
సాక్షి, అమరావతి: బత్తాయి, నిమ్మ పంటల సాగు.. దిగుబడి, ఎగుమతులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ ఏడాదిని చీని, నిమ్మ సంవత్సరంగా ప్రకటించాలని నిర్ణయించామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. మంగళవారం ఆయన డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పలువురు ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, నిమ్మ, బత్తాయి సాగు రైతులతో మంత్రి కన్నబాబు మాట్లాడారు.
నిమ్మ, బత్తాయి అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించేలా ప్రణాళికలు చేసేలా సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారని తెలిపారు. రైతులకు రెట్టింపు ఆదాయం, గ్రామాల్లో ఉపాధి, వారి జీవన ప్రమాణ స్థాయి పెరిగేలా సీఎం పాలన సాగిస్తున్నారని తెలిపారు. నాణ్యమైన మొక్కలు, అంట్లను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆర్‌బీకేల ద్వారా నిమ్మ, బత్తాయి సాగు శిక్షణ, సమగ్ర యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సిట్రస్ పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
చదవండి: వ్యాక్సినేషన్: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
కరోనా వేళ ‘సంక్షేమం’ భేష్
Comments
Please login to add a commentAdd a comment