Hindu girls
-
లవ్ జిహాద్‌కు జీవిత ఖైదు: అసోం
గువాహటి: హిందూ అమ్మాయిలను ముస్లింలుగా మారుస్తున్న ‘లవ్ జిహాద్’ దోషులకు యావజ్జీవ ఖైదు పడేలా కొత్త చట్టం తెస్తామని బీజేపీ పాలిత అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం ప్రకటించారు. ‘‘ఎన్నికల వాగ్దానాలనే నెరవేర్చబోతున్నాం. లవ్ జిహాద్‌తో సంబంధమున్న వారికి జీవితఖైదు తప్పదు. ఇకపై అసోంంలో పుట్టిన వారినే స్థానికులుగా గుర్తిస్తాం. వారికే ప్రభుత్వ ఉద్యోగాల అర్హత ఉంటుంది’’ అన్నారు. -
పాక్‌లో హిందూ యువతులపై అకృత్యాలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. హిందూ యువతుల అపహరణ, మత మార్పిడి ఘటనలు నానాటికి పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే ఒకే జిల్లాలో వేర్వేరు చోట్ల ఇలాంటివి రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. సాయుధులైన దుండగులు అక్రమంగా బాధితుల ఇంట్లో చొరబడి వారిని లాక్కెళ్లడం ఆందోళనలకు దారి తీసింది. వివరాలు.. సింధు ప్రావిన్స్‌లోని మీర్పూర్ ఖాస్ జిల్లా రాయీస్ నేహాల్ ఖాన్ గ్రామానికి చెందిన రాయ్ సింగ్ కోహ్లి తన కూతురు అపహరణకు గురైనట్లు వెల్లడించారు. పదిహేనేళ్ల సుంటారాను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారని.. దీంతో వెంటనే తాము స్థానిక పోలీస్ స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేశామన్నారు. (లాక్డౌన్ ఎత్తివేత.. డబ్బు ఇవ్వలేం: ఇమ్రాన్ ఖాన్) ఈ క్రమంలో చాలా సేపటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీసులు తమను వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా తమ కూతురిని వెనక్కి తీసుకురావాలంటూ పోలీసులను వేడుకున్నారు. ఇక అదే జిల్లాలోని హాజీ సయీద్ గ్రామంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం. వివాహిత అయినటువంటి 19 ఏళ్ల భగవంతిని కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. ఇస్లాం స్వీకరించాలంటూ ఆమెను బలవంతపెట్టారు. ఈ క్రమంలో భగవంతి కుటుంబ సభ్యులు పోలీసు స్టేషనుకు వెళ్లి నిరసన తెలపగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న సదరు వ్యక్తులు.. భగవంతి మతం మారినట్లుగా కొన్ని పత్రాలను పోలీసులకు సమర్పించారు. దీంతో తమ కూతురి జీవితం నాశనమైందంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసు స్టేషను ఎదుట ఆందోళనకు దిగారు. (పాకిస్తాన్లో వారు మాత్రమే ఆ పోస్టులకు అర్హులు) కాగా సింధు ప్రావిన్స్‌లోని థార్పర్కర్ జిల్లాలోని బార్మేలీలో నివసిస్తున్న హిందువులపై ఇదే రోజు హేయమైన దాడి జరిగింది. పురుషులు, మహిళలు, చిన్న పిల్లలు అనే తేడా లేకుండా వారిపై దాడిచేసిన దుండగులు ఇళ్లను నేలమట్టం చేశారు. ఇక కొన్నిరోజుల క్రితం మంత్రి సమక్షంలోనే పంజాబ్ ప్రావిన్స్‌లోని భవల్పూర్లో మైనారిటీల నివాసాలను బుల్డోజర్లతో నేలమట్టం చేసిన విషయం తెలిసిందే.(హిందువుల బస్తీ నేలమట్టం చేసిన పాకిస్తాన్) -
పాక్‌లో ఇద్దరు హిందూ బాలికల కిడ్నాప్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఇద్దరు హిందూ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేయడంతో పాటు మత మార్పిడి చేయించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. పాక్‌లోని ఘోట్కి జిల్లాలో హోలీ సందర్భంగా రవీనా (13), రీనా (15) అనే హిందు బాలికలను ఇంటి నుంచి అపహరించిన కొందరు.. తర్వాత వారికి ఓ ముస్లిం మత గురువు చేతుల మీదుగా మత మార్పిడి చేసి నిఖా నిర్వహించిన వీడియో ఆ దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో అక్కడ ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ నిర్వహించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆదేశించారు. పూర్తి వివరాలను బయటపెట్టాల్సిందిగా సింధ్, పంజాబ్ ప్రభుత్వాలను ఆదేశించారు. భారత రాయబారిని నివేదిక కోరిన సుష్మ పాక్‌లో చోటుచేసుకున్న ఘటనపై భారత్ స్పందించింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ మంత్రి ఫవాద్ చౌద్రీల మధ్య ఈ వ్యవహారంపై ఆదివారం ట్విట్టర్లో వాగ్యుద్ధమే జరిగింది. ఫవాద్ చౌద్రీ స్పందిస్తూ.. ‘ఇది పాక్ అంతర్గత విషయం. మైనారిటీలను అణచివేయడానికి ఇదేం భారత్‌లోని మోదీ ప్రభుత్వం కాదు. ఇది ఇమ్రాన్‌ఖాన్ పాలనలోని కొత్త పాక్. మా జెండాలోని తెల్లరంగులా మేము వారిని సమానంగా చూసుకుంటాం. ఇదే శ్రద్ధని భారత్‌లోని మైనారిటీల విషయంలోనూ చూపిస్తారని ఆశిస్తున్నాం.’అని ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా సుష్మ స్పందిస్తూ.. ‘ఈ విషాదకర ఘటనపై మీ స్పందన చూస్తుంటే మీలోని దోషపూరిత మనస్తత్వాన్ని బయటపెడుతోంది..’అని ట్వీట్లో బదులిచ్చారు. -
పాక్‌లో హిందూ అమ్మాయిలపై లవ్ జిహాద్
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందూ మతానికి చెందిన అమ్మాయిలను కిడ్నాప్ చేయడం, ముస్లింలతో బలవంతంగా పెళ్లిజరిపించడం, వారి అభీష్టానికి భిన్నంగా ఇస్లాం మతంలోకి మార్చడం వంటి ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. వీటి వెనుక రాజకీయ నాయకుడు, ముస్లిం మతపెద్ద మియన్ అబ్దుల్ హక్ అలియాస్ మిత్తూ మియన్ ప్రమేయముందనే ఆరోపణలు వస్తున్నాయి. హిందూమతానికి చెందిన అమ్మాయిలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ, హక్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మానవ హక్కుల సంఘాలు, హిందూమత సంస్థల కార్యకర్తలు లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్‌లతో పాటు పాక్‌లోని ఇతర నగరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హిందూ కుటుంబాలను భయకంపితులను చేస్తున్న హక్కు వ్యతిరేకంగా అమెరికాలో కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హక్ సింధు ప్రావిన్స్‌లోని ప్రముఖ కుటుంబానికి చెందినవాడు. ఆ ప్రాంతంలో హిందువులు ఎక్కువగా నివసిస్తున్నారు. హక్ బలవంతంగా మతమార్పిడులు చేయిస్తున్నాడని, ఆయన్ను ప్రశ్నించే ధైర్యం అక్కడ ఎవరికీలేదని కపిల్ దేవ్ అనే కార్యకర్త ఆరోపించాడు. కిడ్నాపర్లు 18 ఏళ్లలోపు ఉన్న హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. వారిని బలవంతంగా ఎత్తుకెళ్లి మతమార్పిడి చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. హిందువులు పాకిస్థాన్ వదలి వెళ్లిపోవడానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటని హిందూ మతసంస్ధ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయలపై ఆగడాలు పెరగడంతో పాటు కరాచీలో ఇటీవల హిందువులపై దాడులు ఎక్కువ కావడంతో హిందువులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. కరాచీలో హిందు మతానికి చెందని ఓ బాలుడు హత్యకు గురికాగా, మరో డాక్టర్‌ను దుండగులు కాల్చిచంపారు.