Home of the crop
-
ఆ మేడ.. పంటల వైవిధ్యానికి నెలవు!
ఇంటి పంట పచ్చని ఇంటి పంటలతో టై కళకళ బ్యాగ్స్, సిమెంటు సంచుల్లో ఆకుకూరలు, కూరగాయల సాగు ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరించి గుంటూరులోని ఏటీ అగ్రహారం వాస్తవ్యురాలైన ఎల్లాప్రగడ జయలక్ష్మి తమ మేడ పైన 3 నెలలుగా రసాయన రహిత కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నారు. వృత్తి రీత్యా క్లినికల్ సైకాలజిస్ట్ అయిన ఆమె ఆరోగ్యదాయకమైన కూరగాయలు పండించడాన్ని ప్రవృత్తిగా మార్చుకొని పదుగురికి స్ఫూర్తినిస్తున్నారు. తన తండ్రి, విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి అయిన ఎస్ఎస్ఎన్ మూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఇచ్చిన సలహాల ప్రకారం తృప్తిగా ఇంటిపంటలు పండిస్తున్నారు జయలక్ష్మి (77999 92038). ఆమె ఇంటి మేడపై పంటల జీవవైవిధ్యం కనువిందు చేస్తున్నది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. 64 గ్రోబ్యాగ్స్.. 60 సిమెంటు సంచులు ‘కుండీలకు బదులు తక్కువ ఖరీదైన గ్రోబ్యాగ్స్‌ను, ఖాళీ సిమెంటు సంచులను వాడుతున్నాం. రెండు సైజుల్లో గల 64 గ్రోబ్యాగ్స్, 60 సంచులలో బేబీకార్న్, టమాటా, వంగ, బెండ, క్యాబేజీ, కాకర, బీర, సొర లాంటి కాయగూరలు.. తోటకూర, పాలకూర, మెంతికూరలతోపాటు గులాబీ, బంతి వంటి పూల మొక్కలనూ పెంచుతున్నాం. దోమపోటు, పేనుబంక వంటి రసంపీల్చే పురుగుల బారి నుంచి కూరగాయ మొక్కలను కాపాడటానికి జొన్న, సజ్జ మొక్కలను పది సంచుల్లో పెంచుతున్నాం. దీని వల్ల పురుగుమందులు పిచికారీ చేయాల్సిన అవసరం రావడం లేదు. వీటిపై పురుగులేమైనా కనిపిస్తే తీసేసి నాశనం చేస్తున్నాం. మట్టి మిశ్రమం తయారీ ఇలా.. కొబ్బరి పొట్టు, వర్మీ కంపోస్టు, ఎర్రమట్టి, పశువుల ఎరువును సమపాళ్లలో కలిపిన మట్టి మిశ్రమాన్ని బ్యాగ్స్‌లో నింపాము. విత్తనాలు, మొక్కలు నాటే ముందు ‘బీజామృతం’తో తప్పకుండా శుద్ధి చేస్తున్నాం. ఒక్కో బ్యాగ్‌లో నాటేముందు, తరువాత నెలకోసారి 50 గ్రాముల చొప్పున ఘనజీవామృతాన్ని వేస్తున్నాం. ఏడాది తర్వాత మట్టి మిశ్రమాన్ని బ్యాగ్‌లలో నుంచి తీసి.. పశువుల ఎరువు, ఘనజీవామృతం, వర్మీకంపోస్టు కొద్ది మొత్తంలో కలిపి మళ్లీ బ్యాగ్‌లలో నింపుకోవాలి. పది రోజులకోసారి జీవామృతం.. సొంతంగా తయారు చేసుకున్న జీవామృతాన్ని 1:10 నిష్పత్తిలో నీటిలో కలిపి.. మొక్కలపై పది రోజులకోసారి పిచికారీ చేస్తున్నాం. పదిహేను రోజులకోసారి మొక్కల మొదళ్ల వద్ద పోస్తాం. టై గోడలకు వెదురు బొంగులు కట్టి వైర్ అల్లి తీగజాతి మొక్కలను పాకిస్తున్నాం. ఎండల ప్రభావం మొదలవటంతో రెండు పూటలా నీరు పోస్తున్నాం. ఉదయం, సాయంత్రం అరగంట మొక్కల పనికి వెచ్చిస్తాను. నా పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండానే మా కుటుంబానికి అవసరమైన ఆకుకూరలను పండించుకుంటున్నా. వంగ, టమాటా పిందెలు వస్తున్నాయి. విషం లేని ఆహారం సొంతంగా పండించగలగడం సంతోషాన్ని కలిగిస్తోంది. మా నాన్న మూర్తి (9491582181) తోడ్పాటుతో మా చుట్టుపక్కల ఉండే వారికి ఇంటిపంటల సాగుపై శిక్షణ ఇప్పించా. శిక్షణ పొందిన ఆరుగురు ఇంటిపంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు..’ ప్రెజెంటేషన్: దండేల కృష్ణ, ఇంటిపంట డెస్క్ -
ఇటు వ్యాయామం... అటు సహజాహారం!
ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి వ్యాయామం ఉపకరిస్తుంది. అయితే, ఆ వ్యాయామం కోసమే కాకుండా.. రసాయనిక అవశేషాల్లేని సహజాహారాన్ని ఇంటిపట్టునే పండించుకోవడానికి కూడా ఉపయోగపడితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతోనే రేణుకుంట్ల శ్రీరాములు తన ఇంటిపైన 3 నెలలుగా సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటున్నారు. హైదరాబాద్ ఆల్విన్ కంపెనీ మాజీ ఉద్యోగైన శ్రీరాములు(61) కూకట్పల్లి సమీపంలోని ప్రగతినగర్‌లో స్థిరపడ్డారు. ఇంతకుముందున్న ఇంటి వద్ద పెరట్లో చాలా ఖాళీస్థలం ఉండడంతో పూలమొక్కలు, కూరగాయ మొక్కలు పెంచే అలవాటుంది. కొద్ది నెలల క్రితం 3 అంతస్థుల కొత్త ఇంట్లోకి మారిన తర్వాత.. మేడ మీద గ్రోబాగ్స్‌ను ఏర్పాటు చేసి ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. గుండ్రంగా ఉండే పెద్ద గ్రోబాగ్స్ పది, 50కి పైగా చిన్న కుండీల్లో టమాటా, బీర, పొట్ల, సొర, దోస, గోంగూర, పాలకూర, చుక్కకూర సాగు చేస్తున్నారు. మొక్కలకు ఎండాకాలంలో మొక్కలకు షేడ్‌నెట్ వేయడానికి, కోతుల నుంచి రక్షించుకోవడానికి టైపైన పక్కాగా ఇనప ఫ్రేమ్‌ను ఏర్పాటు చేశారు. మొక్కలంటే ప్రాణం కాబట్టి కొంత ఖర్చయినప్పటికీ ఈ ఏర్పాటు చేశానని ఆయన చెప్పారు. దసరా పండుగ తర్వాత గ్రోబాగ్స్ తెచ్చి టై కిచెన్ గార్డెన్‌కు శ్రీకారం చుట్టారు. ట్రాక్టర్ ఎర్రమట్టి, అర ట్రాక్టర్ చివికిన పశువుల ఎరువుతోపాటు కోకోపిట్, వేపపిండితో కూడిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. మొక్కలకు రోజ్క్యాన్తో తగుమాత్రంగా నీరు పోయడంతో శ్రీరాములు దినచర్య ప్రారంభమవుతుంది. కనీసం గంట సేపు చక్కని వ్యాయామం దొరుకుతోందని ఆయన చెప్పారు. దీంతోపాటు మొక్కలను దగ్గరగా పరిశీలించడం వీలవుతోందన్నారు. నలుగురు కుటుంబానికి అవసరమయ్యే ఆకుకూరలు, కూరగాయల్లో 60% వరకు ప్రస్తుతం తామే పండించుకుంటున్నామన్నారు. 15-20 రోజులకోసారి వేపనూనెను మొక్కలపై పిచికారీ చేస్తామని, అంతకుమించి మరేమీ అవసరం రావడం లేదని ఆయన తెలిపారు. రసాయనిక అవశేషాల్లేని ఆకుకూరలు, కూరగాయలను సొంతంగా మేడ మీద పండించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కూరగాయలు, ఆకుకూరలను కోసిన 5 నిమిషాల్లోనే వండుకునే వీలుండడం, రుచి చాలా బాగుండడం సంతృప్తినిస్తోందన్నారు. ప్రగతినగర్ మాజీ సర్పంచ్ అయిన శ్రీరాములు ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్నారు. టైలు ఖాళీగా ఉంచేకన్నా ఉన్నంతలో సహజాహారాన్ని పండించుకోవడం మేలని తన చేతల ద్వారా చాటుతున్నారు. - ఇంటిపంట డెస్క్ -
పండించుకున్న ఆహారాన్నే తిందాం.. తినే ఆహారాన్నే పండిద్దాం!
ఇంటిపంటల సాగులో దేశంలోనే బెంగళూరు ముందంజ 10 వేల మందికిపైగా శిక్షణ ఇచ్చిన శాస్త్రవేత్త డా. విశ్వనాథ్ ‘పండించుకున్న ఆహారాన్నే తిందాం.. తినేదాన్నే పండిద్దాం’ ఇదీ బెంగళూరులోని సేంద్రియ ఇంటిపంట ప్రేమికుల లక్ష్యం. గార్డెన్ సిటీగా పేరొందిన ఈ నగరంలో విషరహిత ఆహారంపై మక్కువ కలిగిన సుమారు 5 వేల మంది ఇప్పుడు ఇంటిపంటల సాగులో నిమగ్నమయ్యారు. దేశంలోనే ఇది రికార్డు. ఇందుకు పునాది వేసిన వ్యవసాయ శాస్త్రవేత్త డా. విశ్వనాథ్. ఇంటిపంటల వ్యాప్తికి పాటుపడిన తొలి భారతీయ శాస్త్రవేత్తగా ఆయన గణుతికెక్కారు. నగరీకరణ విస్తరిస్తున్న నేపథ్యంలో పొలాలు మేడలవుతుంటే.. మేడల పైన ఖాళీ స్థలాలు పొలాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మేడలపైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల సాగులో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నది బెంగళూరు నగరం. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ బీ ఎన్ విశ్వనాథ్ కడూర్ ఇందుకు ఆద్యుడు. బెంగళూరు పరిసరాల్లోని మైలసంద్ర గ్రామంలో వ్యవసాయక కుటుంబంలో జన్మించిన డా. విశ్వనాథ్ వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ పొంది.. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కీటకశాస్త్ర నిపుణుడిగా 16 ఏళ్లు పనిచేశారు. ఉద్యోగానికి స్వస్తి చెప్పి హాలీవుడ్లో శిక్షణ పొందాక వ్యవసాయంపై డాక్యుమెంటరీ తీశారు. జీవన ఎరువుల పరిశ్రమ కొన్నాళ్లు నిర్వహించారు. దాదాపు 20 ఏళ్ల క్రితం మేడ మీద సేంద్రియ ఇంటిపంటల సాగు వైపునకు విశ్వనాథ్ దృష్టి మళ్లింది. టై ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్పై 1995లో బెంగళూరు ఐఐటీలో తొలి వర్క్‌షాప్ నిర్వహించారు. డా. వీరేష్ వంటి స్నేహితులతో కలిసి అసోసియేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్‌ను నెలకొల్పి.. సేంద్రియ వ్యవసాయంపై అంతర్జాతీయ సమావేశాన్ని, టై ఫార్మింగ్‌పై తొలి అంతర్జాతీయ మహాసభను నిర్వహించారు. మట్టి + కంపోస్టు + వర్మీ కంపోస్టు + కొబ్బరి పొట్టు శిక్షణ పొందే వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో అవగాహన కల్పించడంతోపాటు.. మట్టి, కంపోస్టు/పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, కొబ్బరి పొట్టులను సమపాళ్లలో కలిపి మట్టి మిశ్రమంతో కుండీలను సిద్ధం చేయడం వంటి పనులను స్వయంగా నేర్పిస్తారు. అతి తక్కువ చోటుండే బాల్కనీల్లోనూ పెంచుకోదగిన ‘పైప్ గార్డెన్’లలో ఆకుకూరలు, కూరగాయ మొక్కలు, ఔషధ మొక్కలను పెంచే పద్ధతులు నేర్పిస్తున్నారు. ‘ఊట ఫ్రం యువర్ తోట’..! పండించుకున్న ఆహారాన్నే తిందాం.. తినే ఆహారాన్నే పండిద్దాం! అనే నినాదంతో డా. విశ్వనాథ్ మిత్రులు డాక్టర్ జయరాం, డాక్టర్ రాజేంద్ర హెగ్డేతో కలిసి 2011లో ‘గార్డెన్ సిటీ ఫార్మర్స్’ (జ్చటఛ్ఛీ ఛిజ్టీడజ్చటఝ్ఛటట.ౌటజ) అనే ట్రస్టును ప్రారంభించారు. ఆర్గానిక్ టై గార్డెనింగ్ (ఓటీజీ) పేరుతో ఈ సంస్థ ప్రారంభించిన ఫేస్బుక్ బృందంలో 20 వేలకు పైగా సభ్యులున్నారు. ‘ఊట ఫ్రం యువర్ తోట’ (మీ గార్డెన్ నుంచి ఆహారం) పేరుతో సేంద్రియ సంతలు అడపా దడపా నిర్వహిస్తున్నారు. తమ అవసరాలకు మించి ఇంటిపంటలు పండించే నగరవాసులు, వినియోగదారులు ఈ సంతల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. టై ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్‌కు పెద్ద దిక్కుగా నిలిచిన డా. విశ్వనాథ్ కృషి ఫలితంగానే నేడు ఈ రంగంలో బెంగళూరు దేశంలోనే ముందంజలో నిలిచింది. - ఇంటిపంట డెస్క్ ‘పండించుకున్న ఆహారాన్నే తిందాం.. తినేదాన్నే పండిద్దాం’ ఇదీ బెంగళూరులోని సేంద్రియ ఇంటిపంట ప్రేమికుల లక్ష్యం. గార్డెన్ సిటీగా పేరొందిన ఈ నగరంలో విషరహిత ఆహారంపై మక్కువ కలిగిన సుమారు 5 వేల మంది ఇప్పుడు ఇంటిపంటల సాగులో నిమగ్నమయ్యారు. దేశంలోనే ఇది రికార్డు. ఇందుకు పునాది వేసిన వ్యవసాయ శాస్త్రవేత్త డా. విశ్వనాథ్. ఇంటిపంటల వ్యాప్తికి పాటుపడిన తొలి భారతీయ శాస్త్రవేత్తగా ఆయన గణుతికెక్కారు. నగరీకరణ విస్తరిస్తున్న నేపథ్యంలో పొలాలు మేడలవుతుంటే.. మేడల పైన ఖాళీ స్థలాలు పొలాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మేడలపైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల సాగులో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నది బెంగళూరు నగరం. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ బీ ఎన్ విశ్వనాథ్ కడూర్ ఇందుకు ఆద్యుడు. బెంగళూరు పరిసరాల్లోని మైలసంద్ర గ్రామంలో వ్యవసాయక కుటుంబంలో జన్మించిన డా. విశ్వనాథ్ వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ పొంది.. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కీటకశాస్త్ర నిపుణుడిగా 16 ఏళ్లు పనిచేశారు. ఉద్యోగానికి స్వస్తి చెప్పి హాలీవుడ్లో శిక్షణ పొందాక వ్యవసాయంపై డాక్యుమెంటరీ తీశారు. జీవన ఎరువుల పరిశ్రమ కొన్నాళ్లు నిర్వహించారు. దాదాపు 20 ఏళ్ల క్రితం మేడ మీద సేంద్రియ ఇంటిపంటల సాగు వైపునకు విశ్వనాథ్ దృష్టి మళ్లింది. టై ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్పై 1995లో బెంగళూరు ఐఐటీలో తొలి వర్క్‌షాప్ నిర్వహించారు. డా. వీరేష్ వంటి స్నేహితులతో కలిసి అసోసియేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్‌ను నెలకొల్పి.. సేంద్రియ వ్యవసాయంపై అంతర్జాతీయ సమావేశాన్ని, టై ఫార్మింగ్‌పై తొలి అంతర్జాతీయ మహాసభను నిర్వహించారు. మట్టి + కంపోస్టు + వర్మీ కంపోస్టు + కొబ్బరి పొట్టు శిక్షణ పొందే వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో అవగాహన కల్పించడంతోపాటు.. మట్టి, కంపోస్టు/పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, కొబ్బరి పొట్టులను సమపాళ్లలో కలిపి మట్టి మిశ్రమంతో కుండీలను సిద్ధం చేయడం వంటి పనులను స్వయంగా నేర్పిస్తారు. అతి తక్కువ చోటుండే బాల్కనీల్లోనూ పెంచుకోదగిన ‘పైప్ గార్డెన్’లలో ఆకుకూరలు, కూరగాయ మొక్కలు, ఔషధ మొక్కలను పెంచే పద్ధతులు నేర్పిస్తున్నారు. ‘ఊట ఫ్రం యువర్ తోట’..! పండించుకున్న ఆహారాన్నే తిందాం.. తినే ఆహారాన్నే పండిద్దాం! అనే నినాదంతో డా. విశ్వనాథ్ మిత్రులు డాక్టర్ జయరాం, డాక్టర్ రాజేంద్ర హెగ్డేతో కలిసి 2011లో ‘గార్డెన్ సిటీ ఫార్మర్స్’ (జ్చటఛ్ఛీ ఛిజ్టీడజ్చటఝ్ఛటట.ౌటజ) అనే ట్రస్టును ప్రారంభించారు. ఆర్గానిక్ టై గార్డెనింగ్ (ఓటీజీ) పేరుతో ఈ సంస్థ ప్రారంభించిన ఫేస్బుక్ బృందంలో 20 వేలకు పైగా సభ్యులున్నారు. ‘ఊట ఫ్రం యువర్ తోట’ (మీ గార్డెన్ నుంచి ఆహారం) పేరుతో సేంద్రియ సంతలు అడపా దడపా నిర్వహిస్తున్నారు. తమ అవసరాలకు మించి ఇంటిపంటలు పండించే నగరవాసులు, వినియోగదారులు ఈ సంతల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. టై ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్‌కు పెద్ద దిక్కుగా నిలిచిన డా. విశ్వనాథ్ కృషి ఫలితంగానే నేడు ఈ రంగంలో బెంగళూరు దేశంలోనే ముందంజలో నిలిచింది. - ఇంటిపంట డెస్క్ -
‘లెవీ’ మారినా.. మారని రైతన్న తలరాత!
ధాన్యం సేకరణ విధానం మారింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి కొత్త లెవీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇన్నాళ్లూ లెవీ విధానాన్ని మార్చాలన్న మిల్లర్లు ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. కొత్త విధానం తమకు నష్టదాయకమంటూ ధాన్యం ధర తగ్గించి కొంటున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనుగోళ్లు చేపడితే తప్ప.. ధాన్యం రైతు దైన్యస్థితి నుంచి బయటపడే పరిస్థితి లేదంటున్నారు వ్యాసకర్త సత్యకృష్ణ. బియ్యం మిల్లర్లను కట్టడి చేసి బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రా - తెలంగాణ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన నూతన లెవీ విధానం రెండు రాష్ట్రాల వరి రైతులకు చుక్కలు చూపిస్తోంది. నూతన లెవీ విధానంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తెలుగు రాష్ట్రాల ధాన్యం మార్కెట్లో చిత్రమైన పరిస్థితి తలెత్తింది. చాలాకాలంగా తాము కోరుతున్న లెవీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుండటంతో ఆనందించవలసిన ధాన్యం మిల్లర్లు.. తీరా అమల్లోకొచ్చాక ఇప్పుడీ విధానం వద్దు మొర్రో అంటున్నారు. ఏతావాతా ధాన్యం సేకరణ విధానం మారినా రైతులకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితే కొనసాగుతోంది. ధాన్యం సేకరణ ఖర్చు తగ్గింపు లక్ష్యంగా.. 25:75 లెవీ విధానం వల్ల కేంద్రానికి ధాన్యం సేకరణ వ్యయం 15 నుంచి 20 శాతం తగ్గుతుంది. అందువల్లనే దేశమంతటా ఒకే విధమైన ధాన్యం సేకరణ విధానం ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ విధానం ఉత్తరాది రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ముఖ్యంగా పంజాబ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ విధానం విజయవంతంకావటంతో దేశమంతటా దీన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరమే గట్టి నిర్ణయం తీసుకుంది. అయితే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఒక ఏడాది గడువు కోరాయి. గడువు తీరినప్పటికీ.. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మరో ఏడాది గడువు కోరాయి. అందుకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 75:25 లెవీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. మిల్లర్లు గతంలో 100 బస్తాల బియ్యం తయారు చేస్తే 75 బస్తాలు బియ్యం భారత ఆహార సంస్థ(ఎఫ్.సి.ఐ.)కు లెవీగా ఇచ్చి, 25 బస్తాలు బహిరంగ మార్కెట్లో అమ్ముకునేవారు. ఇప్పుడు 25 బస్తాల బియ్యం లెవీగా ఇచ్చి 75 బస్తాలు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాల్సి ఉంటుంది. ఇది తమకు గిట్టుబాటుకాదని మిల్లర్లు అంటున్నారు. అక్టోబర్ 27న ఇరు రాష్ట్రాల ధాన్యం మిల్లుల సంఘం అధ్యక్షుడు నేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆహార, వినియోగదారుల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌కు కొత్తలెవీ విధానం ప్రకారం 75 శాతం బియ్యాన్ని తాము అమ్ముకోలేమని మొరపెట్టుకున్నా కేంద్రం పట్టించుకోలేదు. మాట మార్చిన మిల్లర్లు పాత విధానం(75:25)తో తమకు తీవ్ర నష్టాలొచ్చేస్తున్నాయంటూ ఇంతకాలం మిల్లర్లు గగ్గోలు పెడుతూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో ఈ సాకుతో మద్దతు ధరలో 10 శాతం కోత పెట్టేవారు. బియ్యం మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి ముఖ్యంగా సన్న బియ్యం ధర పెంచేసి లాభాలు గడించేవారు. అందుకే, ధాన్యం సేకరణ ఖర్చును తగ్గించుకోవడంతోపాటు బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలకు కళ్లెం వేసే లక్ష్యంతో కేంద్రం తెలివిగా లెవీని 25 శాతానికి కుదించింది. అయితే, మిల్లర్లు ఇప్పుడు మాట మార్చి.. పెద్ద మొత్తంలో బియ్యం అమ్ముకునే అవకాశం లేనందున ధాన్యం కొనుగోళ్లు ఆపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. తెగనమ్ముకుంటున్న రైతులు ఈలోగా నవంబర్ మొదటి వారంలో వరి కోతలు మొదలయ్యాయి. విధానం మారినా రైతు పరిస్థితి మెరుగుపడలేదు. మిల్లర్లు ఇచ్చే ధరకే రైతులు ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన దుస్థితే కొనసాగుతోంది. ఈ కొత్త విధానం వల్ల గత ఏడాదితో పోల్చి చూస్తే బస్తా(75 కిలోలు)కు కనీసం రూ. 50 నుంచి 100 ధరను కోల్పోతున్నట్లు రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా సన్నరకాల ధాన్యం అమ్మకాలపైనే ఆశలన్నీ పెట్టుకున్న వారికైతే మరింత నష్టం జరుగుతోంది. సన్న రకాల ధాన్యం బస్తా రూ. 1,400 అమ్మవలసి ఉండగా, రూ. 1,200 కూడా గిట్టుబాటు కావటం లేదు. సాధారణ రకాలకు రూ. వెయ్యి నుంచి రూ. 1,100 ఆశిస్తే రూ. 900 నుంచి 950 లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ధాన్య సేకరణ విధానాన్ని సమూలంగా మార్చివేసినా రాష్ట్ర ప్రభుత్వం అంతగా పట్టించుకోకపోవటం ఆంధ్రప్రదేశ్ రైతులను కలవరపరుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మొదట్లో నూతన లెవీ విధానాన్ని స్వాగతించినా తర్వాత వ్యతిరేకించింది. తెలంగాణ ప్రభుత్వ వాదనను కేంద్రం పట్టించుకోదని తేలిపోయింది. కానీ, ఆంధ్రప్రదేశ్ రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత కేంద్ర మంత్రి పాశ్వాన్‌కు ఇటీవల విజ్ఞప్తి చేసినా సానుకూలంగా స్పందించలేదు. అయితే, ముఖ్యమంత్రి దీన్ని అంతగా పట్టించుకున్న దాఖలాల్లేవు. మిల్లర్లకు ముకుదాడు వేసేందుకు ప్రభుత్వం నేరుగా ఎఫ్.సి.ఐ., సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాల్సి ఉంటుంది. అయితే, ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ఏర్పాటు కాక రైతులు ధాన్యాన్ని తెగనమ్ముకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ కేంద్రాలకు వెళ్లి ధాన్యం అమ్ముకునే అలవాటు తెలంగాణ జిల్లాల్లో కొంతవరకు ఉంది. కానీ, ఆంధ్రా రైతులకు ఆ అలవాటు అంతగా లేదు. నేరుగా కళ్లాల్లోనే అమ్ముకోవటం వారికి ఇష్టం. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఎంతమేరకు చిత్తశుద్ధిని చూపుతుందో, ఈ కేంద్రాలు రైతులను ఎంతమేరకు ఆదుకుంటాయో వేచిచూడాలి. -
ఇక్కట్లు లేని ‘ఇంటిపంట’లకు దారిది!
ఇంటి పంట ఆరవై నాలుగు కళల్లో వ్యవసాయం ఒక అద్భుతమైన కళ. ఆయా కళలు ఇంద్రియానుభూతులను సంతుష్టి పరిస్తే.. వ్యవసాయ కళ అన్ని ఇంద్రియాలకూ ఇంధనమైన అన్నాన్ని ఆర్జించి పెడుతుంది. అందుకే వ్యవసాయం అద్భుతమయింది. ఆధునికత పేర వచ్చిన మార్పులు టన్నులకొద్దిగా దించిన రసాయనాలు ఇప్పుడు నింగిని, నేలనే కాదు తినే తిండిని కూడా విషతుల్యంగా మార్చాయి. ఈ నేపథ్యంలో గ్రామసీమల్లో ప్రకృతి వ్యవసాయం, పట్టణ ప్రాంతాల్లో ఆర్గానిక్ అర్బన్ ఫార్మింగ్ క్రమంగా ఉద్యమ రూపం తీసుకుంటున్నాయి. ‘ఇంటిపంట’ల సాగుదారులకు అందుబాటులో ఉన్న వనరులతో చేపట్టే సస్యరక్షణ పద్ధతులనందించి వారి కృషికి తోడ్పడడమే ఈ వ్యాసం ఉద్దేశం. సేంద్రియ ఇంటిపంటలు సాగుచేసే మిత్రులు దృష్టిలో ఉంచుకోదగిన ముఖ్యవిషయం: చీడపీడల నివారణ కాదు నియంత్రణే ప్రధానం. మొక్కలను చీడపట్టిన తరువాత, తెగుళ్లు సోకిన తరువాత నివారణ చర్యలను చేపట్టడం కాకుండా.. మొక్కలు వేసింది మొదలు క్రమానుగతంగా నియంత్రణ చర్యలు చేపట్టాలి. ‘జనరల్ పర్పస్ స్ప్రే’ ‘జనరల్ పర్పస్ స్ప్రే’ తయారీకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ 1 మిరపకాయ 1 వెల్లుల్లి గడ్డ 1 ఈ మూడింటినీ మెత్తగా మిక్సీలో రుబ్బుకొని ఒక రాత్రంతా కొంచెం నీటిలో నానబెట్టుకోవాలి. వడకట్టి ద్రావణంలో 1:5 రెట్ల నీరు కలిపి మొక్కల మీద స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసే ముందు చిటికెడు సర్ఫ్ పొడి కలిపితే మొక్క ఆకులకు మందు అంటుకోవడానికి ఉపయోగపడుతుంది. సబ్బు నీరు: సబ్బు నీరు పిచికారీతో పచ్చదోమ, తెల్లదోమ, పాకుడు పురుగులు, పిండి నల్లి, ఆకు దొలిచే పురుగు, ఎర్రనల్లి వంటి వాటిని పారదోలవచ్చు. తయారీ విధానం: 30 గ్రాముల బార్ సబ్బును సన్నగా తురుము కోవాలి. (డిటర్జెంట్ కాదు) దీనిని లీటర్ నీటిలో కరిగించాలి. ఈ ద్రావణానికి ఒక చెంచాడు వంట నూనె లేదా కిరసనాయిల్ కలిపి పిచికారీ చేసుకోవాలి. వెల్లుల్లి రసం: గొంగళి పురుగు, క్యాబేజీ ఫ్లై, దోమలు, నత్తలు ఇతర రకాల పాకుడు పురుగులను నాశనం చేస్తుంది. దీనికి తోడు ఆకు ముడత, ఆకు మచ్చలు, తేనే మంచు, బూడిద తెగులును నిరోధిస్తుంది. తయారీ విధానం: 90 గ్రాముల వెల్లుల్లి తీసుకొని మెత్తగా దంచాలి. దీనికి రెండు చెంచాల కిరోసిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని 600 మిల్లీ లీటర్ల నీటిలో నానబెట్టాలి. రెండు రోజుల తరువాత వడకట్టి 25 గ్రాముల సబ్బుపొడిని కలిపి పిచికారీ చేసుకోవాలి. వెల్లుల్లి-పచ్చిమిర్చి రసం: ఇది వెల్లుల్లి రసం కన్నా ప్రభావశీలంగా పనిచేస్తుంది. తయారీ విధానం: 10 వెల్లుల్లి రెబ్బలు, 5 పచ్చి మిరపకాయలు, 3 ఓ మోస్తరు ఉల్లిపాయలు మెత్తగా రుబ్బుకొని మిశ్రమాన్ని లీటర్ నీటికి కలిపి మరిగించాలి. రెండు, మూడు పొంగుల తరువాత దించి చల్లారనివ్వాలి. వడపోసుకున్న ద్రావణాన్ని ఒక సీసాలో నిలువ చేసుకోవాలి. పిచికారీ మోతాదు: ఒక కప్పు ద్రావణాన్ని 10 లీటర్ల నీటికి కలిపి ఒక షాంపూ ప్యాకెట్ లేదా కుంకుడు రసం లేదా పచ్చి పాలు కొంచెం కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకు ముడత వచ్చిన మొక్కలకు వరుసగా వారం రోజుల పాటు పిచికారీ చేసుకుంటే సమస్య పరిష్కారమౌతుంది. పచ్చిపాల ద్రావణం: పచ్చిపాల ద్రావణం బూడిద తెగులుపై బాగా పనిచేస్తుంది. పచ్చి పాలను రెట్టింపు నీటితో కలిపి పిచికారీ చేస్తే వైరస్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రధానంగా మొజాయిక్ వైరస్‌పై ఇది బాగా పనిచేస్తుంది. పుల్ల మజ్జిగ: నాలుగైదు రోజులు పులియబెట్టాలి. ఈ పుల్ల మజ్జిగను ఒకటికి తొమ్మిది పాళ్లు నీరు కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. పుల్ల మజ్జిగ వివిధ కీటకాలను పారదోలడమే కాక వాటి గుడ్లను నశింపజేస్తుంది. కీటకాల రసం: పంట మీద ఏదైనా పురుగు ఉధృతంగా కనిపిస్తుంటే.. ఆ పురుగులు కొన్నిటిని ఏరి రెండు కప్పుల నీరు కలిపి రుబ్బాలి. ఆ రసాన్ని లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేస్తే ఆ పురుగులు పారిపోతాయి.దవనం ఆకుల కషాయం: ఒక లీటర్ నీటిలో గుప్పెడు దవనం ఆకులను కలిపి మరిగించాలి. ఈ కషాయానికి రెట్టింపు నీరు చేర్చి పిచికారీ చేస్తే దోమ, పెంకు పురుగు, నత్తలు, క్యాబేజీ తొలిచే పురుగులు వైదొలగుతాయి. ఉప్పు నీళ్ల స్ప్రే: 60 గ్రాముల ఉప్పు, 2 చెంచాల సబ్బు పొడి, 4.5 లీటర్ల గోరు వెచ్చటి నీటిలో బాగా కలిపి వడకట్టుకోవాలి. ఈ ద్రావణం క్యాబేజీని తొలిచే పురుగులపై బాగా పనిచేస్తుంది. ఎప్సమ్ సాల్ట్: వైరస్ ఆశించిన మొక్కల ఆకులు పచ్చగా మారి బలహీన పడతాయి. మెగ్నీషియం లోపం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో 50 గ్రాముల ఎప్సమ్ సాల్ట్ (మెగ్నీషియం సల్ఫేట్) నాలుగు లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పండుటీగ నిరోధక ద్రావణం: 15 లీటర్ల నీటిలో ఒక కిలో పంచదార వేసి కరిగించాలి. ఈ ద్రావణానికి ఒక లీటరు సముద్రపు నీరు లేదా సైంధవ లవణం కరిగించిన నీటితోపాటు.. ఒక లీటరు బెల్లం ద్రావణం లేదా డయటోమసియా ఎర్త్ లేదా పుట్టమన్నును కరిగించి.. వడకట్టి నీరు కలిపి పిచికారీ చేయాలి. పలుమార్లు పిచికారీ చేస్తే పండుటీగ హాని తొలగిపోతుంది. - జిట్టా బాల్‌రెడ్డి