huge security
-
‘చక్కా జామ్’ : 50 వేల మందితో భారీ భద్రత
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పదమైన మూడు వ్యవసాయ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా చేపట్టిన నిరసన కార్యక్రమంలో నేటి (శనివారం) కార్యాచరణ కీలకంగా మారనుంది. దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధనానికి ‘చక్కా జామ్' పేరుతో సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఆందోళన చేపట్టనున్నారు. రిపబ్లిక్ డే ట్రాక్టర్ ర్యాలీ తర్వాత తలపెట్టిన అతిపెద్ద నిరసన కార్యక్రమంగా చక్కా జామ్ నిలవనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భదత్రను కట్టుదిట్టం చేశారు. ఘాజీపూర్, టిక్రీ, సింగు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ మినహా మిగితా దేశమంతా చక్కా జామ్ ఉంటుందని భారతీయ కిసాన్ యూనిన్ నేత రాకేశ్ తికాయిత్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొందరు హింసకు పాల్పడే అవకాశం ఉన్నందున ఈ మూడు రాష్ట్రాల్లో బంద్‌ను వాయిదా వేసినట్లు చెప్పారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న ప్రాంతాలు మినహా ఢిల్లీలో ఎక్కడా చక్కా జామ్ ఉండదని స్పష్టం చేశారు. చక్కాజామ్ ముగియడానికి ముందు ఒక నిమిషం పాటు వాహనాలతో హారన్ కొట్టి రైతులకు సంఘీభావం తెలుపుతామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై నిరసనలు శాంతియుతంగా కొనసాగనున్నాయని తెలిపారు. ఎటువంటి ఘర్షణలకు, వాగ్వాదాలకు పాల్పడవద్దని ఆందోళనకారులకు సూచించారు. అలాగే అంబులెన్సులు, స్కూల్ బస్సులను ఈ నిరసననుంచి మినహాయింపు నిస్తున్నట్టు సంయుక్తి కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. 'చక్కా జామ్' కార్యక్రమానికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఇరువురూ అత్యంత సంయమనం పాటించాలని అటు అధికారులు, ఇటు ఆందోళనకారులకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. మరోవైపు 50 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవం రోజు ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో పారామిలిటరీ, రిజర్వ్ దళాలను మోహరించారు. వాటర్కెనాన్లను సిద్ధం చేశారు. 12 మెట్రో స్టేషన్ల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. కొన్నింటిని మూసివేశారు. పలు ప్రాంతాల్లో వాటర్ కెనాన్లను సిద్ధం చేయడంతో పాటు డ్రోన్ల ద్వారా పోలీసులు నిఘా పెట్టారు. గత 70 రోజులగా కొత్త సాగుచట్టల డిమాండ్‌తో ఢిల్లీలోని సింఘు, తిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతుల ఆందోళన చేస్తున్నారు. #India: We call on the authorities and protesters to exercise maximum restraint in ongoing #FarmersProtests. The rights to peaceful assembly & expression should be protected both offline & online. It's crucial to find equitable solutions with due respect to #HumanRights for all. — UN Human Rights (@UNHumanRights) February 5, 2021 #WATCH I Delhi: Drone cameras deployed in the national capital to monitor the situation in the wake of 'Chakka Jaam' call by farmers; visuals from Tikri border. pic.twitter.com/fQNfd0CNN3 — ANI (@ANI) February 6, 2021 -
వెలగపూడి ‘గూడు’పుఠాణి!
-
వెలగపూడి ‘గూడు’పుఠాణి!
♦ హడావుడిగా కట్టి.. రహస్యంగా కూల్చేశారు ♦ ఇరుకు గదులు, వాస్తుపై మంత్రుల ఫిర్యాదులు ♦ కట్టిన గదులు రహస్యంగా కూల్చివేత ♦ భారీ సెక్యూరిటీ.. గేట్లకు తాళాలు... ♦ అసలే ‘తాత్కాలికం..’ దానికేబోలెడు వ్యయం ♦ మార్పులతో మరింత వృథా ఖర్చు.. ♦ తాత్కాలిక సచివాలయం నుంచి పాలన ఇప్పట్లో లేనట్లే... సాక్షి, అమరావతి: అది అసలే తాత్కాలిక సచివాలయం... దానికే రూ.700 కోట్ల ఖర్చు. అది కూడా హడావుడిగా నిర్మాణం.. అంతా లోపాల మయం. దాంతో అది ఎవరికీ పనికిరాకుండా పోయింది. గదులు ఇరుకుగా ఉన్నాయని, వాస్తుదోషాలున్నాయని మంత్రులు చేస్తున్న ఫిర్యాదులతో ముఖ్యమంత్రి తలబొప్పికట్టింది. అందుకే భారీ మార్పులకు తెరతీశారు. సచివాలయంలోని 2, 3, 4, 5 భవనాల్లో మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు కేటాయించిన గదులను కూలదోస్తున్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం కోసం లోనికి ఎవరినీ రానివ్వకుండా బయట తాళాలువేశారు. భారీ సెక్యూరిటీ ఏర్పాటుచేశారు. ఈ మార్పులు చేర్పులకు కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కానున్నది. తాత్కాలిక సచివాలయం కోసం ఇన్ని మార్పులు చేయడం, ఇంత పెద్ద ఎత్తున వృథా చేయడం చూసి అధికారులు విస్తుపోతున్నారు. మంత్రుల అసహనం.. ఫిర్యాదులు.. తమకు కేటాయించిన గదులు ఇరుకుగా ఉన్నాయని మంత్రి నారాయణ వద్ద యనమల అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజుల తరువాత సచివాలయాన్ని సందర్శించిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన గదులలో మార్పులు చేయాల్సిందిగా మంత్రి నారాయణకు ఫోన్లో సూచించినట్లు తెలిసింది. మంత్రులు అయ్యన్నపాత్రుడు, కిమిడి మృణాళిని, అచ్చెన్నాయుడు, రావెల కిశోర్‌బాబు, పత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావు కూడా తమ పేషీలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఎం ఆదేశాలతో భారీ మార్పులు హడావుడిగా చేపట్టిన నిర్మాణాల్లో లోటుపాట్లు ఉన్నాయని మంత్రులు, అధికారులు అసంతృప్తి వ్యక్తం చేయటంతో మార్పులు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కృష్ణా పుష్కరాల్లో అంతా బిజీగా ఉంటారు కనుక కూల్చివేసి తిరిగి నిర్మాణాలు చేపట్టేందుకు ఇదే మంచి సమయమని సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం రెండవ భవనంలో మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. అన్ని భవనాలకంటే ముందుగా ప్రారంభించిన ఐదవ భవనంలో పెద్ద ఎత్తున మార్పులకు తెరతీశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఐదవ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో మంత్రులు అయ్యన్నపాత్రుడు, కిమిడి మృణాళిని, ప్రిన్సిపల్ సెక్రటరీలకు కేటాయించిన గదులన్నింటినీ పగులగొట్టారు. ప్రతి మంత్రికి 225 అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలు ఉండేలా మార్పులు చేపట్టారు. దీంతో రెండు గదులు కలిపి ఒక మంత్రికి కేటాయించేందుకు మధ్యలో ఉన్న గోడను పగులగొడుతున్నారు. తాత్కాలిక సచివాలయంలో ఎక్కడెక్కడ గోడలు పగులగొట్టాలో ఇంజనీర్లు మార్క్చేశారు. ఆ గోడలపై ‘టోటల్ రిమూవ్డ్’ అంటూ పేపర్‌పై రాసి అంటించారు. గోడలు కూల్చిన ప్రాంతంలో డోర్లు, వాష్‌బేషిన్, బాత్ రూంలు ఎక్కడెక్కడ ఉండాలో మార్కర్‌తో రాశారు. ఇంజనీర్లు సూచించిన చోట్ల గోడలను కార్మికులు పగులగొడుతున్నారు. ఇవన్నీ బయటకు తెలియకుండా ఉండేందుకు ఆయా భవనాలకు తాళాలు వేసి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఎవరినీ లోనికి పంపొద్దని గట్టిగా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. గోడలు కూల్చి తిరిగి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు ఖర్చుచేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. భవనాలకు ఇప్పుడు చేస్తున్న భారీ మార్పులు చూస్తుంటే వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచి ప్రభుత్వ పాలన ఇప్పుడే ప్రారంభమయ్యే అవకాశమే లేదని తేలిపోయింది. ప్రభుత్వ హడావుడి నిర్ణయాలతో ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. -
ఎన్నికలు ప్రశాంతం
కాగజ్‌నగర్ రూరల్/దండేపల్లి/ బెజ్జూర్/తాండూర్, న్యూస్‌లైన్ : జిల్లాలో వాయిదా పడ్డ సర్పంచ్, వార్డుల స్థానాలకు శనివారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలీసులు భారీ బందోబస్తు మధ్య ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగజ్‌నగర్‌లోని నజ్రూల్‌నగర్ పంచాయతీకి సర్పంచ్ స్థానానికి నిర్వహించిన ఎన్నికలో టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి బిజయ్ఘరామీ విజయం సాధించారు. నజ్రూల్‌నగర్ విలేజ్ నంబర్ 12లోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో 16 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సమయంగా కేటాయించడంతో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. మొత్తం 7,229 ఓట్లకు గాను 4,935 ఓట్లు పోలయ్యాయి. 69.30 శాతంగా పోలింగ్ నమోదైంది. బిజయ్ఘరామీకి పోటీగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వర్గం బలపర్చిన స్వప్నమల్లిక్, శివానీబరాయ్ బరిలో నిలిచారు. వీరిలో బిజయ్ఘరామీకి 3,153 ఓట్లు పోలవ్వగా.. స్వప్నమల్లిక్కు 1,634, శివానీబరాయ్కి 88 ఓట్లు వచ్చాయి. 60 ఓట్లు చెల్లనివిగా తీరస్కరించబడ్డాయి. దీంతో బిజయ్ఘరామీ 1519 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజమౌళి ప్రకటించారు. ఇందు లో డీఎల్పీవో శ్రీనివాసరెడ్డి, ఈవోపీఆర్డీ క్రిష్ణమూర్తి, మోడల్ కోడ్ జోనల్ అధికారి నీలం సంపత్‌కుమార్ పాల్గొన్నారు. తదుపరి సర్పంచ్‌గా గెలుపొందిన బిజ య్ఘరామీతో ఆయన మద్దతుదారులు, ఆయా పార్టీ ల నాయకులు పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ తీశా రు. ఇందులో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రావి శ్రీనివా స్, నాయకులు పాల్గొన్నారు. కాగా.. ఎన్నికల సిబ్బం దికి భోజన వసతి కల్పించకపోవడంతో వారు ఎంపీడీవో సత్యనారాయణసింగ్ ను నిలదీశారు. భోజనం చేసే వరకూ కౌంటింగ్ ప్రా రంభించేది లేదని తేల్చడం తో సుమారు 40 నిమిషాలు ఆలస్యంగా కౌంటింగ్ ఆరంభమైంది. ఎన్నికల సందర్భంగా డీఎస్పీ సురేష్‌బాబు ఆధ్వర్యంలో సీఐలు రహమాన్, సత్యనారాయణ, ఎస్సైలు సురేందర్, సత్యనారాయణతోపాటు మరో 60 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. వార్డు సభ్యుల ఎన్నిక దండేపల్లి మండలంలోని తాళ్లపేటలో రెండో వార్డు స్థానానికి నిర్వహించిన ఎన్నికలో 168 ఓట్లకు గాను 152 పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ బలపర్చిన కంది రవి 45 ఓట్ల మెజార్టీతో వార్డు సభ్యుడిగా గెలుపొందారు. ముగ్గురు బరిలో ఉండగా రవి విజయం సాధించారు. రిటర్నింగ్ అధికారి, ఈవోపీఆర్డీ శివకృష్ణ, సిబ్బంది చంద్రమౌళి, సుభాశ్, సత్యనారాయణ పాల్గొన్నారు. ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో బం దోబస్తు నిర్వహించారు. ఎన్నిక అనంతరం రవి, ఆయన మద్దతుదారులు గ్రామంలో విజయోత్సవ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ గడ్డం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రేణి శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు. అలాగే బెజ్జూర్ మండలం సోమిని పంచాయతీ పరిధి తొమ్మిదో వార్డుకు నిర్వహించిన ఎన్నికలలో 97 ఓట్లకు 76 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలువగా.. ఆరెపెల్లి లహన్ విజయం సాధించినట్లు ప్రొసిడింగ్ అధికారి వల్వీనాయక్ ప్రకటించారు. తన సమీప ప్రత్యర్థి జ్యోత్స్నకు 18 ఒట్లు రాగా లహన్కు 48 ఓట్లు వచ్చా యి. 30 ఓట్ల మెజార్టీతో లహన్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎస్సై కుమారస్వామి భారీ బందోబస్తు నిర్వహించారు. అలాగే తాండూర్ మండలం అచ్చలాపూర్ రెండో వార్డుకు నిర్వహించిన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గుర్రం లింగయ్య గెలుపొందారు. 182 ఓట్లకు గాను 160 పోలయ్యాయి. మూడు చెల్లకుండా పోయాయి. ఇందులో లింగయ్య 83 ఓట్లు రాగా.. సీపీఐ బలపర్చిన సమీప ప్రత్యర్థి అట్టి రాములు 74 ఓట్లు వచ్చాయి. కేవలం తొమ్మిది ఓట్ల మెజార్టీతో లింగయ్య గట్టెక్కాడు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి మారుతికుమార్, ప్రిసైడింగ్ అధికారి బాలాజీప్రసాద్ గుర్రం లింగయ్యకు నియామకపు పత్రం అందజేశారు. -
ఈ అరాచకంఎవరి కోసం?
న్యూస్‌లైన్- టాస్క్‌ఫోర్స్ : శాంతిభద్రలను పరిరక్షించాల్సిన పోలీసులే వాటికి విఘాతం కల్పించేందుకు పూనుకున్నారు. నిరక్షరాస్యులు.. స్పెల్లింగ్ తెలియనోళ్లు పోరాటంలో పాల్గొంటున్నారంటూ ఉద్యమాన్ని అపహాస్యం చేశారు. శాంతియుతంగా ఉద్యమిస్తోన్న ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు.. విద్యార్థులపై కేసులు బనాయించి బైండోవర్ చేస్తున్నారు. ఇది కింది స్థాయి పోలీసులు చేస్తోన్న విక ృత చేష్టలేమో అనుకుంటే తప్పులో కాలేసినట్లే..! సాక్షాత్తూ అనంతపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) శ్యాంసుందర్ సాగిస్తోన్న విక ృత క్రీడ ఇది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా ఎస్పీగా శ్యాంసుందర్ జూలై 13న బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు, వరంగల్ జిల్లాల ఎస్పీగా పనిచేసిన కాలంలో శ్యాంసుందర్ తీరు వివాదాస్పదమైన విషయం విదితమే. అనంతపురం జిల్లాలోనూ ఆయన నడత మారలేదు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే వివాదాస్పద నిర్ణయాలతో పేట్రేగిపోతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో సమైక్య ఉద్యమం మిన్నంటింది. సమైక్య ఉద్యమానికి చుక్కానిలా అనంతపురం జిల్లాలో ఉద్యమకారులు వ్యవహరిస్తున్నారు. శాంతియుతంగా సాగుతోన్న ఉద్యమాన్ని అణచేందుకు ఎస్పీ తీసుకుంటున్న చర్యలు హిట్లర్ పోకడలను తలదన్నుతున్నాయి. ఉద్యమాన్ని అదుపు తప్పకుండా చూస్తూ.. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన ఎస్పీ తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యమకారులను రెచ్చగొట్టేలా మాటల తూటాలను పేల్చుతున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శ్రీక ృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆమరణ దీక్ష చేస్తోన్న శిబిరం వద్దకు గురువారం వెళ్లిన ఎస్పీ లాఠీలను ఝుళిపించారు. శాంతియుతంగా ఉద్యమిస్తోన్న విద్యార్థులను సాక్షాత్తూ ఎస్పీ గొడ్డులను బాదినట్లు బాదారు. దీన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో ఎస్కే యూనివర్శిటీలో కడప ఫ్యాక్షనిస్టులు తిష్టవేసి.. ఉద్యమాన్ని నడిపిస్తున్నారని, అసాంఘిక శక్తులు ఉద్యమంలోకి చొరబడ్డాయంటూ ఉద్యమకారులను అపహాస్యం చేశారు. ఎస్కే విశ్వవిద్యాలయం వద్దే ఓ పత్రికా విలేకరి అశోక్‌కుమార్‌పై దాడి చేశారు. దీంతో భయపడ్డ అశోక్‌కుమార్ ఆత్మాహత్యయత్నానికి పాల్పడ్డారు. ఇక ఎస్కే యూనివర్శిటీ వద్ద ఎస్పీ వీరంగం సృష్టించిన తర్వాత అనంతపురం నగరంలో శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తోన్న సాధారణ ప్రజలపై ఇష్టారాజ్యంగా దాడి చేశారు. ఆర్ట్స్ కళాశాల హాస్టల్లో ఉన్న విద్యార్థులపై అర్ధరాత్రి దాడి చేసి.. చావబాదారు. ఈ సంఘటనల తర్వాత శుక్రవారం అనంతపురంలో ఎస్పీ నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని మీడియా ప్రతినిధులు బహిష్కరించారు. ఆ వెంటనే హిందూపురం వెళ్లి విలేకరులతో మాట్లాడుతూ సమైక్య ఉద్యమాల స్పెల్లింగ్ తెలియని వాళ్లు కూడా ఉద్యమాల్లో పాల్గొంటున్నారని ఆయన వ్యాఖ్యానించడం విమర్శలకు దారితీస్తోంది. నిరక్షరాస్యులు, స్పెల్లింగ్ తెలియని వారు ఉద్యమాల్లో పాల్గొనకూడదా అంటూ న్యాయవాదులు నిలదీస్తున్నారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)-ఏ ప్రకారం ప్రజలందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన ఎస్పీకి ఇది తెలియదనుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. ఎస్పీ తీరుతోనే అరాచకం.. జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ నియంత పోడలను అనుసరిస్తున్నారనే విమర్శలు పోలీసు వర్గాల నుంచే బలంగా విన్పిస్తున్నాయి. సమైక్య ఉద్యమాన్ని అణచేందుకు ఆయన అవలంబిస్తోన్న విధానాలను పోలీసులే జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు వ్యక్తం చేసుకోవడానికి కూడా ఎస్పీ అనుమతించక పోవడం గమనార్హం. సమైక్య ఉద్యమ బాట పట్టిన వారిపై ఎస్పీ స్వయాన లాఠీ ఝుళిపించి.. గొడ్డుకన్నా హీనంగా చావబాదడం గమనార్హం. సమైక్య ఉద్యమకారులపై ఒక్క రబ్బరు బుల్లెట్టు.. బాష్పవాయు గోళాలు ప్రయోగించినా ఊరుకునేది లేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేసినా, ఎస్పీ అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని మానవ హక్కుల సంఘాల నేతలు, సమైక్యవాదులు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకటనను పాటించాల్సిన ఎస్పీ బరితెగించి వీధుల్లో వీర విహారం చేశారు. తాను చెప్పిందే వేదంగా పాటించాలని జిల్లా వాసులకు హుకుం జారీ చేశారు. నియంత ృత్వ పోకడలు అవలంబిస్తోన్న ఎస్పీని ఉన్నతాధికారులు మందలించినా.. ప్రభుత్వ పెద్దలు తప్పని చెప్పినా ఆయన తీరును మార్చుకోవడం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమాల్లో కొందరు ఫ్యాక్షన్ క్రిమినల్స్ కలసి జిల్లాలో పెద్ద ఎత్తున లూటీలకు పాల్పడేందుకు కుట్రలు పన్నినట్లు నిఘా వర్గాల ద్వారా గుర్తించామని చెబుతున్న పోలీసు ఉన్నతాధికారి.. నాలుగు రోజులుగా ఏ ఒక్కరిని అదుపులోకి తీసుకున్న సందర్భం లేదు. పైగా తన వాదనను బలపర్చుకొనేందుకు, ఎస్కేయూ విద్యార్థుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు తనదైన శైలిలో ఎత్తులు వేసే పనిలో పడ్డారు. ఉద్యమకారుల్లో క్రిమినల్స్, లూటీదారులు కలిశారని ప్రకటించిన ఎస్పీ సమైక్య ఉద్యమాన్ని అపహాస్యం చేస్తున్నారని ప్రజాస్వామ్యవాదులు నిరసిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకున్న మొదటి రెండు రోజులు నేరుగా రంగంలోకి దిగిన ఆయన కనిపించిన వారిని కుక్కలను తరిమినట్లు తరిమి కొట్టారు. ఎస్పీ మాట్లాడిన మాటలు.. వ్యవహరించిన తీరు వల్లే ‘అనంత’లో తొలి రెండు రోజులు ఉద్యమం హింసాత్మకంగా మారిందని సమైక్యవాదులు ఆరోపిస్తున్నారు. ప్రశాంతంగా ఉద్యమిస్తోన్న ప్రజలను ఆయన రెచ్చగొట్టేలా వ్యవహరించడంతో హింస చోటుచేసుకుంది. చేజేతులారా శాంతి భద్రతలు గతి తప్పడానికి కారణమైన ఎస్పీ.. పరిస్థితిని అదుపులో పెట్టడానికి అదనపు బలగాలు కావాలంటూ కేంద్రానికి లేఖ రాయడం గమనార్హం. ‘అనంత’ను ఖాకీవనంగా మార్చి.. సమైక్యవాదులపై పోలీసులను ఉసిగొల్పి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచి వేయడానికి ఆయన ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఎస్పీ నిరంకుశత్వంపై కథనాలు వెలువరించడంతో జర్నలిస్టులపై పోలీసు ‘మార్కు’ వేశారు. విలేకరులపై అక్రమ కేసులు బనాయించి.. వేధింపులకు తెర తీశారు.