hindu culture
-
హిందువులు సహనశీలురు
ముంబై: ప్రముఖ కవి, గీత రచయిత జావెద్ అక్తర్(78) హిందూ సంస్కృతిపై ప్రశంసలు కురిపించారు. హిందువులు ఎంతో సహనశీలురని, వారి వల్లే మన దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తోందని చెప్పారు. అదే సమయంలో, నేడు దేశంలో వాక్ స్వాతంత్య్రం తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నిర్వహించిన దీపోత్సవ్‌లో ఆయన పాల్గొన్నారు. ‘హిందువులు దయామయులు. విశాల హృదయులు. అసహనం కలిగిన కొందరున్నారు. హిందువులు వారిలా ఉండరు. హిందువులకు మాత్రమే దయ, విశాల హృదయం అనే గొప్ప లక్షణాలుంటాయి. వాటిని కోల్పోవద్దు. లేకుంటే మిగతా వారికీ మీకూ బేధం ఉండదు. హిందువుల జీవన విధానం నుంచి మేం నేర్చుకున్నాం. వాటిని మీరు వదులుకుంటారా?’అని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఆయన.. ‘శ్రీరాముడు, సీతాదేవిల గడ్డపై పుట్టినందుకు గర్విస్తున్నాను. నేను నాస్తికుడినే అయితే రాముడిని, సీతను ఈ దేశ సంపదగా భావిస్తాను. రామాయణం మన సాంస్కృతిక వారసత్వం’అంటూ జై సియా రాం అని నినదించారు. ‘ఇది హిందూ సంస్కృతి, నాగరికత. మనకు ప్రజాస్వామ్య దృక్పథాలను నేర్పింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. అందుకే మనమే ఒప్పు, అందరిదీ తప్పు అని భావించడం హిందువుల సిద్ధాంతం కాదు. ఇది మీకు ఎవరు నేర్పించినా తప్పే’అని అన్నారు. అయితే, దేశంలో నేడు వాక్ స్వాతంత్య్రం క్షీణిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. -
‘భారత్‌లో ముస్లింలు సంతోషంగా ఉన్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో హిందూ సంస్కృతి ఫలితంగానే ఇతర దేశాలతో పోలిస్తే ముస్లింలు భారత్‌లో అత్యంత సంతోషంగా ఉన్నారని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఒడిషాలో ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొంటున్న మోహన్ భగవత్ హిందూ అనేది ఓ మతం లేదా భాష కాదని, ఓ దేశం పేరూ కాదని చెప్పుకొచ్చారు. భారత్‌లో నివసించే వారందరి సంస్కృతి హిందూ అని వ్యాఖ్యానించారు. భిన్న సంస్కృతులను హిందూ విధానం ఆమోదించి గౌరవిస్తుందని చెప్పారు. యూదులు సంచరిస్తున్నప్పుడు వారికి ఆశ్రయం కల్పించిన ఏకైక దేశంగా భారత్ ఆవిర్భవించిందని ఆయన అన్నారు. పార్శీలు కేవలం భారత్‌లోనే స్వేచ్ఛగా తమ మతాన్ని అనుసరిస్తారని ఇదంతా హిందూ మతం గొప్పతనమేనని పేర్కొన్నారు. ఆరెస్సెస్ ముద్ర అంతరించి సమాజమంతా ఒకే వర్గంగా మెలగాలన్నది తన ఆక్షాంక్షని స్పష్టం చేశారు. భిన. సంస్కృతులు, భాషలు, ప్రాంతాలకు అతీతంగా ఒక్కటిగా మెలిగినప్పుడు ముస్లింలు, పార్శీలు ఇతరులు దేశంలో సురక్షితంగా ఉన్నామనే భావనతో ఉంటారని చెప్పారు. మెరుగైన సమాజం ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన పిలుపు ఇచ్చారు. -
రక్తపాతమే
- శ్రీరామ సేనను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు - మహారాష్ర్టలో బీజేపీకి ఓటమి తప్పదు - ప్రమోద్ ముతాలిక్ సాక్షి, బెంగళూరు : హిందు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న శ్రీరామ సేన సంస్థను రద్దు చేస్తే రాష్ట్రంలో రక్తపాతం తప్పదని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రమోద్‌ముతాలిక్ హెచ్చరించారు. ఇందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బాగల్‌కోటేలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీరామ సేన సంస్థకు చట్టబద్దత ఉందని తెలిపారు. అందువల్ల దీనిని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఆర్ఎస్ఎస్ పట్ల చలకనగా మాట్లాడటం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దివాళకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. దేశ రక్షణ కోసం కృషి చేస్తున్న సంస్థల్లో ఆర్ఎస్ఎస్ది అగ్రస్థానమని ప్రశంసించారు. మహారాష్ట్రలో బీజేపీ నుంచి వేరు పడిన శివసేన పార్టీ ఎన్నికల్లో గెలుపుకోసం శ్రీరామసేన మద్దతు కోరుతోందని తెలిపారు. హిందుత్వపై కాని, ఆ మతానికి సంబంధించిన సంస్థలకు, ప్రజల సంక్షేమం కోసం బీజేపీ నేతలు ఎలాంటి సహకారం అందించారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర సీఎం పీఠంపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ కన్నువేశారని, అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం తథ్యమని జోష్యం చెప్పారు. తాను భాష, సరిహద్దు కోసం కాకుండా హిందు మత పరిరక్షణ కోసం పాటు పడ్డానన్నారు. ఎన్ని ఆటు పోటులు ఎదురైనా ఇకపై ఇదే పంథాలో ప్రయాణిస్తానని ముతాలిక్ పేర్కొన్నారు. -
'హిందు సంస్కృతిని సోనియా నాశనం చేస్తున్నారు'
హైదరాబాద్: హిందూ సంస్కృతిని నాశనం చేయడానికే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కంకణం కట్టుకున్నారని వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్ మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న గందరగోళ పరిస్థితులకు సోనియానే కారణమని ఆయన విమర్శించారు. రూపాయి రోజు రోజూకు దిగజారిపోతున్నతరుణంలో ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని సింఘాల్ తెలిపారు. డాలర్ మారకంతో రూపాయి క్షీణదశకు చేరుకోవడానికి కారణం కూడా సోనియా గాంధీయేనన్నారు. ఆధ్మాతిక గురువు ఆశారాం బాపూపై కేసులు పెట్టి వేధించడం వెనకు కాంగ్రెస్ కుట్ర దాగుందని ఆయన తెలిపారు. 80 ఏళ్లకు పైబడిన ఆశారాంపై లైంగిక వేధింపుల కేసు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని సింఘాల్ అభిప్రాయపడ్డారు.