భారీగా పేలుడు పదార్థాలు పట్టివేత
బొబ్బిలి: విజయనగరం జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొబ్బిలి పట్టణంలో పోలీసులు ఆదివారం ఉదయం జరిపిన దాడుల్లో 18 బస్తాల డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్‌ను కనుగొన్నారు. చిన్నబజార్ వీధిలోని జంబలి లక్ష్మీనారాయణ, జంబలి కవితయ్య ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించగా మూడు బ్యాగుల్లో ఉంచిన డిటోనేటర్లు, ఫ్యూజ్‌వైర్లను పట్టుకున్నారు.
వీరికి సంబంధించిన ఒక గోదాములో మరో 15 బస్తాల పేలుడు పదార్ధాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం మేరకు ఈ దాడులు జరుగుతున్నాయి. వ్యాపారులకు దీపావళి సామాగ్రి విక్రయించేందుకు లైసైన్స్ ఉండగా... ఆ ముసుగులో డిటోనేటర్లను క్వారీలు ఇతర అవసరాలకు విక్రయిస్తున్నట్టు తెలిస్తుంది. గత మూడు రోజులుగా పట్టణంలో పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.