జీవన శైలిలో మార్పు తెచ్చుకొని ఆరోగ్యంగా జీవిద్దామని మండల వైద్యాధికారి శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు
చెన్నూరు : జీవన శైలిలో మార్పు తెచ్చుకొని క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మానసిక వత్తిడిని జయించి ఆరోగ్యంగా జీవిద్దామని మండల వైద్యాధికారి శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు . ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ ఆధునిక యుగంలో శరీరానికి శ్రమ లేకుండా పోవడం, వ్యాయామం చేయడానికి సమయం కేటాయించక పోవడంతో వ్యాధులు పెరిగి పోతున్నాయన్నారు. తగినంత నిద్ర, శారీరక శ్రమ లేకపోవడం పోషకాహారలోపం, దుర అలవాట్లు వల్ల అనారోగ్యపాలౌతున్నారని అన్నారు.
అలసట, వత్తిడి నుంచి దూరం అయ్యేందుకు సంగీతం వినడం, ఆహ్లాదకర వాతావరణంలో గడపడం, ద్యానం, యోగ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలుగుతాయన్నారు. వయస్సుతో పని లేకుండా రక్తపోటు, మధుమేహ వ్యాధి ఎక్కువ మందిలో ఉందని, దీనిని నివారించాలంటే, వ్యాయామం, ఆహారంలో అలవాట్లలో సమూల మార్పు రావాలన్నారు. ర్యాలీలో సీహెచ్‌ఓ భారతీ, హెచ్‌ఈ కుమారి, సూపర్‌వైజర్లు రవిస్వామి, నిర్మళ, వైద్య సిబ్బంది, మాదవి, కల్యాణి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.