huge traffic
-
కారులు.. బారులు
సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్తున్న వారితో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం వాహనాల రద్దీ కొనసాగింది. ఇక్కడ 16 కౌం టర్లకు గాను విజయవాడ వైపు 5 ఫాస్టాగ్‌కు, 4 నగదు చెల్లింపులకు కేటాయించారు. హైదరాబాద్ మార్గంలో 4 ఫాస్టాగ్‌కు, నగదు చెల్లింపునకు 3 మార్గాలు కేటాయించారు. ఫాస్టాగ్ లేని వాహనాలు కూడా ఆయా మార్గాల్లోకి వెళ్లడంతో మరింత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. – చౌటుప్పల్/బీబీనగర్/కేతేపల్లి -
ముక్కుతూ మూలుగుతూ వస్తున్న ఆర్టీసీ ప్రయాణికులు!
సాక్షి, హైదరాబాద్ : దసరా సెలవులు ముగిశాయి. శనివారం నుంచి అంతా తిరుగు ప్రయాణాల్లో ఉన్నారు. కానీ, శనివారంతో పోలిస్తే ఆదివారం రద్దీ రెండింతలుగా ఉంది. దీంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. దసరా సెలవుల సందర్భంగా ఆర్టీసీ 4,480 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వీటిలో 50% అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. దసరా, ఆ మరుసటి రోజు రద్దీ బాగా తగ్గినా, శనివారం నుంచి తిరిగి ఊపందుకుంది. ఆదివారం ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులన్నీ కిటకిటలాడటం మొదలైంది. రిజర్వేషన్ చేయించుకున్న వారి పరిస్థితి పర్వాలేదుగానీ, రిజర్వేషన్ లేని ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పాత ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు సీట్లు దొరక్క నానా ఇబ్బందులు పడ్డారు. 50% అదనంగా డబ్బులు చెల్లించినా వేలాడాల్సి రావడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. డొక్కు బస్సుల్లో కుక్కిపంపుతున్నారు, కనీస శుభ్రత పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ అన్నబోర్డు పెట్టి 50% అధిక చార్జీలు వసూలు చేయడం దారుణమని వాపోతున్నారు. సెలవులు ముగియడంతో.. సోమవారం నుంచి బడులు, కాలేజీలు తిరిగి తెరుచుకుంటున్న నేపథ్యంలో ఊళ్లకు వెళ్లిన వారంతా ఆదివారం ఒక్కసారిగా బస్సు ప్రయాణాలను ఎంచుకోవడంతో రద్దీతో బస్సులన్నీ కిటకిటలాడాయి. చాలామంది ప్రయాణికులు బస్సుల్లో నిలుచుని, మరికొందరు ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఈ రద్దీ బుధవారం వరకు ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రైళ్లల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సువిధ రైళ్లు మినహా తిరుగు ప్రయాణంలోనూ ఎలాంటి ప్రత్యేక సర్వీసులు నడపకపోవడంతో జనరల్ బోగీలు కిక్కిరిసిపోయాయి. రోజుకు 50వేలమంది అధికంగా ప్రయాణం చేస్తున్నా.. అధికారులు ప్రత్యేక రైళ్లు నడపకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోల్గేట్ల వద్ద రద్దీ.. తెలంగాణలో ముంబై, విజయవాడ, బెంగళూరు, పుణే, వరంగల్ జాతీయ రహదారులు, నార్కట్‌పల్లి– అద్దంకి, రాజీవ్ రహదారిపై కలిపి దాదాపు 18 టోల్గేట్లు ఉన్నాయి. ఈ టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో గంటల తరబడి వాహనదారులు అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది. మరోవైపు ఈ మార్గంలో ప్రయాణించే స్థానికులు, ఆర్టీసీ ప్రయాణికులు కూడా ట్రాఫిక్‌జామ్‌ల కారణంగా ఇబ్బందులు పడ్డారు. టోల్గేట్ల వద్ద అదనపు సిబ్బందిని నియమించినప్పటికీ రాత్రి వరకు రద్దీ కొనసాగింది. -
నిఘా నీడలో గుంటూరు నగరం
గుంటూరు క్రైం : గురుపూజోత్సవ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విచ్చేసే ముఖ్యమంత్రి, మంత్రులకు విడిది ఏర్పాట్లతో పాటు నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పోలీసు పరేడ్‌గ్రౌండ్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ వివేక్‌యాదవ్, కళాశాల విద్య కమిషనర్ కె.సునీతలతో పాటు విజయవాడ కమిషనర్, అడిషనల్ డీజీపీ, ఏబీ.వెంకటేశ్వరరావు, ఐజీ పీవీ సునీల్ కుమార్, ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ముఖ్యమంత్రి ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. వేదికతోపాటు కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ కావాల్సిన సదుపాయాలను పూర్తి చేశారు. అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ 45 రోజులపాటు శిక్షణకు వెళ్ళడంతో ఐజీతో రూరల్ ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఐజీ, రూరల్ ఎస్పీతోపాటు, ఏడుగురు అదనపు ఎస్పీలు, 20 మంది డీఎస్పీలు, 300 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో సహ మొత్తం 3000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు బాంబ్‌స్క్వాడ్, డాగ్స్క్వాడ్లతో తనిఖీలు చేయించారు. నగరంలోని లాడ్జిలు, హోటళ్ళల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు వరకు ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహనాలతో ట్రయల్ రన్ నిర్వహహించారు. బాధ్యతగా విధులు నిర్వహించాలి.. ముఖ్యమంత్రి కార్యక్రమం పూర్తయి తిరిగి వెళ్లే వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఐజీ సునీల్ కుమార్ అధికారులను ఆదేశించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. భద్రతా,ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు దృష్టి సారించాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి సమస్యలు తలెత్తితే నిమిషాల వ్యవధిలో సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. సమావేశంలో ఎస్పీ రామకృష్ణతో పాటు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.