Horticulture University
-
ఈ ఏడాదిని చీని, నిమ్మ సంవత్సరంగా ప్రకటిస్తున్నాం: కన్నబాబు
సాక్షి, అమరావతి: బత్తాయి, నిమ్మ పంటల సాగు.. దిగుబడి, ఎగుమతులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ ఏడాదిని చీని, నిమ్మ సంవత్సరంగా ప్రకటించాలని నిర్ణయించామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. మంగళవారం ఆయన డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పలువురు ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, నిమ్మ, బత్తాయి సాగు రైతులతో మంత్రి కన్నబాబు మాట్లాడారు. నిమ్మ, బత్తాయి అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించేలా ప్రణాళికలు చేసేలా సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారని తెలిపారు. రైతులకు రెట్టింపు ఆదాయం, గ్రామాల్లో ఉపాధి, వారి జీవన ప్రమాణ స్థాయి పెరిగేలా సీఎం పాలన సాగిస్తున్నారని తెలిపారు. నాణ్యమైన మొక్కలు, అంట్లను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆర్బీకేల ద్వారా నిమ్మ, బత్తాయి సాగు శిక్షణ, సమగ్ర యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సిట్రస్ పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. చదవండి: వ్యాక్సినేషన్: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం కరోనా వేళ ‘సంక్షేమం’ భేష్ -
పండ్లతోటల రక్షణకు చర్యలు అవసరం
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 12,583 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. 22,738 మంది రైతులు నష్టపోయారు. పది జిల్లాల్లో పండ్లు, కూరగాయలు, పూలతోటలు దెబ్బతిన్నాయి. అరటి, మిర్చి, బొప్పాయి, జామ, బత్తాయి, నిమ్మ తదితర తోటలు ప్రభావితమయ్యాయి. పండ్లతోటల సంరక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్సా్ర్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. అన్ని పంటలకు సాధారణ సూచనలు.. ⇔ వీలైనంత త్వరగా చేలల్లో అధికంగా ఉన్న నీటిని తీసివేయాలి. ⇔ పంట ఎదుగుదలకు తోడ్పడేలా బూస్టర్ డోస్ ఎరువులు – నత్రజని, డీఏపీ, జింక్ వంటివి వాడాలి. ⇔ అధిక తేమతో తెగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నందున పురుగుల నివారణ చర్యలు చేపట్టాలి. ⇔ లేత తోటల్లో చనిపోయిన మొక్కల్ని తీసేసి కొత్తవి నాటాలి. ⇔ వర్షాలు తగ్గగానే వీలైనంత త్వరగా చెట్ల మధ్య దున్నడం వల్ల తేమ త్వరగా ఆరి చెట్లు కోలుకుంటాయి. ⇔ అధిక గాలులకు వేళ్లతో సహా ఒరిగిన చెట్లను నిలబెట్టి మట్టిని ఎగదోసి ఊతమివ్వాలి. అరటి తోటలో.. ⇔ రెండు పిలకలు వదిలేసి విరిగిన చెట్లను నరికేయాలి. చెట్లకు వెదురు కర్రలను పాతి ఊతమివ్వాలి. ⇔ అరటిచెట్లు నాలుగురోజుల కంటే ఎక్కువగా నీళ్లలో ఉంటే కోలుకోవడం కష్టం. కోలుకున్నా ఎదుగుదల, దిగుబడి తక్కువగా ఉంటాయి. ⇔ రెండురోజులు నీటిముంపులో ఉంటే త్వరగా నీళ్లు బయటకుపంపి తోట ఆరేలా చేయాలి. ఒక్కో చెట్టుకు వందగ్రాముల యూరియా, 80 గ్రాముల పొటాష్ వేయాలి. ⇔ మూడునెలల కన్నా తక్కువ వయసు మొక్కలు మూడడుగుల లోతు నీటిలో ఉంటే నేల ఆరిన వెంటనే కొత్త పిలకలు నాటుకోవాలి. ⇔ గొర్రుతో అంతరసేద్యం చేసి యూరియా, మ్యూరేట్ పొటాష్‌ను 20, 25 రోజుల వ్యవధిలో రెండుమూడుసార్లు వేయాలి. ⇔ ఆకులు, గెలలపై పొటాషియం నైట్రేట్‌ను వారం రోజుల వ్యవధిలో మూడునాలుగుసార్లు పిచికారీ చేయాలి. ⇔ సగం తయారైన గెలలను ఎండిన ఆకులతో కప్పి 15 రోజుల్లోగా కోసి అమ్ముకోవాలి. ⇔ దుంపకుళ్లు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాముల్ని లీటర్ నీటికి కలిపి మొక్క చుట్టూ తడిచేలా నేలలో పోయాలి ⇔ సిగటోక ఆకుమచ్చ తెగులును అరికట్టేందుకు ప్రొపికొనజోల్ ఒక మిల్లీలీటరును వారంరోజుల వ్యవధిలో రెండుమూడుసార్లు పిచికారీ చేయాలి. బత్తాయి, నిమ్మ తోటల్లో.. ⇔ వేర్లకు ఎండ తగిలేలా చూడాలి. పడిపోయిన చెట్లను నిలబెట్టే ఏర్పాట్లు చేయాలి. ⇔ విరిగిన కొమ్మల్ని కొట్టేసి పైభాగాన బోర్డో మిశ్రమం పోయాలి. ⇔ ఎనిమిదేళ్లపైబడి కాపు ఇస్తున్న తోటలో చెట్టుకు 500 గ్రాముల యూరియా, 750 గ్రాముల పొటాష్ వేసుకోవాలి. ⇔ చెట్టు మొదళ్ల దగ్గర ఒకశాతం బోర్డో మిశ్రమం లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాములను లీటర్ నీటికి కలిపి పోయాలి. ⇔ తోటలో కాపు ఉంటే 2–4–డి మందు చల్లి పిందె, పండు రాలడాన్ని నివారించుకోవాలి. ⇔ బెంజైల్ ఆడినైన్ పిచికారీ చేస్తే అధిక తేమను నివారించుకోవచ్చు. బొప్పాయి తోటలో.. ⇔ మెటలాక్జిల్ ఎంజెడ్ మూడుగ్రాములు లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాములను నీటికి కలిపి మొదళ్ల దగ్గర పోయాలి. ⇔ ఐదుగ్రాముల సూక్ష్మ పోషకాల మిశ్రమ పిచికారీ చేయాలి. ⇔ కోతకు తయారైన కాయలుంటే తక్షణమే కోసివేయాలి. పండు కుళ్లు నివారణకు హెక్సాకొనజోల్ జిగురు మందు చల్లాలి. జామ తోటలో.. ⇔ అధిక నీటిని తీసేయాలి. గొర్రుతో దున్ని పాదులు చేసి మొదళ్ల దగ్గర కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాముల్ని లీటర్ నీటికి కలిపి పోయాలి. ⇔ కాయకోత అనంతరం వచ్చే ఆంత్రాక్నోస్ తెగులు నివారణకు కార్బండిజం పిచికారీ చేయాలి. ⇔ వడలు తెగులు నివారణకు ట్రైకోడెర్మావిరిడి మిశ్రమాన్ని (30 కిలోల పశువుల ఎరువు, 4 కిలోల వేపపిండి, 500 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి) ఒక్కో చెట్టుకు వేయాలి. ⇔ చౌడుభూమి ఉంటే ఒక్కో చెట్టుకు కిలో జిప్సం వేయాలి. మిరప తోటలో.. ⇔ ఎండుతెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్, మెటాలాక్సిల్, మంకోజెబ్‌ను మొక్కల మొదళ్లలో పోయాలి. ⇔ ఆకుమచ్చ తెగులు నివారణకు కార్బండిజం, మంకోజెబ్ పిచికారీ చేయాలి. ⇔ నేలలో తేమ ఎక్కువగా ఉంటే సాలిసిక్ యాసిడ్ పిచికారీ చేసి మొక్కల్లో నిల్వ ఉండే పోషకాల వినియోగాన్ని పెంపొందించవచ్చు. ⇔ వర్షాలు ఆగిన తర్వాత మూడు 19లు లేదా 13ః0ః45, యూరియా వంటి పోషకాలను చల్లుకోవాలి. -
ప్రారంభంకానున్న ద్రాక్ష ఫెస్టివల్
-
రాజేంద్రనగర్‌లో ద్రాక్ష ఫెస్టివల్
-
హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటులో వైఎస్ఆర్ కృషి
-
వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల విలీనం?
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నాయని ఉద్యాన వర్సిటీ వర్గాల సమాచారం. వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తానని ఇటీవల గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో వాటి విలీనం తప్పదని చెబుతున్నారు. వాటి విలీనంతో రైతులకు మరింత మేలు జరుగుతుందని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డైరెక్టర్ జనరల్ త్రిలోచనా మహాపాత్ర కూడా హైదరాబాద్‌లో ఇటీవల పేర్కొన్నారు. కాగా, విలీనాన్ని ఉద్యాన వర్సిటీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, వ్యవసాయ వర్సిటీ వర్గాలు ఆహ్వానిస్తున్నాయి. రెండింటినీ కలిపితే ఉద్యాన పరిశోధనలకు బ్రేక్ పడుతుందని ఉద్యాన వర్గాలు చెబుతున్నాయి. విలీనం ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ ఉద్యాన వర్సిటీ అధికారులు ఉద్యాన వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా ఉన్న వ్యవసాయ కార్యదర్శి సి.పార్థసారథి నేతృత్వంలో గవర్నర్‌ను కలవాలని నిర్ణయించినట్లు ఉద్యాన వర్సిటీ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యాన వర్సిటీని విలీనం చేశాక వ్యవసాయ శాఖలో ఉద్యాన శాఖను కూడా కలిపే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు శాఖలను విలీనం చేయాలని గతేడాదే ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించినా ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గింది. ఒకే దగ్గర సేవలంటూ.. రైతులు వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలు సాగు చేస్తారు. పశు పోషణ కూడా చేపడతారు. రైతులు మూడు అవసరాలకు మూడు వర్సిటీలకు వెళ్లడం కష్టమన్న చర్చ జరుగుతోంది. కాబట్టి వ్యవసాయ, ఉద్యాన, పశు విశ్వవిద్యాలయాలు వేర్వేరుగా ఉండటమెందుకు అన్న వాదన తీసుకొస్తున్నారు. అయితే వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలు ఐకార్ పరిధిలోకి వస్తాయి. పశు విశ్వవిద్యాలయం మాత్రం వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) పరిధిలో ఉంటుంది. మూడింటినీ కలపడం కష్టమైన పనని, ఐకార్ పరిధిలో ఉన్న వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలను విలీనం చేయాలని యోచిస్తున్నారు. వీటిని కలపకుంటే నిధులు విడుదల చేయబోమని కూడా ఓ సందర్భంలో ఐకార్ హెచ్చరించినట్లు ఉద్యాన వర్సిటీ వర్గాలు చెప్పాయి. విలీనం కుట్ర! ‘విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతుంటాయి. పరిశోధనలు జరిగే చోటకు రైతులు పెద్దగా రారు. వేర్వేరుగా ఉండటం వల్లే మరింత ప్రయోజనం. విలీనంలో ఏదో కుట్ర దాగుంది’అని ఉద్యాన వర్సిటీ అధికారి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన అధికారులు కొందరు విలీనాన్ని కోరుకుంటూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. వాస్తవానికి వ్యవసాయ వర్సిటీల్లో జరిగే పరిశోధనల్లో 40 నుంచి 50 శాతం వరకు ఉద్యాన పంటలకు సంబంధించినవేనని పేర్కొంటున్నారు. నిధుల భారాన్ని తగ్గించుకునేందకు ఐకార్ ఈ ఆలోచన చేస్తోందని ఆరోపిస్తున్నారు. 8 ఏళ్ల కిందే రెండు వర్సిటీల ఏర్పాటు.. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భాగంగానే ఉద్యాన విభాగం ఉండేది. వ్యవసాయ, ఉద్యాన రంగాలు ప్రత్యేకంగా ఉంటే పరిశోధనలు మరింత ఊపందుకుంటాయని 8 ఏళ్ల కింద అప్పటి ప్రభుత్వం రెండు వర్సిటీలను వేరు చేసింది. తెలంగాణ వచ్చాక రెండు వర్సిటీలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైస్‌చాన్స్‌లర్‌ను నియమించిన ప్రభుత్వం ఉద్యాన వర్సిటీని మాత్రం పట్టించుకోలేదు. వ్యవసాయశాఖ కార్యదర్శినే ఉద్యాన వర్సిటీ వీసీగా కొనసాగిస్తోంది. -
తెలంగాణలో ఉండనివ్వరు.. ఏపీకి రానివ్వరు!
త్రిశంకుస్వర్గంలో ఉద్యానవర్సిటీ సిబ్బంది సాక్షి, అమరావతి: ‘‘దశాబ్దాల పాటు విద్యా బోధన చేశాం. ఇప్పుడేమో తెలంగాణలో వద్దంటారు, ఆంధ్రా వాళ్లు రానివ్వరు.. ఏడాదిన్నరగా తాము పడుతున్న మనోవేదన ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. మాకెందుకీ శిక్ష’’ అని ఉద్యాన వర్సిటీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సేవల్ని వినియోగించుకోవాలని, తెలుగు రాష్ట్రాలలోని రెండు ఉద్యానవన యూనివర్సిటీ రిజిస్ట్రార్లు తలుచుకుంటే తమ సమస్యను గంటలో పరిష్కరిం చవచ్చని విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు విషయమేమిటంటే... రాష్ట్ర విభజన అనంతరం ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని రెండుగా విభజించారు. వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ విశ్వవిద్యాలయాలు విభజన చట్టంలోని 10వ షెడ్యూల్లో ఉన్నాయి. ఈ సంస్థల ఆస్తుల పంపకం, ఉద్యోగుల విభజనకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంది. ఇవి రాకుండానే యూని వర్సిటీకి తెలంగాణలో అనుబంధంగా ఉన్న ఉద్యాన కళాశాలలు, ఇతర పరిశోధన సంస్థలలో పని చేస్తున్న ఆంధ్రా స్థానికత కలిగిన 33 మందిని 2015 నవంబర్ 27న తెలంగాణ నుంచి రిలీవ్ చేశారు. రిలీవ్ చేసేటప్పుడు ఆంధ్రాలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్‌ను కూడా సంప్రదించాలి. అలాంటిదేమీ జరక్కుండానే వీళ్లను తెలంగాణ నుంచి రిలీవ్ చేయడంతో వాళ్లిప్పుడు త్రిశంకుస్వర్గంలో ఉన్నారు. పెరిగిన అధికారుల వేధింపులు! రిలీవ్ ఆర్డర్లతో ఆంధ్రాకు వెళ్లిన ఈ 33 మందిని తీసుకునేందుకు అక్కడి విశ్వవిద్యాలయం అధికారులు తిరస్కరించారు. తిరిగి వాళ్లు తెలంగాణకు వస్తే బాపూజీ విశ్వవిద్యాలయం వారు.. రిలీవ్ అయిన తర్వాత ఇక అవకాశమే లేదన్నారు. దీంతో ఏమి చేయాలో అర్థం కాక కొందరు జీతభత్యాలు, పోస్టింగ్ కోసం హైకోర్టుకు వెళ్లారు. ఉభయుల వాదన విన్న హైకోర్టు.. ఉద్యోగం సంగతి తర్వాత చూద్దాం, జీతాలను మాత్రం 52, 48 నిష్పత్తిన ఇవ్వండని రెండు వర్సిటీలను ఆదేశించింది. జీతాలయితే వస్తున్నాయి గానీ పని లేదు. ప్రమోషన్లు లేవు. కరవుభత్యాలు, ఇంక్రిమెంట్లు లాంటివేవీ లేవు. జూనియర్లు సీనియర్లవుతున్నారు. ఎక్కడో చోట పోస్టింగ్ ఇచ్చి తమ సేవల్ని వినియోగించుకోవాలని అటు గవర్నర్ మొదలు ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు వినతిపత్రాలిచ్చినా ఫలితం లేదని వారు వాపోతున్నారు. -
హార్టికల్చర్ వర్సిటీలో 107 పోస్టులు
- 85 బోధన,22 బోధనేతర పోస్టులు - డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకం సాక్షి, హైదరాబాద్: కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ)లో 107 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా వర్సిటీలో 72 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ గతేడాది జూన్ 18న ప్రభుత్వం ఉత్తర్వులను (జీవో78) జారీ చేసింది. అనంతరం పోస్టుల సంఖ్యను 107కు పెంచాలని, వర్సిటీ నిబంధన ప్రకారం డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ పోస్టుల భర్తీకి అనుమతించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో గతంలో జారీ చేసిన జీవో 78ను ఉపసంహరించుకున్న ప్రభుత్వం, వర్సిటీ విజ్ఞప్తి మేరకు 107 పోస్టులను డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీకి అనుమతిచ్చింది. శనివారం ఈ మేరకు పరిపాలన పరమైన అనుమతులు జారీ చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ ఉత్తర్వులు (జీవో 75) జారీ చేశారు. రిజర్వేషన్ల నిబంధనలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, సర్వీసు నిబంధనలను అనుసరిస్తూ పారదర్శకంగా ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని వర్సిటీ యాజమాన్యాన్ని ఆదేశించారు. -
వ్యవసాయ వర్సిటీ వీసీల నియామకానికి కసరత్తు
- నియామక విధానంపై నివేదిక కోరిన సర్కారు - సమాచారం పంపిన వ్యవసాయాధికారులు సాక్షి, హైదరాబాద్ : జయశంకర్ వ్యవసాయ, కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీల వైస్ చాన్స్లర్ల (వీసీ) నియామకానికి రంగం సిద్ధమైంది. వీటికి ప్రభుత్వమే నేరుగా వీసీలను నియమిస్తుందనే ప్రచారం జరుగుతోంది. వర్సిటీల నిబంధనల ప్రకారం నియామక విధానాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించగా.. వ్యవసాయశాఖ అధికారులు నివేదిక అందజేశారు. దీంతో నియామక ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకు వీసీలు లేకుండానే వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల పాలన కొనసాగుతోంది. వ్యవసాయ వర్సిటీకి ప్రత్యేకాధికారిగా ప్రవీణ్‌రావు, ఉద్యాన వర్సిటీ ఇన్చార్జి వీసీగా వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి వ్యవహరిస్తున్నారు. రోజువారీ పరిపాలనా వ్యవహారాలను రిజిస్ట్రార్ ప్రతాప్ పర్యవేక్షిస్తున్నారు. వీసీలు లేక వర్సిటీల్లో అభివృద్ధికి విఘాతం ఏర్పడింది. ఉద్యోగాల భర్తీకి బ్రేక్ పడింది. వ్యవసాయ వర్సిటీకి నేరుగా.. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ వర్సిటీలకు మొదటి వీసీల నియామకం జరగబోతోంది. ఉమ్మడి ఏపీలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ ఉండగా... రాష్ట్రం ఏర్పడ్డాక 2014 సెప్టెంబర్ 1 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఉనికిలోకి వచ్చింది. వర్సిటీ నిబంధనల ప్రకారం చాన్స్‌లరే వీసీ ని నియమించాలని వ్యవసాయశాఖ తెలిపింది. అంటే ప్రభుత్వమే వీసీని నేరుగా నియమించడానికి అవకాశం ఉందని అంటున్నారు. ఉద్యాన వర్సిటీ నిబంధనల ప్రకారం వీసీని సెర్చ్ కమిటీ ద్వారా నియమించాలి. కమిటీ రూపొందిం చిన ప్యానెల్ నుంచి ఒకరిని చాన్సలర్ వీసీగా నియమిస్తారు. -
ఉద్యాన పంటలకు ఊతం
♦ ములుగులో 12 ఎకరాల్లో విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తాం ♦ పరిశోధనలకు అనుగుణంగా భవనాలు, ల్యాబులు ♦ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం వెల్లడి ములుగు: రాష్ట్రంలో ఉద్యాన పంటలకు ఊతంగా నిలిచేలా ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ములుగులో ఉద్యాన విశ్వవిద్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని మంత్రి శనివారం రాష్ట్ర వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి పరిశీలించారు. వాస్తుపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంత్రి తెలుసుకున్నారు. ఈ మాట్లాడుతూ ఐసీఏఆర్(ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్) మార్గదర్శకాల ప్రకారం ఇక్కడ 12 ఎకరాల్లో భవన నిర్మాణాలు, పరిశోధనల కోసం తరగతి గదులు, ల్యాబ్‌లు, నిర్మిస్తామన్నారు. . ఈ వర్సిటీకి కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందన్నారు. ఇందులో ఇప్పటికే రూ.85 కోట్లు మంజూరు చేసిందని, ఈ ఏడాదికి మరో రూ.50 కోట్లు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. సాధ్యమైనంత వేగంగా ఇక్కడ ఉద్యాన వర్సిటీని నెలకొల్పుతామన్నారు. రాష్ట్రంలో ఉద్యాన తోటలకు ఎంతో ప్రాధ్యాన్యత ఉందని తెలిపారు. 18 లక్షల ఎకరాల్లో పండ్లతోటలు, 14 లక్షల ఎకరాల్లో కూరగాయలు, పూల తోటలు సాగవుతున్నాయన్నారు. ఈ విస్తీర్ణాన్ని మరింతగా పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఉధ్యాన శాఖ కమిషనర్ వెంకట్రాంరెడ్డి, రిజిస్ట్రార్ ప్రతాప్, ప్రొఫెసర్ ప్రవీణ్‌రావు, డిప్యూటీ డెరైక్టర్ రామలక్ష్మి, సిద్దిపేట ఏడీహెచ్ సురేం దర్, హార్టికల్చర్ అధికారి చక్రపాణి, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ మహ్మద్ జహంగీర్ పాల్గొన్నారు. -
రాష్ట్రం.. విత్తన భాండాగారం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/గజ్వేల్: నాణ్యమైన విత్తనాలను రూపొందించడానికి అవసరమైన నేలలు, వాతావరణం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఉందని, తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే విత్తన భాండాగారంగా ఆవిర్భవించబోతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల కేంద్రంలో రూ.1,823 కోట్ల వ్యయంతో హార్టికల్చర్ యూనివర్సిటీ, రూ.50 కోట్ల వ్యయంతో అటవీ కళాశాల, మరో రూ.30 కోట్ల వ్యయంతో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ (ఫల పరిశోధన కేంద్రం) నిర్మాణ పనులకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. అంతకుముందు వారు 18 కంపెనీలు ఏర్పాటు చేసిన ఉద్యాన పంటల స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యాన పంటలకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. దక్షిణ భారత దేశంలోనే రెండో హార్టికల్చర్ యూనివర్సిటీ తెలంగాణలో ఏర్పాటు చేయడంతో ఇక్కడి పంటలపై అద్భుతమైన ప్రయోగాలు జరుగుతాయన్నారు. పండ్లు, పూలు, కూరగాయల సాగు మరింత విస్తరిస్తుందని చెప్పారు. హైదరాబాద్‌కు కావాల్సిన కూరగాయలను ఇక్కడి నుంచే సరఫరా చేయగలుగుతారన్నారు. గోదాముల నిర్మాణానికి అనుమతులివ్వండి తెలంగాణలో ప్రస్తుతం నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఇవి ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. మరో 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాముల నిర్మాణానికి కేంద్ర సహాయం చేయాలని కోరారు. కరువుతో అల్లాడుతున్న తెలంగాణ రైతాంగానికి సముచిత పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీని వేగంగా నిర్మించడానికి అవసరమైన నిధులను విడుదల చేయాలన్నారు. ప్రతి చేనుకు నీరందించడమే మోదీ సర్కార్ లక్ష్యం: రాధామోహన్ సింగ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి చేనుకు నీరందించడమే లక్ష్యంగా మోదీ సర్కార్ ముందుకు సాగుతోందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందించడానికి ఈ-మార్కెటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. దేశంలోని 550 ప్రముఖ మార్కెట్లను ఈ విధానంతో అనుసంధానం చేస్తామన్నారు. వారం, పది రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కరువు సహాయం అందజేస్తామని ప్రకటించారు. వ్యవసాయరంగంలో సంస్కరణలు తీసుకురానున్నట్లు చెప్పారు. వ్యవసాయరంగాభివృద్ధి కోసం ఆర్కేవీవై (రాష్ట్రీయ కృషి వికాస్ యోజన), పీకేవీవై (పరంపరగత్ కృషి వికాస్ యోజన) పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, టి.హరీష్‌రావు, ఐసీఐఆర్ చైర్మన్ అయ్యప్పన్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగుల నినాదాలు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సభా ప్రాంగణంలో నిరుద్యోగ యువ కులు నినాదాలు చేశారు. సభలో కేసీఆర్ ప్రసంగం చివరి దశకు చేరుకున్న తరుణంలో యువకులు తాము కూర్చున్న చోటు నుంచే.. ‘ఉద్యోగాలు లేని చదువులెందుకు..? నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి’ అంటూ నినదించారు. కొందరు యువకులు కుర్చీలపై నిలబడి గట్టిగా అరవడానికి ప్రయత్నించారు. -
హార్టికల్చర్ వర్సిటీకి శంకుస్థాపన
ములుగు లో హార్టికల్చర్ యూనివర్సిటీకి తెలంగాణ సీఎం కే సీఆర్ శంకుస్తాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ మాట్లాడుతూ.. దేశంలో ప్రతి రైతూ.. తన బిడ్డను రైతు చేయాలనుకునే రోజు రావాలని ఆకాంక్షించారు. వ్యవసాయం లాభసాటిగా మారాలని అన్నారు. మరో వైపు ముఖ్య మంత్రి కేసీఆర్ ఏప్రిల్ 30 కల్లా ప్రతి ఇంటికీ నల్లా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహాకారం కావాలని కోరారు. -
హార్టికల్చర్ వర్సిటీకి శంకుస్థాపన
-
బాపూజీ పేరుతో హార్టికల్చర్ వర్సిటీ
మెదక్: కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో హార్టికల్చర్ యూనివర్సిటీని స్థాపిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మెదక్ జిల్లా ములుగులో 5 ఎకరాల పొలాన్ని కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో 45 ఎకరాల్లో బాలికలు, బాలుర కోసం వేర్వేరుగా ఎడ్యుకేషనల్ హబ్‌లను ఏర్పాటు చేస్తూ నిర్ణయాలు తీసుకుంది. ఈ ఎడ్యుకేషన్ హబ్‌లు 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు బాలురు, బాలికల కోసం ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో మారేడుపల్లిలో నిర్మించనున్న క్రిస్టియన్ భవన్ నమూనాకు సీఎం ఆమోదం తెలిపారు. అదే విధంగా రెండు ఎకరాల్లో నిర్మించనున్న క్రిస్టియన్ భవన్లో అన్ని హంగులూ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. సికింద్రాబాద్ మారేడుపల్లిలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న క్రిస్టియన్ భవనాల నమూనాలు సికింద్రాబాద్ మారేడుపల్లిలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న క్రిస్టియన్ భవనాల నమూనాలు -
త్వరలో గ్రీన్హౌస్ మార్గదర్శకాలు
* రాష్ట్రస్థాయిలో రెండు, జిల్లాస్థాయిలో ఒకటి * త్వరలో కంపెనీల నుంచి టెండర్లకు ఆహ్వానం * నెలాఖరులోగా రైతుల నుంచి దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పూలు, పళ్లు, కూరగాయల తోటల పెంపకం కోసం చేపట్టే అతిపెద్ద ప్రాజెక్టు గ్రీన్హౌస్. వెయ్యి ఎకరాల్లో దీనిని అమలు చేయడానికి బడ్జెట్లో రూ. 200 కోట్లను కేటాయించారు. ప్రాజెక్టు మార్గదర్శకాల ఖరారుకు మూడు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఉద్యానశాఖ కమిషనర్ ఛైర్మన్‌గా రాష్ట్రస్థాయిలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ శాఖ జాయింట్ డెరైక్టర్ మెంబర్ కన్వీనర్‌గా, మరో 12 మంది సభ్యులుగా ఉంటారు. ప్రాజెక్టు అమలును ఈ కమిటీ పర్యవేక్షించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రెండోది రాష్ట్రస్థాయి టెక్నికల్ కమిటీ. హార్టికల్చర్ యూనివర్సిటీ డెరైక్టర్ దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో 11 మంది సభ్యులుంటారు. ప్రధానకమిటీ ఇచ్చే మార్గదర్శకాలను ఇది అమలుచేస్తుంది. యూనిట్ల ధరలు నిర్ణయిస్తుంది. గ్రీన్‌హౌస్‌కు టెండర్లను ఆహ్వానిస్తుంది. ఆయా కంపెనీల సాంకేతిక సామర్థ్యం, కోట్‌చేసే ధరలను అధ్యయనం చేసి టెండర్లను ఖరారు చేయడంలో కీలకపాత్ర వహిస్తుంది. మూడవకమిటీ జిల్లాస్థాయిలో కలెక్టర్ ఛైర్మన్‌గా ఎగ్జిక్యూటివ్/మానిటర్ కమిటీగా ఉంటుంది. ఇందులో 10 మంది సభ్యులుంటారు. క్షేత్రస్థాయిలో గ్రీన్‌హౌస్‌ను అమలుచేసే బాధ్యత వీరిదే. రైతుల దరఖాస్తులు స్వీకరించడం, అర్హులను గుర్తించడం వీరి బాధ్యత. క్షేత్రస్థాయి పర్యటనలు చేసి రైతులకు శిక్షణ, సెమినార్లు నిర్వహిస్తారు. నెలాఖరులోగా దరఖాస్తుల స్వీకరణ... నెలాఖరులోగా గ్రీన్హౌస్ ప్రాజెక్టుకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఉద్యానశాఖ యోచిస్తోంది. మార్గదర్శకాలు ఖరారయ్యాక ఆసక్తి గల రైతులను గుర్తించాలని నిర్ణయించింది. హైదరాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల పరిధిలో దీన్ని చేపట్టాలని అనుకుం టున్నా, ఇతర ప్రాంతాల వారు ఆసక్తి చూపితే వారికి కూడా అనుమతి ఇవ్వాలని యోచి స్తోంది. ఉద్యానశాఖ జాయింట్ డెరైక్టర్ వెంకట్రామ్రెడ్డి ఇప్పటికే పలు సమావేశాలు జరి పారు. టెండర్లను పిలువడానికి సన్నాహాలు చేస్తున్నారు. నగర శివారులో ఏర్పాటు చేసిన గ్రీన్హౌస్లను అధ్యయనం చేసి ఏ కంపెనీకి ఇస్తే బాగుంటుందో అంచనా వేస్తున్నారు. -
500 ఎకరాల్లో హార్టీకల్చర్ వర్సిటీ: కేసీఆర్
మెదక్: గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సందర్శించారు. 500 ఎకరాల్లో ఫారెస్ట్ వర్సిటీ, మరో 500 ఎకరాల్లో హార్టీకల్చర్ యూనివర్సిటీ నెలకొల్పుతామని ఈ సందర్భంగా కేసీఆర్ వెల్లడించారు. 75 ఎకరాల్లో హాస్టళ్లు, ఆఫీసు రూముల ఏర్పాటు చేస్తామని, దీనంతటికి రూ. వెయ్యి కోట్లు అవసరమవుతుందని తెలిపారు. రూ.200 కోట్లు కేంద్రం నుంచి మంజూరయ్యాయరని, వారం రోజుల్లో తానే శంకుస్థాపన చేస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. -
జిల్లా ప్రణాళిక రూ 2149 కోట్లు
నిజామాబాద్ అర్బన్ : మన జిల్లా-మన ప్రణాళికలో భాగం గా రూ. 2,149 కోట్లతో అభివృద్ధి పనులను ఖరారు చేశారు. శనివారం ప్రగతి భవన్లో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు హాజరైన సమీక్ష సమావే శం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగింది. ఇప్పటి వరకు మన ప్రణాళిక- మన గ్రామం నుంచి రూ. 1,183 కోట్ల తో, మన మండలం -మన ప్రణాళిక నుంచి రూ. 966 కోట్ల అంచనాలతో అభివృద్ధి పనులు రూపొం దించినట్లు మంత్రి పోచారం పేర్కొన్నారు. ఈ ప్రణాళిక ఐదు సంవత్సరాల వరకు అమలవుతుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనులను జిల్లా ప్రణాళిక లో చేర్చారు. పిట్లంలోని వేంపల్లి మత్తడి పూర్తి చేయడం ద్వారా 4 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, లెండి ప్రాజెక్టుకు రూ. 150 కోట్లు అదనంగా ఇస్తే 38 శాతం సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో ప్రాణహిత చేవెళ్లకు చెందిన చెరువులు, ట్యాంకుల నిర్మాణం సక్రమంగా లేదని, ప్రాణహిత చేవెళ్ల ప్రారంభమయితే నష్టం జరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. చెరువులు, ట్యాంకులను ప టిష్టం చేసందుకు మరో రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్లు ఇవ్వాలన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 16 లిఫ్టులు ఉండగా, ఇందులో ఎనిమిది పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెలిపారు. గతంలో కాంట్రాక్టర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో ఇవి పోయాయని ఆరోపించారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ మాట్లాడుతూ దోమకొండ మండలం బీబీపేట చెరువు, భిక్కనూరు, కాచాపూర్ చెరువులకు సంబంధించి అభివృద్ధి పనులను చేపట్టాలని ప్రతిపాదించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ గుజ్జల్తండా చెరువు సామర్థ్యం పెంచితే 15 వేల ఎకరాలకు సా గునీరు అందుతుందని తక్షణమే పెంచాలన్నా రు. ఆర్మూర్ నియోజకవర్గంలో గుత్ప ఎత్తిపోతల పథకం విస్తరించి అమ్రాద్‌తండా వరకు పంపుసిస్టమ్ తీసుకువస్తే 22 గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. వ్యవసాయంపై జిల్లాలో హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మంత్రిని కోరారు. పోచారం, నిజాంసాగర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట ప్రాం తాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాల న్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ అంకాపూర్‌లో విత్తనశుద్ధి కర్మాగారం చే యాలని, అంకాపూర్‌ను ప్రత్యేక వ్యవసాయజోన్గా ఏర్పాటు చేయడం ద్వారా విత్త న రీసెర్చ్ సెంటర్, వ్యవసాయ గిడ్డంగులు ఏర్పాటు చేయాలన్నారు. అంకాపూర్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు, శాస్త్రజ్జులు సందర్శనకు వస్తున్నందున పీఆర్వోను ఏర్పాటు చేయాలని సూచించారు. మరికొన్ని ప్రణాళికలో జిల్లాలో 72 గోదాములు ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు ప్రతిపాదించగా పొందుపరిచారు. వ్యవసాయదారులకు సబ్సిడీపై జనరేటర్లు, వ్యవసాయ యంత్రాలు, ప్రత్యేక ట్రాక్టర్లు అందించేందుకు తీర్మానం చేశారు. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్‌ల ఏర్పాటు చేయాలని పొందుపరిచారు. పశుసంవర్ధకశాఖ జిల్లాలోని వెటర్నరీ కళాశాల ఏర్పాటు, 45 పశువైద్య ఆసుపత్రులు, 5 చెక్‌పోస్టులు , పాల వస్తువులు అందించేందుకు కృషి చేయడం, ఎర్రజొన్నచొప్ప, మొక్కజొన్నచొప్ప రిజర్వు చేసుకొని పశువులకు ఆహారంగా ఇచ్చేందుకే కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటు, పశువ్యాధి నిర్ధారణ భవనం, పశుసంవర్ధకశాఖలో అన్నిపోస్టులను భర్తీ చేయాలని తీర్మానించారు. జిల్లాలోని పనిచేయని చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను తిరిగి ప్రారంభించడం, వాటి ఉత్పత్తిని పెంచడం వంటి కార్యక్రమాలను రూపొందించారు. విద్యాశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ నుంచి 3వ తరగతి వరకు ఇంగ్లీష్ విద్యను అందించాలని ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రతిపాదించగా మిగితా ప్రజాప్రతినిధులు ఆమోదించారు. పాఠశాలల్లో టీచర్ల కొరతను తీర్చేందుకు రేషనైజేషన్ను చేపట్టడం, ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా చూడడం, డుమ్మ కొట్టే టీచర్లపై చర్యలు తీసుకోవడం, తరగతి గదులు అవసరమైన చోట చేపట్టాలని నిర్ణయించారు. అలాగే మండలానికో ప్రభుత్వ జూనియర్ కళాశాల, నియోజక వర్గానికి డిగ్రీ కళాశాల , కామారెడ్డిలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు ప్రణాళికలో పొందుపరిచారు. వైద్య ఆరోగ్యశాఖ జిల్లాలో అదనంగా 25 ప్రాథమిక ఆరోగ్యకేం ద్రాల ఏర్పాటు, ప్రతి ఆసుపత్రిలో వైద్యు డు, కుక్కకాటుకు, పాముకాటుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచా లి. ప్రతి నియోజక వర్గంలో ఏరియా ఆసుపత్రి, పెద్ద మండలంలో పది పడకల మరో ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య కేంద్రాలను పెంపొందించాలి. వీటి సేవలను గ్రామీణ స్థాయికి తీసుకెళ్లేందుకు పాటుపడాలి. జిల్లా కేంద్రంలో జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయానికి ఐదు ఎకరాల స్థలం, రూ. 2 కోట్ల రూపాయల మంజూరుకు ప్రతిపాదించారు. పంచాయతీరాజ్ ప్రతి గ్రామానికి రోడ్లు, మండలం నుంచి జిల్లాకు రోడ్ల విస్తరణ చేపట్టాలి. ఎల్లారెడ్డిలో ఆరు గ్రామాలకు, ఆర్మూర్ నియోజక వర్గంలో 8 గ్రామాలు, బాల్కొండ నియోజకవర్గంలో 4 గ్రామాలు, కామారెడ్డి పరిధి లో 4 గ్రామాల నుంచి మండలాలకు రోడ్ల విస్తరణ చేపట్టేందుకు నిర్ణయించారు. బిచ్కుంద, మద్నూరు, జుక్కల్ ప్రాంతాలకు రోడ్ల విస్తరణ, నందిపేట, నిజామాబాద్, ఆర్మూర్, నందిపేట నుంచి నూత్పల్లి వరకు రోడ్ల బాగుకు ఈ ప్రణాళికలో చేర్చారు. ఈనెల 31వరకు ఎక్కడెక్కడైతే అభివృద్ధి పనులకు అసౌకర్యం ఉందో కలెక్టర్‌కు సమర్పిస్తే ప్రణాళికలో పొందుపరుస్తామని మంత్రి పోచారం సమావేశంలో తెలియజేశారు. -
మంత్రులూ పారా హుషార్
► ఉద్యాన వర్సిటీ మనదేనా ► పొరుగు జిల్లాకు తరలుతుందా ► సిరిసిల్లలో ఐఐఎం ప్రతిపాదనలు ► సాధ్యాసాధ్యాలపైనే సందేహాలు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ఊరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హార్టికల్చర్ యూనివర్సిటీ... ప్రతిష్టాత్మకమైన ఐఐఎం ఏర్పాటుకు ఆగమేఘాలపై స్థల సర్వే చేపట్టడం జిల్లా ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఈ రెండు ఉన్నత విద్యాసంస్థలు నెలకొల్పితే... జాతీయ స్థాయిలోనే కరీంనగర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు జిల్లా ప్రజలకు చేరువవుతాయి. మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్ ప్రత్యేకంగా జిల్లాపై దృష్టి కేంద్రీకరించటంతో వీటిని మన జిల్లాలోనే ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇంతకీ రెండు ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి..? యూనివర్సిటీ పొరుగు జిల్లాకు తరలివెళుతుందా..? ఐఐఎం ఏర్పాటుకు అనువైన సదుపాయాలు అందుబాటులో లేవా..? అనే సందేహాలు చర్చనీయాంశంగా మారాయి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణలో హార్టికల్చర్ యూనివర్సిటీకి చోటు కల్పించింది. దీంతో యూనివర్సిటీ ఏర్పాటుకు అనువుగా ఒకే చోట 500 ఎకరాల విస్తీర్ణపు స్థలం కావాలని... ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వెంటనే వివరాలు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు కథలాపూర్, సిరిసిల్ల, రామగుండం మండలాల్లో అనువైన స్థలాన్ని గుర్తించారు. ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ స్వయంగా వెళ్లి ఈ స్థలాలను పరిశీలించారు. ► కథలాపూర్ మండలంలోని గంభీర్పూర్లో 413 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండటంతో యూనివర్సిటీకి అనుకూలంగా ఉంటుందని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నెల 7న జిల్లా అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించినపుడు ఉద్యానశాఖ కార్యదర్శికి ఈ నివేదికను అందించినట్లు సమాచారం. ► జగిత్యాల డివిజన్లో వ్యవసాయ పరిశోధన కేంద్రం, అగ్రికల్చర్ కాలేజీ, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ, చల్గల్ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రం ఉంది. వీటికి సమీపంగా కథలాపూర్ మండలంలో యూనివర్సిటీ నెలకొల్పితే భవిష్యత్తులో ఈ ప్రాంతం అగ్రికల్చర్ హబ్‌గా వెలుగొందే అవకాశముంది. ► ఈలోగా హార్టికల్చర్ యూనివర్సిటీ పొరుగున ఉన్న మెదక్ జిల్లాకు తరలివెళుతుందనే ప్రచారం జోరందుకుంది. సిద్ధిపేట ప్రాంతంలో ఏర్పాటుకు ఉన్నత స్థాయి అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. సొంత జిల్లా కావటంతో పాటు అక్కడి ప్రజాప్రతినిధుల ఒత్తిడితో సీఎం సిద్ధిపేటకే మొగ్గు చూపుతున్నట్లు ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతోంది. ► ఈలోగా ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు మరో లేఖ అందింది. దీనికి సైతం 500 ఎకరాల స్థలం కావాలని సూ చించింది. అప్పటికే సర్వే చేసిన రెవెన్యూ యంత్రాంగం ఈ మూడు ప్రాంతాల్లోనే అంత భారీ విస్తీర్ణంలో ప్రభుత్వ భూమి ఉన్నట్లుగా గుర్తించింది. దీంతో ఐఐఎం ఏర్పాటుకు సిరిసిల్ల మండలంలోని పెద్దూరు, సర్దాపూర్ పరిసర ప్రాంతాలను సర్వే చేసింది. దాదాపు 1600 ఎకరాల స్థలం ఉందని ప్రభుత్వానికి నివేదించింది. ► కానీ... కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఐఐఎం ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ఇటీవలి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో ఐఐఎం ప్రస్తావన లేదు. ఐఐఎం లేని రాష్ట్రాలన్నింటా కొత్తగా ఐఐఎం నెలకొల్పే ఆలోచన ఉందని.. అందులో భాగంగా తెలంగాణలో ఏర్పాటు చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తామని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ భరోసా ఇచ్చారు. ► తెలంగాణలో ఐఐఎం నెలకొల్పాలని ఎంపీ కవిత, మాజీ మంత్రి ఎస్.వేణుగోపాలాచారి నుంచి అందిన విజ్ఞప్తులపై మంత్రి రాజ్యసభలో ఆ సమాధానమిచ్చారు. దీంతో భవిష్యత్తులో ఐఐఎం ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నా.. సిరిసిల్ల ప్రాంతం అనువైంది కాదని ఉన్నతాధికార వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ► హైదరాబాద్ నుంచి సిరిసిల్ల 200 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది. ఐఐఎం జాతీయ స్థాయి విద్యాసంస్థ కావటంతో విమానాశ్రయంతో పాటు రోడ్డు, రైల్వే రవాణా మార్గాలుండే ప్రాంతాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ లేదా పరిసర ప్రాంతాల్లో ఐఐఎం ఏర్పాటుకు అనువైన సదుపాయాలు ఉంటాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.