hudco award
-
హౌసింగ్ కార్పొరేషన్‌కు హడ్కో అవార్డు
సాక్షి,హైదరాబాద్ : డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో మెరుగైన పనితీరుకుగాను ఈ ఏడాది వరుసగా రెండోసారి తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కు హడ్కో అవార్డు దక్కింది. ఢిల్లీలో ఈనెల 25న ఈ అవార్డు అందజేయనున్నట్లు హడ్కో గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. రెండోసారి ఈ అవార్డు రావడం పట్ల గృహ నిర్మాణ శాఖ మం త్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆ శాఖ స్పెషల్ సీఎస్ చిత్రారామచంద్రన్ హర్షం వ్యక్తం చేశారు. -
హడ్కో అవార్డు అందుకున్న కేటీఆర్
న్యూఢిల్లీ : తెలంగాణ ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం హడ్కో అవార్డు అందుకున్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదగా ఆయన ఈ అవార్డు తీసుకున్నారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ప్రత్యేక అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. హడ్కో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఇండియా హాబిటేట్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రక్షిత మంచినీటి పథకాన్ని 4ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఇక నేపాల్‌లో చిక్కుకున్న భరత్పూర్ మెడికల్ విద్యార్థులను ఈరోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుస్తామని కేటీఆర్ తెలిపారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణవారిని రక్షించేందుకు తమ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. -
వాటర్‌గ్రిడ్‌కు ‘హడ్కో’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ప్రత్యేక అవార్డును ప్రకటించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావుకు అభినందనలు తెలుపుతూ హడ్కో అధికారులు లేఖ పంపారు. హడ్కో వ్యవస్థాపక దినోత్సవం (ఏప్రిల్ 27) సందర్భంగా ఢిల్లీలోని ఇండియా హాబిటేట్ సెంటర్లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.