Heavy water project
-
నిండుకుండలా మారిన ప్రాజెక్టులు
-
రూ.4 కోట్లు వెనక్కు పోయే అవకాశం..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘మింగ మెతుకులేదు గానీ మీసాలకు సంపెంగ నూనె పెడదాం’ అన్నాడట వెనకటికి ఒకరు.. జిల్లాలోని చెరువుల దయనీయ పరిస్థితిపై సర్కారు నిర్లక్ష్య వైఖరిని గుర్తుకు తెస్తోందీ సామెత. ఏళ్లుగా నీరు చేరక అడుగంటిపోతున్న చెరువులకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి అవి నీటితో కళకళలాడేలా చూడాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు.. కానీ చెరువులు నిండితే ఆ నీటిని పొలాలకు పారించేందుకు ఉన్న కాల్వలకు మరమ్మతులు చేపట్టాలంటూ రూ.కోట్లు విడుదల చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు చెరువులకు సంబంధించిన కాల్వల మరమ్మతుల కోసం 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.4 కోట్లు మంజూరు చేసింది. క్రమంగా అడుగంటిపోతున్న ఆయా చెరువులకు ప్రస్తుతం ఈ పనులు అక్కర్లేదంటూ నీటి పారుదల శాఖ అధికారులు చేతులు దులుపుకోవడంతో సర్కారు విడుదల చేసిన నిధులు ఏడాది నుంచి ఖజానాలోనే మూల్గుతున్నాయి. ఏమిటీ ఉల్టా పల్టా? జిల్లాలో భారీ నీటి ప్రాజెక్టులేవీ లేకపోవడంతో 90 శాతం రైతులు భూగర్భ జలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. చెరువులను పరిరక్షిస్తే.. ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు మెరుగుపడతాయి. ఈ నేపథ్యంలో చెరువుల్లోకి నీరు చేరేలా చర్యలు చేపట్టాలి. కానీ నీటిపారుదల శాఖ అధికారుల ప్రణాళిక లోపంతో చెరువుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ప్రస్తుతం జిల్లాలో పెద్ద చెరువైన ఇబ్రహీంపట్నం, రావిర్యాల, తిమ్మాపూర్ చెరువులు పూర్తిగా నిండితే దాదాపు మూడేళ్ల వరకు 6 వేల ఎకరాల్లో పుష్కలంగా పంటలు పండుతాయి. కానీ ఈ చెరువుల్లోకి నీరు చేరే ప్రధాన కాల్వ ఫిరంగి నాలా ఆక్రమణలతో కుంచించుకుపోయింది. చిన్నపాటి కాల్వలు ఇసుక తవ్వకాలకు గురికావడంతో అవన్నీ నీటి ప్రవాహానికి ప్రతిబంధకంగా మారాయి. ఈ తరుణంలో నీరు చేరే మార్గాలను పునరుద్ధరించాల్సి ఉండగా.. అధికారులు మాత్రం పొలాలకు నీరు చేర్చే మార్గాల మరమ్మతులకు ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. 2013-14లో ప్రభుత్వం రూ.4 కోట్లు విడుదల చేసింది. అయితే స్థానిక రైతుల ఒత్తిడి, ప్రజాప్రతినిధుల జోక్యంతో ఈ పనులు చేపట్టేందుకు అధికారులు సాహసించలేదు. ఫలితంగా నిధులు ఖజానాలో ఉండిపోయాయి. ఆ నిధులు వెనక్కేనా? నీటి పారుదల కాల్వల మరమ్మతులకు విడుదలైన రూ.4 కోట్లను వెనక్కు పంపాలని జిల్లా నీటిపారుదల శాఖ ఇంజినీర్లు యోచిస్తున్నారు. వాస్తవానికి చెరువుల్లోకి నీరు చేరే మార్గాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. కానీ అందుకు నిధులు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న రూ.4 కోట్లను ఈ పనులకు వినియోగిస్తే మంచి ఫలితాలుండేవి. ప్రస్తుతం సీజన్ సమీపించినా వర్షాలు కురవకపోవడం.. మున్ముందు భారీ వర్షసూచన ఉండడంతో చెరువులకు నీరు చేరే విధంగా చర్యలు చేపట్టాలి. కానీ ఆ దిశగా దృష్టి సారించని ఇంజినీరింగ్ అధికారులు.. అక్కరకు రాని రూ.4 కోట్లను వెనక్కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఒకట్రెండు రోజుల్లో లిఖితపూర్వకంగా వివరించనున్నట్లు ఆ శాఖలోని ఓ అధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
అయ్యవారు వస్తేనే.. నీళ్లిస్తారట
ఇరగవరం, న్యూస్‌లైన్ : ‘అయ్యవారు రాలేదని అమావాస్య ఆగదు’ అనేది సామెత. ఇరగవరంలో రూ.9కోట్ల వ్యయంతో నిర్మించిన భారీ మంచినీటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించే విషయంలో ఆ సామెత కాస్తా రివర్స్ అరుు్యంది. దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రితో ప్రారంభింపచేయూలని కాంగ్రెస్ నాయకులు తలపోశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తరుు్యంది. రెండు నెలల క్రితమే ట్రరుుల్ రన్ సైతం విజయవంతంగా నిర్వహించారు. సూక్ష్మ వడపోత పద్ధతిలో శుద్ధి చేసిన నీటిని తాగడమే తరువారుు అని 10 గ్రామాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో సీఎం వచ్చి దీనిని ప్రారంభిస్తే గానీ నీళ్లిచ్చేది లేదంటూ నాయకులు భీష్మించారు. దీంతో ప్రాజెక్టు పూర్తరుునా ప్రజలకు మాత్రం మంచినీరు సరఫరా కావడం లేదు. బృహత్తర ప్రాజెక్ట్ ఇది జాతీయ గ్రామీణాభివృద్ది తాగునీటి (నేషనల్ రూరల్ డెవలప్మెంట్ వాటర్) ప్రాజెక్ట్ కింద రూ.9 కోట్ల నిధులతో దీనిని నిర్మించారు. ఇరగవరం, కావలిపురం గ్రామాల్లో గల చెరువుల్లోని నీటిని సూక్ష్మ వడపోత పద్ధతిలో శుద్ధిచేసి ఇరగవ రం, వేండ్రవారిపాలెం, గుబ్బలవారిపాలెం, గొల్లగుంటపాలెం, గొల్లమాలపల్లి, అనుమాజీపాలెం, చినరాముని చెరువు, పిల్లివారిపాలెం, పద్దిరెడ్డిపాలెం, యర్రారుుచెరువు గ్రామాల ప్రజలకు పైప్లైన్ల ద్వారా అందించేందుకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. తొలుత ఇరగవరం చెరువు పరిధిలో పనులు పూర్తయ్యాయి. 2011 ఫిబ్రవరి 6న కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి ఎంఎం పల్లంరాజు చేతులమీదుగా శంకుస్థాపన చేశారు. శుద్ధిచేసిన నీటిని పైప్లైన్ల ద్వారా ఆయూ గ్రామాలకు అందించేందుకు వీలుగా 90 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ నిర్మించారు. ఫిల్టరేషన్ పారుుంట్లతోపాటు పైప్లైన్ల నిర్మాణాలు కూడా పూర్తి చేశారు. గతంలో చెరువును నీటితో నింపి ట్రరుుల్ రన్ కూడా చేశారు. కలుషితమైన నీటిని తాగుతూ రోగాల బారినపడుతున్న 10 గ్రామాల ప్రజలు ఇక ఆ బాధలు తప్పుతాయని, స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని ఆశించారు. ఉన్నతమైన ఆశయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ను నాయకుల మాట కాదనలేక ప్రారంభించకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.