిరుపతి అర్బన్: మీ ఇళ్లలోనూ పారిశుధ్యం ఇలాగే ఉంటుందా.. అంటూ తిరుపతిలోని రుయా వైద్యాధికారులపై జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న కన్నెర్ర చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన రుయాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా అత్యవసర వైద్య విభాగంలో తనిఖీలు చేపట్టిన కలెక్టర్, అక్కడ బెడ్‌కవర్లు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్, సీఎంఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విభాగంలో మెడికల్ వేస్ట్ నిర్వహణ కూడా సరిగా లేకపోవడంతో అధికారులు, సిబ్బందిపై మండిపడ్డారు. అదేవిధంగా రోగులతోపాటు వారికి సహాయంగా వచ్చేవారు కూర్చునేందుకు తక్షణం సౌకర్యాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్బన్ గ్రీన్ కార్పొరేషన్‌తో పచ్చదనం రుయాకు రోజూ వచ్చే రోగులకు మరింత ఆహ్లాద, ఆరోగ్యకర వాతావరణం ఏర్పడేలా అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పరిసరాల్లో పచ్చదనం కల్పించాలన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ(హెచ్‌డీసీ) సమావేశాలను ప్రతినెలా క్రమం తప్పకుండా నిర్వహించా లన్నారు. గత సమావేశంలో నిర్ణయించి పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. భద్రతకు ప్రాధాన్యం.. రుయా, మెటర్నిటీ, చిన్నపిల్లల ఆస్పత్రుల వద్ద భద్రతకు అత్యధిక ప్రా«ధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అందులో భాగంగా 40 అధునాతన సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలి పారు. రుయాలో సహాయకుల విశ్రాంతి భవనాన్ని ప్రసూతి ఆస్పత్రి రోగుల కోసం విని యోగించాలన్నారు. అన్ని ప్రభుత్వాస్పత్రులకు కలిపి సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం రుయా పరిపాలనా భవనంలో హెచ్‌డీసీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు, ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, హెచ్‌డీసీ సభ్యులు డాక్టర్ సుధారాణి, చినబాబు, ఆర్ఎంఓ డాక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
తనిఖీలు తప్పనిసరి
ముత్తుకూరు: కృష్ణపట్నంపోర్టులో సరుకుల ఎగుమతి–దిగుమతులకు లంగరు వేసే ప్రతి విదేశీ నౌకలోని సిబ్బంది ఆరోగ్య స్థితిగతులు తనిఖీ చేయాల్సిందే. నౌకల్లోని సిబ్బంది ద్వారా విదేశాల నుంచి వ్యాధులు మన దేశంలోకి ప్రవేశించకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండ పీహెచ్సీ వైద్యాధికారిగా పనిచేసే డాక్టర్ అమరేంద్రనాథరెడ్డి ‘హెల్త్ ఆఫీసర్’ హోదాలో గత డిసెంబరు నుంచి ఈ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పోర్టుకు వచ్చే ప్రతి విదేశీ నౌక సిబ్బంది హెల్త్ కార్డులను తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా సిబ్బందిలో ‘ఎల్లో ఫీవర్’ లక్షణాలు గుర్తించడమే ఆయన విధుల్లో ముఖ్యమైన అంశం. ప్రతి నౌకలో 19 నుంచి 21 మంది వరకు సిబ్బంది ఉంటారు. ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డ్ ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థగుర్తించిన వైద్య సంస్థలు అన్ని రకాలుగా పరీక్షించి, విదేశాలకు బయలుదేరే నౌక సిబ్బందికి హెల్త్ కార్డులిస్తుంది. ప్రతి ఒక్కరి హెల్త్ కార్డులో ఎల్లో ఫీవర్ లక్షణాలు లేవనే అంశాన్ని తనిఖీ చేయడమే హెల్త్ ఆఫీసర్ బాధ్యత. సిబ్బంది హెల్త్ కార్డులన్నీ క్షుణంగా తనిఖీ చేసిన తర్వాతే ఆయన క్లీన్ చిట్ ఇవ్వాలి. పోర్టులో విదేశీ నౌక లంగరు వేసినప్పుడల్లా హెల్త్ ఆఫీసర్ రంగంలోకి దిగాలి. ప్రతి నెలా 35 నౌకల తనిఖీ కృష్ణపట్నంపోర్టులో లంగరు వేసే ప్రతి విదేశీ నౌకా సిబ్బంది హెల్త్ కార్డులు తనిఖీ చేస్తాం. ప్రతి నెలా 30 నుంచి 35 విదేశీ నౌకలు తనిఖీ చేస్తుంటాం. ముఖ్యంగా ఎల్లో ఫీవర్ లక్షణాలపై శ్రద్ధ వహిస్తాం. ఇప్పటి వరకు నౌకల్లో ఈ లక్షణాలున్న వ్యక్తులు తారసపడలేదు. స్వదేశీ నౌకల్లో సిబ్బందిని తనిఖీ చేయాల్సిన అవసరం లేదు. –డాక్టర్ అమరేంద్రనాథరెడ్డి, హెల్త్ ఆఫీసర్ -
యోగాతో వత్తిడిని జయిద్దాం
చెన్నూరు : జీవన శైలిలో మార్పు తెచ్చుకొని క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మానసిక వత్తిడిని జయించి ఆరోగ్యంగా జీవిద్దామని మండల వైద్యాధికారి శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు . ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ ఆధునిక యుగంలో శరీరానికి శ్రమ లేకుండా పోవడం, వ్యాయామం చేయడానికి సమయం కేటాయించక పోవడంతో వ్యాధులు పెరిగి పోతున్నాయన్నారు. తగినంత నిద్ర, శారీరక శ్రమ లేకపోవడం పోషకాహారలోపం, దుర అలవాట్లు వల్ల అనారోగ్యపాలౌతున్నారని అన్నారు. అలసట, వత్తిడి నుంచి దూరం అయ్యేందుకు సంగీతం వినడం, ఆహ్లాదకర వాతావరణంలో గడపడం, ద్యానం, యోగ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలుగుతాయన్నారు. వయస్సుతో పని లేకుండా రక్తపోటు, మధుమేహ వ్యాధి ఎక్కువ మందిలో ఉందని, దీనిని నివారించాలంటే, వ్యాయామం, ఆహారంలో అలవాట్లలో సమూల మార్పు రావాలన్నారు. ర్యాలీలో సీహెచ్ఓ భారతీ, హెచ్ఈ కుమారి, సూపర్వైజర్లు రవిస్వామి, నిర్మళ, వైద్య సిబ్బంది, మాదవి, కల్యాణి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. -
వేధించారంటూ హెచ్చార్సీకి ఫిర్యాదు
కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారిగా పనిచేసిన డాక్టర్ శైలజ జిల్లా ఉన్నతాధికారి కలెక్టర్ అరుణ్‌కుమార్ సహా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్, ఏసీ, డీసీలకు షాక్ ఇచ్చారు. ఎంహెచ్‌వోగా పనిచేసిన సమయంలో వీరంతా తనను వేధింపులకు గురిచేశారంటూ మానవహక్కుల కమిష¯ŒSను ఆశ్రయించారన్న సమాచారం అధికారవర్గాల్లో కలకలం రేపింది. ఆమె ఫిర్యాదుపై శుక్రవారం గుంటూరులో జరిగే విచారణకు కలెక్టర్ మినహా మిగిలిన అధికారులంతా హాజరయ్యేందుకు పయనమై వెళ్ళిన అంశం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్ళితే...కాకినాడ నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారిగా డాక్టర్ శైలజ 2015 జూలై 17 నుంచి ఏడాది కాలంపాటు ఇక్కడ పని చేశారు. డిప్యూటేష¯ŒS కాలపరిమితి పూర్తి కావడంతో ఆమెను సొంత శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అయితే ఆమె బదిలీ ఉత్తర్వులను నిలుపుదల చేసి మరో ఏడాదిపాటు కొనసాగేందుకు వీలుగా ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు ప్రారంభిస్తున్న సమయంలో ఆమెను రిలీవ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపద్యంలో ఆమె తాను ఎంహెచ్‌వోగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రిలీవ్ అయ్యేంతవరకు ఏడాది కాలంలో తనను ఎన్నో వేధింపులకు గురిచేశారంటూ ఆమె మానవహక్కుల కమిష¯ŒSతోపాటు జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిష¯ŒSకు, ఇతర ఉన్నత స్థాయి అధికార వర్గాలకు ఫిర్యాదు చేశారు. ఆరోగ్యాధికారిగా చేర్చుకునే సమయంలో అప్పటి కమిషనర్, రిలీవ్ చేసే సమయంలో ప్రస్తుత కమిషనర్ తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆమె తన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. వీరంతా కలెక్టర్ అరుణ్‌కుమార్‌ను కూడా తప్పుదారి పట్టించి తనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునేలా చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదు నేపధ్యంలో దీనిపై హెచ్ఆర్సీ విచారణకు ఆదేశించింది. ఫిర్యాదులో అందరూ బాధ్యులే... ఆరోగ్యాధికారి డాక్టర్ శైలజ హెచ్ఆర్సీకి ఇచ్చిన ఫిర్యాదులో కమిషనర్ ఆలీమ్‌భాషా, అదనపు కమిషనర్ గోవిందస్వా మి, డిప్యూటీ కమిషనర్ సన్యాసిరావు, మేనేజర్ సత్యనారాయణ, సహా పలువురు అధికారులను బాధ్యులుగా పేర్కొన్నారు. కలెక్టర్ పేరును కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ పురపరిపాలనాశాఖ డైరెక్టర్‌కు విచారణకు ఆదేశించింది. దీంతో మెప్మా అడిషనల్ డైరెక్టర్‌ను విచారణాధికారిగా డీఎంఏ నియమించింది. నేడు గుంటూరులో విచరణ.. హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు శుక్రవారం గుంటూరులో విచారణ చేపట్టనున్నారు. ఇందుకోసం కాకినాడ కమిషనర్‌తోపాటు ఏసీ, డీసీ, మేనేజర్, సూపరింటెండెంట్‌తోపాటు ఇతర అధికారులంతా గుంటూరు బయలుదేరి వెళ్తున్నారు. వీరితోపాటు ఫిర్యాదు చేసిన డాక్టర్ శైలజ కూడా విచారణకు హాజరుకానున్నారు. అయితే కలెక్టర్‌కు మాత్రం విచారణ నుంచి మిçనహాయింపునిచ్చారంటున్నారు. -
త్వరలో సంచార వైద్య బృందాల ఏర్పాటు
ఉంగుటూరు : జిల్లాలో పిల్లలు, విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు సంచార వైద్య బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా వైద్య, ఆరోగ్య వైద్యాధికారిణి డాక్టర్ కె.కోటేశ్వరి తెలిపారు. శనివారం చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక కేంద్రంలో రోగుల రాకపోకలు, రక్త పరీక్షలు, గర్భిణులకు పరీక్షల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 48 మండలాలు ఉండగా ప్రస్తుతం 32 మండలాలకే సంచార వాహనాలు సమకూరాయన్నారు. ప్రతి బృందంలో ఇద్దరు వైద్యులు ఉంటారన్నారు. ఈ బృందం వారు 6 నెలల నుంచి 18 సంవత్సరాలలోపు పిల్లలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరిపి వారిలో లోపాలను గుర్తిస్తారన్నారు. వైద్య శాఖ, విద్యాశాఖ సమన్వయంతో ఆ బృందాలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా నీటి నిల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని డీఎంహెచ్‌వో ప్రజలకు సూచించారు. దోమల వల్ల డెంగీ వచ్చే పరిస్థితి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలన్నారు. మాతృ,శిశు మరణాలు తగ్గించేందుకు ప్రధానమంత్రి మాతృ అభియాన్ ద్వారా ప్రతి నెల 9వ తేదీ నుంచి 4 నెలల నుంచి 9 నెలల గర్భిణులకు వైద్య పరీక్షలను వైద్యులే చేస్తారన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసావాలపై గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం తీసుకువస్తున్నామని ఆమె వివరించారు. -
విజయ పాలల్లో పందికొక్కు
ఎంహెచ్వో తనిఖీలో బయటపడిన డెయిరీ నిర్లక్ష్యం నెల్లూరు సిటీ : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని విజయ డెయిరీ పాలల్లో పందికొక్కు కనిపించింది. నగరపాలక సంస్థ అధికారుల తనిఖీల్లో ఇది బయటపడింది. స్థానిక వెంకటేశ్వరపురంలో విజయ డెయిరీ ఉంది. వారం కిందట వెంకటేశ్వరపురానికి చెందిన వైష్ణవి అనే చిన్నారి డెంగీ జ్వరంతో మృతిచెందింది. ఈక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ (ఎంహెచ్వో) వెంకటరమణ బుధవారం దోమలు వ్యాప్తి చెందే ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలో డెయిరీ సమీపంలో అపరిశుభ్రత కనిపించింది. డెయిరీ లోపలికి వెళ్లి పరిశీలించారు. పాలు నిల్వ ఉంచిన ఒక ట్రేలో పందికొక్కు కనిపించింది. ఈ విషయాన్ని కార్పొరేషన్ కమిషనర్ పి.వి.వి.ఎస్.మూర్తికి తెలిపారు. కమిషనర్ డెయిరీకి వచ్చి కోల్డ్‌స్టోరేజ్‌ను, పాలు ఫిల్టర్ చేసే పరికరాలను పరిశీలించారు. డెయిరీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డెయిరీని నిర్వహించే తీరు ఇదేనా? అని ఎండీ కృష్ణమోహన్‌ను ప్రశ్నించారు. గంటల వ్యవధిలోనే అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అపరిశుభ్ర వాతావరణం లేకుండా చూస్తానని, 10 రోజులు సమయం కావాలని ఎండీ కోరారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే ఏ కంపెనీనైనా సీజ్ చేసేందుకు వెనుకాడబోమని కమిషనర్ మూర్తి హెచ్చరించారు. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత లోపిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. -
మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి
విజయనగరం కంటోన్మెంట్: కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల మధ్యన జనావాసాల్లో పశువులను వధించేందుకు అనుమతి మంజూరు చేసిన మున్సిపల్ కమిషనర్ సోమనారాయణ, హెల్త్‌ఆఫీసర్ రాజులపై చర్యలు తీసుకోవాలని ఏపీ గోసంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ఎన్సీఎస్ రోడ్డులోని పంచముఖాంజనేయస్వామి ఆలయంలో వారు విలేకరలతో మాట్లాడారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 500 మంది సభ్యులున్న జమాతేఖురేషి అసోసియేషన్ వారికి ఆవులు, గేదెలతో పాటు పొలం దున్నే ఎద్దులను వ ధించేందుకు అనుమతులు ఇవ్వడం దారుణమన్నారు. మున్సిపాలిటీ తీర్మానం కూడా లేదన్నారు. కమిషనర్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి. జిల్లా మంత్రికి, కలెక్టర్ ఎంఎం నాయక్‌కు ఫిర్యాదు చేశామన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మద్దిల సోంబాబు, ఇతర సభ్యులు గుగ్గిలం రామారావు, శ్రీమాన్ నారాయణ స్వామి, ఎం. అప్పారావు, జి. పైడితల్లి, ఐవీఆర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.