House for sale
-
అమ్మకానికి రవీంద్రనాథ్ ఠాగూర్ నివసించిన గృహం
లండన్: నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ లండన్‌లో కొంత కాలం పాటు నివసించిన గృహం తాజాగా అమ్మకానికి వచ్చింది. 1912లో ఠాగూర్గీతాంజలిని ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేశారు. ఆ సమయంలో హాంపస్టెడ్ హీత్‌లోని హీత్ విల్లాలో నివసించారు. అప్పటి నుంచి ఈ విల్లాకు ప్రాముఖ్యత పెరిగింది. 2015, 17లలో బెంగాల్ సీఎం మమత యూకేను సందర్శించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ విల్లాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. లండన్‌లోని భారత హై కమిషన్‌తో ఆమె అప్పట్లో ఈ విషయంపై మాట్లాడారు. ఠాగూర్ నివసించిన ఆ ఇంటిని ఓ మ్యూజియంగా మార్చాలని ఆమె అభిలషించారు. ఎస్టేట్ ఏజెంట్ ఫిలిప్ గ్రీన్ మాట్లాడుతూ.. తమ కస్టమర్లు అత్యధిక విలువను పొందడమే లక్ష్యమని, బ్రిటిష్ చట్టాలను అనుగుణంగా కొనుగోలు చేస్తే తమకు సమస్యేమీ లేదని కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ విల్లా కొనుగోలుపై బెంగాల్ ప్రభుత్వంగానీ, కేంద్రంగానీ ఎలాంటి ఆసక్తి వ్యక్తం చేయలేదని లండన్‌లో భారత హైకమిషన్ తెలిపింది. -
కిటికీల్లేవు.. గదుల్లేవ్.. దీనికి రూ. 7 కోట్లా
టెక్సాస్/వాషింగ్టన్: అప్పుడప్పుడు సినిమాల్లో కొన్ని చిత్ర విచిత్రమైన ఇళ్లు కనిపిస్తుంటాయి. అందులో ప్రవేశిస్తే తిరిగి బయటపడటం చాలా కష్టం. ఎందుకంటే.. ఆ ఇంటిలోపల అంతా గందరగోళంగా.. అస్తవ్యస్తంగా ఉంటుంది. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. మొత్తంగా చెప్పాలంటే మహాభారతంలోని మయ సభను పోలి ఉంటుంది. ఇలాంటి ఇంట్లో నివాసం ఉంటే ఖచ్చితంగా పిచ్చి పడుతుంది. మరి ఇలాంటి వింత ఇల్లు ఉంటుందా అంటే.. ఉంది.. అది కూడా ఇప్పుడు అమ్మకానికి వచ్చిది. ఖరీదు ఏకంగా 7 కోట్ల రూపాయల పైమాటే. ఇంతకు ఆ ఇల్లు ఎక్కడ ఉంది.. దాని విశేషాలు తెలియాలంటే ఇది చదవండి అమెరికా టెక్సాస్ డల్లాస్ పట్టణంలోని ఓ ఇల్లు అమ్మకానికి వచ్చింది. దాని ఖరీదు ఏకంగా 1 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. 7,43,79,300 రూపాయలు. ఇంత ఖరీదు ఉందంటే.. తప్పకుండా సకల హంగులతో ఇంద్ర భవనంలా ఉంటుందని భావిస్తే మాత్రం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇంటి లోపలికి వెళ్తే బుర్ర తిరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో బెడ్రూంలుండవు.. కిటికీల స్థానంలో నకిలీవి ఉంటాయి. బయట నుంచి చూస్తే.. పెద్ద పెద్ద గాజు కిటికీలున్నట్లు కనిపిస్తుంది కానీ అలా లోపలికి వెళ్లి చూస్తే మాత్రం అవేం కనిపించవు. ఇక ఈ ఇంటి మొత్తం మీద ఓ గ్లాస్ సెక్యూరిటీ విండో ఉంటుంది. అది ఎలా కనిపిస్తుంది అంటే పోలీస్ స్టేషన్, నిర్బంధ కేంద్రాల ప్రవేశ ద్వారం వద్ద ఉండే కిటికీని పోలి ఉంటుంది. ప్రతి గది బూడిద రంగు కార్పెట్‌తో కవర్ చేసి ఉంటుంది. ఇల్లు ఓ గోడౌన్‌లాగా కనిపిస్తుంది. దాదాపు 21 ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరంలో నిర్మించిన ఈ ఇంటిని ఈ ఏడాది జిల్లోలో అమ్మకానికి పెట్టారు. ఇక ‘‘ఈ ఇల్లు పెద్ద మొత్తంలో వైన్ దాచుకోవడానికి.. ఎక్కువ సంఖ్యలో కార్లను, ఆర్ట్ కలెక్షన్‌ను దాచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది’’ అని రాసుకొచ్చారు. ఈ ఇంటిని అనుసంధానిస్తూ రెండు విద్యుత్ గ్రిడ్లు, రెండు డీజిల్ ఇంధన ట్యాంకుల ద్వారా నడిచే సహజ వాయువు జనరేటర్ కూడా ఉన్నాయి. ఇంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై నెటిజనులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇది ఇల్లా.. లేక దెయ్యాల కొంపా’’.. ‘‘నాలుగు గోడలు.. పైన కప్పు.. అంతకు మించి ఈ ఇంటిలో ఎలాంటి ఆకర్షణ లేదు’’... ‘‘ఇలాంటి ఇళ్లల్లో ఉంటే లేనిపోని మానసకి సమస్యలు తలెత్తుతాయి’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
‘మా ఊరికి రండి.. బదులుగా రూ. 24.5 లక్షలు తీసుకోండి’
రోమ్: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఇటలీలో గత కొద్ది కాలంగా పట్టణాలు, నగరాలు ఖాళీ అవుతున్నాయి. జనాలు వలస బాట పట్టడంతో ఇళ్లు, ఊర్లు, నగరాలు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో జనాలను ఆకర్షించడం కోసం.. వలస వెళ్లిన వారిని తిరగి రప్పించడం.. ఖాళీ అయిన ప్రాంతాలు తిరిగి మునపటిలా జనాలతో కలకలలాడటం కోసం వింత ఆఫర్లను ప్రకటిస్తుంది. దానిలో భాగంగా కేవలం రూపాయికే ఇళ్లను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో క్రేజీ ఆఫర్‌తో ముందుకొచ్చింది ఇటలీ ప్రభుత్వం. దేశంలోని ఓ గ్రామంలో నివాసం ఉంటే ఏకంగా 24.5లక్షల రూపాయలు చెల్లిస్తామని తెలిపింది. కాకపోతే కండీషన్స్ అప్లై అంటుంది. మరి ఇంతకు ఆ ప్రాంతం ఎక్కడ.. కండీషన్స్ ఏంటో తెలియాలంటే ఇది చదవండి. ఇటలీలోని కలాబ్రియాలో ప్రస్తుతం కేవలం 2 వేల మంది మాత్రమే ఉంటున్నారు. ఏళ్లుగా ఈ గ్రామం ఆర్థికమాంద్యంతో సతమతమవుతోంది. దాంతో చాలా మంది ఉపాధి కోసం వలస బాట పట్టారు. ఈ క్రమంలో కలాబ్రియా స్థానిక ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పనతో పాటు వలసవెళ్లిన వారిని తిరిగి రప్పించేందుకు ఓ వినూత్న ఆలోచన చేసింది. ఈ ప్రాంతంలో అతి తక్కువ ధరకే ఇళ్లను విక్రయిస్తుంది. ఇక్కడ ఇల్లు కొన్న వారికి మూడు ఏళ్ల వ్యవధికి గాను అక్కడి ప్రభుత్వమే 24 వేల పౌండ్లు(24,87,660 రూపాయలు) చెల్లిస్తుంది. కాకపోతే కొన్ని షరతులు పెడుతుంది. అవేంటంటే.. 40 ఏళ్ల లోపే వారే ఇక్కడ ఇళ్లు కొనడానికి అర్హులు. అంతేకాక అక్కడ ఉన్న స్థానికులకు ఉపాధి కల్పించి.. వలస వెళ్లిన వారిని తిరిగి రప్పించాలి. అది కూడా వారు చెప్పిన గడువులోపే. ఇంటిని కొనుగోలు చేయడానికి ఇక్కడ వ్యాపారం చేయాలనుకునే వారు దరఖాస్తులను 90 రోజుల్లోపు అధికారులకు అందజేయాలి. ఈ ప్రాజెక్ట్‌ను ఇటలీ అధికారులు ‘యాక్టివ్ రెసిడెన్సీ ఆదాయం’ అని పిలుస్తున్నారు. దీనిపై కలాబ్రియా పట్టణ మేయర్ స్పందిస్తూ.. తమ ప్రయోగం సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు ఇటాలియన్ ప్రాంతంలో నివసించడానికి ప్రజలను ఆకర్షించండి.. ఇక్కడకు వచ్చే వారికి ఆధునిక సౌకర్యాలను కల్పిస్తాము.. మరింత మెరుగైన విద్య ఆరోగ్య సదుపాయాలను కల్పిస్తాము.. హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని అందిస్తామని తెలిపారు. -
బంగారు భవనం అమ్మకం, కారణమేంటో తెలుసా?
బయటి నుంచి చూడటానికి సాదాసీదాగానే కనిపిస్తుంది గాని, ఈ భవంతి లోపలికి అడుగు పెడితే మాత్రం బంగారు ధగధగలు కళ్లు చెదిరేట్లు చేస్తాయి. ఏదో రాజప్రాసాదంలోకి అడుగుపెట్టినట్లే అనిపిస్తుంది. రష్యాలోని ఈర్‌కుత్‌స్క్ నగరంలో ఉన్న ఈ బంగారు భవనం ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. రెండెకరాల విస్తీర్ణమైన ప్రాంగణంలో పచ్చని తోటల మధ్య నిర్మించిన ఈ భవంతి విస్తీర్ణం 6,997 చదరపు అడుగులు. ఇందులోని సోఫాలు, కుర్చీలు, టేబుళ్లు, టీపాయ్‌లు, మంచాలు, పడకగది తలుపుల అంచులు, వాటి గొళ్లాలు, షాండ్లియర్లు వంటివన్నీ పూర్తిగా బంగారం తాపడంతో తయారు చేసినవే కావడం విశేషం. ఈ భవంతిలో ఐదు పడకగదులు, డ్రెసింగ్ రూమ్‌లు, ప్రైవేట్ బాత్రూమ్లు, విశాలమైన హాలు, కారిడార్, వంటగది, భోజనాల గది ఉన్నాయి. ఈ గదుల్లో అడుగడుగునా బంగారు తళతళలు మిరుమిట్లుగొలుపుతాయి. ప్రఖ్యాత బైకాల్ సరస్సుకు చేరువలో ఉండటం ఈ భవంతికి అదనపు ఆకర్షణ. ఈ బంగారు భవంతిలో మరిన్ని అదనపు హంగులూ ఉన్నాయి. భవంతి మొత్తానికి విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేకమైన విద్యుత్ సబ్‌స్టేషన్, వైన్ సెల్లార్, ఇంటి ఆవరణలో చక్కగా తీర్చిదిద్దిన పచ్చిక బయళ్లు, పైన్ వృక్షాలు, ఒక చేపల చెరువు, ఒక కృత్రిమ జలపాతం కూడా ఉన్నాయి. (చదవండి: ఆడుకునేందుకు వెళ్లి ఊహించని ఫ్రెండ్‌తో..) దీని ధర 2.1 మిలియన్ పౌండ్లు (21 కోట్ల రూపాయలు). ఈ భవంతికి ఒకటే సమస్య. భవంతి లోపల అంతా బాగానే ఉంటుంది గాని, శీతాకాలంలో మాత్రం వెలుపల –51 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉంటాయి. కాస్త వెచ్చని ప్రాంతానికి మకాం మార్చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని అమ్ముతున్నట్లు పదకొండేళ్లుగా ఇందులోనే ఉంటున్న ప్రస్తుత యజమాని కానాగత్ రజమతోవ్ చెబుతున్నారు. -
హౌస్ ఫర్ సేల్
‘పురపాలికల్లో ఇళ్ల కోసం అధికారులను మాత్రమే సంప్రదించాలి. మధ్యవర్తులు, ఇతరులను సంప్రదించవద్దు’.. ఆదివారం విజయనగరంలో పురపాలక మంత్రి నారాయణ పేదలకిచ్చే ‘హౌస్ ఫర్ ఆల్’ పథకంపై స్వయంగా చెప్పిన మాటలు.. పై చిత్రం చూశారా.. బొబ్బిలి మున్సిపాలిటీలోని పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విభాగానికి చెందిన కార్యాలయంలో కంప్యూటర్ల ముందు కూర్చున్నవారు అధికారులు కారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు. హౌస్ ఫర్ ఆల్ పథకానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం.. అర్హులంటూ తమ వారిని ఎంపిక చేసుకోవడం వారి పని. మొత్తంగా ఇళ్ల ఎంపిక బాధ్యతను వారి చేతుల్లోకి తీసుకున్నారు. ఇటీవల వారం రోజులుగా బొబ్బిలి మున్సిపాలిటీలో పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయాల్లోనే తిష్ట వేసి లబ్ధిదారుల పేర్లు, కొత్త దరఖాస్తులు చేస్తున్నారు. కేవలం అధికారులే చేయాల్సిన పనిని వీరు అక్కడి కంప్యూటర్ ఆపరేటర్లతో చేయించుకోవడం గమనార్హం. ఈ విషయం తెల్సినా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. మరికొందరు అధికారులు సహకరిస్తున్నారు. బొబ్బిలి: టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆరాచక పాలన సాగిస్తోంది. పింఛన్లు, ఇళ్లు, రేషన్ కార్డులు ఇలా.. అన్నింటిలోనూ రాజకీ య వివక్ష చూపుతోంది. జన్మభూమి కమిటీల సభ్యులు, పార్టీ చోటా నాయకులతో అవినీతి చేస్తోంది. పథకానికి ఓ రేటు చొప్పున దందా చేస్తోందంటూ జనం మండిపడుతున్నారు. ప్రజా ధనంతో అమలుచేసే పథకాలు అర్హులకు అందడం లేదని వాపోతున్నారు. పట్టణాల్లో పేదలకు ఇచ్చే ఇళ్లలోనూ టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని, తమ వారికే ఇళ్లు కేటాయించేలా జాబితాలు రూపొంది స్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పేదలు బతకడం కష్టం గా మారిందని, పనులు మానుకుని ఇంటిళ్లపాదీ నేతల సేవ చేస్తే తప్ప ప్రభుత్వ పథకాలు అందేలా లేవంటూ మదనపడుతున్నారు. టీడీపీ పాలనా తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. దగ్గరుండి జాబితాల రూపకల్పన.. పట్టణ పేదల కోసం కేటాయించిన హౌస్ ఫర్ ఆల్ పథకం.. హౌస్ ఫర్ టీడీపీగా మారింది. ఓ పక్క అర్హులను కొర్రీలు వేసి తొలగిస్తూనే.. కొత్త దరఖాస్తులంటూ అధికార పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో కూర్చుని తమ వారి జాబితాలు రూపొందిస్తున్నారు. అధికారుల్లా కార్యాయాల్లో ని కంప్యూటర్ల ముందు కూర్చొని జాబితాలు సిద్ధం చేస్తున్నా రు. అన్నింటా తామై ఉండి నడిపించాల్సిన పట్టణ ప్రణాళికా విభాగం చేష్టలుడిగి చూస్తోంది. బొబ్బిలి మున్సిపాలిటీలో కంప్యూటర్ల ముందు కౌన్సిలర్ల పెత్తనమే కనిపిస్తున్నా కిమ్మనడంలేదు. ఎవరికి దరఖాస్తు చేయాలి? మరెవరిని అనర్హులు గా చూపించాలనే విషయంలో అధికారమంతా అధికార పార్టీ కౌన్సిలర్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఇక్కడి అధికార విభాగం లోపభూయిష్టంగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కౌన్సిలర్లు కూడా తమ వర్గానికి చెందిన వారికే ఇళ్ల లబ్ధిదారులుగా గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీల్లో ఉన్న నిరుపేదలు, ఎటువంటి ఆసరా లేని వారికోసం ఈ ఇళ్లను కేంద్ర ప్రభుత్వ నిధులతో టిడ్కో ఆధ్వర్యంలో నిర్మాణాలు చేయాలని సంకల్పించారు. ఇప్పుడు కౌన్సిలర్లకు అధికారం ఇవ్వడంతో అర్హులను వివిధ కారణాలతో తొలగి స్తున్నారన్న వ్యాఖ్యలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఎవరికోసం ఈ ఇళ్లు? జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి, నెల్లిమర్ల, సాలూరు ము న్సిపాలిటీల్లో ఈ ఇళ్లను నిర్మించేందుకు స్థలాలు కేటాయిస్తున్నారు. ఇప్పటికే విజయనగరం, నెల్లిమర్ల, బొబ్బిలి ప్రాంతా ల్లో స్థలాలను కేటాయించారు. ఆయా మున్సిపాలిటీల్లో సొంత ఇల్లు లేనివారు, సొంత ఇంటి స్థలం లేనివారిని గుర్తించాల్సి ఉంది. మున్సిపాలిటీ పరిధిలో మాత్రమే నివసిస్తున్న వారు అర్హులు. అలాగే, సంవత్సరాదాయం రూ.3 లక్షలకు మించి ఉండరాదు. గతంలో ఎటువంటి గృహరుణం పొంది ఉండకూడదు. అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం యంత్రాలతో మట్టి నమూనాలు సేకరిస్తున్న కాంట్రాక్టర్లు నామమాత్రంగా సిబ్బంది నియామకం.. వార్డుల్లో మున్సిపల్ సిబ్బందిని అర్హుల ఎంపికకు నియమిస్తున్నామని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కేవలం నామమాత్రంగానే వీరిని నియమించారని, వార్డుల్లో ఇళ్ల గురించి చెప్పేది మాత్రం కౌన్సిలర్లేననీ, సంబంధిత అధికారులు ఎవరూ రావడం లేదని వార్డువాసులు చెబుతున్నారు. చాలా వార్డుల్లో నియమించిన మున్సిపల్ సిబ్బందిని వార్డుల్లోకి రావద్దని కౌన్సిలర్లు ముందే హెచ్చరించినట్టు సమాచారం. ఇప్పటికే ఈ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసి ఉన్న వారి సంఖ్య సుమారు 20 వేలకు పైగానే ఉంది. రుణాలిచ్చేదుందా? హౌస్ ఫరాల్ పథకంలో రుణాలు, డిపాజిట్లు ముఖ్యం. కేటగిరీల ప్రకారం ఒకటో కేటగిరీలో రూ.2.65లక్షలు, రెండో కేటగిరీకి రూ.3.15 లక్షలు, మూడో కేటగిరీకి రూ.3.65 లక్షల రుణం బ్యాంకులు ఇవ్వాలన్నది పథక నిర్ణయం. దీంతో ఈ రుణాలు నిజంగా బ్యాంకులు ఇస్తాయా అని జనం నోరెళ్లబెడుతున్నారు. దీంతో పాటు నిరుపేదలంతా మూడు కేటగిరీల్లోనూ రూ.500, 50,000, 100,000 వంతున డిపాజిట్లు చెల్లించాల్సి ఉంది. ఈ డిపాజిట్ల చెల్లింపుతో పాటు రుణ వాయిదాలు చెల్లించాలి. దీంతో ఈ గృహ నిర్మాణాలపై నమ్మకం లేకుండా పోతోందని ప్రజలు వాపోతున్నారు. రైల్వే శాఖ అనుమతిస్తేనే ఇళ్ల నిర్మాణం.. బొబ్బిలిలో నిరుపేదల కోసం అందరికీ ఇళ్లు పథకంలో ప్లాట్లు నిర్మించేందుకు గ్రోత్ సెంటర్ పక్కన 34 ఎకరాల స్థలం కేటాయించారు. ఈ స్థలానికి వెళ్లేందుకు దారి లేదు. రైల్వే లైన్ దాటి వెళ్లాల్సిన అవసరం ఉన్నందున అధికారులు ఇప్పుడు డీఆర్ఎంకు లేఖ రాస్తున్నారు. ఇక్కడ గేటు వేయడం లేదా ఓవర్ బ్రిడ్జి నిర్మించడం అవసరం. గేట్లను ఇప్పటికే రైల్వే శాఖ తొలగిస్తున్నది. దీంతో ఓవర్‌బ్రిడ్జి తప్పనిసరి. ఇదంతా అయ్యే పనేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముందుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కు ఎదురుగా ఉన్న స్థలం చూపించిన అధికారులు దానిని ఎందుకు మార్చాతో తెలియడంలేదు. దారిలేని చోటును ఎందుకు కేటాయించారో వారికే తెలియాలి. మొత్తం అన్ని మున్సిపాలిటీల్లోనూ స్థల సేకరణ జరిగాక నిర్మాణాలు ప్రారంభిస్తామని టెండర్ దక్కించుకున్న సంస్థ చెబుతుండగా.. ముందుగా అర్హులను తేల్చేందుకు కౌన్సిలర్లు ఉబలాట పడుతుండటం కొసమెరుపు. బొబ్బిలి పట్టణంలోని ఆరో వార్డులో గెంబలి కవిత అనే మహిళ ఉంది. అదే పేరుతో ఐదో వార్డులో మరో మహిళ ఉంది. ఇద్దరూ ఇల్లు కోసం దరఖాస్తు చేశారు. ఇందులో గెంబలి కవిత పేరున ఇల్లు మంజూరై ఉందని మరొకరి దరఖాస్తును తిరస్కరించారు. కాదు బాబోయ్ అంటున్నా అటు హౌసింగ్, ఇటు మున్సిపల్ కార్యాలయానికి తిప్పుతున్నారే తప్ప సమస్యను పరిష్కరించడంలేదు. వీరే కాదు పట్టణంలోని హౌస్ఫర్ఆల్ పథకానికి వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 30 శాతం ఇళ్లున్నాయని, ఇక్కడి వారు కాదని తిరస్కరిస్తున్నారు. మా పేరు గల్లంతైందని పట్టణ ప్రణాళికా విభాగం అధికారిని ప్రశ్నిస్తున్న కవిత ఈ చిత్రంలోని వ్యక్తి పేరు ఈశ్వరరావు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ భార్య సుమ, కుమార్తె హారికలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. సొంత ఇల్లు లేకపోవడంతో ఇందిరమ్మ కాలనీలోని ఓ ఇల్లు అద్దెకు తీసుకుని తనకొచ్చే కొద్దిపాటి సంపాదనలోనే రూ.1500 నెలకు అద్దె చెల్లిస్తున్నాడు. హౌస్ ఫర్ ఆల్ పథకంలో ఇటువంటి వారికి ఇల్లు మంజూరు చేస్తారనే సరికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇతనికి ఆధార్ లింక్ కావడం లేదని జాబితా లోంచి పేరు తొలగించారని ఆవేదన చెందుతున్నాడు. -
అమ్మకానికి 'అన్న'గారి ఇళ్లు
-
అమ్మకానికి 'అన్న'గారి ఇళ్లు
సాక్షి, ప్రతినిధి, చెన్నై: 28 బజుల్లా రోడ్.. టీ నగర్.. చెన్నై.. దూర ప్రాంతాల నుంచి అక్కడకు తరలివెళ్లే అభిమానులకు ఆ ఇల్లు మరో తిరుపతి! అన్నగారి పట్ల అంతులేని అనురాగానికి అది చిరునామా. తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అన్న నందమూరి తారక రామారావు నివాసం ఇప్పుడు అంగడి సరుకుగా మారింది. ఎన్నో అనుబంధాలు, మధుర జ్ఞాపకాలకు గుర్తుగా నిలిచిన చెన్నైలోని ఎన్టీఆర్ నివాసం కొనుగోలు చేసేవారి కోసం దీనంగా ఎదురు చూస్తోంది. బ్రోకర్ ఏలుమలై పేరు, సెల్‌ఫోన్ నెంబర్‌తో ఆ ఇంటి గేటుకు వేలాడుతున్న బోర్డు తెలుగు ప్రజల హృదయాలను కలచివేస్తోంది. ఎన్టీఆర్‌కు ఆ ఇంటితో అనుబంధం గురించి ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఓ వ్యక్తి అందించిన వివరాలు ఇవీ... బెడ్రూం పక్కనే పిల్లల గది... ఎన్టీఆర్ నటుడిగా స్థిరపడిన తరువాత చెన్నై రంగరాజపురంలో ఓ చిన్న ఇంటిని కొనుగోలు చేశారు. ఆయన రాకతో ఆ వీధి ఎన్టీఆర్ స్ట్రీట్‌గా మారింది. అక్కడ ఉండగా ఒక కుక్కను పెంచుకుంటూ షూటింగ్ లేని సమయాల్లో దానితో గడిపేవారు. (బజుల్లా రోడ్డుకి మారిన తర్వాత ఆ కుక్కను, ఇంటిని తన సోదరుడు త్రివిక్రమరావుకు అప్పగించారు) అనంతరం ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తరువాత ఆనాటి ప్రముఖ హాస్య నటుడు కస్తూరి శివరావు నుంచి బజుల్లా రోడ్డులోని ఇంటిని 1953లో కొనుగోలు చేశారు. రెండంతస్థుల ఆ ఇంటికి కొద్దిగా మెరుగులు దిద్ది నివాసం, ఆఫీస్ అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. గేటు దాటి ప్రవేశించగానే రెండు ఏనుగుల బొమ్మలు అందంగా కనిపించేవి. మిద్దెపైన పిల్లల గదులు, ఆయన బెడ్రూం ఉండేది. కింద పోర్షన్లో ఆఫీస్, సందర్శకుల కోసం మరో గది, మేకప్ రూం ఉండేవి. కంటిచూపు సరిగా కనపడని ప్రసాద్ అనే వ్యక్తి ఆయనకు మేనేజర్‌గా వ్యవహరించేవారు. ఆయన్ను ‘కళ్లజోడు’ ప్రసాద్ అని పిలిచేవారు. ఎన్టీఆర్ కూర్చునే గదిలో తల్లిదండ్రుల ఫోటో, ఆరుగురు కూర్చునే సోఫా, ఆయన కోసం ఒక విలాసవంతమైన కుర్చీ ఉండేది. 6.00 గంటలకు చికెన్‌తో భోజనం ... ఎన్టీఆర్ నిత్యం తెల్లవారుజామున 3.30 గంటలకు నిద్ర లేచేవారు. మేడపై నుంచి దిగుతూ గట్టిగా గొంతు సవరించుకునేవారు. అది వినపడగానే ఆయన కోసం వేచి ఉండే వారంతా అప్రమత్తమయ్యేవారు. తనను కలిసేందుకు వచ్చిన వారితో మాట్లాడిన అనంతరం ఉదయం 6.00 గంటలకు కొద్దిగా చికెన్‌తో కలిపి భోజనం చేసేవారు. ఏ ఊరు మనది...? ఎన్టీఆర్ 7.00 గంటలకు మేకప్‌తో బయటకు వచ్చి మెయిన్ గేటు తెరవాలని ఆదేశించటమే ఆలస్యం అప్పటికే అక్కడ గుమికూడిన అభిమానులు ఇంటి వరండాలోకి చేరుకునేవారు. రెండు చేతులూ జోడించి వారికి నమస్కరిస్తూ ‘ఏ ఊరు మనది..?’ అంటూ గంభీరంగా ప్రశ్నించేవారు. ‘షూటింగ్ చూస్తారా...?’ అని అభిమానులను ప్రశ్నించి అందుకు ఏర్పాట్లు కూడా చేసేవారు. నేలపైనే ఆయన నిద్ర... భక్తి ప్రపత్తులు ఎక్కువగా కలిగిన ఎన్టీఆర్‌కు చాలా సెంటిమెంట్లు ఉండేవి. ఆదివారం పూర్తిగా ధవళ వస్త్రాలు ధరించి నుదుటిన అడ్డంగా విభూది పెట్టుకునేవారు. ఎవరికైనా ఆర్థిక సాయం చేయదలిస్తే తన చేత్తో కాకుండా భార్య బసవతారకం లేదా ఇతరుల చేతుల మీదుగా అందించేవారు. వారు అందుబాటులో లేని పక్షంలో సమీపంలోని కుర్చీ లేదా గోడపై డబ్బును ఉంచి తీసుకోమనేవారు. రాత్రి 8.30 గంటలకు నిద్ర పోవడానికి ముందుగా చపాతి తిని పాలు తాగేవారు. ప్రతి రోజూ నేలపైనే ఒంటరిగా పడుకునేవారు. దిగ్గజాలను మళ్లీ కలిపిన ప్రేమాభిషేకం.. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల మధ్య వృత్తిపరమైన విభేదాలు తలెత్తిన సమయంలో ప్రేమాభిషేకం చిత్రం వారిని తిరిగి కలిపింది. ఈ సినిమా కచ్చితంగా ఏడాది ఆడుతుందని ఏఎన్నార్ గ్రేట్ అని ఎన్టీఆర్ ప్రశంసించారు. ఊటిలో షూటింగ్లో ఉన్న ఏఎన్నార్‌కు ఫోన్ చేసి సినిమా సూపర్‌హిట్ అని చెప్పారు. ప్రొడక్షన్ వాళ్లు యావరేజ్ అంటున్నారని అక్కినేని చెప్పగా.. లేదు సూపర్ హిట్ అవుతుందని చెప్పి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఈ సినిమాలో హీరోగా తాను కూడా చేయలేనని చెప్పి ఎన్టీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. ‘బ్రదర్.. మన ఇద్దరి మధ్యన ఎవరెవరో ఏదో పెడుతుంటారు. మనం సర్దుకుపోవాలి..’ అని ఏఎన్నార్‌కు స్నేహహస్తం అందించారు. -
ఇల్లు కొంటే ఇల్లాలు ఉచితం!
పెళ్లి చేసుకోవడం.. ఇల్లు కట్టుకోవడం.. మనిషి జీవితంలో ఈ రెండే కదా అత్యంత ఘనకార్యాలు! అందుకేనేమో ఒకేసారి ఇంటితోపాటు ఇల్లాలినీ సొంతం చేసుకోండి అంటూ 40 ఏళ్ల వినాలియా ప్రకటించిన బంపర్ ఆఫర్ ప్రస్తుతం ఇండోనేషియాలో హాట్ టాపిక్‌గా మారింది. జావా దీవిలో నివసిస్తున్న బ్యుటీషియన్ వినాకు సొంతగా ఓ పార్లర్తోపాటు రెండతస్తుల ఇల్లుంది. కొన్నేళ్ల కిందట భర్తను కోల్పోయిన ఆమె ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది. ఈ మధ్యే పిల్లకు తండ్రి, తనకో తోడు కోసం రెండో పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకు అవసరమయ్యే డబ్బు కోసం ఇంటిని అమ్మిపెట్టమని ప్రాపర్టీ సెల్లర్ అయిన తన స్నేహితుణ్ణి సంప్రదించింది. ఆ స్నేహితుడు తెలివిగా ప్రకటనలో కొన్ని కీలక మార్పులు చేశాడు. వినాలియా ఇంటిని కొన్న వ్యక్తి.. ఆమెను పెళ్లి కూడా చేసుకోవచ్చని ఆన్లైన్లో ప్రకటనలిచ్చాడు. విషయాన్ని సీరియస్‌గా తీసుకునేవాళ్లే తనను, తన ఇంటిని చూడటానికి రావాలనడంతోపాటు మరి కొన్ని కఠినమైన కండిషన్లు విధించింది వినాలియా! అయితే అనూహ్యంగా ఆమెను చూడటానికి ఒక్కరంటే ఒక్కరు మాత్రమే ముందుకొచ్చారట! అయనకు కూడా ఇల్లు నచ్చకపోవడంతో వెనుదిరిగి వెళ్లాడట! ఏదైతేనేం.. ఇల్లు అమ్మిన తర్వాత కూడా భార్య హోదాలో ఇంటి యజమానురాలిగా ఉండాలనుకున్న వినాలియా ఐడియా అద్భుతంగా ఉందంటున్నారు మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్. -
ఇల్లు ఎందుకు అమ్మావని..
నవమాసాలు మోసి కని, పెంచిందనే కనికరం కూడా అతడికి కలగలేదు..గోరుముద్దలు..లాలిపాటలు గుర్తుకేరాలేదు.. నాన్నా తల్లినిరా అన్నా వదల్లేదు.. కర్రతో తలపై బలంగా కొట్టి.. ఆపై నాపరాయిపై తోసేయడంతో ‘తల్లి’డిల్లి ‘పోయింది’..ఈ దారుణం మంగళవారం నకిరేకల్‌లో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం .. -నకిరేకల్ నకిరేకల్‌లోని శివాజీనగర్‌లో నివాసముంటున్న పుపాల కళమ్మ(45) కుమారుడు సతీష్, కుమార్తె రాజేశ్వరి సంతానం. తన తల్లిదండ్రులు ఇచ్చిన స్థలంలో రేకులతో ఇల్లు నిర్మించుకుని నివసిస్తోంది. భర్త పన్నెం డేళ్ల క్రితమే చనిపోవడంతో కూలి పనులు చేస్తూ పిల్లలను పెద్దచేసింది. కుమారుడు సతీష్ నాలుగేళ్ల క్రితమే కులాంతర వివాహం చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చేసేదేమీ లేక కళమ్మ అప్పు చేసి కుమార్తె వివాహం చేసింది. అప్పు తీర్చేందుకు కళమ్మ ఉన్న ఇంటిని విక్రయించాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని కుమారుడికి కూడా చెప్పింది. కళమ్మ తొమ్మిది నెలల క్రితం ఇల్లు విక్రయించింది. ఇల్లు ఖాళీ చేయలేదు. విక్రయించిన వారికి నాలుగు రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ చేసింది. మంగళవారం ఇంటిని ఖాళీ చేస్తుండగా సతీష్ ఇంటికి వచ్చాడు. ఇల్లు ఎందుకు విక్రయించావని తల్లితో గొడవపడ్డాడు. ఇద్దరి ఘర్షణ తారాస్థాయికి చేరడంతో కోపోద్రిక్తుడైన సతీష్ కర్రతో కళమ్మ తలపై బలంగా కొట్టాడు. నేను నీ కన్నతల్లినిరా అన్నా వినకుండా నాపరాయిపై తోసేయడంతో కళమ్మ తలకు బలమైన గాయమైంది. రక్తపు మడుగులో ఆమెను చూసి సతీష్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంట్లోనే ఉన్న కుమార్తె రాజేశ్వరి తల్లిని 108 వాహనంలో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది. సీఐ శ్రీనివాసరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలిం చారు. మృతురాలి కూతురు రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.