'హిందు సంస్కృతిని సోనియా నాశనం చేస్తున్నారు' | sonia gandhi trying to Destroy hindu culture, says ashok singhal | Sakshi
Sakshi News home page

'హిందు సంస్కృతిని సోనియా నాశనం చేస్తున్నారు'

Published Sun, Sep 1 2013 6:18 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

sonia gandhi trying to Destroy hindu culture, says ashok singhal

హైదరాబాద్: హిందూ సంస్కృతిని నాశనం చేయడానికే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కంకణం కట్టుకున్నారని వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్‌ మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న గందరగోళ పరిస్థితులకు సోనియానే కారణమని ఆయన విమర్శించారు. రూపాయి రోజు రోజూకు దిగజారిపోతున్నతరుణంలో ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని సింఘాల్ తెలిపారు. డాలర్ మారకంతో రూపాయి క్షీణదశకు చేరుకోవడానికి కారణం కూడా సోనియా గాంధీయేనన్నారు.

 

ఆధ్మాతిక గురువు ఆశారాం బాపూపై కేసులు పెట్టి వేధించడం వెనకు కాంగ్రెస్ కుట్ర దాగుందని ఆయన తెలిపారు. 80 ఏళ్లకు పైబడిన ఆశారాంపై లైంగిక వేధింపుల కేసు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని సింఘాల్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement