లగ్జరీ కార్లలో పోలీసు పెట్రోలింగ్!
దుబాయ్: పోలీసులు అనగానే జీపులు గుర్తుకు వస్తాయి. నిన్న మొన్నటి దాకా సినిమాల్లో కూడ పోలీసులు జీపుల్లో రావడమే చూపించారు. అలాంటిది ఇటీవల కొన్ని ప్రభుత్వాలు నగరాల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచడమే కాక, వారికి ప్రత్యేకంగా కార్లను సమకూర్చాయి. ప్రస్తుతం దుబాయ్ ప్రభుత్వం కూడా పోలీసులు గస్తీ తిరిగేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ లగ్జరీ కార్లను, ఎస్ యూవీలను అందించింది. దీంతో ఇప్పుడు పోలీసులు ఆ ఖరీదైన కార్లలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
అత్యంత హార్స్ పవర్ కలిగిన లగ్జరీ కార్లను దుబాయ్ ప్రభుత్వం మెట్రో పోలీసులు గస్తీ తిరిగేందుకు ఇవ్వడంతో ఇప్పుడు గ్యారేజీలన్నీ అత్యాధునిక లగ్జరీ కార్లతో ఆకట్టుకుంటున్నాయి. ఆడి ఆర్8, బెంట్లీ కాంటినెంటల్ జీటీ, ఆస్టాన్ మార్టిన్ వన్ 77, బీఎం డబ్ల్యూ ఐ8, బీఎం డబ్ల్యూ ఎం6, బ్రాబస్ మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ, బుగట్టి వేరాన్, చెవ్రోలెట్ కేమెరో, ఫెరారీ ఎఫ్ ఎఫ్, ఫోర్డ్ ముస్టాంగ్ కస్టమైజ్డ్ బై రష్ పెర్భార్మెన్స్, లంబోర్గిని ఎవెంటేడర్, లెక్సస్ ఆర్సీ ఎఫ్, మెక్ లారెన్ ఎంపీ4 12సీ, మెర్సిడెస్ బెంజ్ ఎస్ ఎల్ ఎస్ ఏఎంజీ, నిస్సాన్ జీటీఆర్, పోర్స్ ఖె పనామెరా ఎస్ ఈ హైబ్రిడ్ వంటి అన్ని మోడల్స్ లోనూ ఖరీదైన కార్టు.. ఇప్పుడు దుబాయ్ పోలీసుల పెట్రోలింగ్ లో భాగం పంచుకుంటున్నాయి.