చిన్నారి మృతి: హాస్పిటల్ లైసెన్స్ రద్దు
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందులోని ఒక చిన్నారి అనుమానాస్పద మృతికి కారణమైన ప్రైవేట్ ఆస్పత్రి లైసెన్సును అధికారులు రద్దు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 18 నెలల బాలుడు గురువారం ఉదయం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ చనిపోయాడు. దీనిపై కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో విచారణ చేపట్టిన డీఎంహెచ్వో దయానంద్స్వామి శ్రీనివాస పిల్లల హాస్పిటల్ వైద్యులే కారణమని తేలంటంతో లైసెన్సును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మృతుని కుటుంబానికి అవసరమైన సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.