housing schemes
-
జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 32 కోట్లు ఖర్చు
-
ఇళ్ల నిర్మాణం పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
-
రంగనాథ్ అన్న చాలా అద్భుతంగా చేశారు: సీఎం వైఎస్ జగన్
-
ఒక్కో మహిళా చేతిలో రూ.4 లక్షలు నుంచి 10 లక్షలు..
-
నా పులివెందులపైనే కుట్ర చేశాడు: సీఎం వైఎస్ జగన్
-
6 వేలకు పైగా ఎకరాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు: మంత్రి అవంతి శ్రీనివాస్
-
ఇళ్ల నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్ల పథకం కింద 30 లక్షల మంది లబ్ధిదారులకు ఇచ్చిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో ఆగిపోయిన ఇళ్లకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇళ్ల స్థలాల మంజూరులో పలు మార్గదర్శకాలతో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ సింగిల్ జడ్జి ముందు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు 128 మంది పిటిషనర్లు మంగళవారం హైకోర్టు ధర్మాసనానికి నివేదించారు. దీంతో పేదల ఇళ్ల నిర్మాణం కొనసాగనుంది. తమకు వివాదాలు వద్దని, ఇళ్ల పట్టాలు వస్తే చాలని వారు ధర్మాసనానికి తెలిపారు. పిటిషనర్లలో కొందరికి ఇప్పటికే పట్టాలు మంజూరు చేశామని, మిగతా వారు దరఖాస్తు చేసుకుంటే వారికీ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నందున, ఆ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, పిటిషన్ ఉపసంహరణకు అనుమతినిచ్చింది. పిటిషనర్లు వ్యాజ్యం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పూర్వాపరాల్లోకి వెళ్లడంలేదని స్పష్టంచేసింది. సింగిల్ జడ్జి తీర్పులో ప్రస్తావించిన అంశాలేవీ ఏ ఒక్కరి పట్ల ఏ రకంగానూ ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించవని తేల్చి చెప్పింది. పట్టాలు కోరుకొనే పిటిషనర్లు మూడు వారాల్లో దరఖాస్తు చేసుకోవాలని, వాటిని మూడు నెలల్లో పరిష్కరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేర అప్పీల్ దాఖలు ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షల మంది పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దంటూ సింగిల్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి గత నెలలో తీర్పునిచ్చారు. దీంతో పనులు నిలిచిపోయాయి. ఈ తీర్పు వల్ల పేదలు తీవ్రంగా ప్రభావితమైనందున, అప్పీల్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా సింగిల్ జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేసిన 128 మంది పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వీఎస్ఆర్ ఆంజనేయులు తాము వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరింది. పిటిషన్ ఉపసంహరణకు తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. పట్టాలు ఇవ్వడానికి కూడా అభ్యంతరం లేదని ఏజీ చెప్పారు. సింగిల్ జడ్జి తీర్పును ఉపసంహరించాలని కోరారు. సింగిల్ జడ్జి తీర్పులో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) గురించి ప్రస్తావనలు చేశారని, దీనివల్ల ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సింగిల్ జడ్జి తీర్పులో ప్రస్తావించిన అంశాలేవీ ఎవరి పట్ల ఏ రకంగానూ ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించవని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అసలుకే మోసం వస్తుందనే పిటిషన్ ఉపసంహరణ? సింగిల్ జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేసిన వారిలో చాలా మందికి అంతకు ముందే ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది. మరికొందరు పిటిషనర్ల చిరునామాలు కూడా లభించలేదు. ఈ పరిస్థితుల్లో ఈ వ్యాజ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాజ్యం వెనుక ఎవరో ఉన్నారని, దీనిపై లోతుగా విచారణ జరపడం మేలన్న వాదన కూడా వినిపించింది. ఈ వ్యవహారంపై లోతుగా విచారిస్తే అసలుకే మోసం వస్తుందన్న ఉద్దేశంతోనే పిటిషనర్లు వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. -
పేదలను పట్టించుకోలేదు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గత సమాజ్‌వాదీ(ఎస్పీ) సర్కార్ పేదలకు ఇళ్లు నిర్మించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ప్రధాని మోదీ విమర్శలు చేశారు. కేంద్ర ప్రాయోజిత గృహ నిర్మాణ పథకాల ఫలాలను పేదలకు అందకుండా అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం మోకాలడ్డిందని మోదీ ఆరోపించారు. ‘ఆజాదీః 75 న్యూ అర్బర్ ఇండియా: ట్రాన్స్ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్‌స్కేప్’ సదస్సు, ఎగ్జిబిషన్‌ను మంగళవారం లక్నోలో ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ గత ఎస్పీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘2017లో ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం కింద ఏకంగా 18,000 ఇళ్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. కానీ నాటి ఎస్పీ సర్కార్ కనీసం 18 ఇళ్లు కూడా నిర్మించలేదు. కానీ కేంద్రంలోని మా ప్రభుత్వం దేశవ్యాప్తంగా పీఎంఏవై కింద మూడు కోట్ల మంది పేదలను లక్షాధికారులను చేసింది’ అని మోదీ వ్యాఖ్యానించారు. అయోధ్యలో ఏడున్నర లక్షల వెలుగులు పీఎంఏవై కింద లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ రెండు ప్రమిదలను దీపావళి రోజున వెలిగించాలని మోదీ సూచించారు. యూపీలో మొత్తం 9 లక్షల మంది లబ్దిదారులున్నారు. మరోవైపు, అయోధ్యలో దీపోత్సవ్ కార్యక్రమంలో భాగంగాలో దీపావళి రోజున 7.5 లక్షల ప్రమిదలు కాంతులీననున్నాయి. -
జగన్ పాలనలో ఏపీకి సువర్ణయుగమే
-
ఇల్లు.. నిల్లు..
అర్ధంతరంగా మాయమైన ‘వాంబే’ పదేళ్లుగా పూర్తికాని లబ్ధిదారుల ఎంపిక సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో దాదాపు పది లక్షల మంది సొంత ఇళ్లు లేక అల్లాడుతున్నారు. వీరిలో బడుగు, బలహీనవర్గాలకు చెందిన పేదలే ఎక్కువ. ఇలాంటి పేదల కోసం ప్రభుత్వాలు పలు గృహనిర్మాణ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ.. వేటినీ సవ్యంగా పూర్తి చేయకపోవడంతో పేదల సొంతగూడు కల నెరవేరడం లేదు. ఆరంభ శూరత్వంగా ప్రారంభమై, అవాంతరాలతో మధ్యస్తంగా నిలిచిపోయిన పలు గృహనిర్మాణ పథకాల్లో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన (వాంబే) ఒకటి. దాదాపు దశాబ్దం క్రితమే ఈ పథకం ప్రారంభించినప్పటికీ, నేటికీ లబ్ధిదారుల ఎంపికే పూర్తికాని దుస్థితి. త్వరలో ఏర్పాటు కానున్న కొత్త సర్కారు హయాంలోనైనా పేదల సొంతగూటి కల నెరవేరుతుందో లేదో వేచి చూడాల్సిందే. దశాబ్దం కిందట ప్రారంభమైనా.. దాదాపు దశాబ్దం క్రితం పేదలకు గృహ సదుపాయం కల్పించేందుకు హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 6,036 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వేర్వేరు ప్రాంతాల్లో 19 కాలనీల్లో వీటిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకుగాను దాదాపు రూ.92.30 కోట్లు ఖర్చు కాగలదని అప్పట్లో అంచనా వేశారు. ఇందులో రూ. 80.86 కోట్లు గృహనిర్మాణాలకు కాగా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.44 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. అనంతరం ఆ పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్ నుంచి జీహెచ్ఎంసీకి బదలాయించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకపోవడం.. ఎంపికైన లబ్ధిదారులు తాము చెల్లించాల్సిన వాటా ధనం చెల్లించకపోవడం.. లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకు రాకపోవడం.. తదితర కారణాలతో ఈ పథకం అర్ధాంతరంగా నిలిచిపోయింది. పథకం అమలుపై శ్రద్ధ చూపేవారు కరవై పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మారింది. కొన్ని కాలనీల్లో పూర్తయిన ఇళ్లు ఆక్రమణల పాలయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారుల స్థానే థర్డ్‌పార్టీలు చేరాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో పట్టిం చుకునే అతీగతీ లేకుండా అసంపూర్ణంగా మిగిలాయి. మరికొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులే చేరినప్పటికీ.. చెల్లించాల్సిన వాటా ధనం చెల్లించలేదు. మొత్తానికి పథకం నిష్ర్పయోజనమైంది.