చైనాలో ఆంక్షలు సడలించగానే ఒక్కసారిగా అనూహ్యంగా కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇది చాలదన్నట్లు మరో ముప్పు ఉందని, మరి కొద్దిరోజుల్లో ప్రపంచంపై మరోసారి కరోనా వైరస్ పంజా విసురుతుందని నిపుణలు సైతం హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో ఒక్కసారిగా చైనాలో నిమ్మకాయలకు అమాంతంగా డిమాండ్ పెరిగిపోయింది. అక్కడ ప్రజలంతా నిమ్మకాయలు కొనేందుకు దుకాణాల వద్దకు ఎగబడటంతో ధరలు సైతం అమాంతంగా పెరిగినట్లు సమాచారం. కరోనా భారి నుంచి బయటపడేందుకు రోగనిరోధక శక్తి కోసం చైనీయులు విటమిన్ సీ అధికంగా ఉండే నిమ్మకాలయను కొనుగోలు చేసేందుకు బారులు తీరుతున్నారు.
దీంతో నిమ్మ రైతుల వ్యాపారాలు అకస్మాత్తుగా పుంజుకున్నాయి. ఈ మేరకు నైరుతీ ప్రావిన్స్ కౌంటీ ఎన్యూలో ఒక నిమ్మ రైతు తాను సుమారు 130 ఎకరాల్లో నిమ్మాకాయలు పండిస్తున్నానని, తన విక్రయాలు రోజుకు 20 నుంచి 30 టన్నులు పెరిగాయని చెబుతున్నాడు. పైగా గతంలో కేవలం 5 నుంచి 6 టన్నులుగా మాత్రమే తన విక్రయాలు ఉండేవని తెలిపాడు. అదీగాక గత మూడేళ్లుగా జీరో కోవిడ్ పాలసీ పేరుతో కఠిన ఆంక్షలు విధించి ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేసిన చైనా ప్రభుత్వమే ప్రజల కోసం తన తీరుని మార్చుకుంది.
దీంతో ప్రజలు ఈ కరోనా మహమ్మారితో పోరాడేందుకు సహజసిద్ధమైన వాటిపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే విటమిన్ సీ అధికంగా ఉండే నిమ్మ జ్యూస్‌లు తాగి రోగ నిరోధక శక్తి పెంపొందించుకునేందుకు రెడీ అవుతున్నారు. గత నాలుగు ఐదు రోజుల నుంచి నిమ్మ ధరలు రెట్టింపు అయినట్లు మరో రైతు లియు యాంజింగ్ చెబుతున్నారు. తాను మొన్నటి వరకు అరకిలో నిమ్మకాయలు రూ. 22 నుంచి 35 రూలు వరకు అమ్మానని, ఇప్పుడూ ఏకంగా రూ. 61కి అమ్ముతున్నట్లు తెలిపాడు.
గత కొద్దిరోజులుగా ఈ కరోనా ఆంక్షలతో ఎగుమతులు లేక కూరగాయాలు, పళ్ల వ్యాపారులు నష్లపోయినట్లు చెబుతున్నారు. ఇప్పుడూ ప్రజలు తాజా పళ్లు మంచివని, అందులోని నిమ్మరసం సేవించడంతో ఈ వైరస్ నుంచి బయటపడవచ్చిన ప్రజలు నమ్మడంతో వీటికి డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. అదీగాక ఈ కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రజలు తాజా కూరగాయాలు, ఇతర పళ్లు బేరీ, నారింజ, పీచెస్ వంటివి తెగ కొంటున్నారని, విక్రయాలు కూడా అమాంతంగా పెరిగాయని రైతులు తెలిపారు.
(చదవండి: బాప్‌రే! ఒకటి, రెండు కాదు.. ఏకంగా 11 వేలకు పైగా హత్యలు చేసిన 97 ఏళ్ల వృద్ధురాలు)
Comments
Please login to add a commentAdd a comment