Lemon crop
-
ఈ జాగ్రత్తలు తీసుకుంటే నిమ్మ రైతులకు డబ్బే డబ్బు
-
China: నిమ్మకాయలకు భారీ క్యూలు కడుతున్న చైనా ప్రజలు
చైనాలో ఆంక్షలు సడలించగానే ఒక్కసారిగా అనూహ్యంగా కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇది చాలదన్నట్లు మరో ముప్పు ఉందని, మరి కొద్దిరోజుల్లో ప్రపంచంపై మరోసారి కరోనా వైరస్ పంజా విసురుతుందని నిపుణలు సైతం హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో ఒక్కసారిగా చైనాలో నిమ్మకాయలకు అమాంతంగా డిమాండ్ పెరిగిపోయింది. అక్కడ ప్రజలంతా నిమ్మకాయలు కొనేందుకు దుకాణాల వద్దకు ఎగబడటంతో ధరలు సైతం అమాంతంగా పెరిగినట్లు సమాచారం. కరోనా భారి నుంచి బయటపడేందుకు రోగనిరోధక శక్తి కోసం చైనీయులు విటమిన్ సీ అధికంగా ఉండే నిమ్మకాలయను కొనుగోలు చేసేందుకు బారులు తీరుతున్నారు. దీంతో నిమ్మ రైతుల వ్యాపారాలు అకస్మాత్తుగా పుంజుకున్నాయి. ఈ మేరకు నైరుతీ ప్రావిన్స్ కౌంటీ ఎన్యూలో ఒక నిమ్మ రైతు తాను సుమారు 130 ఎకరాల్లో నిమ్మాకాయలు పండిస్తున్నానని, తన విక్రయాలు రోజుకు 20 నుంచి 30 టన్నులు పెరిగాయని చెబుతున్నాడు. పైగా గతంలో కేవలం 5 నుంచి 6 టన్నులుగా మాత్రమే తన విక్రయాలు ఉండేవని తెలిపాడు. అదీగాక గత మూడేళ్లుగా జీరో కోవిడ్ పాలసీ పేరుతో కఠిన ఆంక్షలు విధించి ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేసిన చైనా ప్రభుత్వమే ప్రజల కోసం తన తీరుని మార్చుకుంది. దీంతో ప్రజలు ఈ కరోనా మహమ్మారితో పోరాడేందుకు సహజసిద్ధమైన వాటిపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే విటమిన్ సీ అధికంగా ఉండే నిమ్మ జ్యూస్‌లు తాగి రోగ నిరోధక శక్తి పెంపొందించుకునేందుకు రెడీ అవుతున్నారు. గత నాలుగు ఐదు రోజుల నుంచి నిమ్మ ధరలు రెట్టింపు అయినట్లు మరో రైతు లియు యాంజింగ్ చెబుతున్నారు. తాను మొన్నటి వరకు అరకిలో నిమ్మకాయలు రూ. 22 నుంచి 35 రూలు వరకు అమ్మానని, ఇప్పుడూ ఏకంగా రూ. 61కి అమ్ముతున్నట్లు తెలిపాడు. గత కొద్దిరోజులుగా ఈ కరోనా ఆంక్షలతో ఎగుమతులు లేక కూరగాయాలు, పళ్ల వ్యాపారులు నష్లపోయినట్లు చెబుతున్నారు. ఇప్పుడూ ప్రజలు తాజా పళ్లు మంచివని, అందులోని నిమ్మరసం సేవించడంతో ఈ వైరస్ నుంచి బయటపడవచ్చిన ప్రజలు నమ్మడంతో వీటికి డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. అదీగాక ఈ కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రజలు తాజా కూరగాయాలు, ఇతర పళ్లు బేరీ, నారింజ, పీచెస్ వంటివి తెగ కొంటున్నారని, విక్రయాలు కూడా అమాంతంగా పెరిగాయని రైతులు తెలిపారు. (చదవండి: బాప్రే! ఒకటి, రెండు కాదు.. ఏకంగా 11 వేలకు పైగా హత్యలు చేసిన 97 ఏళ్ల వృద్ధురాలు) -
ఉద్యాన సిరులు
ఈమె పేరు పాదర్తి కృష్ణమ్మ. పొదలకూరు మజరా లింగంపల్లి. కృష్ణమ్మ ఈ ఏడాది 1.20 ఎకరాల్లో కూరగాయాల సాగు చేపట్టింది. ఉద్యానశాఖ ద్వారా ఆమెకు రూ.19,200 సబ్సిడీ బ్యాంకు ద్వారా ప్రభుత్వం అందజేసింది. కూరగాయాల సాగులో మెళకువలను తెలుసుకుని దిగుబడి సాధించారు. యర్రనాగు దొరసానమ్మ. మండలంలోని మొగళ్లూరు. ఆమె తన ఎకరా పొలంలో నిమ్మ మొక్కలు నాటారు. ఆమెకు ఉద్యానశాఖ ద్వారా ఈ ఏడాది రూ.9,602 రాయితీ లభించింది. ఉద్యానాధికారుల సలహాలు సూచనలతో చీడపీడలు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా అందజేస్తున్న రాయితీ వస్తుందని, దీనిపై ఆధారపడి నిమ్మ మొక్కలు నాటుకున్నట్టు వెల్లడించారు. ఈ రైతు పేరు అక్కెం అంకిరెడ్డి. మండలంలోని ముదిగేడు. తనకున్న 1.20 ఎకరాల్లో నిమ్మమొక్కలు నాటుకుని జీవిస్తున్నారు. ఉద్యానశాఖ రాయితీ సహకారంతో తోటలో మల్చింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఈ ఏడాది రూ.19,200 బ్యాంకులో సబ్సిడీ నగదు జమఅయ్యింది. ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా కల్పిస్తున్న రాయితీలు రైతుకు ఉపయోగకరంగా ఉన్నాయి. పొదలకూరు: పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో పండ్ల తోటల విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా రాయితీలను అందజేస్తోంది. ప్రధానంగా 70 శాతం మంది రైతులు వరి సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే పంట మార్పిడి పద్ధతిని రైతులకు అలవాటు చేసే దశగా ప్రభుత్వం ఉద్యాన పంటలను గణనీయంగా పెంచేందుకు కృషి చేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు అదనంగా మరో 20 వేల హెక్టార్లలో సాగు పెంచేందుకు ఉద్యానశాఖ కసరత్తు చేస్తోంది. నిమ్మ, మామిడి విస్తీర్ణం పెరుగుతున్నా మిగిలిన పండ్ల తోటల సాగు ఇంకా పెరగాల్సి ఉంది. ప్రభుత్వ ప్రకటిస్తున్న రాయితీలతో పండ్లు, కూరగాయలు, పూల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. మూడు విడతల్లో రాయితీ పండ్ల తోటల పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని మూడు విడతలుగా పంపిణీ చేస్తోంది. పండ్ల తోటల సాగు ద్వారా అధిక దిగుబడులను సాధించేందుకు నూతనంగా తోటల అభివృద్ధి పరిచేందుకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. పండ్ల తోటలతో పాటు మల్లె, చామంతి, కనకాంబరం, బంతి, లిల్లీ పూల తోటల పెంపకానికి కూడా రాయితీలను అందజేస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులు పెట్టే మొత్తం ఖర్చులో 40 శాతం రాయితీని హెక్టారుకు రూ.16 వేలు, ఇతర రైతులకు 25 శాతం హెక్టారకు రూ.10 వేలు అందజేస్తున్నారు. పూలపెంపకం మల్చింగ్‌కు రూ.16 వేలు, ప్రాసెసింగ్ యూనిట్‌కు రూ.10 లక్షలు, ప్యాక్‌హౌస్ రూ.2 లక్షలు, కోల్డ్‌స్టోరేజ్‌కు రూ.5.25 లక్షలు, సంకరజాతి కూరగాయాల పెంపకానికి హెక్టారుకు ఏడాదికి రూ. 20 వేలు అందజేస్తున్నారు. యాంత్రీకరణకు రాయితీలు ఉద్యాన యాంత్రీకరణకు రాయితీలు అందజేస్తున్నారు. ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులు 50 శాతం, ఇతరులు 40 శాతం రాయితీ పొందవచ్చు. మినీ ట్రాక్టర్‌కు రూ.75 వేలు, పవర్ టిల్లర్ రూ.40 వేలు, తైవాన్ స్ప్రేయర్ రూ.8 వేలు రాయతీ కల్పిస్తున్నారు. కరువు పరిస్థితుల్లో ఉద్యాన పంటలను రక్షించుకునేందుకు తోటల్లో నీటి కుంటల నిర్మాణానికి ఉద్యానశాఖ ద్వారా కమ్యూనిటీ నీటి కుంట రూ.20 లక్షలు, పంట కుంట రూ.75 వేలు అందజేస్తున్నారు. పంటల సాగుకు ప్రోత్సాహం ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలను అందజేస్తోంది. ప్రధానంగా పండ్ల తోటల సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. రైతుల అనుమానాలను క్షేత్రస్థాయికు వెళ్లి నివృత్తి చేస్తున్నాం. ఉద్యానశాఖ నిబంధనల ప్రకారం రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాం. – ఈ.ఆనంద్, ఉద్యానాధికారి, పొదలకూరు -
నిమ్మ.. ధర అదిరెనమ్మ!
జమ్మలమడుగు: జిల్లాలో నిమ్మ సాగు చేసిన రైతులకు కాసుల పంట పండింది. ఈ ఏడాది నిమ్మ దిగుబడి తక్కువగా ఉన్నా ధర ఎక్కువగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 3527 ఎకరాల్లో నిమ్మతోటలను సాగుచేశారు. గత ఏడాది భారీ వర్షాల కారణంగా నిమ్మతోటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. సాధారణంగా వేసవి కాలంలో ప్రతి ఏడాది భారీగా దిగుబడి వచ్చేది. అయితే ఈ ఏడాది భూమిలో తేమశాతం ఎక్కువ కావడంతో నిమ్మ చెట్లకు ఉన్న పూత రాలిపోయింది. దీంతో దిగుబడి కాస్త తగ్గిపోయింది. అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో నిమ్మకాయలకు భారీ గిరాకీ వచ్చింది. నిమ్మకాయల బస్తా రూ.7వేలు నిమ్మకాయల బస్తా ఏడు వేల రూపాయలు పలికింది. ప్రతి బస్తాలో 800 నుంచి 1000 నిమ్మకాయలు నింపి వరిగడ్డి వేసి బస్తాలను బెంగళూరుకు ఎగుమతి చేస్తూ వచ్చారు. జిల్లాలో పులివెందుల డివిజన్ ప్రాంతంలో అత్యధికంగా 1750 ఎకరాల్లో నిమ్మసాగును రైతులు సాగుచేస్తున్నారు. ఆ తర్వా త కడప డివిజన్లో 868 ఎకరాలు, జమ్మలమడుగు డివిజన్లో జమ్మలమడుగు, మైలవరం మండలాల్లో 549 ఎకరాల్లో, బద్వేలు డివిజన్లో 360 ఎకరాల్లో పంటను సాగుచేశారు. ప్రస్తుతం పంట తక్కువగా ఉండటంతో వచ్చిన దిగుబడిని ఏరోజుకారోజు బెంగళూరుకు ప్రత్యేక వాహనాలలో ఎగు మతి చేసి అత్యధికంగా లాభాలను ఆర్జిస్తున్నారు. అధికారులు సలహాలు ఇవ్వాలి ఈ ఏడాది దిగుబడి తక్కువగా ఉన్నా నిమ్మ కు మంచి గిరాకీ ఉంది. ప్రతి ఏడాది తోటలో 15 చెట్లు ఎండిపోతున్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గిపోతోంది. అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు సూచనలు సలహాలు ఇస్తే పంట దిగుబడి పెంచుకుంటాము. – నరసింహ, నిమ్మరైతు, గండికోట ఎండుపుల్లలు కత్తిరించాలి ప్రస్తుతం నిమ్మకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. రైతులు మంచి దిగుబడి పొందాలంటే చెట్లపై ఉన్న ఎండు పుల్లలను కత్తిరించి సున్నం, మైలుతుత్తి కలిగిన బార్డోపేస్ట్, బోర్డో పిచికారీ చేస్తే ఎండు తెగులు, ఎండు పుల్లలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. –భరత్‌రెడ్డి, ఉద్యాన అధికారి -
అమ్మపాలెంలో నిమ్మ జాతర.. ఇంటింటికీ సిరుల పంట, ఎలాగంటే..
జంగారెడ్డిగూడెం (పశ్చిమ గోదావరి): నష్టాల నుంచి బయటపడేందుకు ఆ పంట వైపు మొగ్గారు. కష్టం కాయై కాసింది. నష్టం గట్టెక్కింది. దీంతో ఆ గ్రామంలోని రైతులు అటుగా అడుగులు వేశారు. నేడు ప్రతీ రైతుకు ఆ పంట సిరులు కురిపిస్తోంది. అదే అమ్మపాలెం నిమ్మ. జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెంలో ప్రతీ రైతు నిమ్మ పంటను పండిస్తున్నారు. గ్రామంలో సుమారు 100 ఇళ్లు ఉండగా, 150 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 100 మంది రైతులుగా ఉన్నారు. ప్రతీ రైతుకు ఉన్న భూమిలో కొంత భూమిలో నిమ్మ పంట పండిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే ప్రధానంగా నిమ్మపంటపై ఆధారపడటమే కాక, కుటుంబసభ్యుల అంతా కలిసి నిమ్మ సేద్యం చేస్తారు. తమ కుటుంబాల్లో ఉన్న విద్యార్థులు కూడా ఖాళీ సమయాల్లో నిమ్మతోటలకు వెళ్లి సొంతంగా కష్టపడుతారు. గ్రామరెవెన్యూ పరిధిలో సుమారు 600 హెక్టార్లు ఉండగా, దీనిలో 300 ఎకరాలు రైతులు నిమ్మపంట వేశారంటే విశేషమేమిటో ఇట్టే అర్థమవుతుంది. సుమారు 15 – 20 ఏళ్ల క్రితం వరకు గ్రామ రైతులు మిరప, పొగాకు వేసేవారు. ఆ సమయంలో ఈ పంటలకు నష్టాలు రావడంతో ఒకరిద్దరు రైతులు ప్రయోగాత్మకంగా నిమ్మపంట వేశారు. అంతే నిమ్మ పంట సిరులు కురిపించింది. ఇలా దశలవారీగా రైతులంతా తమ పంట భూమిలో కొంత మేర నిమ్మ పంట వేశారు. మెరకపొలాలు, వరి పొలాల్లో కూడా నిమ్మపంట వేశారు. దీంతో సేద్యపుభూమిలో సగ భూమి నిమ్మతోటలు వేశారు. ఎకరానికి సుమారు లక్ష రూపాయలు ఆదాయం రైతులకు లభిస్తోంది. దీంతో నిమ్మపంట అమ్మపాలెం గ్రామానికి బంగారం పంటగా మారిపోయింది. ఇప్పుడు ఊరంతా నిమ్మపంటపైనే ఆధారపడ్డారు. అంతే గాక రైతు ఇంటి పెరట్లో ఖాళీ జాగా ఉంటే ఖచ్చితంగా ఒకటి రెండు నిమ్మచెట్లు సెంటిమెంట్‌గా పెంచుతున్నారు. ఊరంతా రైతు కుటుంబాలే. వీరంతా ఒకే మాటపై కట్టుబడి ఉంటారు. పూర్వం సూరవరపు పున్నయ్య అనే వ్యక్తి గ్రామపెద్దగా వ్యవహరించారు. ఆయన మృతి అనంతరం ఆయన కుమారుడు రాంబాబు ప్రస్తుత గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్నారు. అందరూ ఒకే కట్టుబాటు, సాంప్రదాయాలపై ఏకతాటిపై ఉంటారు. గ్రామంలో పండించిన నిమ్మ పంటను కుటుంబసభ్యులంతా ప్రతీ రోజు తోటల్లోకి వెళ్లి నిమ్మకాయలు కోసి సంచుల్లో నింపి ఊర్లో రోడ్డుపక్కన ఉంచుతారు. నిమ్మకాయల వ్యాపారులు మోటార్‌సైకిళ్లపై వచ్చి ఒకొక్క రైతు నుంచి వరుసుగా కొనుగోలు చేసుకుని ట్రక్కు, ఆటోలో ఏలూరు నిమ్మ మార్కెట్‌కు తరలిస్తారు. ఈ విధంగా రైతులకు నిమ్మకాయల మార్కెట్ ఇబ్బంది కూడా లేకుండా ఉంది. అమ్మపాలెం పండే నిమ్మ పంట మంచినాణ్యత కలిగి ఉంటుంది. మంచి ధర లభిస్తుంది. -
ఇది ‘చీని, నిమ్మ’ సంవత్సరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిమ్మ, బత్తాయి సాగు, ఎగుమతులను ప్రోత్సహించే సంకల్పంతో 2021–22 సంవత్సరాన్ని చీని, నిమ్మ సంవత్సరంగా ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. రాష్ట్రంలో నిమ్మ, బత్తాయి (చీని) సాగును ప్రోత్స హించడం ద్వారా రైతులకు రెట్టింపు ఆదాయం, గ్రామాల్లో ఉపాధి, వారి జీవనప్రమాణ స్థాయిని పెంపొందించేలా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యానపంటల సాగు, దిగుబడి, ఎగుమతులు తదితర అంశాలపై ఉద్యాన వర్శిటీ శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖాధికారులతో మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న ఆంధ్రా బత్తాయితోపాటు నిమ్మ సాగు, ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఏడాదిని చీని, నిమ్మ నామ సంవత్సరంగా ప్రకటించామన్నారు. దేశంలో చీని దిగుబడిలో 66 శాతం మన రాష్ట్రం నుంచే దేశంలో చీని సాగులో సగం విస్తీర్ణం, దిగుబడిలో 66 శాతం వాటా మన రాష్ట్రానిదేనని చెప్పారు. మన రాష్ట్రంలో 95,982 హెక్టార్లలో సాగవుతోందని, ఏటా 22.03 టన్నుల దిగుబడి వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 43 వేల హెక్టార్లలో 7 లక్షల టన్నుల నిమ్మ దిగుబడి వస్తోందన్నారు. నాణ్యమైన అంట్లు, మొక్కలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి రాష్ట్రంలో చీని, నిమ్మ సాగు విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. రోగరహిత మొక్కలు, అంట్లు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉద్యానశాఖ సహకారంతో ఉద్యాన శాస్త్రవేత్తలు కృషిచేయాలన్నారు. ఈ పండ్ల నుంచి ఉత్పత్తులపై చిత్తూరు జిల్లా తిరుపతి, పెట్లూరు, నెల్లూరుల్లో ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో పరిశోధనలు చేయనున్నారని తెలిపారు. రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా రైతులకు చీని, నిమ్మలో మేలైన యాజమాన్య పద్ధతులపై శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సమగ్ర పంటల యాజమాన్యంపై తోటల్లోనే ప్రదర్శనలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ సమీక్షలో వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జానకిరామ్, ఉద్యానశాఖ కమిషనర్ శ్రీధర్ పాల్గొన్నారు. -
ఈ ఏడాదిని చీని, నిమ్మ సంవత్సరంగా ప్రకటిస్తున్నాం: కన్నబాబు
సాక్షి, అమరావతి: బత్తాయి, నిమ్మ పంటల సాగు.. దిగుబడి, ఎగుమతులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ ఏడాదిని చీని, నిమ్మ సంవత్సరంగా ప్రకటించాలని నిర్ణయించామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. మంగళవారం ఆయన డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పలువురు ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, నిమ్మ, బత్తాయి సాగు రైతులతో మంత్రి కన్నబాబు మాట్లాడారు. నిమ్మ, బత్తాయి అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించేలా ప్రణాళికలు చేసేలా సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారని తెలిపారు. రైతులకు రెట్టింపు ఆదాయం, గ్రామాల్లో ఉపాధి, వారి జీవన ప్రమాణ స్థాయి పెరిగేలా సీఎం పాలన సాగిస్తున్నారని తెలిపారు. నాణ్యమైన మొక్కలు, అంట్లను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆర్బీకేల ద్వారా నిమ్మ, బత్తాయి సాగు శిక్షణ, సమగ్ర యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సిట్రస్ పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. చదవండి: వ్యాక్సినేషన్: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం కరోనా వేళ ‘సంక్షేమం’ భేష్ -
‘కోవిడ్ చికిత్సకు అదనంగా రూ.1000 కోట్లు’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 138 ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో అదనంగా మరో 5 ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ సదుపాయలు కల్పించే దిశగా సాగుతున్నామని, వాటిలో ఇప్పటికే 3 ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కోవిడ్ సమీక్షా సమావేశంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. కొత్తగా తూర్పు గోదావరి జీజీహెచ్, పశ్చిమగోదావరిలో ఆశ్రం, గుంటూరు జీజీహెచ్, అనంతపూర్ జీజీహెచ్, శ్రీకాకుళం జీజీహెచ్ ఆస్పత్రులను రాష్ట్రస్థాయి కోవిడ్ ఆస్పత్రులుగా మారుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. తద్వారా క్రిటికల్‌కేర్ కోసం 2380 బెడ్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అనంతపూర్, శ్రీకాకుళం తప్ప మిగిలిన మూడు ఆస్పత్రులనూ క్రిటికల్ కేర్ సేవలు అందించడానికి సిద్ధం చేశామన్నారు. మొత్తంగా 8 ఆస్పత్రులు క్రిటికల్ కేర్ ఆస్పత్రులుగా మార్చామన్నారు. కాగా, వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు చెప్పారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం వీటిని ఖర్చు చేయాలని సూచించారు. అవసరమైన సిబ్బందిని నియమించుకుని మరణాలు తగ్గిచండంపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. రెమ్‌డెసివిర్, టోసీలిజుమబ్ వంటి మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై దృష్టిపెట్టాలని సీఎం చెప్పారు. క్వారంటైన్ సెంటర్లలో సేవలపై ప్రతిరోజూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వెల్లడించారు. కోవిడ్ టెస్టులు, క్వారంటైన్ సదుపాయాలకోసం రాష్ట్ర ప్రభుత్వం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. (చదవండి: కొత్త మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు) రికార్డుస్థాయిలో పరీక్షలు రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, పాజిటివిటీ అంశాలను అధికారులు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో రోజుకు రికార్డు స్థాయిలో 58వేల పరీక్షలు చేస్తున్నామన్నారు. కంటైన్ మెంట్ క్లస్టర్లు, కోవిడ్ సోకడానికి ఆస్కారం అధికంగా ఉన్న వారిపై దృష్టి పెట్టి ఈ పరీక్షలు చేస్తున్నామని, దీనివల్ల పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగిందని వివరించారు. దాదాపు 90 శాతం పరీక్షలు వీరికే చేస్తున్నామన్నారు. రానున్న కొన్నిరోజులు కేసుల తీవ్రత ఇలాగే కొనసాగి, తర్వాత తగ్గుముఖం పడుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలిపారు. ఈ అంకెలను చూసి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. నిమ్మ ధరలపై కీలక ఆదేశం రాష్ట్రంలో నిమ్మ ధరలు పడిపోవడంపై సీఎం వైఎస్ జగన్ శుక్రవారం సమీక్షించారు. రైతులకు మేలు చేసేలా కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రభుత్వమే నిమ్మ కొనుగోలు చేసి మద్దతు ధర వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశాలిచ్చారు. రేపటి నుంచి నిమ్మ కొనుగోలు చేపడతామని ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి కన్నబాబు మీడియాకు తెలిపారు. ఏలూరు, గుడివాడతో పాటు నిమ్మ మార్కెట్లలన్నింటిలో కొనుగోలు చేపడుతామని చెప్పారు. రైతుకు మద్దతు ధర వచేలా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. (ఫుడ్ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించాలి) -
‘నిమ్మ’ ధర..ఢమాల్!
నకిరేకల్ : వేసవికాలం నేపథ్యంలో నిమ్మ దిగుబడులు అధికంగా రావడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఒక బస్తా ధర రూ.1200 పలకగా, నాలుగు రోజులనుంచి పడిపోయింది. ప్రస్తుతం బస్తా ధర రూ.600లకు మించి రావడం లేదు. దీంతో నిమ్మ రైతులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 40వేల ఎకరాల్లో నిమ్మ తోటలు సాగువుతున్నాయి. ఏటా 2.50లక్షల టన్నుల దిగుబడులు వస్తాయి. అంటే రూ.300కోట్ల పైనే నిమ్మ వ్యాపారం సాగుతోంది. ఒక్కో నిమ్మకాయ బస్తా 22 కేజీలు ఉంటుంది. ఒక్కో బస్తాలో లావుకాయ అయితే 600 వరకు, చిన్న కాయలైతే 900 వరకు నింపుతారు. గతంలో నిమ్మరైతులు దళారులకు అమ్ముకునేవారు. ఎన్నో ఏళ్లనుంచి రైతులనుంచి వచ్చిన డిమాండ్ మేరకు నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్ ఏర్పాటు చేశారు. దాదాపు రూ.3కోట్లతో నకిరేకల్‌లోని తిప్పర్తిరోడ్డు చిమలగడ్డ సమీపంలో అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా నిమ్మమార్కెట్ నిర్మించారు. ఈ మార్కెట్ ప్రారంభమైన నాటి నుంచి నాలుగు రోజు ల క్రితం వరకు కూడా ఒక నిమ్మ బస్తా ధర రూ. 900నుంచి రూ.1300 ధర పలికింది. ప్రస్తుతం బస్తా ధర 400 నుంచి 600వరకు పడిపోయింది. ప్రధానంగా నిమ్మ దిగుబడులు అధికంగా రావడంతో ధరలు తగ్గుతున్నాయని మార్కెటింగ్ అధికారులు అంటున్నారు. సాయంత్రం 6 గంటలనుంచి మార్కెట్లో కొనుగోళ్లు ఇక్కడ ఈ మార్కెట్లో ప్రతి రోజు సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 11గంటల వరకు నిమ్మ వ్యాపారం సాగుతోంది. హైదరాబాద్, సూర్యపేట, కోదాడ తదితర ప్రాంతాలకు చెందిన నిమ్మ బేరగాళ్ళు ఇక్కడికి వచ్చి పాటలు పాడుతుంటారు. రైతులనుంచి కొనుగోలు చేసిన నిమ్మ దిగుబడులను హైదరాబాద్‌కు, అక్కడినుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు. రైతు దగ్గరినుంచి గతంలో మార్కెట్ ప్రారంభం కాకముందు దళారులు 13శాతం కమీషన్ తీసుకునేవారు. ప్రస్తుతం నిమ్మ మార్కెట్ ప్రారంభం చేయడంతో 4శాతం మేర కమీషన్ భారం రైతుపై పడుతోంది. నాలుగు రోజుల నుంచి గత ఏడాది కాలంగా కొనసాగిన ధర పడిపోవడంతో రైతులు కొంత నిరాశ నిసృహలకు లోనవుతున్నారు. బస్తా ధర రూ.900పైనే రావాలి మాది శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామం. నాకు ఆరు ఎకరాల్లో నిమ్మ తోట ఉంది. ఇటీవల గాలి దుమారంతో నిమ్మకాయలు రాలిపోయాయి. పక్షం రోజుల క్రితం ఈ మార్కెట్‌కు వచ్చినప్పుడు ఒక నిమ్మ బస్తా ధర రూ.1000 వరకు వచ్చింది. నాలుగు రోజులనుంచి తగ్గింది. రూ.600కు మించి ధర రావడం లేదు. ఒక్క నిమ్మ బస్తాకు కనీసం రూ.900 పైబడి ధర పలికితే రైతుకు లాభం ఉంటుంది. – తోట వీరయ్య, నిమ్మ రైతు, అంబారిపేట నిమ్మ ధరల్లో నిలకడ ఉండదు నిమ్మ ధరలలో నిలకడ ఉండదు. నిమ్మ మార్కెట్ ప్రారంభించిన నాటినుంచి ఇప్పటి వరకు రైతుకు మంచి మద్దతు ధర లభించింది. నాలుగు రోజులనుంచి ధరలు తగ్గుముఖం పట్టిన విషయం వాస్తవమే. నిమ్మ కాయలు ఎక్కువ దిగుబడి వస్తే ధర తగ్గుముఖం పడతాయి. వేసవి నేపథ్యంలో నిమ్మకు మంచిడిమాండ్ ఉంటుంది. రైతులకు కూడా తగిన ధర వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – వెంకన్న, ప్రత్యేక శ్రేణి కార్యదర్శి, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ -
‘నిమ్మ’ రైతు కళ్లల్లో చెమ్మ!
- పూర్తిగా పడిపోయిన ధరలు - గతేడాది ఇదే సీజన్లో బస్తా రూ.800.. ప్రస్తుతం కేవలం రూ.80 సాక్షి, నల్లగొండ: నిమ్మ పంటకు ధర లేక ఈ పంట సాగు చేసిన రైతుల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. గతేడాది ఇదే సీజన్లో బస్తా రూ.800 పలికితే ఇప్పుడు అందులో 10% ధర రూ.80 పలుకుతోంది. ధర లేక పంటకోసి మార్కెట్‌కు తరలిస్తే ఎక్కువ ఖర్చు వస్తున్నదని, చెట్లమీద ఉన్న కాయలను తెంపి పారబోస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిమ్మ రైతులు ధరలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద నిమ్మతోపాటు దొండకాయలను పారబోసి ఆందోళన వ్యక్తం చేశారు. నకిరేకల్ సమీపంలో ఇటీవల నిమ్మ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితేనే గిట్టుబాటు ధర దక్కేఅవకాశం ఉంది. దిగుబడి వచ్చినా.. ధర దరువు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 40 వేల ఎకరాల్లో నిమ్మ తోటలు సాగువుతున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించి ఈసారి దిగుబడి ఎక్కువ రావడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. కానీ ధర లేకపోవడంతో దిగుబడి ఎక్కు వ వచ్చిందన్న ఆనందం వారిలో ఆవిరైంది. వ్యాపారుల సిండి‘కేటు’ మాయాజాలం.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నకిరేకల్‌లో నియోజకవర్గం పరిధిలో నిమ్మ పంట ఎక్కువగా సాగవుతోంది. చుట్టుపక్కల మండలాల నుంచి రైతులు నిమ్మకాయలను అమ్మకానికి ఇక్కడికే తెస్తారు. నిమ్మ వ్యాపారం పూర్తిగా ఇక్కడి వ్యాపారులు సిండి‘కేటు’గా మారి లావాదేవీలు సాగిస్తున్నారు. ఒక్కో నిమ్మకాయ బస్తా 22 కేజీలు ఉంటుంది. ఒక్కో బస్తాలో లావు కాయ 600 వరకు, చిన్న కాయలైతే 900 వరకు నింపుతారు. మరోవైపు నూటికి రూ.13 చొప్పు న కమీషన్ తీసుకుని రైతుల చేతికి డబ్బులు అందిస్తున్నారు. దీంతో బస్తా అమ్మినా కూలికి ఇచ్చే డబ్బులు కూడా రాకపోవడంతో కాయలు తెంపకుండా చెట్లమీదనే వదిలేస్తున్నారు మార్కెట్ లేక తప్పని వెతలు.. రాష్ట్రంలోనే నిమ్మ సాగు ఎక్కువగా అయ్యేది నల్లగొండ జిల్లా అయినా.. ఇక్కడ రైతులు పంటను అమ్ముకోవడానికి మార్కెట్ లేదు. రైతుల వద్ద ఇక్కడ కొనుగోలు చేసిన నిమ్మను వ్యాపారులు హైదరాబాద్, ఖమ్మం, రాజ మండ్రి, విజయవాడ ప్రాంతాలకు తరలిస్తారు. అయితే వ్యాపారుల సిండికేట్‌తో ధర లేదని భావించే రైతులు మాత్రం ప్రధాన నగరాలకు వెళ్లి అమ్ముదామనుకుంటున్నా అక్కడ కూడా ధర లేకపోతే అసలు రవాణా ఖర్చులు కూడా రావని భావిస్తున్నారు. ఈ పరిస్థితితో చేసేదేమీ లేక వ్యాపారులు అడిగిన ధరకు రైతులు నిమ్మను అమ్ముకుంటున్నారు. నిమ్మ రైతుల వెతలను చూసి రాష్ట్రంలోనే నకిరేకల్‌కు తొలి నిమ్మ మార్కెట్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. మార్కెట్ నిర్మాణానికి రూ.3.7 కోట్లను ప్రభుత్వం ఇచ్చింది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం నిమ్మ మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. నకిరేకల్‌లోని చీమలగడ్డలో నిమ్మ మార్కెట్ నిర్మాణం సాధ్యమైనంత త్వరలో పనులు పూర్తి చెయిస్తానని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. రోడ్డెక్కిన రైతులు నల్లగొండ టూ టౌన్: పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నల్లగొండ జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. నిమ్మకాయలు, దొండకాయలు తెచ్చి కలెక్టరేట్ ఎదుట పారబోసి నిరసన తెలిపారు. మద్దతు ధర కల్పించకపోవడంతో కనీసం కూలీల ఖర్చులు కూడా రావడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పండ్ల తోటల రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులంతా కలెక్టరేట్ ఎదుట ప్రధాన రహదారిపై భారీగా నిమ్మకాయలు, దొండకాయలు పోసి ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. -
నిమ్మను హరించే తెగుళ్లు
బంక తెగులు ఈ తెగులు వల్ల మొక్క పూర్తిగా ఎండిపోతుంది. తెగులు ఉధృతి పెరిగితే చెట్టు వేర్లు బలహీన పడతాయి. కాండం పైన, మొదలు వద్ద పుట్ట గొడుగుల లాంటి చారలు ఏర్పడతాయి. కాండం పగిలి దాని నుంచి బంక కారుతుంది. చివరకు చెట్టు చనిపోతుంది. మురుగు నీరు బయటకు వెళ్లే వసతి గల నేలల్లో నిమ్మ సాగు చేయాలి. సాగు నీరు చెట్టు మొదలుకు తగలకుండా తల్లి పాదు, పిల్ల పాదు ఏర్పాటు చేయాలి. ఏడాదికి ఒకసారి చెట్టు మొదలు నుంచి 65 సెం.మీ ఎత్తు వరకు బోర్డ్ పేస్ట్ రాయాలి. చాకుతో తెగులు భాగాన్ని తీసేసి మెర్క్యురిక్ క్లోరైడ్‌తో శుభ్రపరిచి బోర్డ్ పేస్ట్ పూయాలి. వేరుకుళ్లు తెగులు ఈ తెగులు సోకి తే పూత, పిందె విపరీతంగా వచ్చి క్రమేణా ఆకులు రాలిపోతాయి. చెట్టుపై కాయలు మాత్రమే మిగులుతాయి. చెట్టు ఎండు ముఖం పట్టి చనిపోతుంది. వేర్లపై ఉండే బెరడు తేలికగా ఊడి వస్తూ వేర్ల నుంచి దుర్వాసన వ స్తుంది. ఈ లక్షణాలు గమనించిన వెంటనే 100 లీటర్ల నీటికి కిలో మైలుతుత్తం(కాపర్ ఆక్సీ క్లోరైడ్), కిలో సున్నం కలిపి ఆ మిశ్రమాన్ని వ్యాధి సోకిన మొక్కకు, దాని చుట్టు పక్కల నాలుగు మొక్కల పాదుల్లో వేర్లు పూర్తిగా తడిచే లా 20-25 లీటర్లు పోయాలి. 100 కేజీల పశువుల ఎరువును కేజీ ట్రైకోడెర్మావిరిడీతో కలిపి గొనె సంచులను కప్పి ఉదయం సాయంత్రం నీళ్లు చల్లితే 15-20 రోజుల్లో ట్రైకోడెర్మావిరిడీ కల్చర్ తయారవుతుంది. దీనిని 10 నుంచి 15 కేజీల చొప్పున వ్యాధి సోకిన చెట్టు పాదుల్లో వేసి పాదంతా కలియబెట్టాలి.