Hero Nithiin
-
తెలుగు సినిమాల్లోనే ఎలాంటి రోల్ ఎవరు చేయలేదు..
-
ఈ సినిమాకి అదే హార్ట్ లాంటిది
-
ఇప్పుడు బాలీవుడ్ కి అంత లేదు... టాలీవుడ్ టాప్ లో ఉంది
-
ఆ హీరోయిన్స్ తో బాగా కంఫర్ట్ గా ఉంటుంది: హీరో నితిన్
-
నా వరకూ అయితే ధోని ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్
-
వక్కంతం వంశీ ఫేమస్ రైటర్...కానీ డైరెక్షన్ విషయానికి వస్తే..!
-
హీరో నితిన్ తో రక్షా బంధన్ స్పెషల్ ఇంటర్వ్యూ
-
కరోనా కట్టడికి నితిన్ విరాళం
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తనవంతు భాగస్వామ్యం అందించాలని హీరో నితిన్ నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి పది లక్షల చొప్పున మొత్తం 20లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు నితిన్. మార్చి 31వ తేదీ వరకు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలనీ, అందరూ తమ తమ ఇళ్లల్లోనే ఉండి కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగస్వామ్యులు కావాలని నితిన్ విజ్ఞప్తి చేశారు. హిందీకి ‘భీష్మ’ సౌత్ కథలెప్పుడూ బాలీవుడ్‌కి కలిసొస్తూనే ఉంటాయి. పోకిరి, మర్యాద రామన్న, అర్జున్ రెడ్డి వంటి తెలుగు చిత్రాలు హిందీలో రీమేక్ అయి, ఘనవిజయం సాధించాయి. ప్రస్తుతం‘జెర్సీ, ఆర్ఎక్స్ 100’ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. తాజాగా మరో సౌత్ సినిమా ‘భీష్మ’ కూడా ఈ లిస్ట్‌లో చేరనుందని సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం నితిన్ కెరీర్లో భారీ వసూళ్లను సాధించి, పెద్ద హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోందట. ఈ రీమేక్‌లో హీరోగా రణ్‌బీర్ కపూర్‌ను యాక్ట్ చేయించాలని చూస్తున్నారట. రణ్‌బీర్ కపూర్ -
ఎన్టీఆర్ డ్యాన్స్ కేక
ఒక హీరో షూటింగ్ లొకేషన్‌కి మరో హీరో వెళ్లడం కామన్‌గా జరుగుతుంటుంది. పక్క పక్క లొకేషన్లో షూటింగ్ చేస్తున్నప్పుడో, పని గట్టుకునో వెళుతుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రం షూటింగ్ లొకేషన్‌కి నితిన్ పని గట్టుకుని వెళ్లారని తెలుస్తోంది. ‘‘ఈ రోజు (శుక్రవారం) ‘జనతా గ్యారేజ్’ సెట్స్‌కు వెళ్లా. చాలా రోజుల తర్వాత తారక్‌ను కలిశా. ఆయన డ్యాన్స్ కేక’’ అని హీరో నితిన్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. దాంతోపాటు తారక్ తో కలిసి దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణా ఏడెకరాలలో జరుగుతోంది. ఎన్టీఆర్, సమంతపై చిత్రీకరిస్తున్న పాట కోసం అక్కడ మూడు భారీ సెట్స్ వేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శేఖర్ మాస్టర్ నేతృత్వంలో తెరకెక్కిస్తున్నారు. గురువారం మొదలైన ఈ పాట చిత్రీకరణ నాలుగు రోజుల్లో పూర్తవుతుంది. ఎన్టీఆర్, సమంత, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరుకి టాకీ పార్ట్ పూర్తవుతుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయాలనుకుంటున్నారు. -
నా కెరీర్‌కు హార్ట్ లాంటి సినిమా!
‘‘నా కెరీర్‌ను 2002లో మొదలుపెట్టాను. ఈ 14 సంవత్సరాల్లో 22 సినిమాలు చేశాను. 2011 వరకూ ఫ్లాప్స్ వచ్చాయి. నా పనైపోయిందన్నారు. కానీ, ఏనాడూ కుంగిపోలేదు. నా పంథా మార్చుకున్నాను. ‘ఇష్క్’ నుంచి ప్రేమకథలు ఎంచుకోవడం మొదలుపెట్టా. ఈ నాలుగేళ్లలో చాలా నేర్చుకున్నాను. ఈ టైమ్‌లో నాకు దక్కిన మంచి అవకాశం ‘అ...ఆ’ ’’ అని హీరో నితిన్ అన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ ముఖ్యతారలుగా ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నితిన్ చెప్పిన విశేషాలు... ♦ ‘హార్ట్ ఎటాక్’ షూటింగ్ అప్పుడు, త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి, మనం కలిసి సినిమా చేద్దామనగానే చాలా హ్యాపీగా అనిపించింది. నా కెరీర్ స్టార్టింగ్‌లోనే వీవీ వినాయక్‌గారు, రాజమౌళిగార్లతో పనిచే యడం నా లక్. త్రివిక్రమ్‌గారితో ఎప్పట్నుంచో వర్క్ చేయాలను కుంటున్నా. ఆయనే స్వయంగా సినిమా చేద్దామనగానే వెంటనే ఓకే అన్నాను. ‘అత్తారింటికి దారేది’ రిలీజయ్యాక మా సినిమాని సెట్స్‌కి తీసుకెళదామనుకున్నాం. కానీ, అది జరగలేదు. అప్పుడు చాలా బాధపడ్డాను. ఆ తర్వాత వేరే సినిమా చేశాను. గతేడాది ఒప్పుకున్న ఒక సినిమా క్యాన్సిల్ అయింది. దాంతో ఆరు నెలలు ఖాళీగా ఉండాలా? అని అనుకుంటున్నప్పుడు మళ్లీ త్రివిక్రమ్‌గారి ఫోన్‌కాల్‌తో ‘అ.. ఆ’కు పునాదులు పడ్డాయి. ♦ నేనిప్పటివరకూ చేసిన ప్రేమకథలకు భిన్నంగా ఉంటుంది. అలాగని ఇదేదో కొత్త కథ అని చెప్పను. ఒక్క ప్రేమకథే అని కాకుండా, కుటుంబ అనుబంధాలతో త్రివిక్రమ్‌గారి శైలిలో సాగే అందమైన కథ. ఈ సినిమాలో త్రివిక్రమ్‌గారు నా పాత్రకు కాస్త బరువు, బాధ్యతలు అప్పగించారు. ఇందులో నేనో చెఫ్. సంతోషం, బాధ, రొమాన్స్.. ఇలా అన్ని భావోద్వేగాలు బ్యాలెన్స్ చేసుకుంటూ నన్ను నేను కొత్తగా తీర్చిదిద్దుకుంటూ చేసిన సినిమా. ఇది నా కెరీర్‌కు హార్ట్ లాంటి మూవీ. ♦ రాజమౌళిగారి తర్వాత నన్ను బాగా అర్థం చేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ గారు. నా పాజిటివ్స్, నెగటివ్స్ ఇలా అన్నిటినీ డిస్కస్ చేసి, నన్ను మరింత కొత్తగా చూపించారు. వ్యక్తిగతంగా నాతో ఆయన అనుబంధం బలపడింది. త్రివిక్రమ్‌గారికి తెలీని విషయం లేదు. ఆయనో జ్ఞాని. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నాకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఇక నుంచి నేను ఫస్ట్ ఫోన్ చేసేది ఆయనకే. ♦ నా ఫేవరేట్ హీరో పవన్‌కల్యాణ్ ఈ సినిమా సెట్స్‌కు రావడం స్వీట్ షాక్. సడన్‌గా ఆయన సెట్లో ప్రత్యక్షమయ్యేసరికి టెన్షన్ పడ్డాను. ఆయన ముందు నటించాను కూడా. బాగా చేశాననే అనుకుంటున్నా. ♦ ‘అఖిల్’ రిజల్ట్‌ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఎన్నో అంచనాలతో, ఆశలతో తీసిన సినిమాకి నెగటివ్ టాక్ వచ్చేసరికి చాలా ఫీలయ్యా. నాలుగైదు రోజుల పాటు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. హిట్, ఫ్లాప్ అనేవి సర్వసాధారణం. కానీ, నా ఫ్రెండ్ అఖిల్ లాంచింగ్ సినిమా అలా కావడం నన్ను బాధించింది. ♦ ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సీక్వెల్ ఫస్టాఫ్ స్క్రిప్ట్ పూర్తయింది. సెకండాఫ్ బాగా వస్తేనే చేస్తాను. ఎందుకంటే ప్రీక్వెల్‌ను చెడగొట్టకూడదు కదా! ఫ్రెండ్ మాత్రమే! సమంత ఓ హీరోతో లవ్‌లో ఉన్నారని ప్రచారమవుతోంది కదా... ఆమె మీ ఫ్రెండ్ కాబట్టి.. ఆ హీరో ఎవరో మీకు తెలుసా? అనే ప్రశ్న నితిన్ ముందుంచితే - ‘‘సమంత నాకు ఫ్రెండే. కానీ, తన పర్సనల్ విషయాలు చెప్పుకునేంత కాదు’’ అన్నారు. -
అ..ఆ.. అందంగా ఉండే కథ
- పవన్‌కల్యాణ్ ‘‘ హీరో నితిన్ నాకు తమ్ముడి లాంటివాడు. ‘ఇష్క్’ సినిమా టైమ్‌లో నితిన్ నా దగ్గరకొచ్చి, ఆ చిత్ర ఆడియో ఫంక్షన్‌కి రమ్మన్నాడు. అప్పుడు నాలాగే తనకూ హిట్స్ లేక బాధపడుతున్నాడని తెలిసింది. తమ్ముడికి ఇబ్బంది ఉంటే అండగా ఉంటాం కదా. అందుకే ఆ ఆడియో ఫంక్షన్‌కి వెళ్లా. ‘ఇష్క్’ విజయం వాళ్లందరి కష్టం. అలాగే ఈ సినిమా మరింత గొప్ప విజయం సాధించాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ ముఖ్యతారలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో కె.రాధాకృష్ణ నిర్మించిన చిత్రం ‘అ..ఆ’. ఈ చిత్రం పాటల వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ పవన్‌కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఆయన సినిమా పాటల సీడీని ఆవిష్కరించారు. పవన్ కల్యాణ్ మాట్లాడే ముందు తనదైన శైలి మాటల చాతుర్యంతో ఆయన్ని ఆహ్వానిస్తూ, త్రివిక్రమ్ మైకు అందించారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ- ‘‘మిక్కీ పాటలకు నాకు డ్యాన్స్ చేయాలనిపించింది. నా ‘గోకులంలో సీత’కు త్రివిక్రమ్ అసిస్టెంట్ రైటర్. ‘తొలిప్రేమ’ డబ్బింగ్ టైమ్‌లో, ‘చిరునవ్వుతో’ రీరికార్డింగ్ చూశా. చాలా బాగా డైలాగ్స్ రాశారనిపించింది. అప్పటికి ఆయనతో పరిచయం లేదు. ఆ తరువాత జరిగిన మా పరిచయం స్నేహంగా అల్లుకుంది. త్రివిక్రమ్ నిజజీవితంలో విలువలు పాటించే వ్యక్తి. హీరోలకు ఎంత పేరు వచ్చినా దానికి కారణం రచయిత, అతను రాసిన కథ, డైలాగ్స్ అని నా నమ్మకం. త్రివిక్రమ్ లాంటి రచయిత ఉన్నందుకు తెలుగు పరిశ్రమ గర్విస్తుంది. ‘అ.. ఆ’ చాలా అందంగా ఉండే కథ. ‘అత్తారింటికి దారే ది’కి ముందే ఈ కథ నాకు తెలుసు’’ అని చెప్పారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ - ‘‘జీవితంలో ఎంత ముందుకెళ్లినా మూలాలను మర్చిపోకూడదు. ఆ మూలాలను వెతుక్కునే ప్రయత్నమే ‘అ..ఆ’. చిన్నప్పటి నుంచి ఇప్పటి దాకా నేను చేసిన ప్రయాణం... ఊళ్ళో వన్ బై టీ తాగుతూ స్నేహితులతో కబుర్లు చెప్పిన క్షణాలు - ఇవన్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే తీయగా ఉంటాయి. రాసేసిన డైరీ చదవాలని అనుకుంటారు. ఈ చిత్రకథ నేను చాలా రోజుల క్రితం రాసేసిన డైరీ. మళ్లీ చదువుకోవాలనిపించి, ‘అ..ఆ’గా తీశాను. ఇది కథ ఉన్న సినిమా అని నమ్మి చేశారు నితిన్, సమంత. ఈ సినిమాలో నాగవల్లి పాత్రలో అనుపమ చాలా కాలం గుర్తుండిపోతుంది. నేను కథ చెబుతుంటేనే మిక్కీ ‘గోపాల..’ పాట ట్యూన్ ఇచ్చేశారు. తెలుగు పాటకు మళ్లీ గౌరవం తీసుకురాగలిగిన రచయితల్లో సీతారామశాస్త్రి గారి తర్వాత రామజోగయ్య శాస్త్రి ఒకరు’’ అన్నారు. నితిన్ మాట్లాడుతూ- ‘‘త్రివిక్రమ్ గారితో పనిచేసిన క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. ‘జయం’ ఆడిషన్స్‌కి తేజగారు నన్ను ఆఫీస్‌కు పిలిచినప్పుడు, పవన్ కల్యాణ్‌గారు ‘తొలి ప్రేమ’, ‘బద్రి’ చిత్రాల్లో వేసిన స్టెప్స్‌ను, ‘తమ్ముడు’లో కల్యాణ్‌గారు చేసిన ‘శాకుంతలక్కయ్యా’ సీన్‌ని చేసి చూపిస్తే, అభినందించారు. ఆ విధంగా 2002లో కల్యాణ్‌గారు నా తొలి బ్రేక్‌కు కారణమయ్యారు. ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడు ‘ఇష్క్’ ఆడియోకు కల్యాణ్‌గారు వచ్చారు. ఆ సినిమా హిట్టయ్యి, నా రెండో బ్రేక్‌కి కారణమయ్యారు. ఇప్పుడీ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వచ్చారు. ఇదీ హిట్టే’’ అని ఉద్వేగంగా అన్నారు. -
అఖిల్
ఏ హీరోకీ దక్కని సువర్ణావకాశం అఖిల్‌కి దక్కింది. తొలి సినిమా టైటిలే తన పేరు మీద రావడమనేది ఇంతవరకూ ఏ హీరోకీ జరగలేదు. అఖిల్ సినిమాకి ఏం పేరు పెడతారా అని అందరూ రకరకాల ఊహాగానాలతో ఎదురుచూస్తుంటే, ‘అఖిల్’ టైటిల్ అనౌన్స్ చేసి అభిమానుల్ని థ్రిల్ చేశారు దర్శకుడు వీవీ వినాయక్. ఈ నెల 20న ఏయన్నార్ జయంతికి పాటలు విడుదల కానున్నాయి. అక్టోబర్ 22న విజయదశమి కానుకగా విడుదల చేస్తామని ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్న హీరో నితిన్ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కొన్ని పాటలను అఖిల్, హీరోయిన్ సాయేషాలపై ఆస్ట్రియా, స్పెయిన్లలో చిత్రీకరిస్తున్నారు.