human development
-
World Health Day: ఏయే వయసుల్లో.. ఏయే వ్యాక్సిన్లు! ఏయే వైద్య పరీక్షలు..?
ఆరోగ్య సమస్య ఏమైనా వస్తే చికిత్స తప్ప ప్రత్యామ్నాయం లేదు. కానీ సమస్య రాకుండా ముందే నివారించుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. చికిత్స కంటే నివారణే మేలు అనే సూక్తి మేరకు వ్యాధుల నివారణకు ఉపయోగపడే అంశాల్లో మొట్టమొదటి అంశం టీకాలు (వ్యాక్సిన్లు). రెండో అంశం.. లక్షణాలు కనిపించగానే చేయించాల్సిన వైద్యపరీక్షలు. నేడు ‘వరల్డ్ హెల్త్ డే’. ఈ సందర్భంగా ఏ వయసులో. వారు ఏయే వ్యాక్సిన్లు తీసుకోవాలన్న అంశంపై అవగాహన కోసం ఈ కథనం. టీకాలు.. చిన్నారి పుట్టిన వెంటనే.. ఓపీవీ, బీసీజీలతో పాటు హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత 6, 10, 14 వారాల్లో ఇస్తారు). ఆరు వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా ఫస్ట్ డోస్ హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా ఫస్ట్ డోస్ ఐపీవీ (ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్)/ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా ఫస్ట్ డోస్ పీసీవీ 13 (న్యూమోకోకల్ కాంజుగేట్ టీకా) ఫస్ట్ డోస్ రొటావైరస్ టీకా మొదటి డోస్ (ఇది నోటిద్వారా ఇస్తారు) హెపటైటిస్–బి వ్యాక్సిన్ రెండో డోస్. పది వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా రెండో మోతాదు హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా రెండో మోతాదు ఐపీవీ / ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా రెండోడోస్ పీసీవీ 13 రెండో మోతాదు నోటిద్వారా ఇచ్చే రొటావైరస్ టీకా రెండో డోస్ హెపటైటిస్–బి మూడో డోస్. పద్నాలుగు వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా మూడో మోతాదు హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా మూడోమోతాదు ఐపీవీ (ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్)/ ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా మూడో మోతాదు పీసీవీ 13 (న్యూమోకోకల్ కాంజుగేట్ టీకా) మూడో మోతాదు రొటావైరస్ టీకా మూడో డోస్ (ఇది నోటిద్వారా ఇచ్చే డోస్) హెపటైటిస్–బి వ్యాక్సిన్ నాలుగో మోతాదు. ఆరు నెలల వయసప్పుడు: ఇన్ఫ్లుయెంజా టీకా మొదటి మోతాదు ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) మొదటి మోతాదు ఏడు నెలల వయసప్పుడు: ఇన్ఫ్లుయెంజా టీకా రెండో మోతాదు తొమ్మిది నెలల వయసప్పుడు: ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) రెండో మోతాదు ఎమ్ఎమ్ఆర్ (తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా) టీకా ఫస్ట్ డోస్ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఇస్తారు. పన్నెండు నుంచి 15 నెలల వయసప్పుడు: ఎమ్ఎమ్ఆర్ (తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా) టీకా రెండో మోతాదు వారిసెల్లా (చికెన్‌పాక్స్) టీకా మొదటి మోతాదు హెపటైటిస్–ఏ టీకా మొదటి మోతాదు (దీని రెండో డోస్ సాధారణంగా 18 నెలలప్పుడు ఇస్తారు) పీసీవీ (ప్యాక్డ్ సెల్ వాల్యూమ్) బూస్టర్. పద్దెనిమిది నెలల వయసప్పుడు: డీట్యాప్ టీకా మొదటి బూస్టర్ డోస్ హెచ్ఐబీ (హిబ్) టీకా మొదటి బూస్టర్ డోస్ ఐపీవీ లేదా ఓపీవీ టీకా హెపటైటిస్–ఏ రెండో డోస్. మూడేళ్ల వయసప్పుడు: వారిసెల్లా వ్యాక్సిన్ రెండో డోస్ టీకా. ఐదేళ్లప్పుడు: డీ–ట్యాప్ టీకా రెండో బూస్టర్ ఐపీవీ టీకా ∙ఎమ్ఎమ్ఆర్ టీకా మూడో డోస్. పది నుంచి పన్నెండేళ్ల వయసప్పుడు: హెచ్‌పీవీ టీకా మొదటి డోస్ (దీని రెండు, మూడు డోసులు 9 నుంచి 18 ఏళ్ల వయసప్పుడు) టీడ్యాప్ టీకా బూస్టర్ డోస్ ∙మెనింగోకోకల్ కాంజుగేట్ టీకా మొదటి డోస్ (దీని బూస్టర్ 16 ఏళ్ల వయసప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది). పదిహేను నుంచి 16 ఏళ్ల వయసప్పుడు: మెనింగోకోకల్ కాంజుగేట్ టీకా బూస్టర్ డోస్ టీడీ / డీటీ టీకా. 18 నుంచి 65 ఏళ్ల వరకు: ఈ వయసులో ఎవరికైనా మంచి వ్యాధి నిరోధకత ఉంటుంది. గతం లో ఏదైనా వ్యాక్సిన్ తీసుకోకపోతే... డాక్టర్ సలహా మేరకు తీసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్నదీ లేనిదీ గుర్తులేనప్పుడు డాక్టర్‌కు ఆ విషయం చెబితే... వారు కొన్ని పరీక్షల ద్వారా వ్యాక్సిన్ తీసుకున్నదీ లేనిదీ నిర్ధారించి అవసరమైతే ఇస్తారు. 65 ఏళ్లు పైబడిన వారికి: ఈ వయసు దాటాక కొన్ని వ్యాక్సిన్లు తప్పనిసరిగాను, మరికొన్ని అవసరాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. పీసీవీ–13 అండ్ పీపీఎస్వీ 23 అనే వ్యాక్సిన్లను సాధారణంగా 65 ఏళ్లు దాటినవారికి ఇస్తుంటారు. ఇవి నిమోనియాను నివారించే నిమోకోకల్ వ్యాక్సిన్స్‌లు. ఇందులో తొలుత పీసీవీ–13 ఇస్తారు. ఆ తర్వాత రెండు నెలలకు పీపీఎస్వీ–23 ఇస్తారు టీ–డ్యాప్ వ్యాక్సిన్: చిన్నప్పుడు తీసుకున్న టెటనస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ వ్యాధులను నివారించే వ్యాక్సిన్ తాలూకు బూస్టర్ డోసులను 65 ఏళ్లు పైబడ్డ తర్వాత ప్రతి పదేళ్లకోమారు తీసుకుంటూ ఉండాలి. - డాక్టర్ బీవీఎస్ అపూర్వ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. పరీక్షలు.. ముందుగానే కొన్ని వైద్య పరీక్షలు చేయించడం వల్ల కొన్ని వ్యాధుల్ని కనుగొని సంపూర్ణంగా నయం చేసుకోవచ్చు. ఉదాహరణకు సర్వైకల్ క్యాన్సర్ అనే వ్యాధికి సుదీర్ఘమైన ముందస్తు వ్యవధి ఉంటుంది. అంటే అసలు వ్యాధి రావడానికి పదేళ్ల ముందునుంచే ‘ప్రీ–సర్వైకల్ పీరియడ్’ ఉంటుంది. పాప్ స్మియర్ అనే పరీక్ష ద్వారా వ్యాధి రాబోయే దశాబ్దకాలం ముందుగానే దాన్ని కనుగొనవచ్చు. క్యాన్సర్ ను ఎంత త్వరగా కనుగొంటే అంత తేలికగా నయమవుతుంది. ఆరోగ్యంగా ఉండటం కోసం ముందస్తుగా ఏయే వయసుల్లో ఏయే వైద్యపరీక్షలు ఉపకరిస్తాయో తెలుసుకుందాం. 0 – 10 ఏళ్ల వయసులో: ఈ వయసులో అవసరం అయితే తప్ప పెద్దగా వైద్యపరీక్షలు అవసరం లేదు. 11 – 20 ఏళ్లు: ఇది యుక్తవయసులోకి మారే దశ. నిర్దిష్టంగా ఏవైనా వైద్యసమస్యలు ఉండటం లేదా లక్షణాలు కనిపించడం వంటి సమయాల్లో తప్ప... ఈ వయసులోనూ పెద్దగా వైద్యపరీక్షలు అవసరం పడవు. 20 – 30 ఏళ్లు: ఈ వయసులో కొన్ని లైంగిక సాంక్రమిక వ్యాధులు (ఎస్టీఐ’స్) కోసం మరీ ముఖ్యంగా హెపటైటిస్–బీ నిర్ధారణ పరీక్షలు చేయించి హెచ్‌బీఐజీ వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే అమ్మాయిలైతే పాప్‌స్మియర్ వంటి గైనిక్ పరీక్ష లు చేయించుకుని, 12 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్యకాలంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ప్రయోజనకరం. 30 నుంచి 40 ఏళ్లు: ఈ వయసు నుంచి డయాబెటిస్ కోసం హెచ్‌బీఏ1సీ అనే రక్తపరీక్షలు, రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. ఏవైనా తేడాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి ఈసీజీ, టూ డీ ఎకో, అవసరాన్ని బట్టి ట్రెడ్మిల్ వంటి పరీక్షలు చేయించాలి. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలూ మంచిదే. మహిళలైతే డాక్టర్ సలహా మేరకు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మామోగ్రామ్ పరీక్ష చేయించాలి. 40 – 50 ఏళ్లు: ఈ వయసు నుంచి దేహంలో కొన్ని మార్పులు మొదలవుతాయి. అందుకే ఈ వయసులో పరీక్షలు తరచూ చేయిస్తుండటం మేలు. రక్తపోటును తెలుసుకోవడం కోసం సిస్టోల్, డయాస్టోల్ ప్రెషర్స్, రక్తలో చక్కెర మోతాదుల కోసం హెచ్‌బీఏ1సీతో పాటు అవసరమైతే గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ), పొద్దున్నే పరగడుపున, ఏదైనా తిన్న తర్వాత చేసే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ్రపాండియల్ వైద్య పరీక్షలతోపాటు అవసరాన్ని బట్టి కొన్నిరకాల క్యాన్సర్ పరీక్షలు చేయించడం మంచిది. అలాగే మహిళలైతే ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ డెన్సిటీ పరీక్ష చేయించాలి. దాంతోపాటు మామోగ్రామ్, పాప్ స్మియర్ పరీక్షలను డాక్టర్ చెప్పిన వ్యవధుల్లో చేయించాలి. ఇక పురుషులైతే ఈ వయసు నుంచి ్రపోస్టేట్ స్పెసిఫిక్ ఏంటీజెన్... సంక్షిప్తంగా పీఎస్ఏ అనే పరీక్షను డాక్టర్లు చెప్పిన వ్యవధుల్లో చేయించుకుంటూ ఉండాలి. 50 – 60 ఏళ్లు: చాలామంది 50 ఏళ్ల వరకు ఎలాంటి పరీక్షలు చేయించకపోవచ్చు. అయితే అలాంటివాళ్లంతా ఈ 50 – 60 ఏళ్ల మధ్యవయసులో తప్పక వైద్యపరీక్షలు చేయించాల్సిన అవసరం తప్పక వస్తుంది. ముందు నుంచి పరీక్షలు చేయించని వాళ్లతోపాటు ఈ వయసులోని అందరూ ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ స్కాన్, కోలన్ క్యాన్సర్ నిర్ధారణ కోసం కొలనోస్కోపీ, గుండె జబ్బుల కోసం తరచూ ఈసీజీ, టూ డీ ఎకో, ట్రెడ్మిల్ పరీక్షలతో పాటు లక్షణాలను బట్టి ఇతర వైద్యపరీక్షలు చేయిస్తుండాలి. మహిళలకు 50 ఏళ్ల వయసు తర్వాత మెనోపాజ్ రావడంతో గుండెకు ఉండే ఒక సహజ రక్షణ తొలగిపోతుంది. అందువల్ల గతంలో చేయించినా, చేయించక పోయినా ఈ వయసు నుంచి మహిళలు గుండెకు సంబంధించిన అన్ని స్క్రీనింగ్ పరీక్షలు అంటే ఈసీజీ, టూడీ ఎకో, ట్రెడ్మిల్ వంటి పరీక్షలు చేయించాలి. 60 నుంచి 70 ఏళ్లు: ఈ వయసులో వాళ్లనే సీనియర్ సిటిజెన్‌గా పరిగణిస్తుంటారు. పురుషులూ మహిళలు అన్న తేడాలేకుండా... ఈ వయసు నుంచి అందరూ... ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ స్కాన్, కోలన్ క్యాన్సర్ నిర్ధారణ కోసం కొలనోస్కోపీ, గుండెజబ్బుల కోసం తరచూ ఈసీజీ, టూ డీ ఎకో, ట్రెడ్మిల్ పరీక్షలతోపాటు లక్షణాలను బట్టి మరికొన్ని ప్రత్యేకమైన పరీక్షలు అవసరమవుతాయి. 70+ పైబడ్డాక.. ఆపైన కూడా.. ఈ వయసు నుంచి లక్షణాలను బట్టి ఓ వ్యక్తి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండేందుకు పైన పేర్కొన్న వైద్యపరీక్షలతో పాటు కొన్ని వ్యాక్సిన్లు, మరికొన్ని మందులు తీసుకోవాలి. ఒకవేళ పోషకాహార లోపం ఉంటే, తగిన ఆహారం తీసుకోవాలి. దాంతోపాటు అవసరం అయితే మరికొన్ని హెల్త్ సప్లిమెంట్స్ వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. - డాక్టర్ హరికిషన్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్. ఇవి చదవండి: మన తెలుగువాడి బయోపిక్ -
మానవాభివృద్ధినీ మనం అంగీకరించలేమా?
ఈ నెల ఐదున – ‘కళ్యాణమస్తు’ పథకం ఆరంభిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన క్లుప్త ప్రసంగంలో– ‘ఈ పథకంలో వధువు విధిగా టెన్త్ క్లాస్ చదివి ఉండాలి’ అనే షరతు కుటుంబం ఆడపిల్లను చదివించడానికి ప్రోత్సహించడం కోసమే’’ అన్నారు. రాష్ట్రంలో పేదపిల్లల చదు వుల ప్రోత్సాహానికి ఇప్పటికే పలు పథకాలు అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇవి ’ఓట్ బ్యాంకు’ పథకాలు అనీ, రాష్ట్ర ఖజానాను కుదేలు చేసేవనీ, ‘కరోనా’నంతర కాలంలో విమర్శలు చేస్తున్నారు. ఈ రెండు విమర్శల్లోని నిజానిజాలను అటు జగన్ వ్యక్తిగత దృష్టి నుంచి, ఇటు మానవాభివృద్ధి నిర్వచనం దృష్టి నుంచి... ఇవి రెండు వేర్వేరు అంశాలుగా చూడాలి. మొదటిది– ముఖ్యమంత్రి ఈ విషయంలో చూపుతున్న శ్రద్ధలో రాజకీయం కంటే వందేళ్ల ఆయన కుటుంబం చరిత్ర నేపథ్య ప్రభావం ఉంది. వైఎస్ రాజారెడ్డి సోదరి డా‘‘ రత్నమ్మ 1923లో పులివెందుల తాలూకా బలపనూరులో ఐదవ తరగతి చదివిన తర్వాత, సొంత ఊళ్ళో హైస్కూల్ లేకపోవడంతో ఆమె తండ్రి జమ్మలమడుగు మిషన్ స్కూల్లో ఆమెను చేర్చారు. అలా పై చదువుల్లోకి వెళ్లి మెడిసిన్ చదివాక, జమ్మలమడుగు మిషన్ హాస్పిటల్లో పనిచేశారు. సర్వీస్ మధ్యలో విదేశాల్లో ‘గైనిక్’ పీజీ చేసివచ్చాక, పదిమంది తోబుట్టువులు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె– ‘ట్యూబెక్టమీ’ ఆపరేషన్ చేయించుకున్నారు. కడప జిల్లాలో 1954 నాటికి అది మొదటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్. ఇదంతా ఇప్పటికి వందేళ్ల నాటి చరిత్ర. ఇక రెండవది– మానవాభివృద్ధి నిర్వచనం దృష్టి నుంచి చూస్తే... ప్రపంచీకరణ తర్వాత ఐరాస ఉపాంగం అయిన యూఎన్డీపీ 17 ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ (ఎస్డీజీ)ను 2030 నాటికి లక్ష్యాలుగా నిర్దేశించి, అంశాల వారీగా వాటిని సమీక్షిస్తున్నది. కనుక, ఇది ఏమాత్రం ఇప్పుడు స్థానిక అంశం కాదు. ఢిల్లీలో మన ‘నీతి ఆయోగ్’ స్థాయిలోనే కాకుండా, పలు విదేశీ యూనివర్సిటీల్లో కూడా వీటిపై నిరంతరాయంగా అధ్యయనం జరుగుతున్నది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ‘పాపులేషన్–హెల్త్–జాగ్రఫీ’ ప్రొఫె సర్గా పనిచేస్తున్న ఎస్వీ సుబ్రహ్మణ్యన్ అదే యూని వర్సిటీలో–‘ఇండియా పాలసీ ఇన్సైట్స్ ఇనీషియేటివ్’ చీఫ్ ఇన్వెస్టిగేటర్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన–‘ఇండియా, ఇట్స్ ఎస్డీజీ ప్లెడ్జి గోల్ అండ్ ది స్ట్రాటజీ టు అప్లై’ శీర్షికతో వెలువరించిన వ్యాసం చూస్తే... ‘ఇందు కోసమా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ కేంద్రిత సంక్షేమంపైఇంత శ్రద్ధ చూపుతున్నది’ అని ఆలోచనలో పడతాం. హార్వర్డ్ యూనివర్సిటీలో మనదేశంలోని 707 జిల్లాలు ప్రాతిపదికగా జరుగుతున్న పరిశీలనలో 2016–2021 మధ్య– ఐదేళ్లలోపు పిల్లల మరణాలు, మెరుగైన మరుగుదొడ్ల వసతి, కౌమార బాలికల గర్భిణీ శాతం, పేదరికం (మల్టీ డైమెన్షియల్ పావర్టీ) స్త్రీల బ్యాంక్ అకౌంట్స్ సంఖ్య వంటివి ఆ సమీక్షకు తొలి ప్రాధమ్యాలుగా ఉన్నాయి. ఒకప్పుడు ‘పేదరికం’ ఒక అంశంగా సమీక్షించే దశ నుంచి, మూడు అంశాలను కలిపి ఇప్పుడు దాన్ని– ‘మల్టీ డైమెన్షియల్ పావర్టీ’గా చూస్తున్నారు. అవి – 1. ఆరోగ్యం 2. విద్య 3. జీవన ప్రమాణాలు (వంటఇంధనం, శానిటేషన్, తాగునీరు, విద్యుత్తు, గృహవసతి, అసెట్స్).మారిన పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు, అభివృద్ధిని వదిలేసి సంక్షేమమా అంటున్నవారి చూపు ఎటువంటిది అనే ప్రశ్న ఉదయించడం సహజం. అమలులో ఉన్న జీవన ప్రమాణాల సూచీ మేరకు, ‘ప్రజల’ పేదరికం తగ్గించడం ఎన్నికయిన ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన బాధ్యత. ‘యూఎన్డీపీ’ నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030 నాటికి సాధించాలి అనే షరతు మీదే ప్రపంచ బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలు నుంచి మనతో సహా పలు దేశాలకు ఆర్థిక సహకారం అందుతున్నది. విమర్శకులు ఈ విషయాన్నీ గమనంలో ఉంచుకోవాలి. ఉద్యోగులు, పెన్షనర్లు, మానవాభివృద్ధి పథకాల అమలు పట్ల సానుకూల వైఖరి కనపర్చకపోవడం, అవి తమకు అందే వేతన ప్రోత్సాహకాలకు అడ్డు అని భావించడం కొత్త ధోరణి. ఇక ‘ప్రైవేట్ సెక్టార్’ ఉద్యోగులకు తాము పనిచేస్తున్న కంపెనీల ఉనికి వెనుక ప్రభుత్వాలు కల్పించిన మౌలిక వసతులు, ‘సబ్సిడీలు’ ఉన్నవనే విషయాన్ని మరుస్తు న్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జీవిక ప్రశ్నార్థంగా మిగిలిన వర్గాల విషయంలో తమ ‘స్టాండ్’ ఏమిటని ఎవరికి వారు జవాబు వెతుక్కోవడమే మిగిలిన పరిష్కారం. -జాన్సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
చంపడాలు పరిష్కారం కాదు
సాక్షి, హుజూరాబాద్: సమాజంలో మార్పు వచ్చినప్పుడే దిశ, నిర్భయ వంటి ఘటనలు పునరావృతం కావని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం చంపడాలు, ఉరి శిక్షలు వేయడం పరిష్కారం కాదని చెప్పారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో శనివారం జరిగిన మానవ వికాస వేదిక 3వ రాష్ట్ర మహాసభల్లో ఈటల మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ కోసం సంఘర్షణ జరగాలని, అప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మనిషి మృగంగా మారుతుండటంతోనే దిశ లాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వినకూడని, చూడకూడని దారుణాలను పత్రికలు, మీడియా ద్వారా వినాల్సి వస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం ఎప్పుడూ వైరుధ్యాలమయమని, మానవ మనుగడ ఉన్నంత కాలం వైరుధ్యాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. నేటి సమాజంలో సెల్‌ఫోన్, ఆధునిక టెక్నాలజీ మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి కోసమే వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో సామాజిక కార్యకర్త దేవి, మానవ వికాస వేదిక కేంద్ర కమిటీ అధ్యక్షుడు సాంబశివరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎన్ఎస్ మూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు జార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నార్వేను ఆదర్శంగా తీసుకోవాలి: చంద్రబాబు
అమరావతి: మానవాభివృద్ధి సూచికకు దేశంలో కేరళను, ప్రపంచ స్థాయిలో నార్వే దేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన గురువారం ఆర్ధిక, ప్రణాళిక శాఖల సంయుక్త సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఫలిత ఆధారిత బడ్జెట్ ను రూపొందించాలని అధికారులకు సూచించారు. అయిదు అంశాల ఆధారంగా బడ్జెట్‌కు రూపకల్పన చేయాలని, సుస్థిర అభివృద్ధి సాధనకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆరో తేదీన నిర్వహించే కార్యదర్శులు, హెచ్ ఓడీల సమావేశం అజెండాపైనా చర్చించినట్లు సమాచారం. ప్రజలు పన్నులు చెల్లించిన నిధులనే ప్రభుత్వం అభివృద్ధికి ఖర్చు చేస్తోందని, కేటాయింపులు ప్రాధాన్యతా క్రమంలో ఉండాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రయోజిత పథకాలు, కేంద్రం సహాయం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న 73 పథకాలతో లక్ష్య సాధనను నిర్దేశించుకోవాలని చెప్పారు. -
ల్యాబ్‌లో మానవ పిండాల సృష్టి
వాషింగ్టన్: మానవ అభివృద్ధి క్రమంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. తొలిసారిగా మానవ పిండాలను రెండు వారాల పాటు ల్యాబ్‌లో అభివృద్ధి చేశారు. తొందరగా గర్భస్రావం కావడానికి కారణాలు తెలుసుకోవడానికి, మానవ వికాసానికి సంబంధించి తలెత్తే అనేక ప్రశ్నలకు ఇది సమాధానం కాగలదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మానవ అభివృద్ధిలో ఫలదీకరణం తర్వాత 14వ రోజు వరకు జరిగే అణు, కణ ప్రక్రియలను ఈ పరిశోధనలో క్షుణ్నంగా పరిశీలించారు. గర్భాశయం బయట మొదటిసారిగా విజయవంతంగా ఈ ప్రక్రియను నిర్వహించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
మానవాభివృద్ధిలో భారత్‌ది 135వ స్థానం
వార్తల్లో వ్యక్తులు హర్యానా గవర్నర్‌గా కప్టన్ సింగ్ బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు కప్టన్ సింగ్ సోలంకి హర్యానా గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి జూలై 25న ప్రకటన వెలువడింది. జగన్నాథ్ పహాడియా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇండోనేసియా అధ్యక్ష ఎన్నికల్లో జోకో విడోడో విజయం ఇండోనేసియా అధ్యక్ష ఎన్నికల్లో జోకో విడోడో విజయం సాధించినట్లు జూలై 22న ప్రకటించారు. ప్రత్యర్థి సుబియాంతోపై 8.4 మిలియన్ల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అక్టోబర్‌లో అధ్యక్ష పగ్గాలు చేపట్టే విడోడో ఐదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. ఇరాక్ అధ్యక్షుడిగా పుఅద్ మాసుమ్ కుర్దు రాజకీయవేత్త పుఅద్ మాసుమ్ ఇరాక్ కొత్త అధ్యక్షుడిగా జూలై 24న బాధ్యతలు చేపట్టారు. ఇరాక్ స్వతంత్ర కుర్దీస్ ప్రాంతానికి మొదటి ప్రధానిగా ఆయన పనిచేశారు. భారత్‌లో పర్యటించిన ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ జూలై 21 నుంచి మూడు రోజులపాటు భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలుసుకున్నారు. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక తోడ్పాటుతో తమిళనాడులో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సంద ర్శించారు. జాతీయం రాష్ట్రపతి భవన్లో ప్రదర్శనశాల జూలై 25 నాటికి రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ఒక ప్రదర్శనశాలను ప్రారంభించారు. ఇందులో మాజీ రాష్ట్రపతుల ఫైబర్ గ్లాస్ ప్రతిమలు, విదేశీ పర్యటనల సందర్భంగా వారు బహుమతులుగా స్వీకరించిన కళాఖండాలను ఉంచారు. ఈ సందర్భంగా ‘వింగ్డ్ వండర్స్’ అనే పుస్తకాన్ని, రాష్ట్రపతి భవన్లో 2012, ఆగస్టు నుంచి జరిగిన సంగీత, నృత్య కార్యక్రమాల సమాహారమైన ‘ఇంద్రధనుష్’ అనే మరో పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. మరో రెండు క్షిపణి ప్రయోగ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులలో కొత్తగా మరో రెండు క్షిపణి ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ జూలై 25న లోక్‌సభకు తెలియజేశారు. వీటి కోసం కృష్ణా జిల్లాలోని నాగాయలంక, అండమాన్‌లోని రుట్లాండ్ దీవిని డీఆర్డీవో ఎంపిక చేసిందని ఆయన తెలిపారు. టీసీఎస్ రికార్డు టాటా గ్రూప్‌నకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కంపెనీల విలువ జూలై 23న రూ. 5లక్షల కోట్లకు చేరుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయగా కంపెనీగా రికార్డు సృష్టించింది. తొలిసారి 2004లో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన టీసీఎస్ తొలిసారి 84 బిలియన్ డాలర్ల(రూ.5,06,703 కోట్లు) విలువను అందుకున్న ఒక దేశీ కంపెనీగా నిలిచింది. టీసీఎస్.. టాటా సన్స్ డివిజన్‌గా 1968లో ఏర్పాటైంది. 1995లో ప్రత్యేక కంపెనీగా టాటా సన్స్ నుంచి విడివడింది. హిజ్రాలకు పథకాల్లో థర్డ్ జెండర్ ఆప్షన్ వివిధ స్కాలర్షిప్/ఫెలోషిప్ పథకాల్లో హిజ్రాలకు (ట్రాన్స్‌జెండర్) థర్డ్ జెండర్‌గా నమోదు చేసుకునేలా ఆప్షన్ ఇవ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పు మేరకు యూజీసీ పథకాల్లో ఈ అవకాశం కల్పించాలని తెలిపింది. ఈ మేరకు యూజీసీ కార్యదర్శి జస్పాల్ ఎస్.సంధు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, జైనులను మైనారిటీలుగానే పరిగణించాలని పేర్కొన్నారు. బ్రెయిలీ లిపిలో సర్దార్ జీవిత చరిత్ర భారత ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జీవిత చరిత్రను సాయిబాబా గౌడ్ బ్రెయిలీ లిపిలో రచించారు. ఈ పుస్తకాన్ని ప్రధాని నరేంద్రమోడీ జూలై 23న ఢిల్లీలో ఆవిష్కరించారు. సాయిబాబా గౌడ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో అంధుల పాఠశాలను నిర్వహిస్తున్నారు. మై గవ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ప్రధాని పరిపాలనలో ప్రజలను మరింత భాగస్వామ్యుల్ని చేసేందుకు ఝడజౌఠి.జీఛి.జీ అనే పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ప్రధాని నరేంద్రమోడీ జూలై 26న ప్రారంభించారు. గంగానది ప్రక్షాళన, నైపుణ్యాల అభివృద్ధితోపాటు పలు అంశాలపై పౌరుల ఆలోచనలు, అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు వెబ్‌సైట్‌ను రూపొందించారు. మానవాభివృద్ధిలో భారత్‌ది 135 వ స్థానం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) మానవాభివృద్ధి నివేదిక-2013ను జూలై 24న విడుదల చేసింది. ఇందులో 187 దేశాల జాబితాలో భారత్ 135వ స్థానంలో నిలిచింది. కాగా తొలి మూడు స్థానాల్లో నార్వే, ఆస్ట్ట్రేలియా, స్విట్జర్లాండ్‌లు ఉన్నాయి. భారత్ హెచ్‌డీఐ (మానవాభివృద్ధి సూచీ) విలువ 0.586. మానవ జీవన ప్రమాణాల అభివృద్ధి విషయంలో భారత్ మధ్యస్థ కేటగిరీలో ఉందని పేర్కొంది. 1980-2013 మధ్య కాలంలో భారత్‌లో హెచ్‌డీఐ విలువ 0.369 నుంచి 0.586కు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఆరోగ్యకరమైన దీర్ఘ ఆయుః ప్రమాణం, జ్ఞాన సముపార్జనకు అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణం అనే మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని యూఎన్డీపీ మానవాభివృద్ధి నివేదికను రూపొందిస్తుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 220 కోట్లకు పైగా ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. ఇందులో 80 కోట్ల మంది పేదరికం అంచున ఉన్నారు. రాష్ట్రీయం భీమిలి ఎర్రమట్టి దిబ్బలకు జీఎస్ఐ గుర్తింపు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా భీమిలి ఎర్రమట్టి దిబ్బలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియో హెరిటేజ్ సైట్)గా గుర్తించింది. ఈ దిబ్బలు సుమారు 20 వేల ఏళ్ల కిందట ఏర్పడ్డాయి. దక్షిణ ప్రాంతీయ మండలి వైస్ చైర్మన్‌గా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి, దక్షిణాది రాష్ట్రాలకు మధ్య సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించే దక్షిణ ప్రాంతీయ మండలి వైస్ చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కేంద్ర ప్రభుత్వం నియ మించింది. ఈ మండలికి చైర్మన్ కేంద్ర హోం శాఖమంత్రి. సాహితీ విమర్శకుడు చేరా కన్నుమూత ప్రముఖ తెలుగు భాషా వేత్త , సాహితీ విమర్శకుడు చేకూరి రామారావు (79) హైదరాబాద్‌లో జూలై 22న కన్నుమూశారు. చేరాగా సుపరిచితుడైన రామారావు ఖమ్మం జిల్లాకు చెందినవారు. అంతర్జాతీయం భారత్ వృద్ధి 5.4 శాతం బ్రిక్స్ దేశాల్లో భారత్ మినహా ఇతర దేశాల అభివృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య సంస్థ తగ్గించింది. ఈ ఏడాది ఇండియా 5.4 శాతం, వచ్చే ఏడాది 6.4 శాతం పురోగతి సాధిస్తుందని ప్రపంచ ఆర్థిక భవితపై జూలై 25న విడుదల చేసిన నివేదికలో తెలిపింది. బ్రిక్స్‌లో (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) రష్యా 0.9శాతం (1.1 శాతం డౌన్‌గ్రేడ్), చైనా 7.4 శాతం(0.2 శాతం), బ్రెజిల్ 1.3 శాతం (0.6 శాతం), దక్షిణాఫ్రికా 1.7 శాతం (0.6 శాతం) వృద్ధి నమోదుచేస్తాయని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అంచనాను 3.4 శాతానికి చేర్చింది. సుష్మాస్వరాజ్ నేపాల్ పర్యటన భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ నేపాల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా నేపాల్ అధ్యక్షుడు రామ్‌బరన్ యాదవ్, ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా తదితరులతో సమావేశమయ్యారు. అంతేకాకుండా రక్షణ, భద్రత, వాణిజ్యం, జల విద్యుత్.. తదితర రంగాల్లో సహకారాన్ని పెంచుకునేందుకు ఇరుదేశాలు అంగీరించాయి. ఇండో- నేపాల్ జాయింట్ కమిషన్ సమావేశానికి(జేసీఎం) సహ అధ్యక్షత వహించేందుకు, ఆగస్టు 3 నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేపాల్ పర్యటనకు రంగం సిద్ధం చేసేందుకు సుష్మా నేపాల్‌లో పర్యటించారు. 23 ఏళ్ల తర్వాత ఉభయ దేశాల మధ్య జేసీఎం సమావేశం జరిగింది. చైనా క్షిపణి నిరోధక పరీక్ష విజయవంతం చైనా గగనతలానికి క్షిపణి రక్షణ కవచం ఏర్పాటులో భాగంగా ఆ దేశం జూలై 23న మూడోసారి క్షిపణి నిరోధక పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. బాల్యవివాహాలు భారత్‌లోనే అధికం ప్రపంచ వ్యాప్తంగా జరిగే బాల్య వివాహాల్లో మూడింట ఒక వంతు భారతదేశంలోనే జరుగుతున్నాయని యూనిసెఫ్ పేర్కొంది. బాల్య వివాహాల సంఖ్య అత్యధికంగా ఉన్న పది దేశాల్లో భారత్, నైగర్, బంగ్లాదేశ్, చాద్, మాలి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, గినియా,ఇథియోయా, బుర్కినాఫాసో, నేపాల్ ఉన్నాయి. క్రీడలు గ్లాస్గోలో ప్రారంభమైన 20వ కామన్వెల్త్ క్రీడలు 20 వ కామన్వెల్త్ క్రీడలు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జూలై 23న ప్రారంభమయ్యాయి. ఇంగ్లండ్ రాణి ఎలిజిబెత్-2 క్రీడలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. ప్రారంభ కార్యక్రమంలో ముందుగా మైదానంలో అడుగుపెట్టిన భారత్ మార్చ్‌పాస్ట్ బృందానికి షూటర్ విజయ్‌కుమార్ నేతృత్వం వహించారు. 71 దేశాలకు చెందిన 4,950 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొనగా, వీరిలో భారత్ నుంచి 213 మంది అథ్లెట్లు ఉన్నారు. మొత్తం 17 క్రీడాంశాల్లో ఈ పోటీలు జరుగుతాయి. క్రీడల అధికార మస్కట్‌కు క్లైడ్ అని పేరు పెట్టారు. గ్లాస్గో నగరం మధ్య నుంచి పారే నది పేరే క్లైడ్. ఈ క్రీడల్లో తొలి స్వర్ణం ఇంగ్లండ్‌కు చెందిన జోడీ స్టింప్సన్‌కు మహిళల ట్రయిథాన్లో దక్కింది. భారత్ తరపున తొలి స్వర్ణం మహిళల 48 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టర్ సంజిత్ కుమ్‌చమ్ సాధించింది. ఇదే క్రీడల్లో మహిళల వెయిట్ లిఫ్టింగ్ 53 కిలోల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన తెలుగమ్మాయి మత్స సంతోషి కాంస్య పతకం సాధించింది. కెనడా జిమ్నాస్ట్ ప్యాట్రికా బెజ్బెంకో(17) రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో ఐదు స్వర్ణ పతకాలు గెలుచుకొని క్వీన్ ఆఫ్ కామన్వెల్త్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఫోర్బ్స్ విలువైన ఆటగాళ్ల జాబితా ప్రముఖ పత్రిక ‘ఫోర్బ్స్’ ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్థికంగా విలువైన ఆటగాళ్ల’ జాబితాను ప్రకటించింది. ఇందులో భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐదో స్థానంలో నిలిచాడు. 2013లో ధోని 21 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 126 కోట్లు) ఆర్జించాడు. ఈ జాబితాలో రోజర్ ఫెడరర్ (టెన్నిస్), గోల్ఫ్ ఆటగాడు టైగర్‌వుడ్స్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. బాస్కెట్‌బాల్ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్ రెండో స్థానంలో ఉండగా... ఫిల్ మికెల్సన్ (గోల్ఫ్), షరపోవా (టెన్నిస్) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. రికియార్డోకు హంగరీ గ్రాండ్ ప్రి టైటిల్ ఫార్ములా వన్ హంగరీ గ్రాండ్ ప్రి టైటిల్‌ను రెడ్‌బుల్ డ్రైవర్ రికియార్డో గెలుచుకున్నాడు. జూలై 27న బుడాపెస్ట్‌లో జరిగిన రేసులో ఫెరారీ డ్రైవర్ అలోన్సో రెండో స్థానం సాధించాడు. వరల్డ్ కబడ్డీ లీగ్ ప్రారంభం వరల్డ్ కబడ్డీ లీగ్ (డబ్ల్యూకేఎల్) జూలై 24న న్యూఢిల్లీలో ప్రారంభమైంది. పంజాబ్ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్సింగ్ బాదల్ లీగ్ అధ్యక్షుడిగా, భారత హాకీ మాజీ కెప్టెన్ పర్గత్‌సింగ్ లీగ్ కమిషనర్‌గా ఈ లీగ్ ఏర్పడింది. ఎనిమిది జట్లు ఈ లీగ్‌లో ఉంటాయి. ఆగస్టు 9 నుంచి నాలుగు నెలలపాటు ఐదు దేశాల్లో 13 నగరాల్లో కబడ్డీ పోటీలు లండన్‌లో ప్రారంభమవుతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ అత్యాధునిక సమాచార వ్యవస్థ.. దిశానెట్ విపత్తులు, ప్రమాదాల సమయంలో సమాచార వ్యవస్థలు పనిచేయని ప్రదేశాల్లో అండగా నిలిచే అత్యాధునిక సమాచార వ్యవస్థను భారత్-జపాన్ శాస్త్రవేత్తలు జూలై 24న ప్రదర్శించారు. దీనికి దిశానెట్ అని పేరు పెట్టారు. సమాచార వ్యవస్థ అందుబాటులో లేనిచోట కూడా ఇది పనిచేస్తుంది.ఆపదలో ఉన్న వారికి ఆసరాగా నిలవ డమే కాకుండా బాధితులు, బంధువులకు సాంత్వన కలిగించడంలో ఇది కీలకం కానుంది. ఈ పరిశోధనలో హైదరాబాద్ ఐఐటీ, చెన్నై ఐఐటీ, ఎన్జీఆర్ఐతో పాటు టోక్యో కియో విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. అండమాన్‌లో పరిశోధనలకు బయల్దేరిన సింధుసాధన భారత్ తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన పరిశోధన నౌక సింధుసాధన అండమాన్ సముద్రంలో పరిశోధన సాగించేందుకు జూలై 27న విశాఖ పోర్టునుంచి బయలుదేరింది. అత్యాధునిక పరిశోధన సదుపాయాలు గల ఈ నౌకను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిశోధనల కోసం గుజరాత్‌లోని ఏబీసీ షిప్‌యార్డ్ రూపొందించింది. రూ. 220 కోట్లతో నిర్మించిన ఈ నౌక 6వేల మీటర్ల లోతులో పరిశోధనలు నిర్వహించగలదు. క్లోనింగ్ ముర్రా జాతి కోడెదూడ హ్యాండ్ గెడైడ్ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఛండీగఢ్‌లోని నేషనల్ డెయిరీ పరిశోధన సంస్థ (ఎన్డీఆర్ఐ) శాస్త్రవేత్తలు ఒక కోడెదూడను సృష్టించారు. జూలై 23న జన్మించిన దీనికి రజత్ అని పేరు పెట్టారు. -
మానవాభివృద్ధి సూచిలో జిల్లాకు ఆరో ర్యాంకు
పురోగమనం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాజకీయ చైతన్యానికి మారుపేరయిన ఖమ్మం జిల్లా సామాజిక చైతన్యానికి కూడా నిదర్శనంగా నిలుస్తోంది. మానవాభివృద్ధి విషయంలో జిల్లా ఓ అడుగు ముందుకేసింది. గత లెక్కలతో పోలిస్తే ఓ స్థానం పెకైళ్లి, ఆరోస్థానంలో నిలిచింది. తెలంగాణ నూతన ప్రభుత్వానికి రాష్ట్ర ప్రణాళిక విభాగం గత నెల 29న ఓ నివేదిక (2013 మార్చి వరకు ఉన్న గణాంకాలతో) సమర్పించింది. దాని ప్రకారం మానవాభివృద్ధి సూచి (హెచ్‌డీఐ)లో జిల్లా ఆరోస్థానంలో ఉంది. అదే 2004-05లో ఏడో స్థానంగా నమోదైంది. జిల్లా ప్రజానీకం తలసరి ఆదాయంతో పాటు అక్షరాస్యత, విద్య, ఆరోగ్య ప్రమాణాలు, నివాస సదుపాయాలు, ఇతర అంశాలన్నింటినీ పరిగణ నలోకి తీసుకుని నిర్ధారించే మానవాభివృద్ధి సూచి జిల్లాలో పెరగడం హర్షించదగిన పరిణామమేనని అధికార వర్గాలంటున్నాయి. ఇక, తలసరి ఆదాయం విషయానికి వస్తే తెలంగాణలో జిల్లా మూడో స్థానంలో నిలుస్తోంది. రెండో సవరించిన అంచనాల ప్రకారం 2010-11 ఆర్థిక సంవత్సరానికి (స్థిరధరల ప్రకారం) జిల్లా తలసరి ఆదాయం రూ. 38,888గా నమోదైంది. 2004-05తో పోలిస్తే రూ.10 వేలకు పైగా తలసరి ఆదాయం పెరగడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల తర్వాత ఎక్కువ తలసరి ఆదాయం జిల్లాలోనే నమోదు కాగా, పక్కనే ఉన్న నల్గొండ, వరంగల్ జిల్లాల కన్నా తలసరి ఆదాయం మెరుగ్గా ఉంది. జనాభా నియంత్రణలోనూ జిల్లా వాసులు ముందున్నారని ప్రణాళిక విభాగం లెక్కలు చెపుతున్నాయి. ఒకటి కాదు... రెండు కాదు... దశాబ్ద కాలపు లెక్కలు తీస్తే... గత పదేళ్లలో జనాభా పెరుగుదల విషయంలో భారీ మార్పు కనిపిస్తోంది. గత పదేళ్లలో (2001-2011) జిల్లా జనాభాలో కేవలం 8.47 శాతమే పెరిగింది. అంతకు ముందు పదేళ్లతో పోలిస్తే ఇది సగానికి సగం తగ్గడం గమనార్హం. అంతకుముందు పదేళ్లలో (1991-2001) జనాభా పెరుగుదల 16.39 శాతంగా నమోదైంది. తెలంగాణలోని పది జిల్లాలతో పోలిస్తే దశాబ్ద కాలపు జనాభా పెరుగుదలలో జిల్లా ఐదో స్థానంలో ఉంది. జనాభా తగ్గుదలతో పాటు జిల్లాకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు ఈ నివేదికలో ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం జిల్లాలో వ్యవసాయ విద్యుత్ వినియోగం తక్కువేనని తెలుస్తోంది. తెలంగాణ జిల్లాలోనే అత్యల్ప వ్యవసాయ విద్యుత్ వినియోగం మన జిల్లాలోనే నమోదయింది. అదే గృహ వినియోగానికి వస్తే మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల తర్వాత మనమే ముందున్నాం. ఇక రసాయన ఎరువుల వినియోగంలోనూ జిల్లా రైతులు జాగ్రత్తలు పాటిస్తున్నట్టు ప్రణాళిక శాఖ లెక్కలు చెపుతున్నాయి. జిల్లాలో 2012-13 సంవత్సరంలో అన్ని రకాల ఎరువులు కలిసి కూడా లక్ష టన్నులు ఉపయోగించలేదు. మిగిలిన జిల్లాలతో పోలిస్తే తెలంగాణలో చేపల ఉత్పత్తిలో అగ్రస్థానం మనదే. రవాణాకు సంబంధించి జిల్లాలో వ్యవసాయ వినియోగానికి గాను 9,345 ట్రాక్టర్లున్నాయని ప్రణాళిక శాఖ లెక్కలు చె పుతున్నాయి. ద్విచక్రవాహనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నా ఆటోలలో మాత్రం జిల్లా ముందుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల తర్వాత మన జిల్లాలోనే ఎక్కువ ఆటోలున్నాయి. జిల్లాలో మొత్తం 28,016 ఆటోలున్నాయని ప్రణాళిక శాఖ గుర్తించింది. రైతులు, ఇతర వర్గాలు బ్యాంకుల్లో తీసుకున్న అప్పుల కంటే జిల్లా ప్రజలు దాచిపెట్టుకున్న సొమ్మే ఎక్కువగా ఉందని ప్రణాళిక శాఖ లెక్కలను బట్టి తెలుస్తోంది. నివేదికలో జిల్లాకు సంబంధించిన ముఖ్యాంశాలివి... మానవాభివృద్ధి సూచిలో ఆరోస్థానంలో ఉన్న జిల్లా ఆర్యోగం విషయంలో ఐదో స్థానంలో, విద్యా రంగంలో నాలుగో స్థానంలో ఉంది. జీవన ప్రమాణంలో విషయానికి వస్తే జిల్లా ఏడో స్థానంలో ఉంది.జనాభా పెరుగుదలకు సంబంధించి గత పదేళ్లలో 8.47 శాతం పెరుగుదల నమోదైంది. అందులో 3.55 శాతం గ్రామీణ జనాభా పెరగగా, 28.39 శాతం పట్టణాల్లో జనాభా పెరిగింది. అంటే జీవన పోరాటంలో భాగంగా ఎక్కువ మంది పట్టణాలకు వలస వస్తున్నారని తెలుస్తోంది. అదే విధంగా పురుష జనాభాలో 6.54 శాతం పెరుగుదల ఉంటే, స్త్రీలు గత పదేళ్లలో 10.44 శాతం పెరిగారు. అంటే ప్రతి 100 మంది స్త్రీలకు మరో 10 మంది పెరిగారన్నమాట. గత వందేళ్లలో పరిశీలిస్తే 1901-11 వరకు 23.46 శాతం, 1911-21లో 0.72 శాతం, 1921-31లో 21.61 శాతం, 1931-41 వరకు 17.60 శాతం, 1941-51 వరకు 19.53 శాతం, 1951-61 మధ్యకాలంలో 30.88 శాతం జనాభా పెరుగుదల కనిపిస్తోంది. ఈ పదేళ్లలో తెలంగాణలోని అన్ని జిల్లాల కన్నా మన జిల్లాలోనే ఎక్కువ పెరుగుదల నమోదైంది. ఇక, 1961-71 వరకు 29.54, 71-81 వరకు 27.86, 81-91 వరకు 26.50 శాతం జనాభా పెరుగుదల నమోదు కావడం గమనార్హం. ఆవాసాలకు సంబంధించి జిల్లాలో మొత్తం 8,70,625 గృహాలుండగా, అందులో 39,459 ఖాళీగా ఉన్నాయి. 7,28,996 గృహాల్లో జనాభా నివాసముంటుండగా, 19.361 ఆవాసాల్లో దుకాణాలు, కార్యాలయాలున్నాయి. 6,449 భవనాల్లో స్కూళ్లు, కాలేజీలుండగా, 1,521 భవనాల్లో లాడ్జిలు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు ఉన్నాయి. మిగిలిన వాటిలో ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు, వర్క్‌షాప్‌లు, ప్రార్థనా మందిరాలున్నాయి. చాలాకాలంగా 1,419 ఆవాసాలకు తాళాలు వేసి ఉన్నాయని ప్రణాళిక శాఖ లెక్కలు చెపుతున్నాయి. వ్యవసాయానికి సంబంధించి రసాయన ఎరువుల వినియోగం ఇతర జిల్లాలతో పోలిస్తే మన దగ్గర తక్కువగానే ఉంది. నత్రజని ఎరువును ఒక ఏడాదిలో 71,679 టన్నులు వినియోగించగా, ఫాస్పరస్ 21,556 టన్నులు, పొటాష్ 6,455 టన్నులు వినియోగించారు. ఇదంతా కలిపినా లక్ష టన్నుల లోపే. అదే ఇతర జిల్లాల విషయానికి వస్తే వరంగల్‌లో 1.66 లక్షల టన్నులకుపైగా, నల్గొండలో 1.53లక్షల టన్నులకు పైగా, కరీనంగర్‌లో 1.70లక్షల టన్నులకు పైగా వినియోగించారు. చేపల ఉత్పత్తిలోనూ తెలంగాణలోనే మన జిల్లా అగ్రస్థానంలో ఉంది. చేపలు, రొయ్యల ఉత్పత్తికి సంబంధించి 2010-11లో జిల్లాలో 13,650 టన్నుల ఉత్పత్తి రాగా, 2011-12లో అది 23,770 టన్నులకు చేరింది. ఇక, 2012-13లో 35,016 టన్నుల ఉత్పత్తి వచ్చింది. విద్యుత్ వినియోగానికి సంబంధించి తలసరి వినియోగాన్ని పరిశీలిస్తే తెలంగాణ జిల్లాల్లోనే మన జిల్లాలో వ్యవసాయ విద్యుత్ వినియోగం తక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయ విద్యుత్ తలసరి వినియోగం 117 యూనిట్లు మాత్రమే నమోదైంది. అదే నల్లగొండలో 318 యూనిట్లు, మహబూబ్‌నగర్‌లో 387 యూనిట్లుగా నమోదైంది. పక్కనే ఉన్న వరంగల్ జిల్లాలో మాత్రం మనకంటే చాలా తక్కువగా 60 యూనిట్లే నమోదు కావడం విశేషం. అంటే ఇతర జిల్లాలతో పోలిస్తే మన జిల్లాతో పాటు వరంగల్‌లో బావులపై ఆధారపడి వ్యవసాయం తక్కువేనని తెలుస్తోంది. అదే గృహ విద్యుత్ వినియోగం వచ్చే సరికి హైదరాబాద్, రంగారెడ్డి తర్వాత మన జిల్లాలోనే ఎక్కువగా ఉన్నట్లు ప్రణాళిక శాఖ లెక్కలు చెపుతున్నాయి. వాహనాల విషయానికి వస్తే జిల్లాలో 2013, మార్చి 31 నాటికి 18,987 కార్లు, 559 జీపులు, 2,67,563 ద్విచక్ర వాహనాలు, 9,345 ట్రాక్టర్లు, 446 ఓమ్నీ బస్సులు, 182 రిగ్గులు, 57 క్రేన్లు ఉన్నాయి. ఇక, ఆటోలయితే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల తర్వాత మన జిల్లాలోనే ఎక్కువ. జిల్లాలో మొత్తం 28,016 ఆటోలుండగా, పక్కనే ఉన్న నల్లగొండలో 23,917, వరంగల్‌లో 16,476 ఆటోలున్నాయి. జిల్లాలో మార్చి 2013 నాటికి 3,743 మంది హెచ్ఐవి బాధితులున్నారు. వీరిలో 1,909 మంది మహిళలు, 1,660 మంది పురుషులు ఉన్నారు. -
మానవాభివృద్ధిలో విద్య కీలకం
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ :మానవాభివృద్ధిలో విద్య చాలా కీలకమని, విద్యతో ఏదైనా సాధించవచ్చని, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి, ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చి డెరైక్టర్, ఉపకులపతి ఆచార్య ఎస్. మహేంద్రదేవ్ అన్నారు. శనివారం ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం 2010-2011, 2011-2012 విద్యా సంవత్సరాల స్నాతకోత్సవాన్ని ఒకేసారి వర్సిటీలో నిర్వహించారు. ఆచార్య మహేంద్రదేవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో మానవాభివృద్ధి, బడుగు వర్గాలకు అవకాశాలు, ప్రాథమిక , ఉన్నత విద్య అనే అంశాలపై ప్రసంగించారు. మానవాభివృద్ధికి మానవ స్వేచ్ఛ ముఖ్యమన్నారు. మానవ అభివృద్ధి పేదరికాన్ని నిర్మూలించేందుకు దోహదం చేస్తుందన్నారు. మహిళల జీవిత కాలం, అక్షరాస్యత విషయంలో మన దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య తీవ్రమైన అంతరాలు వున్నాయన్నారు. మహిళా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 25వ రాష్ట్రంగా ఉందన్నారు. చైనాతో పోల్చితే మన దేశంలో నిపుణుల సంఖ్య తక్కువ అన్నారు. అక్కడ 50 శాతం మంది నిపుణులు ఉంటే మన దేశంలో పది శాతం మంది మాత్రమే ఉంటున్నారని వివరించారు. ఇక్కడ సాధారణ నిరుద్యోగం కంటే యువ నిరుద్యోగం అధికంగా ఉందని చెబుతూ దానిని నిర్మూలించకపోతే మానవాభివృద్ధి సాధ్యం కాదన్నారు. జపాన్, సౌత్‌కొరియా, తైవాన్ తదితర దేశాలు ప్రాథమిక విద్యకు ప్రాధాన్యమిస్తుంటే మన దేశం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. మన దేశంలో ఐదవ తరగతి విద్యార్థి రెండో తరగతి పాఠ్యాంశాన్ని చదివే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండటం లేదన్నారు. విద్యారంగ ప్రమాణాల పెంపునకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. యువకులకు ఉపాధి కల్పించటంలో కీలకమైన ఉన్నత విద్యను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రపంచస్థాయిలో మొదటి రెండు వందల యూనివర్సిటీల్లో మనదేశ విశ్వవిద్యాలయాలు స్థానం సంపాదించకపోవటం విచారకరమన్నారు. ఉన్నత విద్యలో సంఖ్య కంటే నాణ్యత ముఖ్యమని పేర్కొన్నారు. విద్యార్థులు కృషి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే లక్ష్యాన్ని సొంతం చేసుకోవచ్చని తెలిపారు. గౌరవ డాక్టరేట్ ప్రదానం.. అనంతరం వీసీ ఆచార్య కె. వియ్యన్నారావు మహేంద్రదేవ్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. రెక్టార్ ఆచార్య వైపీ. రామసుబ్బ య్య, రిజిస్ట్రార్ ఆచార్య ఆర్ఆర్ఎల్. కాంతం, డీన్లు ఆచార్య ఎం. మధుసూదనరావు, ఆచార్య ఏవీ. దత్తాత్రేయరావు, ఆచార్య బి. సాంబశివరావు, ఆచార్య పి. చంద్రశేఖరరావు, ఆచార్య ఎల్. జయశ్రీ, ఆచార్య వై. కిషోర్, డాక్టర్ డి. భాస్కరరావు, ఆచార్య మహా లక్ష్మి , పలువురు అధికారులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి దశను గుర్తు చేసుకుంటూ.. స్నాతకోత్సవ ముఖ్య అతిథి, గౌరవ డాక్టరేట్ గ్రహీత ఆచార్య మహేంద్రదేవ్ ఈ సందర్భంగా తన విద్యార్థి దశను గుర్తు చేసుకున్నారు. తాను ఏఎన్‌యూ పూర్వ విద్యార్థినేనని, యూనివర్సిటీ ఏర్పడిన మొదటి సంవత్సరంలో ఎంఏ ఎకనామిక్స్ చదివానని తెలిపారు. ఆ రోజుల్లో తన స్వగ్రామమైన దుగ్గిరాల మండలం తుమ్మపూడి నుంచి రోజూ స్కూటర్‌పై వచ్చే వాడినన్నారు. ఆ రోజుల్లో తరగతులు రేకుల షెడ్డుల్లో సాగాయని ఇప్పుడు భవనాలు అందుబాటులోకి రావటం మంచి పరిణామమన్నారు.