యువ హీరో 'పబ్' బిజినెస్..
హైదరాబాద్ : సినిమాల కన్నా ఎక్కువగా వివాదాలతో వార్తల్లో ఉండే యువ హీరో నవదీప్ సొంతగా ఓ పబ్‌ను తెరిచాడు. 'బీట్స్ పర్ మినిట్' పేరుతో హైదరాబాద్ గచ్చిబౌలి సమీపంలో సోమవారం పబ్‌ను ప్రారంభించాడు. టేస్టీ ఫుడ్, రకరకాల డ్రింక్స్, డీజే హోరు, డాన్స్ ఫ్లోరుతో పబ్.. జల్సా రాయుళ్లకి తెగ నచ్చేసేలా ఉందట.
నవదీప్‌తో పాటు మరికొంతమంది బడా బాబులు ఈ పబ్ పై పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. మొత్తానికి నవదీప్ లాభసాటి వ్యాపారం ఎంచుకున్నాడన్నది పలువురి కామెంట్. ఇదివరకు తన ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ పెట్టాడంటూ వచ్చిన వార్తను తీవ్రంగా ఖండించిన నవదీప్.. అది రేవ్ పార్టీ కాదు, గృహ ప్రవేశం అంటూ మీడియాకి పెద్ద క్లాస్ ఇచ్చిన విషయం తెలిసిందే.