Humanists
-
మతాలు కాదు... మనిషే ప్రధానం
అన్నిరకాలుగా నాశనమవుతూ ఉన్న మనిషిని బతికించుకోవాల్సిన అవసరం వచ్చింది. తన అలసత్వం, అజ్ఞానం, మూర్ఖత్వం వల్ల మనిషి తన ఉనికికే ప్రమాదకారి అవుతున్నాడు. మనిషి సజీవంగా ఉంటేనే ప్రభుత్వాలైనా, హక్కుల పోరాటాలైనా ఉనికిలో ఉంటాయి. అందుకే భూమి మీద ప్రమాదంలో ఉన్న మనిషిని ముందు బతికించు కోవాలి. అందుకు తగిన అవగాహన పెంచుకోవడానికే ఈ జూన్ 21ని మనం ‘హ్యూమనిస్ట్ డే’గా జరుపుకొంటున్నాం. అన్ని దశల్లో అన్నివేళలా మానవాభ్యుదయాన్ని కాంక్షించేదే మానవ వాదం. ఫెడ్రిక్ ఇమ్మాన్యుల్ నైథమ్మర్ తొలిసారి 1808లో ‘హ్యూమనిజం’ అనే పదాన్ని రూపొందించాడు. పద్దెనిమిది, పంతొమ్మిది శతాబ్దాలలో మానవ అవసరాల మీద శ్రద్ధ పెట్టడం, పనికిరాని విశ్వాసాల్ని పక్కకు నెట్టడం, ప్రతి దానికీ కారణాన్ని అన్వేషించడంతో ప్రారంభమై ‘మానవ వాదం’ ఒక ఆలోచనా ధోరణిగా రూపుదిద్దుకోవడం మొదల య్యింది. ఆ ఆలోచనా ధోరణి అన్ని కళల్లోకి వ్యాపించింది. మానవవాద దృక్పథంలోంచి లలిత కళలు, కవిత్వం, విద్య, వైద్యం వంటి రంగాలన్నీ బలపడుతూ వచ్చాయి. ప్రతిచోటా, ప్రతి రంగంలో ప్రశ్నకు విలువ పెరుగుతూ వచ్చింది. ఆ ప్రశ్న లకు సమాధానాలు అన్వేషించుకునే క్రమంలో హేతువాదంతో కూడిన మానవవాదం, శాస్త్రీయ అవగాహనా వ్యాప్తి చెందాయి. తొలిసారిగా 1933లో ‘హ్యూమనిస్ట్ మానిఫెస్టో’ చికాగో విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో విడుదల అయ్యింది. ఆ మానిఫెస్టో ప్రధానంగా... కారణం, నైతికత, సామాజిక–ఆర్థిక న్యాయం, సమన్వయం అనే సూత్రాల మీద ఆధారపడింది. వీటన్నింటితోపాటు మరొక విషయం ప్రత్యేకంగా చర్చించ బడింది. అదేమిటంటే– ఆధారం లేని విశ్వాసాలు, మూఢ నమ్మ కాలను పక్కకు నెట్టి, వైజ్ఞానిక అవగాహనను పెంపొందించా లనీ, దానిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉందనీ కూడా మాని ఫెస్టోలో రాశారు. మానవవాదం గురించి అవగాహన పెరుగు తున్న దశలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ నిఘంటువు ఒక వ్యతిరేకమైన అర్థాన్ని ప్రచురించింది. దాన్ని రూపొందించిన బృందంలో ఒక ఇంగ్లిష్ వాడు, హ్యూమనిస్ట్‌లంటే చులకన భావం గలవాడు ఆ అర్థాలు రాశాడు. ‘దైవ భావనను ధిక్కరించేవారు’, ‘ఉట్టి మానవతావాదులు’, ‘అరాచక వాదులు’, ‘ఆస్తులను దోపిడీ చేయువారు’ అని రాశాడు. బహుశా అతను విశాలమైన భావ జాలంతో, ప్రగతిశీల ధోరణితో ఆలోచించలేనివాడై ఉంటాడు. అందువల్ల అతను తన అక్కసును అలా వెళ్లగక్కుకున్నాడు. అది మాత్రమే కాదు, అలాంటి మరికొన్ని సంఘటనలు జరుగుతూ రావడం వల్ల సహజంగా మతతత్వ వాదులకు వెయ్యేనుగుల బలం చేకూరింది. అదే సమాజంలో వేళ్లూనుకుని పోయింది. తరతరాలుగా ప్రపంచవ్యాప్తంగా దైవభావన బలం పుంజు కుంది. దాని పర్యవసానంగానే మతాన్ని, దైవాన్ని ప్రశ్నించిన వారు దుర్మార్గులు, పాపాత్ములు, చెడ్డవారు అనే ముద్ర వేయ బడుతూ వచ్చారు. అందుకే చూడండి. పరిస్థితి ఈనాటికీ పూర్తిగా మారలేదు. మత విశ్వాసాలలో పడి కొట్టుకుపోయే వారిని మామూలు మనుషులుగా పరిగణిస్తున్నారు. స్వేచ్ఛాలో చనతో హేతుబద్ధంగా మాట్లాడేవాళ్లను ‘పిచ్చి’వాళ్ల కింద జమ కడుతున్నారు. విశాల హృదయంతో ఆలోచించలేని వారినీ, ఈ దేవుడు కాదు – ఆ దేవుడనీ, ఈ మతం కాదు ఆ మతమనీ కొట్టుకు చచ్చేవారిని – సమాజంలో అక్కడక్కడ అప్పుడప్పుడు కొందరు మహాను భావులు హెచ్చరిస్తూనే వచ్చారు. వాస్తవంలోంచి ఆలోచించం డనీ, కారణాల్ని వెతకండనీ బోధిస్తూనే వచ్చారు. అలాంటి వారిలో ఎర్నెస్ట్ రెనన్ పేరు తప్పక చెప్పాలి. ‘జ్ఞానం యొక్క భవిత: 1848 నాటి ఆలోచనలు’ – అనే గ్రంథంలో ఆయన ఇలా రాశాడు... ‘‘భవిష్యత్తులో మతమేదైనా ఉంటే, అది మా‘నవ’ వాదం – అని నేను మనస్ఫూర్తిగా నమ్ము తున్నాను. శాఖోపశాఖలుగా ఉన్న ఈ విశ్వాసాలన్నీ ఒక్కతాటిపై కొచ్చి, నైతిక విలువలతో కూడిన మా‘నవ’వాదంగా రూపు దిద్దుకుంటుంది– తప్పదు!’’ దుర్మార్గాల్ని ఆపే శక్తి సంప్రదా యాలకు లేదు– వైజ్ఞానిక అవగాహన పెరిగితేనే మానవత్వం వికసిస్తుంది! డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త ప్రముఖ రచయిత, జీవశాస్త్రవేత్త (జూన్ 21న ‘హ్యూమనిస్ట్ డే’ సందర్భంగా...) -
మూర్తీభవించిన మానవతా వాది భగవద్రామానుజులు
సమాజంలో అశాంతి, అల్లకల్లోల భావాలు ప్రజ్వరిల్లుతున్నవేళ ధర్మపథాన్ని చూపేందుకు, జాతి యావత్తునూ ఏకతాటిపై తెచ్చేందుకు ఓ వెలుగు రేఖ ఉద్భవించింది. అష్టాక్షరీ మంత్రాన్ని గాలి గోపురమెత్తి చాటింది. అజ్ఞాన తిమిరాన్ని సంహరించి జ్ఞానమార్గాన్ని చూపింది. ఆ కాంతి కిరణమే ‘భగవద్రామానుజాచార్యులు’. నేటియుగంలో చెప్పుకుంటున్న సహజీవన, సమభావన, సమతావాదాలను ఆనాడే ప్రతిపాదించారు. మూర్తీభవించిన సమతా, మానవతావాదిగా కీర్తిగాంచారు. తరతరాలకి ఆదర్శం... విశిష్టాద్వైత సిద్ధాంత నిరూపణతోపాటు సర్వమానవాళిని చైతన్యపరిచేందుకు సహజ– సమభావాలతో ధార్మిక బోధనలు చేస్తూ ఆదర్శమూర్తిగా నిలిచారు. జ్ఞానమార్గంతోపాటు భక్తిమార్గంపై విస్తృత ప్రచారం చేశారు. ధర్మానుష్ఠానంతో జ్ఞానం, సామాజిక న్యాయదృష్టితో చేసే కర్మద్వారా జీవితం సార్థకమవుతుందని ఉద్బోధించారు. వీరి తరువాత దేశంలో బయలు దేరిన అనేక ఉద్యమాలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రామానుజులవారి ప్రభావం ఉండటం వీరి భావోన్నతికి తార్కాణంగా నిలుస్తోంది. సిసలైన శ్రీ భాష్యకారుడు... వేదాంతంలో ఎంతో క్లిష్టమైనటువంటి బ్రహ్మసూత్రాలకు రామానుజులు రాసిన శ్రీభాష్యం అత్యంత ప్రసిద్ధిపొందింది. అలాగే వేదాంతసారం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం మొదలైన గ్రంథాలు రచించి విశిష్టాద్వైతాన్ని, వేదాంత సాహిత్యాన్ని దేశమంతటా ప్రచారం చేయడానికి పూనుకున్నారు. సాఫల్యం సాధించారు. ఏడుకొండలవాడి పాద సేవ... జ్ఞానం, కర్మ అనే రెండు మార్గాలను తనలోఇమడ్చుకునిసాగే భక్తిమార్గాన్నిఎంచుకున్నారు రామానుజులు. ఇది తదనంతరకాలంలో గొప్ప చారిత్రక పరిణామాలకు కారణమైంది. కేవలం పాండిత్యం, జ్ఞానం ఉన్నవారికే దైవం సాక్షాత్కరిస్తుందనే భావనను తొలగించేందుకు అడుగులు వేశారు రామానుజులు. అవశ్యం... ఆచరణీయం అణుమాత్రమైనా మినహాయింపు లేకుండా త్రికరణ శుద్ధిగా తనను తాను భగవంతునికి అర్పించుకోవాలి. అటువంటి వారికి భగవంతుడు ప్రసన్నుడై సాయుజ్యాన్ని ప్రసాదిస్తాడన్న రామానుజులు వారి మాటలు అవశ్యం ఆచరణీయం. ఆ మహానుభావుడు జన్మించి 1002 సంవత్సరాలు గడిచినా ఆయన ఏర్పాటు చేసిన రహదారిపై ధర్మరథం ఈనాటికీ పరుగులు పెడుతూనే ఉంది. – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని,వేదపండితులు -
ట్రంపుతా!
ఆడవాళ్లు ఫెమినిస్టులు కాదు. హ్యూమనిస్టులు. తను బాగుంటే సమాజం బాగుంటుందని తెలిసినవాళ్లు. సమాజం బాగుండాలంటే అధికారం తమ దగ్గర ఉండాలని తెలుసుకున్నవాళ్లు. ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన రోజు మొదలైన ‘మహిళా మార్చ్’.. నేడు ఇంకో అడుగు వేయబోతోంది. ఎటువైపు చూసినా మహిళలే. నిప్పులా మహిళ.. ఉప్పెనలా మహిళ! నింగిలా మహిళ.. ఫిరంగిలా మహిళ! వాయువులా మహిళ.. విశ్వానికే ఆయువులా మహిళ. ఏడు ఖండాల్లో సూర్యుడివాళ ఎరుపెక్కడు. పింక్‌తో ప్రచండుడౌతాడు! ఏడు సముద్రాల్లో నీరివాళ నీలివర్ణంలో ఉండదు. పింక్ పోటెత్తుతుంది! ఏడు గగనాల్లో నిశి ఇవాళ మసకమసగ్గా ఉండదు. పింక్ పిండారబోసినట్లుంటుంది! ఏడు లోకాల్లో గాలులివాళ, జ్వాలలివాళ, గొంతులివాళ.. అన్నీ పింక్‌లోనే ప్రతిఫలిస్తాయి. ప్రతిధ్వనిస్తాయి. ప్రతిఘటిస్తాయి. దడదడమంటూ పదఘటనలతో విశ్వగోళాల చుట్టూ పరిభ్రమిస్తాయి. పింక్ నేడు పిడికిలి బిగిస్తుంది. సమరశంఖం పూరిస్తుంది. నరాలు ఉబికేలా నినదిస్తుంది. ఎక్కడి నుంచి వస్తోంది ఇంత పింక్? గాలిలా, నేలలా, నింగిలా, నిప్పులా, నీటిలా.. పంచభూతాలనే పరుగులెత్తించేలా, నురగలు కక్కించేలా.. ఎక్కడి నుంచి ఫెటిల్లమనబోతోంది? విస్ఫోటించబోతోంది? ఇంటింటి నుంచి! అవును. ఇంటింటి పొగగొట్టాల నుంచి, మసిబారిన జీవిత ఘట్టాలనుంచి తోసుకుని, తోసుకుని ఆశలమేఘంలా కమ్ముకుని వీధిల్లోకి వస్తోంది. గుప్పెట నిండా నినాదాలను పట్టుకుని రాజ్యాల రహదారులపై కవాతు చేయడానికి వస్తోంది. ‘పవర్ టు ద పోల్స్’. ‘లుక్ బ్యాక్, మార్చ్ ఫార్వర్డ్’. అందనిది అందుకుందాం.. అందలానికి అడుగులేద్దాం. ఇదే లక్ష్యం. ఇదే గమ్యం. ది గ్రేట్ విమెన్ మార్చ్. మహిళల భారీ ప్రదర్శన! ముందుకు అడుగు వేయడానికి. పాలకుల్ని కడిగివేయడానికి.. మహా ప్రదర్శన. ఈవెంట్ పేరు.. ‘2018 విమెన్స్ మార్చ్’. ఈవెంట్ తీరు.. విప్లవోద్యమ హోరు. నిరుడు ఇదే రోజున... ఇదే జనవరి 20న మొదలైన హోరు ఇది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఆకాశంలోంచి పూలేం కురవలేదు! ఆకాశంలో సగమైన మహిళ నేత్రాలలోంచి అగ్ని కణాలు కురిశాయి. శతఘ్నులై అవి వైట్‌హౌస్ వైపు గర్జించాయి. దిగిపో ట్రంప్. నువ్వు మాకిష్టం లేదు. దిగిపో ట్రంప్. నీకు ఆడవాళ్లంటే గౌరవం లేదు. దిగిపో ట్రంప్. పాలించే అర్హత నీకు లేదు. ఎక్కడికి పోతాడు? ఎందుకు పోతాడు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.. కోరికోరి ఎన్నుకున్నవాడే కదా ఆ ప్రెసిడెంట్. ట్రంప్ దిగిపోవడం కాదు. మనమే ఎదిగిపోవాలి. వ్యూహం మారింది. మహిళలు ఏకం అయ్యారు. ఐదు లక్షల మంది మహిళలు ఒక థీమ్‌గా పింక్ కలర్ పుస్సీహ్యాట్స్ తలపై ధరించి వాషింగ్టన్ వీధుల్లోకి వచ్చారు. వారి స్వరంలో అప్పుడిక ట్రంప్ లేడు! ట్రంప్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న అమెరికన్ సమాజం ఉంది. ఆ సమాజానికి లాగిపెట్టి ఒక్కటిస్తే చాలు.. ట్రంప్ దవడలు అదిరిపోతాయి. మహిళల హక్కులు, వలసల హక్కులు, ఆరోగ్య హక్కులు, మాతృత్వపు హక్కులు, ప్రకృతి హక్కులు, స్వేచ్ఛా సమానత్వపు హక్కులు, కార్మిక హక్కులు.. ట్రంప్ ఇవన్నీ కత్తిరించబోతున్నాడని, ‘అమెరికా ఫస్ట్’ అనే కత్తి నూరుతున్నాడని ఎన్నికల ప్రచారంలోనే తేలిపోయింది. ఆ హక్కుల్ని అమెరికా ప్రెసిడెంట్ నుంచి కాపాడుకోవాలి. అందుకు అధికారం సంపాదించుకోవాలి. ఆ అధికారాన్ని ఉద్యమంతో సాధించుకోవాలి. అదే.. ‘పవర్ టు పోల్స్’. ట్రంప్‌ని ఇంపీచ్ చెయ్యడం స్టేజ్ వన్ ఉద్యమం. ట్రంప్‌లాంటి వ్యవస్థపై పోరాడటం స్టేజ్ టు ఉద్యమం. 2017లో స్టేజ్ వన్‌లో ఉన్న మహిళలు 2018లో స్టేజ్ టు లోకి వచ్చేశారు. 2019లో స్టేజ్ త్రీ మార్చ్. 2020లో అధికారం చేజిక్కించుకునే మార్చ్. మార్చ్ ఒక్క అమెరికాలోనే కాదు. దాదాపుగా అన్ని దేశాలలో. అన్ని రంగాలలో. అన్ని పంథాలలో. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే.. జనవరి 20 అంతర్జాతీయ మహిళల ఐక్యతా దినోత్సవం అన్నంతగా మహిళలు ఏకం అయ్యారు. అవుతున్నారు. ఎటువైపు చూసినా మహిళలే. నిప్పులా మహిళ, ఉప్పెనలా మహిళ. నింగిలా మహిళ, ఫిరంగిలా మహిళ. వాయువులా మహిళ, విశ్వానికే ఆయువులా మహిళ. 2017లో జరిగింది.. ‘లార్జెస్ట్ సింగిల్డే ప్రొటెస్ట్ ఇన్ యూ.ఎస్.హిస్టరీ’ ఇవాళ జరగబో తున్నది.. లార్జెస్ట్ సింగిల్ డే ప్రొటెస్ట్ ఇన్ ది వరల్డ్! ఈ నిరసనలకు ‘మీ టూ’, ‘టైమ్స్‌అప్’ ఉద్యమాలూ అజ్యం అయ్యాయి. ఒక్కోదేశంలో ఒక్కో సమస్య ఉంది. అన్నిదేశాల్లోనూ ఉన్న సమస్య మానవహక్కుల సమస్య. వాటిపై మహిళలు ఫైట్ చేయబోతున్నారు. తమ కోసం మాత్రమే చేస్తున్న ఫైట్ కాదది. మొత్తం మానవజాతి సంక్షేమం కోసం చేయబోతున్నది. యూట్యూబ్, ఫేస్బుక్, ట్వీటర్ రెడీగా ఉన్నాయి. మేమున్నాం.. మీరు కానివ్వండని! మహిళలారా.. బిగిసిన మీ ఒక్క పిడికిలినీ వృథా కానివ్వం. మహిళలారా ఎలుగెత్తిన మీ ఒక్క గొంతునీ వృథా కానివ్వం. అడుగడుగునా.. మీ ఆశనీ, మీ శ్వాసనూ, మీ సమరాన్నీ, మీ నిరాయుధ ధర్మాగ్రహాన్నీ, మార్చింగ్‌లో మీ పాదాల కింద రేగిన ప్రతి ధూళికణాన్నీ క్యాప్చర్ చేసి చట్టసభల్లోకి పంపిస్తాం అని కెమెరాలతో రెడీగా ఉన్నాయి. మహిళా జయీభవ! విజయీభవ. లాలించిన తల్లీ.. పాలించు. పరిపాలించు. భువిలో దివిని సృష్టించు. నేడు (2018 విమెన్స్ మార్చ్) ►యు.ఎస్‌లోని దాదాపు అన్ని రాష్ట్రాలతో పాటు.. గ్రీసు, స్పెయిన్, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, ఇటలీలో నేడు ‘విమెన్స్ మార్చ్’ జరుగుతోంది. ►ప్రపంచవ్యాప్తంగా 250 మహిళా ర్యాలీలు జరుగుతున్నాయి. ►యు.ఎస్.లో ‘పవర్ టు ద పోల్స్’ అనే థీమ్‌తో, మిగతా దేశాల్లో ‘లుక్ బ్యాక్, మార్చ్ ఫార్వార్డ్’ అనే థీమ్‌తో ఈ ‘విమెన్స్ మార్చ్’ జరుగుతోంది. ►2017 మార్చ్‌కి కొనసాగింపుగా 2018 మార్చ్ జరుగుతోంది. నాడు (2017 విమెన్స్ మార్చ్) ►ట్రంప్‌కు వ్యతిరేకంగా మొదలై, అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా మలుపు తిరిగింది. ►శాంతియుతంగా, ఒక్క అరెస్టయినా లేకుండా ప్రదర్శన జరిగింది! ►హిల్లరీ క్లింటన్, హవాయీ మహిళ తెరెసా షూక్ చొరవతో ‘మార్చ్’ జీవం పోసుకుంది. ఫేస్బుక్ దానికి పురుడుపోసింది. ►మొదట ఈ ఉద్యమానికి అనుకున్న పేరు ‘మిలియన్ విమెన్ మార్చ్’. తర్వాత ‘విమెన్స్ మార్చ్’ అయింది. ఉద్యమంలో మనవాళ్లు ‘విమెన్స్ మార్చ్’, టైమ్స్‌అప్’, ‘మీ టూ’.. ఈ మూడూ.. మూడు అంతర్జాతీయ మహిళా ఉద్యమాలు. వీటిల్లోని ఏ ఉద్యమంలోనూ మనవాళ్లు లేరు. అలాగని తమకేం పట్టనట్లూ లేరు! బయటి నుంచి మద్దతు ఇచ్చారు. రాధికా ఆప్టే, కొంకణ సేన్, కంగనా రనౌత్, ప్రియాంకా చోప్రా, రీచా చద్ధా ఎప్పటికప్పుడు ఈ మహిళా ఉద్యమాలను బలపరుస్తూనే ఉన్నారు. ఇవాళ జరుగుతున్న ‘విమెన్స్ మార్చ్’.. అన్ని సమాజాలలో మంచి మార్పు తేవాలని వీరు ఆకాంక్షిస్తున్నారు. -
విడ్డూరం: ఈ గడుగ్గాయి గ్లామర్ క్వీన్!
క్రిస్టీనా పిమెనోవా... ఈ పేరు మన దేశస్తులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ రష్యాలో ఈ పేరు విన్నవాళ్ల ముఖాల్లో ఓ వింత మెరుపు కనిపిస్తుంది. క్రిస్టీనా గురించి మాటల ప్రవాహం మొదలవుతుంది. ఎందుకంటే... ఏడేళ్ల ఆ చిన్నారి అంత ఫేమస్ మరి! 2005లో మాస్కోలో జన్మించింది క్రిస్టీనా. తండ్రి ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తల్లి కూడా ఒకప్పుడు ఉద్యోగం చేసేది కానీ, ఇప్పుడు మానేసింది. దానికి కారణం క్రిస్టీనాయే. క్యూట్‌గా ఉండే క్రిస్టీనాని చూసినవాళ్లంతా... భలే ఉంది మీ అమ్మాయి, పెద్దయ్యాక సూపర్ మోడల్ అయిపోతుంది, తనని మోడల్‌నే చేయండి అనేవారట. ఆ మాటల్లో నిజం లేకపోలేదనిపించింది క్రిస్టీనా తల్లికి. అందుకే మూడేళ్ల వయసులోనే కూతురిని మోడల్ని చేసేసింది. యాడ్స్‌లో నటింపజేసింది. ముద్దులొలికే క్రిస్టీనా అందరి మనసులనూ దోచేసుకుంది. కళ్లు మూసి తెరిచేలోగా పెద్ద మోడల్ అయిపో యింది. ఆమె కాల్షీట్లు చూడటానికి ఉద్యోగం మానేయాల్సి వచ్చింది ఆమె తల్లికి! డబ్బుకి డబ్బు, పేరుకి పేరు, దేశాలు తిరిగే చాన్స్... క్రిస్టీనా విషయంలో తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు. కానీ ఏడేళ్ల చిన్నారిని ఇలా గ్లామర్ ప్రపంచంలో తిప్పడం ఆ చిన్నారి అందమైన బాల్యాన్ని హరించడమేనని అంటున్నారు కొందరు సామాజిక సంస్కర్తలు, మానవతావాదులు. మా చిన్నారిని చదివిస్తూనే ఇవన్నీ చేయిస్తున్నాం, ఎవరికో గానీ ఈ చాన్స్ రాదు, వచ్చినప్పుడు ఉపయోగించుకోవడంలో తప్పేముంది అంటారు క్రిస్టీనా తల్లిదండ్రులు. ఈ రెండు వాదనలూ క్రిస్టీనాకు అర్థం కావు. ఆమెకి ఊళ్లు తిరగడం సరదాగా ఉంది. రకరకాల డ్రెస్సులు వేసుకోవడం, తనని అందరూ గుర్తు పట్టడం ఆనందంగా ఉంది. భలే భార్యను పట్టాడు! బ్రెజిల్‌కు చెందిన 74 యేళ్ల క్యాస్టాల్డో భార్యను కోల్పోయి చాలాకాలం అయ్యింది. ఏడుగురు పిల్లల్ని ఒంటరిగా కష్టపడి పెంచాడు. అయితే ఆ ఒంటరితనం విసుగనిపించి, మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. వధువుని కూడా ఎంపిక చేసుకున్నాడు. ఆమె ఎవరో తెలుసా? అతడి పెంపుడు మేక కార్మెల్లా.కార్మెల్లాను రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడట క్యాస్టాల్డో. అది చాలా సౌమ్యురాలట. తను ఎలా చెబితే అలా వింటుందట. దానితో ఉంటే సమయమే తెలీదట. అంతకంటే మంచి భార్య ఎక్కడ దొరకుతుంది అనుకుని దాన్నే పెళ్లాడేయడానికి రెడీ అయిపోయాడు. కానీ ఆ పెళ్లితంతు జరపడానికి అక్కడి చర్చి యజమానులెవరూ ఒప్పుకోలేదు. నానా తంటాలు పడి చివరికి ఎక్కడో ఓ మూలనున్న చర్చివాళ్లను ఒప్పించాడు. అక్టోబర్ 13న నా పెళ్లికి రండి అంటూ ఆహ్వానాలు పంపుతున్నాడు. ఈ వయసులో ఇదేం పని, పైగా మేకను పెళ్లాడటమేంటి అంటే... నా ఏడుగురు పిల్లలూ కార్మెల్లాను తల్లిగా అంగీకరించారు, వాళ్లకు లేని బాధ మీకేంటి అంటూ మండిపడుతున్నాడు. ముసలాయనకి మతి భ్రమించలేదు కదా అంటూ గుసగుసలాడుతున్నారంతా!